ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
2, సెప్టెంబర్ 2024, సోమవారం
వరదలో భోజనం
వరదలో భోజనం లేక ఇబంది పడుతున్న వాళ్ళకి మా మధువని క్యాటరింగ్ విజయవాడ వారి తరుపున ఈ రోజు 500 మందికి పులిహోర ప్యాకింగ్స్ పంచాము మీకు ఆలా ప్యాకింగులు లా పంచాలనిపిస్తే మా వంతు సహాయంగా ప్యాకింగ్ 20 రూపాయలకే ఇస్తున్నం అండి కావాలనుకున్న వాళ్ళు 9182554800
7396881404
ఈ num ki కాల్ చేయండి
ఉచిత డ్రోన్ కార్గో
విజయవాడలో ఉచిత డ్రోన్ కార్గో సర్వీస్ అందుబాటు లో ఉంది . ఎమర్జెన్సీ గా మందులు, పాలు, వాటర్, ఫుడ్ కోసం 8897067212 కి కాల్ చేయండి. లొకేషన్ పెడితే వెంటనే పంపుతారు.
అనవసరంగా సమయం వృధా చెయ్యకండి. ఎమర్జెన్సీలో అందాల్సిన సహాయాన్ని మానవత్వంతో వినియోగించుకోండి.
⚜ *శ్రీ జయ దుర్గా పరమేశ్వరి ఆలయం*
🕉 *మన గుడి : నెం 428*
⚜ *కర్నాటక : కన్నార్పడి_ ఉడిపి*
⚜ *శ్రీ జయ దుర్గా పరమేశ్వరి ఆలయం*
💠 కర్ణాటక తీరప్రాంతం పవిత్రమైన దేవాలయాలకు ప్రసిద్ధి.
ప్రత్యేకించి "రజత పీఠం"గా పిలువబడే ఉడిపి నగరాన్ని దేవతా కేంద్రంగా పరిగణిస్తారు.
💠 కన్నార్‌పడి జయదుర్గా పరమేశ్వరి దేవాలయం 66వ జాతీయ రహదారి పక్కన 150 గజాల దూరంలో ఉంది.
ఆలయానికి సమీపంలో కణ్వ పుష్కరణి కూడా ఉంది.
💠 పట్టణంలో 'కన్నర' అని పిలువబడే బ్రాహ్మణ కుటుంబం నివసించిన తర్వాత "కన్నారపడి" అనే పేరు ఆచరణలోకి వచ్చింది.
💠 చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు ఉద్యావర అని పిలవబడేది అప్పుడు ఉదయపుర అని పిలువబడింది.
దీనిని అప్పటి అలుపా రాజవంశం రాజులు పరిపాలించారని పరిశోధనలు చెబుతున్నాయి.
అందుకే శ్రీ జయదుర్గాపరమేశ్వరి ఆలయం ఈ రాజులచే నిర్వహించబడుతుందని నమ్ముతారు.
💠 పౌరాణిక చరిత్ర ప్రకారం, పురాతన కాలంలో ఆలయం ముందు ఉన్న చిన్న సరస్సు సమీపంలో పూజా ఆచారాలు చేస్తూ కణ్వ ముని నివసించేవారు.
ఒక తెల్లవారుజామున శ్రీ దేవి అతని కలలో కనిపించింది, తానే జయదుర్గేనని మరియు అతని సేవ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది.
ఋషి ఉదయం మేల్కొన్నప్పుడు, నిన్న రాత్రి తన కలలో కనిపించిన శ్రీ దేవి ముఖాన్ని పోలిన విగ్రహం కనిపించింది.
ఆ విధంగా మహర్షి తన కర్మలు చేసిన ప్రదేశాన్ని కన్నారపడి అని, సరస్సు కణ్వ పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది.
💠 ఒకప్పుడు ఈ ఆలయాన్ని బ్రాహ్మణ కుటుంబం నిర్వహించేది. ఈ వంశంని కణ్వరాయ, కన్నారాయ, మొదలైన పేర్లతో పిలుస్తారు.
ఈ సంఘానికి చెందిన శంకర్ కణ్వరాయ తన భార్య యాత్ర జ్ఞాపకార్థం దేవి యొక్క బలి మూర్తిని సమర్పించాడు.
ఆలయం వద్ద లభించిన శాసనాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఈ శాసనం 16-17 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు.
💠 ఇక్కడ జయదుర్గా దేవి తలపై చంద్రుడిని ధరించి, మూడు కళ్ళు, నాలుగు చేతులతో వరుసగా శంఖ, చక్ర, కృపాణ మరియు అగ్నిశాఖను పట్టుకుని, నిలబడి, సింహంపై ఉంటుంది.
💠 దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలు ఒకదానిలో ఒకటిగా ఉండటం వలన ఈ విగ్రహం ప్రత్యేకమైనది.
💠 ఉడిపిలోని నాలుగు ముఖ్యమైన దుర్గామాత ఆలయాలలో ఇది ఒకటి మరియు ఇది స్కంద పురాణంలో పేర్కొనబడింది.
ఆమె వాహనం, సింహం, దీపం పైన కూడా చూడవచ్చు.
ఆలయ ప్రాంగణంలోని పవిత్ర చెరువును కణ్వ పుష్కరణి అంటారు.
ఈ క్షేత్రం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.
💠 ఈ పుణ్యక్షేత్రం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తున్నారు.
ఆలయ నిర్మాణం ఇతర తీరప్రాంత కర్ణాటక దేవాలయాల మాదిరిగానే ఉంటుంది. గర్భగుడిని నల్ల గ్రానైట్ ఉపయోగించి నిర్మించారు.
ఆలయ లోపలి ప్రాంగణంలో తీర్థ మండపం ఉంది.
💠 ఆలయ పరిసరాలలో దక్షిణం వైపున నందికేశ్వరుడు, పడమర వైపు రక్తేశ్వరి, నాగదేవరు మరియు బ్రహ్మస్థానం మరియు తూర్పు వైపున కల్లుకుట్టిగ మరియు క్షేత్రపాలాలు ఉన్నాయి.
తూర్పు భాగంలో 'కణ్వ పుష్కరణి' ఉంది.
💠 ఒకసారి శ్రీ సోదే మఠానికి చెందిన శ్రీ వాదిరాజ స్వామీజీ ఆలయాన్ని సందర్శించినప్పుడు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎంతో పులకించిపోయిన స్వామీజీ, జయదుర్గామాతను స్తుతిస్తూ స్వయంభువుగా స్వరపరిచిన భక్తిగీతాన్ని ఇప్పుడు "శ్రీ దుర్గాస్తవ"గా ప్రసిద్ది చెందింది.
భక్తులు అమ్మవారికి నైవేద్యంగా మల్లెపూలు, పట్టుచీరలు ఇవ్వడం ఇక్కడ ఆచారం.
💠 ఇక్కడ అత్యంత ముఖ్యమైన పండుగ 9 రోజుల నవరాత్రి పండుగ.
అక్షయ తృతీయ తర్వాత మూడవ రోజు వార్షిక ఆలయ పండుగను ఏటా జరుపుకుంటారు.
💠 ఆలయంలో పూజించబడే ముఖ్యమైన అనుబంధ దేవతలు గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మరియు శాస్తా.
💠 ఆలయ పూజ మరియు దర్శన సమయాలు
ఉదయం పూజ సమయం - 5:30 AM నుండి 12:30 PM వరకు
సాయంత్రం దర్శనం మరియు పూజ సమయం - 4:00 PM నుండి 8:30 PM వరకు
ఒక రోజులో ముఖ్యమైన పూజలు
ఉష పూజ : ఉదయం 6 నుండి 6:30 వరకు
మహా పూజ : 10:30 నుండి 11:30 వరకు
రాత్రి పూజ : సాయంత్రం 7 నుండి 7:30 వరకు
💠 ఉడిపికి నైరుతి దిశలో 5 కి.మీ దూరంలో జాతీయ రహదారి 66కి సమీపంలో ఉంది.
దర్గాకువెళ్లి
ఓ భర్త దర్గాకువెళ్లి మొక్కుకుని వచ్చాడు.
అప్పుడు
ఆయన భార్య:- మీరు #తలస్నానం చేసి కానీ #ఇంటి_గడప_లోపలికి రావద్దని అడ్డుకుంది.
#భార్య :- నీ తండ్రి చనిపోయినపుడే స్మశాననికి వెళ్లి #దహనసంస్కారాలు పూర్తి చేసి, బుద్దిగా శుభ్రంగా స్నానం ఇంట్లోకి వచ్చావు🤔
అటువంటిది ఇప్పుడు #ఎవరిదో శవము/ఎముక లున్నా #సమాధిని ముట్టుకుని దణ్ణం పెట్టు కునొచ్చి #స్నానంచేయకుండా లోపలికి వస్తావా?
#భర్త :- భగవంతుడా అది సమాధి మాత్రమే!
దేవదూత గా చెప్తారు
#భార్య :- అంటే
నీ తండ్రి దయ్యమా? రాక్షసుడా? మనకి ఏం తక్కువ?
33కోట్లమంది దేవతలున్నారు న్నారు
#భర్త :- అదికాదు, మా ఫ్రెండ్ అబ్దుల్ తీసుకెళ్తే వాడి వెంట వెళ్ళాను, వెళ్లకుంటే బాగుండదు!
#భార్య :- అదేఅబ్దుల్ ని ఎదురుగానే ఉండే హనుమాన్ మందిర్ కి కూడా తీసుకువెళ్లి అక్కడ మొక్కమను ఈ మంగళవారం?
#భర్త :- అతడెప్పుడూ రాడు, గుడికి దణ్ణం పెట్టుకోవడానికి, సరే నువ్వు బకెట్ నీళ్లు ఇచ్చేయ్
#️భార్య :- సరే అయితే చెవులు పట్టుకుని నూరు గుంజీలు తీయండి అలాగే ప్రమాణం చేయండి, #ఇంకొకసారెప్పుడు దర్గాలకి వాటికి వెళ్ళనని. మనకి మన ఇల్లు కూడా మందిరం🛕
ఇక్కడ.. రాముడు కృష్ణుడు శివుడు ఆదిపరాశక్తి అందరూ ఉన్నారు 🙏
పేగుల్లోని సూక్ష్మక్రిములే
అనేక జబ్బులకు ‘పేగుల్లోని సూక్ష్మక్రిములే (మైక్రోబయోమ్) ' కారణం
-దీర్ఘకాలం నాణ్యమైన జీవితంలో.. పేగు బ్యాక్టీరియా పాత్ర పై
ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి
ఆరోగ్యకర అలవాట్లు,జీవనశైలిలో మార్పులు అవసరం
ఆహారానికి ముందు స్వీట్ అస్సలు తినొద్దు
ఇంటి తిండికి, జంక్‌ఫుడ్‌కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా
అనేక జబ్బులకు పేగు సూక్ష్మక్రిములే కారణం
నాలుగు గంటల గాఢ నిద్ర తప్పనిసరి
దీర్ఘకాలం నాణ్యమైన జీవితంలో..
పేగు బ్యాక్టీరియా పాత్ర’పై ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి పలు అంశాలు వెల్లడించారు.
‘‘జంతువులు, పక్షుల్లో ఒక్కోదానికి జీవితకాలం ‘ఇంత’ అని ఉంటుంది.
అలాగే మనుషుల జీవితకాలం 120 ఏళ్లు.
అయితే చాలా తక్కువమంది అప్పటివరకు జీవిస్తుంటారు.
ఒకవేళ దీర్ఘకాలం బతికినా..
80 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువమంది నాణ్యమైన జీవితం గడపలేకపోతున్నారు.
పుట్టుకతోనే మంచి బ్యాక్టీరియా
అనేక జబ్బులకు ‘పేగుల్లోని సూక్ష్మక్రిములే (మైక్రోబయోమ్)’ మూలకారణమని పరిశోధనల్లో నిర్ధారించారు.
ఇందులో మంచి, చెడు బ్యాక్టీరియాలుంటాయి.
మనం ఆరోగ్యకర అలవాట్లు పాటిస్తే ‘మంచి బ్యాక్టీరియా’ వృద్ధి చెందుతుంది.
చెడు అలవాట్లను అలవర్చుకుంటే ‘హానికారక బ్యాక్టీరియా’ విజృంభిస్తుంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలా? జబ్బులతో శల్యమవ్వాలా? అన్నది నిర్ణయించేది ఈ బ్యాక్టీరియాలే!
మనిషి శరీరంలో 20 వేల జన్యువులుండగా.. పేగు బ్యాక్టీరియాలో 20 మిలియన్ల జన్యువులుంటాయి.
ఈ బ్యాక్టీరియా మనకు పుట్టుకతోనే వస్తుంది.
సహజ ప్రసవం అయినప్పుడు తల్లి నుంచి బిడ్డకు..
ఆరు నెలలు తల్లి చనుపాలు ఇవ్వడం ద్వారా..
పుట్టిన ఆరు నెలల వరకూ శిశువుకు యాంటీబయాటిక్స్ మందులు వాడకపోతే
మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
సిజేరియన్ వల్ల శిశువు పుట్టినా..
తల్లి పాలు పట్టకపోయినా..
తొలి ఆరు నెలల్లోనే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వచ్చినా..
మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందదు.
హాంకాంగ్‌లో సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువుకు తల్లి నుంచి పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేస్తున్నారు.
మన దగ్గర ఇది ఇంకా అమల్లోకి రాలేదు.
తల్లి గర్భంతో ఉన్నప్పుడు
ఇంటి పెరుగు, చీజ్, కిమ్చి, ఆపిల్, టమాట, అరటిపండు, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి
వంటివి తినడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి.. శిశువుకు కూడా సంక్రమిస్తుంది.
బ్యాక్టీరియా ఎలా నియంత్రిస్తుందంటే?
శరీర నియంత్రణలో కీలక పాత్ర పోషించేది బ్యాక్టీరియానే.
మనం తిన్న ఆహారాన్ని ముందుగా జీర్ణం చేసి, శరీరానికి అందిస్తుంది.
మంచి బ్యాక్టీరియా ఉంటే నెమ్మదిగా జీర్ణం చేస్తుంది.
చెడు బ్యాక్టీరియా ఉంటే వేగంగా జీర్ణం చేస్తుంది.
తద్వారా వెంటనే షుగర్ స్థాయుల్లో హెచ్చుదల కనిపిస్తుంది.
ఉదాహరణకు
చికెన్ తింటే జీర్ణాశయంలో ముందుగా బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది.
మంచి బ్యాక్టీరియా ఉంటే.. ‘సెరోటోనిన్’ను ఉత్పత్తి చేస్తుంది.
జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
ఎక్కువ తిన్నా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
సెరోటోనిన్ వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది.
చెడు బ్యాక్టీరియా ఉంటే..
‘మెలటోనిన్’ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది.
దీనివల్ల తక్కువ తిన్నా క్యాలరీలు పెరిగిపోయి, కొవ్వు కిందకు మారిపోయి.. బరువు పెరుగుతారు.
మెలటోనిన్ వల్ల నీరసం వస్తుంది. బద్ధకం ఆవరిస్తుంది.
ఆహార నియంత్రణ
పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే..
ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి.
ముఖ్యంగా ఆహారాన్ని నియంత్రించుకోవాలి.
లేకపోతే చెడు బ్యాక్టీరియా పెరిగి..
వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయి.
ఇలా తినండి..
మనలో చాలామంది అల్పాహారం తినేటప్పుడు
ముందుగా ఇడ్లీ, వడ, పూరీ, దోసె వంటివి తింటారు.
దీంతో అరగంటలో షుగర్ పెరిగిపోతుంది.
ఇందుకు బదులుగా అల్పాహారానికి ముందు ఏదైనా ఒక పండు తినాలి.
ఇందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల.. నెమ్మదిగా జీర్ణమవుతుంది.
మధ్యాహ్న భోజనంలోనూ..
ముందుగా స్వీట్ అస్సలు తినొద్దు.
ముందుగా పండ్లు, కూరగాయల ముక్కలతో భోజనాన్ని ప్రారంభించాలి.
ఆ తర్వాత అన్నం, పప్పు, కూరగాయలు, రసం, పెరుగుతో ముగించాలి.
బిస్కెట్ తినాలనుకున్నప్పుడు..
ముందుగా ఆపిల్ సైడర్ వినెగర్‌ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని..
ఆ తర్వాత బిస్కెట్ తింటే రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పెరగవు.
కాలీఫ్లవర్, ఆకుకూరలు, కూరగాయలు తిన్న తర్వాత
మాంసాహారం, ఆలుగడ్డలు తిన్నా.. షుగర్ స్థాయులు అంతగా పెరగవు.
పండ్లు, పాలు, పంచదార కలిపి ‘స్మూతీ’ పేరిట ఒక పదార్థంగా తీసుకుంటుంటారు.
దీంతో అర గంటలోనే షుగర్ పెరుగుతుంది.
ఒకవేళ స్మూతీ తీసుకోవాలనుకుంటే.. భోజనం తర్వాత తాగాలి.
పండ్ల రసాలు శరీరానికి మేలు చేస్తాయని ఎక్కువమంది భావిస్తుంటారు.
నిజానికి జ్యూస్‌లో పీచు పదార్థం అస్సలు ఉండదు.
ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది.
ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కలిపితే షుగర్ అవుతుంది.
కేవలం ఫ్రక్టోజ్ తీసుకోవడం గ్లూకోజ్ కన్నా ప్రమాదకరమైంది.
రోజూ 2 గ్లాసుల కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు.
దీనివల్ల చెడు బ్యాక్టీరియా పోయి.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఆలివ్ నూనెలు వాడి..
ఆకుకూరలు, కూరగాయలు, చేపలతో చేసిన వంటకాల వల్ల మంచి బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది.
చిప్స్, సమోసాలు, పఫ్‌లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్,
కూల్‌డ్రింక్‌లు, ఎనర్జీ డ్రింక్‌లు, ఐస్‌క్రీములు
వంటి తినుబండారాల్లో వాడే రంగులు, ఇతర ప్రిజర్వేటివ్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది.
ఇవి మంచి బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాగా మారుస్తాయి.
100 క్యాలరీలు ఆహారం తిన్నా.. చెడు బ్యాక్టీరియా 200 క్యాలరీలుగా మారుస్తుంది.
టూత్‌పేస్ట్‌లోని రంగుల్లో ‘టైటేనియం ఆక్సైడ్’ను వాడుతున్నారు.
బ్రష్ చేస్తున్నప్పుడు కొందరు పిల్లలు రుచిగా ఉందని పేస్ట్‌ను మింగుతుంటారు.
దీని వల్ల చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఇంట్లో తినే భోజనానికి, జంక్ ఫుడ్‌కు మధ్య బ్యాక్టీరియా వృద్ధిలో స్పష్టమైన తేడా ఉంది.
తిన్నాక 10 నిమిషాలు అటూ ఇటూ.. నడవాలి.
వ్యాయామం చేసినప్పుడు ‘లాక్టేట్’ అనేది ఉత్పత్తి అవుతుంది.
ఇది ఎక్కువగా ఉత్పత్తయ్యే వారిలో శరీరం నిస్సత్తువగా మారుతుంది.
అలసిపోయి.. పనిచేయాలనిపించదు.
ఇలాంటివారు ఉదయం వ్యాయామం చేస్తే ఇక ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు.
అందువల్ల లాక్టేట్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారు సాయంత్రం పూట వ్యాయామం చేస్తే మంచిది.
అలసిపోయినా.. వ్యాయామం తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు.
ఎప్పుడైనా తినగానే కనీసం 10 నిమిషాలైనా అటూ ఇటూ నడవాలి.
దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు వేగంగా నడవొద్దు.
ఉపవాసాలతో మేలే!
వారానికి ఒకటి, రెండు రోజులు ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది.
ఈ రోజుల్లో కేవలం పీచు ఎక్కువగా ఉండే పండ్లను పరిమితంగా తినాలి.
వాటితో పాటు కొబ్బరి నీళ్లను తీసుకోవాలి.
ఇటీవల కొందరు ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ పద్ధతి అనుసరిస్తున్నారు.
ఇందులో రోజులోని 24 గంటల్లో కేవలం 8 గంటల్లో మాత్రమే తినాలి.
ఆ 8 గంటల్లో నాలుగైదు సార్లు కూడా తినొచ్చు.
మిగతా 16 గంటలు ఏమీ తినకూడదు.
ఉదాహరణకు ఉదయం 10 గంటలకు తినడం ప్రారంభిస్తే..
సాయంత్రం 6 గంటలకు ఆపేయాలి.
ఆ తర్వాత మళ్లీ మర్నాడు ఉదయం 10 గంటల వరకూ ఏమీ తినొద్దు.
ఈలోగా కొబ్బరి నీళ్లు, బ్లాక్ కాఫీ తాగొచ్చు.
ఈ విధానంలో కూడా మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
మనం తినే ఆహారంలో నాలుగింట మూడో వంతు మాత్రమే తిని.. ఆఖరిది తినొద్దు.
ఇలా చేస్తే జీవిత కాలం 2-3 ఏళ్లు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎందుకంటే రోజూ తినే ఆహారం కంటే తక్కువ తింటే..
క్యాలరీలు తక్కువగా వచ్చాయనే భావనతో.. శరీరంలో రుగ్మతలను నయం చేసే వ్యవస్థ బలంగా పనిచేస్తుంది.
అదే పుష్టిగా తింటే.. ఎక్కువ క్యాలరీలున్నాయిలే అన్న భావనతో ఆ వ్యవస్థ బద్ధకంగా ఉంటుంది.
సొంతంగా నయం చేసుకునే వ్యవస్థ పనిచేయదు.
గట్ మైక్రోబయోమ్ అంటే?
పీచు ఉన్న షుగరా? లేని షుగరా?
శరీరంపై ప్యాచ్‌లు పెట్టడం ద్వారా
ఒంట్లోని షుగర్ స్థాయులను గంటగంటకూ పరీక్షించుకునే
కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
సాధారణ ఆహారం తిన్నామనుకోండి..
గంటలో షుగర్ పెరుగుతుంది.
తిరిగి 2-2.30 గంటల్లో షుగర్ స్థాయులు కిందకు వస్తాయి. మళ్లీ ఆకలేస్తుంది.
ఒకవేళ తీపి పదార్థాలు తింటే..
షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
2 గంటల్లో తగ్గిపోయి.. మళ్లీ ఆకలి అవుతుంది.
ఈ రెండూ కాకుండా
పీచు పదార్థాలున్న ఆహారం తీసుకుంటే.. షుగర్ ఎక్కువగా పెరగదు.
రెండు గంటల వరకు ఒకే స్థాయిలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతోంది.
చాలామంది అరటిపండులో షుగర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు.
కానీ, అందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ నెమ్మదిగా విడుదలవుతుంది.
మూణ్నాలుగు గంటల తర్వాత గానీ మళ్లీ ఆకలి వేయదు.
షుగర్ ఒక్కటే ముఖ్యం కాదు..
పీచుతో పాటు ఉన్న షుగరా? పీచు లేని షుగరా? ఏది తింటున్నామన్నది ముఖ్యం.
‘గట్ మైక్రోబయామ్ మెటా జీనోమిక్స్’ పరీక్ష ద్వారా మంచి, చెడు బ్యాక్టీరియాల గురించి తెలుసుకోవచ్చు.
తెలుగు కోసం
*తెలుగు కోసం నిజంగా పని చేయాలి* అనుకునే నేస్తాలందరికీ విన్నపం. మన వలగూడు *telugukootami.org* చూడండి. భాషోద్యమం లో భాగంగా మీకు నచ్చిన పోటీలలో పాల్గొనండి. (11 పోటీలను ఇప్పటివరకు ప్రకటించాము.) కానుకలు, మెచ్చుకోళ్ళు పొందండి. మీలో కొందరిని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి ముందుకు రమ్మని కోరుతున్నాము. మనం పెట్టే పోటీలలో పాల్గొన్న వారి విషయాలను మీకు పంపుతాము. మీరు ఆ పోటీలో ఎవరు గెలిచారో ప్రకటించాలి. ఉద్యమ కవితల పోటీలో గెలిచిన వారికి నెలకు రెండుసార్లు, పిల్లల పద్యాల పోటీలకు నెలకు రెండు సార్లు కానుకలను ఇస్తాము. ఉద్యమ పాటలకు 5,000 రూ. కాన్క, ఉద్యమ కవితకు 500 రూ. కాన్క నెలకు రెండు సార్లు, ఉద్యమ పద్యం పాడిన చిన్నారికి 500 రూ. కాన్క నెలకు రెండు సార్లు, రచ్చబండలో ఇస్తామని తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. పాల్గొన్నవారికి, గెలిచిన వారికి విడిగా మెచ్చాంకులు (appreciation letters) ఇస్తారు. రచ్చబండ జరిగేటప్పుడు కలం, కాగితం దగ్గర పెట్టుకోండి. తగు వార్తను తయారు చేయండి. దానిని పత్రికలకు పంపాలి. YouTube లో *తెలుగు కూటమి* అని కొట్టి (మన వారు యుట్యూబ్ కు తెలుగు నేర్పారు!) పాత వీడియోలను చూసి వ్యాసాలను రాస్తే పత్రికలు ప్రచురించే ఏర్పాటు చేద్దాం. ఉద్యమ ఘోష అన్ని పత్రికలలో ఎప్పుడూ వినబడుతూనే ఉండాలి. మీ నేస్తాలను కూడ ఈ పని చేయటానికి రమ్మనండి. రచ్చబండలో పాల్గొనటానికి రెండవ శనివారము నాలుగో శనివారము మాపటి పూట ఏడు గంటలకు ఈ లంకెను మీటండి; https://meet.google.com/ste-jdoz-xbs
*శ్రీ కంచి పరమాచార్య వైభవం.71*
*శ్రీ కంచి పరమాచార్య వైభవం.71*
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*
🌸 *శుక్రవారం, 2 ఏప్రిల్ 2021 - కంచి శ్రీ మఠం*🌸
శ్రీ మహాత్రిపురసుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వర పూజ అనేది శంకర భగవత్పాదుల చేత స్థాపించబడిన పీఠాలను అధిరోహించిన పీఠాధిపతుల ప్రథమ మరియు ముఖ్యమైన ధర్మం. ఎట్టి పరిస్థితుల్లో అయినా మూడు కాలాల్లో ఈ పూజ జరిగి తీరవలసినదే. ఈ పూజలో చెప్పుకోదగ్గ విషయం పీఠాధిపతుల ఓపిక. గంటల తరబడి సాగే ఈ పూజలో వారు మౌనంగా ఉంటారు. కేవలం సంజ్ఞలతో సంవాదం. పూజ జరుగుతున్నంత సేపు ఒకే ఆసనంలో అటు ఇటు కదలకుండా నిశ్చలమైన మనస్సుతో, మూర్తీభవించిన ప్రసన్నతయై ఉంటారు.
కంచి కామకోటి పీఠంలో శుక్రవారం జరిగే మూడవ కాలం పూజ విశేషమైనది. రోజూ కేవలం మొదటి కాలం పూజలో మాత్రమే అభిషేకం ఉంటుంది స్వామి వారికి. శుక్రవారం నాటి సాయంత్రం మాత్రం మూడవ కాలం పూజలో స్వామి వారికి అమ్మవారికి మళ్లీ అభిషేకం చేస్తారు. ఆ పూజ చూడటానికి రెండు కళ్ళు చాలవు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
నిన్నటి సాయంత్రం అందరం చంద్రమౌళీశ్వర పూజ జరిగే చోట భక్తులు కూర్చుని వీక్షించే ప్రదేశంలో కూర్చుని ఉన్నాం. సమయం దాదాపు రాత్రి తొమ్మిది గంటలు. వచ్చిన వారిలో డెబ్భై ఏళ్ళ పైబడిన వారి నుండి రెండేళ్ల పసి పాపలు కూడా ఉన్నారు. ఎంతో ఆతృతగా వర్షం కోసం ఎదురుచూసే రైతుకి ఊరట కలిగించటానికి కురిసిన తొలకరిలాగా మా ఎదురుచూపులకు ప్రతిఫలమా అన్నట్టు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చంద్రమౌళీశ్వర పూజా మండపంలోకి అడుగు పెట్టారు. వస్తూనే అందరి మీద ఒకసారి కృపా దృష్టి ప్రసరించి చల్లని చిరునవ్వే పలకరింపుగా ఆసనం మీద కూర్చున్నారు.
తెర పడింది. అలంకార మండపంలో ఉన్న అయ్యవారిని, అమ్మవారిని అభిషేకం కోసం పానవట్టం మీదకి బదలాయించే క్రతువు చూడకూడదు. అందుకే తెర అడ్డు. తెర తీసేసరికి మహాత్రిపురసుందరి, చంద్రమౌళీశ్వరుడు పానవట్టం మీద అభిషేకానికి సిద్ధంగా ఆసీనులయ్యారు. స్వామి వారు సంకల్పం, ప్రాణాయామం మొదలైనవి చేసి, ఎప్పుడూ నేను చూసి ఎరుగని పని ఒకటి చేశారు. ఒకసారి తల పైకెత్తి గోడ గడియారం కేసి చూశారు. ఎంతసేపైనా చాలా ఓపికగా పూజ చేసే స్వామి వారు ఇవ్వాళ ఇలా సమయం చూడటం ఆశ్చర్యంగా అనిపించింది. మనసు పలువిధాలుగా ఆలోచించ సాగింది. ఎంత నడయాడే పరబ్రహ్మము అయినా శరీర ఉపాధి ఉంది కనుక శరీరం అలసిందా? పొద్దున్న నుంచీ ఎంత మంది ఆర్తి విని వారికి సలహా ఇచ్చుంటారు. ఎంత మందితో మాట్లాడి అలసి ఉంటారో. ఇలా వచ్చిన ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పూజ మీద దృష్టి పెట్టాను. జలాభిషేకం జరిగింది. ఇక ఆ పైన జరిగేది క్షీరాభిషేకం. అక్కడి వరకే అందరికీ చూసే అనుమతి ఉంది. ఆ పైన జరిగే ఫలోదకాలతో అభిషేకం, నారికేళ జలాభిషేకం, చందనాభిషేకం మొదలైనవి ఏకాంతంగా తెర వేసేసాక జరుగుతాయి.
అందరం క్షీరాభిషేకం చూద్దాము అని వేచి చూస్తున్న వేళ ఎన్నడూ లేని విధంగా తెర పడింది. అయ్యో! క్షీరాభిషేకం చూసే అవకాశం ఇలా అయిపోయింది అనిపించింది. కొంత సేపు తర్వాత చందనాభిషేకం అయ్యాక ఇచ్చే హారతి చూపించటానికి తెర తీశారు. అందరం హారతి కళ్ళారా దర్శించి నమస్కారం పెట్టాక మళ్లీ తెర పడింది.
ఈ సారి తెర తీసేసరికి అమ్మవారు, అయ్యవారు స్వామి వారి చేత నిండుగా అలంకరింపబడి బంగారు ఊయలలోని సింహాసనం మీద అధిష్టించి పూజలు అందుకోటానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి వారు మళ్లీ గోడ గడియారం కేసి చూసారు. నాలో మళ్లీ అలజడి. ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి వారికి? అందరి ఇబ్బందులు తీర్చేవారికి ఇబ్బంది ఉంటుందనుకోవటం మూర్ఖత్వం అయినా మనసు అలానే ఆలోచించింది ఆ క్షణం.
లేలేత బిల్వ దళాలను జాగ్రత్తగా చంద్రమౌళీశ్వరుడి పాదాల మీద పడేలా అర్చన చేస్తున్నారు స్వామి వారు. మళ్లీ ధూప దీప నైవేద్యాలు సమర్పించటానికి తెర వెయ్యబోతున్నారు. స్వామి వారు అక్కడున్న పరిచారకుడికి ఏదో సంజ్ఞ చేశారు. లోపల నుంచి పెద్ద తట్ట నిండా అరటిపళ్ళు తీసుకొని రాబడ్డాయి. తెర పడింది. కూర్చున్న భక్తులందరికీ రెండు చొప్పున అరటి పళ్ళు పంచ బడ్డాయి. ఇది కూడా ఆశ్చర్యం కలిగించిన విషయం.
ఈ సారి తెర తీసేసరికి అమ్మవారికి, అయ్యవారికి నక్షత్ర హారతి ఇస్తున్నారు స్వామి వారు. ఆ పిదప పంచ హారతి, శేష హారతి, నంది హారతి, సింహ హారతి. ఇది అయిన తర్వాత మంగళ హారతి. మంగళ హారతి ఇచ్చే తీరు చూడాలి అస్సలు. అమ్మవారి, అయ్యవారి చుట్టూ చిన్న చిన్న వృత్తాలలో హారతి తిప్పుతుంటే మనకి వారిరువురి అలంకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హారతి తర్వాత ఇక తెర పడదు. వేద స్వస్తి, ఛత్ర, చామర సమర్పణ, శ్రీ కామాక్షి చూర్ణికా స్తోత్ర పఠనంతో ఆ కాలం పూజ ముగిసింది.
స్వామి వారు సత్య దండం చేతికి ఎత్తుకుని మెల్లగా లేచి అమ్మవారికి, అయ్యవారికి ప్రదక్షిణంగా వేదిక దిగటానికి సిద్ధపడ్డారు. ఇది అయ్యేసరికి సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఆ సమయంలో కూడా ఓపికగా అక్కడున్న వారితో చిరు సంభాషణలు జరిపారు. అందరినీ ప్రసాదం (భోజనం) చేయాల్సిందిగా చెప్పినట్టు మెల్లగా భిక్ష చేసే గది వైపు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయారు స్వామి వారు.
భోజనాలు చేసే గదిలోకి మామూలుగా మేము వెళ్లి వేచి ఉంటే స్వామి వారి భిక్ష అయ్యాక, వేద పండితుల భోజనం అయ్యాక అమృతతుల్యమైన ఆ ప్రసాదం మాకు వడ్డించబడేది. దీనికి షుమారు ఒక పావు గంట పట్టేది. కానీ నిన్న అక్కడికి వెళ్లేసరికి పదార్థాలు అప్పటికే చేరవేసి ఉన్నాయి. ఇంక అందరం కూర్చుని వడ్డించుకొని తినటమే తరువాయి. అప్పటికి నా మట్టి బుర్రకి అర్థం అయింది. స్వామి వారు గడియారం కేసి చూసింది ఆయన బిడ్డలమైన మా ఆకలి గుర్తొచ్చి. అంతే కానీ ఆయనకి ఇబ్బంది కలిగి కాదు. ఆయన పూజించే మహాత్రిపురసుందరికి ఆయనకి అభేదం అని చెప్పకనే చెప్పారు. కన్నతల్లిలాగా తన బిడ్డల ఆకలిని పసిగట్టి అరటి పళ్ళు పంచేలా నువ్వు చేసినప్పుడు కూడా గడియారం చూడటంలో అంతరార్థం అప్పటికి అర్థం అవ్వలేదు. కాదు, అర్థం అవ్వనివ్వలేదు.
--- పరమాచార్య పాదరేణువు
*జయజయ శంకర హరహర శంకర*
సెప్టెంబర్, 02, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
🌹 *సెప్టెంబర్, 02, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
ఈనాటి పర్వం:
ప్రాంతీయ ఆచార
*పోలాల అమావాస్య*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి : అమావాస్య* పూర్తిగా రోజంతా రాత్రితో సహా
*వారం:సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : మఖ* రా 12.20 ఉపరి *పూర్వ ఫల్గుణి (పుబ్బ)*
*యోగం : శివ* సా 06.20 వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : చతుష్పాద* సా 06.20 ఉపరి *నాగ* రాత్రంతా
*సాధారణ శుభ సమయాలు*
*ఈరోజు లేవు*
అమృత కాలం :*రా 09.41 - 11.27*
అభిజిత్ కాలం : *ఉ 11.42 - 12.32*
*వర్జ్యం : ఉ 11.04 - 12.50*
*దుర్ముహూర్తం : మ 12.32 - 01.21 & 03.01 - 03.50*
*రాహు కాలం : ఉ 07.27 - 09.01*
గుళికకాళం : *మ 01.40 - 03.13*
యమగండం : *ఉ 10.34 - 12.07*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం :*ఉ 05.54*
సూర్యాస్తమయం :*సా 06.19*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.52*
మధ్యాహ్న కాలం:*10.52 - 01.21*
అపరాహ్న కాలం: *మ 01.21 - 03.50*
*ఆబ్ధికం తిధి : శ్రావణ అమావాస్య*
సాయంకాలం : *సా 03.50 - 06.19*
ప్రదోష కాలం : *సా 06.19 - 08.38*
నిశీధి కాలం :*రా 11.44 - 12.30*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *శ్రీ శివకవచం*🔯
🕉️ప్రతీరోజూ ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది.🙏
_*పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః| పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠ స్థధొత్తరే | ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః | నైరుత్యాం పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః| ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః| ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః| నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే| మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతేనమః||*_
_*అర్ధము:-* తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…_
_ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులు_
_ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
విజయవాడ అతలాకుతలం
*విజయవాడ అతలాకుతలం అయిపోయింది*
*యామిజాల నరసింహ మూర్తి*
*విజయవాడలో.. ప్రాంతాల వారీగా పర్యవేక్షించే అధికారులు వీరే..*
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.
*అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు...*
*విజయవాడ సెంట్రల్*
1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822
2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153
3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124
4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481
5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941
6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078
7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180
8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739
9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069
10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539
11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088
12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270
13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125
*విజయవాడ పశ్చిమ*
14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026
15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067
16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645
17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260
*విజయవాడ తూర్పు*
18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163
19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772
20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148
21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677
22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045
23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959
*విజయవాడ రూరల్*
24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852
25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859
26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246
27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399
28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595
29. అంబాపురం- బి. నాగరాజు 8333991210
శ్రీ కృష్ణ పరమాత్ముని చివరి సందేశం...
శ్రీ కృష్ణ పరమాత్ముని చివరి సందేశం...
ద్వాపరయుగం ఇంకా కొద్ది కాలంలో ముగిసిపోయి, కలియుగం రాబోతుందనగా ఒకరోజున జరిగిన కృష్ణ, ఉద్ధవుల సంభాషణ:
శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.
ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.
ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతిగా ఉండేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకు ఏదయినా ఉపదేశం చెయ్యి”అన్నాడు.
అప్పుడు కృష్ణపరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవునితో ప్రస్తావన చేశాడు.*
ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.
దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుని అడ్డుపెట్టి చెప్పాడు.
“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.
కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు ప్రారంభం అవుతాయి. అవి, ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.
ఎవ్వరూ కూడా తమతప్పు తాము తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో అస్సలు చెయ్యరు.
కోర్కెలచేత, అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెలచేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.
కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. వేదాన్ని విడచి, అంతా తమ ప్రతిభే అని నమ్ముతారు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి పుట్టగొడుగుల్లా పుట్టే అనేక వేరు, వేరు మార్గములలో నడుస్తూ అదః పాతాళ దారుల్లో నడుస్తూ వెళ్ళిపోతారు.
అల్పాయుర్దాయంతో జీవిస్తారు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.
ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి అసలే ఉండదు.
మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి. అది తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.
ఇంద్రియములకు వశులు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. దానితో, ప్రజలు రాజుల మీద తిరగబడతారు.
ఎవరుకీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. డబ్బు ప్రాధాన్యంగా నిలుస్తుంది. అది ఎలాంటి సంపాదన అయినా కూడా!
కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.
ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఉన్నత ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటిని దర్శించటం కంటే, ఆడంబర ప్రాధాన్యత హెచ్చుగా ఉంటుంది.
కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, ఆలయంలోని దైవాన్ని చూడరు. మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి, అని అనుకోరు.
హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.
కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా ఒట్టిదని తెలుసుకో. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో!
కలియుగంలో గాని, ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను. ఉంటాను. ఇది తెలుసుకో! విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహము, మాట మౌనం మనసు మౌనంతో ధ్యానంలో కూర్చొనుటే, ఈశ్వరుని సేవించుట అని తెలుసుకో! ఇలా ధ్యానం, అభిషేకం మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెడతారో వారు శాంతి అనే మెట్లెక్కటం మొదలుపెడతారు.
ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఇచ్చిన చివరి సందేశం...
ఈ సందేశం ఉద్ధవునికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.
విని, ఆచరించి తరిద్ధాము🙏
సేకరణ
దేవాలయాలు - పూజలు 29*
*దేవాలయాలు - పూజలు 29*
సభ్యులకు నమస్కారములు.
దేవాలయాలలో సాయం సంధ్యలలో మామూలుగా దీపారాధన, హారతి, దైవ స్తుతి, అర్చనలు, తీర్థ ప్రసాదాలు, శఠగోప్యం, భక్తులకు ఆశీర్వచనముల తదుపరి *మంగళ నీరాజనము, మంత్ర పుష్పం, ఛత్రం, చామరం, నృత్యం, వాయిద్యం, సంగీతం, కీర్తనం* ఇంతే కాకుండా రాత్రి సేవలలో భాగంగా *అనంత భోగాశయ్యాసనం, పర్యజ్కాసనం, పవళింపు* సేవలతో ఆ దినపు భగవత్ పూజా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.
1) *మంగళ నీరాజనం* :- మంగళం యొక్క సాధారణ అర్థము *శుభము*. విశేష అర్థము *దీపము*. దీపము *అగ్నిని* సూచిస్తుంది నీరాజనము = నీటితో ప్రోక్షణ = చిలకరించుట. హారతి ఇస్తూ జలమును దీపము = అగ్ని చుట్టూ నీటిని చిలకరిస్తారు. దీపము = అగ్ని వలన సర్వ దోషాలు, అశుభాలు ప్రతిహత (భస్మ) మవుతాయి. నీటిని చిలకరించడం వలన వలయాకారమైన చట్రము ఏర్పడి పవిత్రత అక్కడ పరివేష్టింప బడి ఉంటుంది. అంతరార్థం మంగళ నీరాజనం వలన దోషాలు నివారింపబడి, చేకూరిన పవిత్రత వలన అక్కడ ఉపస్థితులైన సర్వులకు శుభం కలుగుతుంది.
2) *మంత్ర పుష్పం*:- దేవాలయాలలో పూజలలో అంతర్భాగంగా మంత్ర పుష్ప పఠనం ఉంటుంది. *భగవంతుడు సర్వాంతర్యామి (సర్వత్రా ఉన్నాడని) అని మంత్ర పుష్పం తెలియజేస్తున్నది*.
మంత్ర పుష్పం వేదాంతర్గతమైనది. తైత్తిరీయ ఉపనిషద్ లో మంత్ర పుష్ప వివరణ కనిపిస్తుంది. *మననాత్ త్రాయాతే ఇతి మంత్ర:*. అర్థం :- మననం చేసే కొద్దీ రక్షించేది మంత్రం. షోడశోపచారాలలో మంత్ర పుష్పం ఒక అంగం. మంత్ర పుష్పం రెండు భాగములు. ఇందులో పూర్వార్ధం మొదటిది. *ఓం సహాస్ర శీర్ష* తో ప్రారంభమై *సముద్ద్రేంతం విశ్వ సంభవ* తో ముగుస్తుంది. రెండవది ఉత్తరార్ధం *పద్మకోశ ప్రతికాశ* తో ప్రారంభమై *సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి* తో ముగుస్తుంది.
పూజాదికాలతో పరిచయమున్న అధిక సంప్రదాయ వాదులందరికీ కంఠోపాఠంగా ఉంటుంది. *మంత్ర పుష్ప ప్రధాన ఆంతర్యము భగవంతుడు మనకిచ్చిన జ్ఞానేంద్రియాలు కృతజ్ఞతా పూర్వకంగా మనస్సనే పుష్పంతో భగవంతుని కీర్తిస్తాము*
ఆ స్వామి తత్వాన్ని అంగీకరిస్తూ, ఆవిభూతిలో మనల్ని భాగస్వాములను చేసినందులకు కృతజ్ఞతా పూర్వకముగా పుష్పాన్ని , అదే *మన్త్రపుష్పాన్ని* సమర్పిస్తాము. రెండవది *భగవంతుడు సర్వాంతర్యామి* అని మనలో కూడా ఉన్న భగవత్తత్వాన్ని వృద్ధి చేసుకుంటాము.
*భక్తి అంటే పువ్వులతో పూజచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం "మాత్రమే కాదు". భగవంతుని ఉనికిని అనుభవ సిద్ధము చేసుకుని అతనిని ఎప్పుడు మరువక, ఎల్ల వేళలా అతనికి సాధన మాత్రులై అతని ఆజ్ఞానుసారము నడుచుకోవడం. అట్టి భక్తి స్థిరపడాలంటే, భక్తి కథలను వినడం, భగవంతుని స్మరిస్తూ ఉండడం, భగవన్నామాలను సంకీర్తించడం ఎంతో తోడ్పడతాయి. ఆలా చేయడం వలన భగవంతుని గూర్చిన విస్మృతి కలుగదు. భక్తుడు "మాయలో" పడకుండా ఎప్పుడు "చేతనా స్థితిలో" ఉంటాడు*.
ధన్యవాదములు
*(సశేషం)*
మిరపకాయ బజ్జిలు
మిరపకాయ బజ్జిలు
ఎంతో పుణ్యం*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*దవనముతో శివుని ప్రార్థిస్తే*
*ఎంతో పుణ్యం*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*సులువుగా శివలోక ప్రాప్తిని పొందేంత పుణ్యం.*
*దవనము సువాసన భరితమైన లత( తీగ ) వంటిది. దీనిని పరిమళం కోసం పూలతో కలిపి మాలకడుతూ ఉంటారు. శివారాధనకు దవనము అత్యుత్తమైనదని శివరాత్రి, మాస శివరాత్రుల నాడు, పండుగలు పర్వదినాలు వంటి పుణ్య తిధులలో శివున్ని సహస్రనామాలతో దవనముతో పూజిస్తే ఆ బోళ శంకరుడు కోరిన వరాలను ప్రసాదిస్తాడు.*
*దవనము పుట్టుక గురించి అగ్నిపురాణంలో ఒక కథ ఉంది.*
*శివుడు ఒకానొక సమయంలో ఆగ్రహానికి లోను కావడం వల్ల శివుని క్రోధము నుండి భైరవుడు (మనం కుక్కను వ్యవహారములో భైరవతారముగా భావిస్తాము) పుట్టుకొచ్చాడు. భైరవుడు శివ సంకల్పాన్ని పట్టించుకోకుండా దేవతలని హతమార్చసాగాడు. దేవతలంతా భక్త వసుడైన పరమేశ్వరుని పాహిమాం రక్షమాం శంకర నీవే మాకు దిక్కు అంటూ ప్రార్థించారు. దేవతలకు శివుడు అభయమిచ్చి భైరవుడిని భూలోకములో వృక్షముగా పుట్టమని శాపం ఇచ్చాడు. భైరవుడికి జ్ఞాన నక్షత్రం తెచ్చుకుంది "దేవాదిదేవ నా తప్పును మన్నించు నాకిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకో" అంటూ ప్రాధేయపడగా శివుడు కొంత శాంతించి భూలోకంలో నీవు పరిమళభరితమైన వృక్షముగా పుడతావు అందరూ నిన్ను పూజిస్తారు. నిన్ను పూజించిన వారికి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు సౌభాగ్యం ప్రసాదిస్తూ ఉండు అని చెప్పాడు.*
*శివుని క్రోధం నుండి జన్మించిన భైరవుడు శివుని శాపం కారణంగా పూజనీయమైన వృక్షంగా మారాడు. ఆ వృక్ష దళంతో శివుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు యోగాలు తప్పక ప్రసాదిస్తాడని పండితుల వాక్కు.*
*ఓం నమఃశివాయ*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
దేవాలయాలు - పూజలు 29*
*దేవాలయాలు - పూజలు 29*
సభ్యులకు నమస్కారములు.
దేవాలయాలలో సాయం సంధ్యలలో మామూలుగా దీపారాధన, హారతి, దైవ స్తుతి, అర్చనలు, తీర్థ ప్రసాదాలు, శఠగోప్యం, భక్తులకు ఆశీర్వచనముల తదుపరి *మంగళ నీరాజనము, మంత్ర పుష్పం, ఛత్రం, చామరం, నృత్యం, వాయిద్యం, సంగీతం, కీర్తనం* ఇంతే కాకుండా రాత్రి సేవలలో భాగంగా *అనంత భోగాశయ్యాసనం, పర్యజ్కాసనం, పవళింపు* సేవలతో ఆ దినపు భగవత్ పూజా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.
1) *మంగళ నీరాజనం* :- మంగళం యొక్క సాధారణ అర్థము *శుభము*. విశేష అర్థము *దీపము*. దీపము *అగ్నిని* సూచిస్తుంది నీరాజనము = నీటితో ప్రోక్షణ = చిలకరించుట. హారతి ఇస్తూ జలమును దీపము = అగ్ని చుట్టూ నీటిని చిలకరిస్తారు. దీపము = అగ్ని వలన సర్వ దోషాలు, అశుభాలు ప్రతిహత (భస్మ) మవుతాయి. నీటిని చిలకరించడం వలన వలయాకారమైన చట్రము ఏర్పడి పవిత్రత అక్కడ పరివేష్టింప బడి ఉంటుంది. అంతరార్థం మంగళ నీరాజనం వలన దోషాలు నివారింపబడి, చేకూరిన పవిత్రత వలన అక్కడ ఉపస్థితులైన సర్వులకు శుభం కలుగుతుంది.
2) *మంత్ర పుష్పం*:- దేవాలయాలలో పూజలలో అంతర్భాగంగా మంత్ర పుష్ప పఠనం ఉంటుంది. *భగవంతుడు సర్వాంతర్యామి (సర్వత్రా ఉన్నాడని) అని మంత్ర పుష్పం తెలియజేస్తున్నది*.
మంత్ర పుష్పం వేదాంతర్గతమైనది. తైత్తిరీయ ఉపనిషద్ లో మంత్ర పుష్ప వివరణ కనిపిస్తుంది. *మననాత్ త్రాయాతే ఇతి మంత్ర:*. అర్థం :- మననం చేసే కొద్దీ రక్షించేది మంత్రం. షోడశోపచారాలలో మంత్ర పుష్పం ఒక అంగం. మంత్ర పుష్పం రెండు భాగములు. ఇందులో పూర్వార్ధం మొదటిది. *ఓం సహాస్ర శీర్ష* తో ప్రారంభమై *సముద్ద్రేంతం విశ్వ సంభవ* తో ముగుస్తుంది. రెండవది ఉత్తరార్ధం *పద్మకోశ ప్రతికాశ* తో ప్రారంభమై *సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి* తో ముగుస్తుంది.
పూజాదికాలతో పరిచయమున్న అధిక సంప్రదాయ వాదులందరికీ కంఠోపాఠంగా ఉంటుంది. *మంత్ర పుష్ప ప్రధాన ఆంతర్యము భగవంతుడు మనకిచ్చిన జ్ఞానేంద్రియాలు కృతజ్ఞతా పూర్వకంగా మనస్సనే పుష్పంతో భగవంతుని కీర్తిస్తాము*
ఆ స్వామి తత్వాన్ని అంగీకరిస్తూ, ఆవిభూతిలో మనల్ని భాగస్వాములను చేసినందులకు కృతజ్ఞతా పూర్వకముగా పుష్పాన్ని , అదే *మన్త్రపుష్పాన్ని* సమర్పిస్తాము. రెండవది *భగవంతుడు సర్వాంతర్యామి* అని మనలో కూడా ఉన్న భగవత్తత్వాన్ని వృద్ధి చేసుకుంటాము.
*భక్తి అంటే పువ్వులతో పూజచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం "మాత్రమే కాదు". భగవంతుని ఉనికిని అనుభవ సిద్ధము చేసుకుని అతనిని ఎప్పుడు మరువక, ఎల్ల వేళలా అతనికి సాధన మాత్రులై అతని ఆజ్ఞానుసారము నడుచుకోవడం. అట్టి భక్తి స్థిరపడాలంటే, భక్తి కథలను వినడం, భగవంతుని స్మరిస్తూ ఉండడం, భగవన్నామాలను సంకీర్తించడం ఎంతో తోడ్పడతాయి. ఆలా చేయడం వలన భగవంతుని గూర్చిన విస్మృతి కలుగదు. భక్తుడు "మాయలో" పడకుండా ఎప్పుడు "చేతనా స్థితిలో" ఉంటాడు*.
ధన్యవాదములు
*(సశేషం)*
దేవస్థానాల్లో వాలంటీర్
*దేవస్థానాల్లో వాలంటీర్ గా చేయాలనుకునే వారికోసం...*
ప్రతి శనివారం, ఆదివారం రోజుల్లో *అన్నవరంలో సేవ* ఉంది. వాలంటీర్ గా
ఎవరైనా వెళ్లాలని 7893159871 కాల్ చేయండి.
*రామేశ్వరంలో* హుండీ లెక్కింపు ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు 7893159871 కాల్ చేయండి.
మహాశివరాత్రి సందర్భంగా *పట్టిసీమ, కోటప్పకొండ శ్రీశైలంలో, పంచరామాల్లో సేవలు* ఉన్నవి. వాలంటీర్ గా వెళ్లగలిగే వారు ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి
789315981.
*సింహాచలంలో*, ప్రతి శనివారం, ఆదివారం సేవ ఉన్నది. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి
7893159871
*శ్రీపురంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను.
7893159871
*ద్వారకా తిరుమలలో సేవ* ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు, 7893159871 కాల్ చేయండి.
*భద్రాచలంలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి.
*తిరుపతిలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871
*మద్ది ఆంజనేయ స్వామి గుడి వద్ద సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి
*అయోధ్య మరియు కాశి* రాగలిగే వారు ఎవరైనా ఉంటే గనుక కాల్ చేయండి. భోజనానికి , రూముకి , ట్రైన్ చార్జీలతో కలిపి, మూడు రోజుల సేవకి ₹3500/-
*కాణిపాకంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871.
*రామనారాయణ టెంపుల్, విజయనగరం సేవ*, శనివారం, ఆదివారం సేవ చేయుటకు కావలెను.
7893159871
కాశీకి అస్తికలు అనే కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన ఈ సంస్థ ఉచితంగా అస్థికలు తీసుకు వెళ్ళే కార్యక్రమం చేస్తుంది. స్వయంగా వెళ్లలేని వారెవరైనా సరే చనిపోయిన మీ ఆప్తుల అస్తికలు వీరికి ఇస్తే, ఈ సంస్థ వారు పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయగలరు దీనికి డబ్బులు అవసరం లేదు.
బీద ధనిక కుల వర్గ భేదము ఏమీ లేవు.
కాశీలో కార్యక్రమం చేసి లైవ్ వీడియో పంపిస్తారు. కనుక ఎవరైనా అస్తికలు గంగలో కలపాలని ఉండి స్వయంగా వెళ్లలేని వారు ఉంటే కనుక వీళ్ళకు తెలియజేయండి ఫ్రీగా తీసుకువెళ్లి కార్యక్రమం అన్ని పూర్తి చేసి వస్తారు. 7893159871 కాల్ చేయండి.
భక్తితో (డబ్బులు ఆశించకుండా) సేవ చేయాలి అనుకునేవారికి ఈ మెసేజ్ పంపించండి.
జై శ్రీ రామ!
జై శ్రీ మన్నారాయణ!
హరే కృష్ణ!
Shri Bala subrahmanyam manda. Secretary (kaca)
సర్వలక్షణ లక్షణ్య:
👆శ్లోకం
అతులశ్శరభో భీమః
సమయజ్ఞో హవిర్హరిః|.
సర్వలక్షణ లక్షణ్యో
లక్ష్మీవాన్ సమితింజయః||
ప్రతిపదార్థ:
అతుల: - సాటిలేనివాడు.
శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
రక్తం వృద్ది చెందుటకు
శరీరం నందు రక్తం వృద్ది చెందుటకు సులభయోగాలు -
* ఉల్లిపాయ , ఉసిరికాయలను సమభాగాలుగా నూరి రసము తీసి ఆ రసము సేవించిన శరీరం నందు రక్తం వృద్ది చెందును.
* టమాటో రసం నందు తేనే కలిపి త్రాగిన రక్తశుద్ధి జరుగును మరియు రక్తం వృద్ది చెందును
* ప్రతిరోజు పడుకునే ముందు వేడిపాలు పావుసేరు తాగుతున్న రక్తంవృద్ది అగును .
* పటికబెల్లం , లొహాభస్మం , పిప్పిల్లు వీటిని సమపాళ్లలో తీసుకుని పొడిచేసి పూటకు పావుతులము పొడిని నేతిలో కలుపుకుని తినుచున్న రక్తం వృద్ది అగును.
నా అనుభవ యోగం -
ప్రతిరోజూ ఉదయము మరియు సాయంత్రం సమయాలలో ఆహారానికి గంటన్నర ముందు ఒక గ్లాస్ తియ్యటి దానిమ్మ రసములో ఒక స్పూన్ గోధుమ గడ్డి చూర్ణం కలిపి ఇవ్వడం జరిగింది. బెల్లంతో తయారుచేసిన పల్లీపట్టీ కొంత ఆహారంలో భాగముగా ఇచ్చాను . 40 రోజులలోనే రక్తవృద్ది జరిగి రోగి కోలుకున్నారు . ప్రతినిత్యం ఆపిల్ కూడా ఆహారములో భాగం చేశాను .
శరీరము నందు రక్తాన్ని వృద్ధి చేయు మరికొన్ని ఔషధులు -
అంజీర పండు , అభ్రక భస్మము , అమృత ఫలము , ఆవునెయ్యి , ఓమము , కొర్రలు , కోడిగుడ్లు , జాజికాయ , దానిమ్మపండు తియ్యనిది . ద్రాక్షపండు తియ్యనివి , నువ్వులు , బత్తాయి పండ్లు , సపోటా ఆహరంలో తీసికొనవలెను
పళ్ళ రసాలు ఎప్పుడూ కూడా ఆహరం తరువాత తీసుకోవద్దు . ఆహారానికి గంటన్నర ముందు తీసుకోవడం మంచిది .
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
ప్రాప్తిని బట్టి లబ్ధి!
చొప్పకట్ల.
ప్రాప్తిని బట్టి లబ్ధి!
వనజభవుడు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంమ్మొ కొంచెమో
విను మరుభూమి కేగిన లభించును, మేరువు చేరఁబోయినన్
ధన మధికమ్మురాదు;కడు దైన్యము మానుధనాఢ్యులందు న
వ్వననిధి నూతఁదుల్యముగ వారి గ్రహించు ఘటమ్ము చూడుమా?
-భర్తృహరి సుభాషితములు.ఏనుగు లక్ష్మణకవి.
భావం:ప్రాప్తిని బట్టి లబ్ధి.మనకెంతప్రాప్తియోఅంత మరుభూమికేగినా లభిస్తుంది.లబ్ధివ్రాసిపెట్టి లేకపోతే మేరుపర్వతం చుటూతిరిగినా మనకేమీ అంటదు.దైన్యంతో ధనవంతులచుట్టూతిరిగితే ఏంప్రయోజనం?
కలశ ప్రమాణమునుబట్టినీరు.నీకలశమెంతపెద్దదో అంతనీరు సముద్రమందైనా నూతియందైనా లభించుట నిత్యము మనమెరిగినసత్యమేగదా!!
"దృష్టాంతాలంకారము."
స్వస్తి!!
🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️
కాశీ విశ్వనాథ సుప్రభాతం*
*కాశీ విశ్వనాథ సుప్రభాతం*
విశ్వేశం మాధవం ధుండిం దండపాణిం చ భైరవం
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం
ఉత్తిష్ఠ కాశి భగవాన్ ప్రభు విశ్వనాథో
గంగోర్మి సంగతి శుభైః పరిభూషితోబ్జైః
శ్రీధుండి భైరవ ముఖైః సహితాన్నపూర్ణా
మాతా చ వాంఛతి ముదా తవ సుప్రభాతం
బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారిః
భానుః శశీ భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రః శని రాహు కేతవః
కుర్వంతు సర్వే భువి సుప్రభాతం
వారాణసీ స్థిత గజానన ధుండిరాజ
తాపత్రయాపహరణే ప్రథిత ప్రభావ
ఆనంద కందలకుల ప్రసవైకభూమే
నిత్యం సమస్త జగతః కురు సుప్రభాతం
బ్రహ్మద్రవోపమిత గాంగ పయః ప్రవాహైః
పుణ్యైః సదైవ పరిచుంబిత పాదపద్మే
మధ్యేఖిలామరగణైః పరిసేవ్యమానే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం
ప్రత్నైరసంఖ్య మఠ మందిర తీర్థకుండ
ప్రాసాద ఘట్ట నివహైః విదుషాం వరైశ్చ
ఆవర్జయస్యఖిల విశ్వ మనాంసి నిత్యం
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం
కే వా నరాను సుధియః కుధియో అధియో వా
వాంఛంతి నాంతసమయే శరణం భవత్యాః
హే కోటి కోటిజన ముక్తి విధానదక్షే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం
యా దేవైరసురైర్మునీంద్ర తనయైర్గంధర్వ యక్షోరగైః
నాగైర్భూతలవాసిభిర్ద్విజవరైస్సంసేవితా సిద్ధయే
యా గంగోత్తరవాహినీ పరిసరే తీర్థైరసంఖ్యైర్వృతా
సా కాశీ త్రిపురారిరాజ నగరీ దేయాత్ సదా మంగలం
తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసార పారాపరా
నందానంది గణేశ్వరైరుపహితా దేవైరశేషైః స్తుతా
యా శంభోర్మణి కుండలైక కణికా విష్ణోస్తపో దీర్ఘికా
సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్ సదా మంగలం
అభినవ బిసవల్లీ పాద పద్మస్య విష్ణోః
మదన మథన మౌళేర్మాలతీ పుష్పమాలా
జయతి జయపతాకా కాప్యసౌ మోక్షలక్ష్మ్యాః
క్షపిత కలికలంకా జాహ్నవీ నః పునాతు
గాంగం వారి మనోహారి మురారి చరణచ్యుతం
త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతు మాం
విఘ్నావాస నివాసకారణ మహాగండస్థలాలంబితః
సిందూరారుణ పుంజ చంద్రకిరణ ప్రచ్ఛాదినాగచ్ఛవిః
శ్రీవిశ్వేశ్వర వల్లభో గిరిజయా సానందమానందితః
స్మేరాస్యస్తవ ధుండిరాజ ముదితో దేయాత్ సదా మంగలం
కంఠే యస్య లసత్కరాల గరళం గంగాజలం మస్తకే
వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతీ
నంది స్కంద గణాధిరాజ సహితః శ్రీవిశ్వనాథప్రభుః
కాశీమందిర సంస్థితోఖిలగురుః దేయాత్ సదా మంగలం
శ్రీవిశ్వనాథ కరుణామృత పూర్ణ సింధో
శీతాంశు ఖండ సమలంకృత భవ్యచూడ
ఉత్తిష్ఠ విశ్వజన మంగల సాధనాయ
నిత్యం సమస్తజగతః కురు సుప్రభాతం
శ్రీవిశ్వనాథ వృషభ ధ్వజ విశ్వవంద్య
సృష్టి స్థితి ప్రళయకారక దేవదేవ
వాచామగోచర మహర్షి నుతాంఘ్రిపద్మ
వారాణసీపురపతే కురు సుప్రభాతం
శ్రీవిశ్వనాథ భవభంజన దివ్యభావ
గంగాధర ప్రమథవందిత సుందరాంగ
నాగేంద్రహార నత భక్త భయాపహార
వారాణసీపురపతే కురు సుప్రభాతం
శ్రీవిశ్వనాథ తవ పాదయుగం నమామి
నిత్యం తవైవ శివనామ హృదా స్మరామి
వాచం తవైవ యశసానఘ భూషయామి
వారాణసీపురపతే కురు సుప్రభాతం
కాశీనివాస మునిసేవిత పాదపద్మ
గంగాజలౌఘ పరిషిక్త జటాకలాప
అస్యాఖిలస్య జగతః సచరాచరస్య
వారాణసీపురపతే కురు సుప్రభాతం
గంగాధరాద్రితనయా ప్రియ శాంతమూర్తే
వేదాంత వేద్య సకలేశ్వర విశ్వమూర్తే
కూటస్థ నిత్య నిఖిలాగమ గీతకీర్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతం
విశ్వం సమస్తమిదమద్య ఘనాంధకారే
మోహాత్మకే నిపతితం జడతాముపేతం
భాసా విభాస్య పరయా తదమోఘ శక్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతం
సూనుః సమస్తజన విఘ్నవినాస దక్షో
భార్యాన్నదాన నిరతా విరతం జనేభ్యః
ఖ్యాతః స్వయంచ శివకృత్ సకలార్థిభాజాం
వారాణసీపురపతే కురు సుప్రభాతం
యే నో నమంతి న జపంతి న చామనంతి
నో వా లపంతి విలపంతి నివేదయంతి
తేషామబోధ శిశు తుల్యధియాం నరాణాం
వారాణసీపురపతే కురు సుప్రభాతం
శ్రీకంఠ కంఠధృత పన్నగ నీలకంఠ
సోత్కంఠ భక్త నివహోపహితోప కంఠ
భస్మాంగరాగ పరిశోభిత సర్వదేహ
వారాణసీపురపతే కురు సుప్రభాతం
శ్రీపార్వతీ హృదయవల్లభ పంచవక్త్ర
శ్రీ నీలకంఠ నృకపాల కలాపమాల
శ్రీవిశ్వనాథ మృదు పంకజ మంజుపాద
వారాణసీపురపతే కురు సుప్రభాతం
దుగ్ధ ప్రవాహ కమనీయ తరంగభంగే
పుణ్యప్రవాహ పరిపావిత భక్తసంగే
నిత్యం తపస్వి జనసేవిత పాదపద్మే గంగే
గంగే శరణ్యశివదే కురు సుప్రభాతం
సానందమానంద వనే వసంతం ఆనంద కందం హత పాప వృందం
వారాణసీ నాథం అనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
గానం - యం యెస్ సుబ్బలక్ష్మి
02.09.2024. సోమవారం
*జై శ్రీరాం..🚩🚩 శుభోదయం🌷🌅*
02.09.2024. సోమవారం
*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు*
సుప్రభాతం.....
ఈరోజు శ్రావణ మాస బహుళ పక్ష *అమావాస్య* తిథి ఈరోజు పూర్తిగా, *మఖ* నక్షత్రం రా.12.20 వరకూ తదుపరి *పూర్వఫల్గుని* నక్షత్రం, *శివం* యోగం సా.06.20 వరకూ తదుపరి *సిద్దం* యోగం, *చతుష్పాద* కరణం సా.06.30 వరకూ తదుపరి *నాగవ* కరణం ఉంటాయి.
*సూర్య రాశి* : సింహ రాశి లో ( పూర్వఫల్గుని నక్షత్రం లో)
*చంద్ర రాశి* : సింహ రాశి లో
*నక్షత్ర వర్జ్యం*: ఉ.11.04 నుండి మ.12.50 వరకూ.
*అమృత కాలం*: రా.09.41 నుండి రా.11.27 వరకూ
( హైదరాబాద్ ప్రాంతం వారికి)
*సూర్యోదయం*: ఉ.06.02
*సూర్యాస్తమయం*: సా.06.29
*చంద్రోదయం* : లేదు
*చంద్రాస్తమయం*: సా.06.13
*అభిజిత్ ముహూర్తం*: ప.11.51 నుండి మ.12.40 వరకూ
*దుర్ముహూర్తం*: మ.12.40 నుండి మ.01.30 వరకూ మరలా మ.03.10 నుండి మ.03.59 వరకూ
*రాహు కాలం*: ఉ.07.36 నుండి ఉ.09.09 వరకూ
*గుళిక కాలం*: మ.01.49 నుండి మ.03.22 వరకూ
*యమగండం* : ఉ.10.42 నుండి మ.12.16 వరకూ.
ఈరోజు *సోమవతీ అమావాస్య, ఆమా సోమవార వ్రతం*. అమావాస్య తిథి సోమవారం వచ్చిన రోజును సోమవతీ అమావాస్య అని పిలుస్తారు. శివ పురాణం ప్రకారం శివుడిని పూజించడానికి సోమవతీ అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి,శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమ జాతక చక్రంలో చంద్ర గ్రహ దోషాలు ఉన్నవారు, వాటిని అధిగమించడానికి ఈరోజు చంద్ర గ్రహ శాంతులు చేయించుకుంటారు.
ప్రతి అమావాస్య రోజు పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవడానికి అనుకూలం.
ఒరిస్సా రాష్ట్రం లో ఈ రోజు *సప్త పూరీ అమావాస్య* గా పండుగ జరుపుకుంటారు. ముఖ్యం గా పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయం లో, అలం చండి దేవాలయం లో వేదోక్త ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజు *సప్త పూరీ తడ* అనే ప్రత్యేక తీపి వంటకాన్ని జగన్నాథ దేవాలయం నుండి జగన్నాథుడు పంపే ప్రత్యేక బహుమతి గా అలం చండి దేవాలయానికి భక్తులు పంపుతారు.
ఈరోజు *పోలావ్రతం*. దీనినే *పోలాంబ వ్రతం అనీ, పోలాల అమావాస్య* అని కూడా పిలుస్తారు.ఈ వ్రతాన్ని సంతానం లేని స్త్రీలు,తరచూ గర్భస్రావం అవుతున్న వారు త్వరగా దోషాలు తొలగి సంతానం కలగాలని కోరుకుంటూ ఆచరిస్తారు. పోలేరమ్మ తల్లి,పోచమ్మ తల్లి లేదా పొలాంబ దేవత గా పిలవబడే గ్రామదేవతలు,తమ సంతానాన్ని కాపాడి కష్టకాలం లో రక్షించే శక్తులుగా భక్తులు భావిస్తారు.వివాహిత స్త్రీలు తమ సంతాన ఆయురారోగ్యాలు కోసం ఈరోజు ఈవ్రతం ఆచరించి కందదుంప ను బ్రాహ్మణులకు దానం చేస్తారు.
ఈరోజు *పిఠోరి అమావాస్య*. ఈరోజు భక్తులు దుర్గాదేవి ని పూజిస్తారు. పిఠ్ అంటే ధాన్యపు పిండి అని అర్థం. ఈరోజు వివాహిత తల్లులు తమ పిల్లల ఆయురారోగ్యాలు కోసం,ఉన్నతి కోసం బియ్యపు పిండి తో 64 దేవతల ప్రతిమలను తయారుచేసి, దుర్గాదేవిని, అష్టమాతృకలను, సప్తమాతృకలను పూజించి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేస్తారు.
ఈరోజు *కుశ గ్రహణం*.ప్రతి హిందూ మత కార్యక్రమాలలో తప్పనిసరిగా వాడే దర్భలను సేకరించడానికి ప్రత్యేకమైన రోజు.
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు *అన్వాధానం*. వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి, రేపు ఉదయం *ఇష్ఠి* రోజు యజ్ఞం చేస్తారు.
ఈరోజు *అయిదవ శ్రావణ సోమవార వ్రతం*. భక్తులు ఈరోజంతా పగటిపూట ఉపవాసం ఉండి,108 బిల్వాలతో,రుద్రాభిషేకంతో శివుడిని పూజించి, నక్తకాలం లో (సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత కానీ,నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత కానీ)భోజనం చేస్తారు.
ఈరోజు *అయిదవ శివ ముష్ఠీ వ్రతం* .వివాహిత స్త్రీలు,తమ పెండ్లి అయిన మొదటి అయిదు సంవత్సరాలు, శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటి పూట భోజనం చేసి,శివుడిని బిల్వపత్రాలతో పూజించి ఒక్కో సోమవారం రోజున ఒక్కో ధాన్యంతో ప్రసాదం నివేదిస్తారు. అయిదవ సోమవారం రోజున బార్లీ గింజలు తో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తలు మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని నమ్మకం.
కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు *అగ్ని సావర్ణీక మన్వాది* శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు *రుద్ర సావర్ణీక మన్వాది*. ప్రతి మన్వాది రోజున పితృ దేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం.
ఈరోజు *వృషభోత్సవం*. వ్యవసాయదారులు తమ ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు.
శివ స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.
ఫోన్ నెంబర్:6281604881
translations
I am an 81-year old retired scientist from Kerala and settled in Bangalore. I am an expert in Sanskrit, Tamil, Malayalam, Hindi and have working knowledge of Kannada and Telugu.
On the day of retirement, I decided that I will engage myself in translation of Hindu stotras written in all these languages into English. I have so far translated 2000 stotras written in four languages. I have translated three Ramayanas (Valmiki , Kamba and Adhyathma), 21 Upanishads, Gita, Devi Mahatmyam, Narayaneeyam, Jnanapana, Krishna Karnamrutham, 21 Vedic Sukthas, including Chamakam, Rudram and 65 out of 80 known Stotra compositions of Adhi Sankara.
I also wanted to preserve Carnatic Krithis in English and I have translated 1950 Krithis, which include all known Krithis of Thyagaraja, about 100 Krithis each of Purandaradasa , Oothukadu Venkatasubba Iyer and so on.
All these translations are now available in PDF format on:
http://www.hindupedia.com/en/User:P.R.Ramachander
I have a humble request. Please circulate this information to your contacts.
- *PR Ramachander*