👆శ్లోకం
అతులశ్శరభో భీమః
సమయజ్ఞో హవిర్హరిః|.
సర్వలక్షణ లక్షణ్యో
లక్ష్మీవాన్ సమితింజయః||
ప్రతిపదార్థ:
అతుల: - సాటిలేనివాడు.
శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి