2, సెప్టెంబర్ 2024, సోమవారం

మిరపకాయ బజ్జిలు

 మిరపకాయ బజ్జిలు

సుబ్బారావు ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్కుగా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగం ఒకింత లాభదాయకమైనదే అని చెప్పవచ్చు. జీతం తో పాటు ఫై సంపాదనకూడా తగినంతగా వస్తూవుంటుంది. కాబట్టి జీవితం సునాయాసంగా నడుస్తున్నది. ఇటీవలే ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు. సుబ్బారావు భార్య విమల ఆమెకు సుబ్బారావుకు చక్కటి జోడి అని చూసినవాళ్లు చెపుతారు. ఇద్దరు అన్యోన్యంగా వుంటారు. వారికి సురేష్, సురేఖ అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు. సుబ్బారావు ఎటువంటి ఇగోలు లేవు. వచ్చిన సంపాదనతో సుఖంగా జీవనం చేస్తున్నాడు. ఇది సూక్ష్మంగా సుబ్బారావు చరిత్ర.
ఒకరోజు రాత్రి సుబ్బారావుకు అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. అంతేకాదు విరోచనానికి వేళ్ళ వలసి వచ్చింది. కానీ విషయం ఏమిటంటే నీళ్ల విరోచనం అయింది. ఏదో ఆహార దోషం అయివుంటుంది అని అనుకుని వెళ్లి మంచంమీద పడుకోపోయాడు. కానీ ఇంకొక నిమిషానికి మరల ఇంకొక విరోచనం అయింది. ఏమిటి ఇలా అవుతున్నది అని అనుకున్నాడు. కడుపులో మెలిపెట్టినట్లు ఒకటే నొప్పి. భరించటానికి ప్రయత్నించాడు కానీ అతని వసం కావటంలేదు. మరల మరల వాష్ రూముకు వెళ్ళవలసి వచ్చింది. ఏమిటి ఇట్లా అవుతున్నది అని బాధపడసాగాడు. అతని శరీరంలో శక్తి మొత్తం గాలితీసిన బెలూనులా క్షీణించి పోతున్నది. చమటలు పడుతున్నాయి. ఇక తప్పని సరి పరిస్థితిలో భార్యను నిద్ర లేపి అతి కష్టంమీద ఆమెకు తన అవస్థను చెప్పాడు. స్వతహాగా విమల చాలా గాబరా మనిషి. ఎప్పుడైతే భర్త తన అవస్థను తెలిపాడో ఆమెకు ఒకనిమిషం మెదడు మొద్దుపారినట్లు అయింది. వెంటనే తేరుకొని పిల్లలకు చెప్పకుండానే బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి భర్త చేతిని పట్టుకొని కారుదాకా నడిపించుకుని వెళ్లి తను డ్రైవరు సీట్లో కూర్చొని దగరలో వున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటలుకు వెళ్లి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ని సంప్రదించింది. వెంటనే నర్సులు, వార్డు బాయిలు వచ్చి స్టెక్చెర్ మీద సుబ్బారావుని తీసుకొని లోపలి వెళ్లారు.
మేడం మీరు ఒక ముప్పై వేలు కౌంటరులో కట్టండి అని డాక్టరు విమలకు ఆదేశిస్తున్నట్లు చెప్పాడు. వెంటనే విమల కౌంటరు వద్దకు వెళ్లి ఫోనుపేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. రసీదు నర్సుకి చూపించింది. మీరు అక్కడ కూర్చోండి ట్రీట్మెంట్ జరుగుతుంది అని సాపీగా చెప్పింది నర్సు. విమలకు ఒకవైపు నిద్ర వస్తువున్నది. ఇంకొకవైపు తన భర్తకు ఏమి అవుతుందానని గాబరాగా వుంది. 
విమల మనసులో పరి పరి ఆలోచనలు పరిగెడుతున్నాయి.  ఏమైంది తన భర్తకు ఆయనకు ఎటువంటి దురలవాట్లు కూడా లేవుకదా ఉన్నట్లుండి ఇట్లా విరోచనాలు ఎందుకు వచ్చాయి.  ఆయన బయట తనకు తెలియకుండా ఏమైనా తిన్నారా.  తింటే తనకు చెప్పేవాడే.  ఏమిలేదు ఏదో ఒక చిన్న అస్వస్థత అయి ఉండవచ్చు అని అనుకుంది.  తనను తానూ తమాయించు కోలేక పోయింది.  ఇంట్లో పిల్లలు యెట్లా వున్నారు. ప్రక్కనే వున్న తన అక్కకు ఫోను చేస్తే.  ఎందుకు అక్కను లేపటం అని అనుకుంటూనే ఇక తట్టుకోలేక అక్క సరోజకి ఫోను చేసింది. అప్పుడు సమయం 12.30. అవుతున్నది అక్క బావ ఏమనుకుంటారో అని ఒకవైపు మనసు పీకుతున్నది. ఇంతలో అక్కే ఫోను ఎత్తింది. ఏమైంది విమల అంతా క్షేమమే కదా ఈ సమయంలో ఎందుకు ఫోను చేసావు అని కంగారుగా అడిగింది. అక్కకు జరిగింది చెప్పి తానూ తన భర్తను ఏ హాస్పిటలులో చేర్చింది చెప్పింది. ప్రక్కనే వున్న బావ విమల నీవు ఏమి కంగారు పడకమ్మా నేను మీ అక్క ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము అని ఫోను పెట్టి 5 నిమిషాలలో విమల ముందు ప్రత్యక్షం అయ్యారు.  అక్క బావను చూసేసరికి విమలకు ప్రాణం లేచి  వచ్చినట్లు అయ్యింది. ఒక్కసారిగా అక్కను కౌలించుకొని భోరున ఏడిచింది.  ఏమిటే చిన్న పిల్లలా విరోచనాలు అనేవి ఈ రోజుల్లో  ఒక చిన్న సమస్య మీ ఆయనకు ఏమీకాదు తగ్గుతుంది అని సముదాయించింది. ఇంతలో సుబ్బారావు పేషంటు తాలూకు ఎవరు అని ఒక నర్సు వచ్చింది.  మేమె అని బావ అన్నాడు.  అర్జన్టుగా ఈ మందులు తీసుకొని రండి అని ఒక లిస్టు ఇచ్చింది.  ఇవి ఇక్కడ దొరుకుతాయా అని అడిగాడు. క్రింద మా మందుల షాపు వుంది అక్కడ అన్ని దొరుకుతాయి అని అన్నది.  బావ నేను తెస్తాలే అని విమల అన్నది. ఏమిపరవలేదు అని బావే వెళ్లి మందులు తెచ్చాడు. అందులో ఒక సెలెను బాటిళ్లు కొన్ని టాబిలెట్లు, ఇంజక్షన్లు వున్నాయి.
అక్క మరచి పోయా ఇంట్లో నా పిల్లలు వంటరిగా వున్నారు. నీవు ఇంటికి వెళ్లి వాళ్లకు తోడుగా ఉండవా అని విమల అని ఇంటి తాళం చెవులు ఇచ్చింది. సరోజ నిజం పిల్లలు దడుచుకుంటారు నేను నీ చెల్లెలికి తోడుగా ఉంటాలే నీవు కారు తీసుకొని వేళ్ళు అని బావ అన్నాడు. సరోజ కారులో వెళ్ళింది. అప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది. ఇంతలో ఒక డాక్టరు వచ్చి అమ్మ మేము ట్రీట్మెంట్ చేసాము ఇప్పుడు మీ వారికి ఏమి ప్రమాదం లేదు మీరు వెళ్లి చూడవచ్చు అని అనే సరికి విమల, విమల బావ ఇద్దరు బ్రతుకుజీవుడా అని ఐ సి యు కు వెళ్లారు. సుబ్బారావుకు చేతికి సెలైన్ పైపు ముక్కుకు ఆక్సిజన్ మాస్కు తలకు కవరు వేసి ఒక ఆపరేషను చేసిన పేషంటులాగా ఉంచారు. తన భర్తను ఆలా చూసే సరికి విమలకు ఏడుపు ఆగలేదు. పవిట కొంగుతో తుడుచుకుంటూ ఎంతో ప్రయత్నం మీద కళ్ళులోని  ఏడుపును అదుపులో పెట్టుకుంది.
సుబ్బారావు తన తోడల్లుడిని అల్లుడిని చూసి అన్నయ్య నీవు ఎందుకు వచ్చావు అని అన్నాడు. దానికి ఆయన జరిగింది అంతా చెప్పి. నీవేమి బాధపడకు నేను ఇక్కడే వుంటాను మీకు తోడుగా అని ఊరట పరిచాడు. సుబ్బారావుకు విరోచనాలు తగ్గాయి. కానీ ట్రీట్మెంట్ వలన శరీరం పూర్తిగా క్షీణించింది. డాక్టరు వచ్చి డిశ్చార్జి చేస్తాము మీరు వేట్ చేయండి అన్నాడు. ఉదయం 6 గంటలకు బిల్లు చేతిలో పెట్టి ఇక మీరు వేళ్ళ వచ్చు అని పంపాడు డాక్టరు. రాత్రి విమల కట్టిన 30 వేల రూపాయలకు బిల్లు వుంది.
విమల బావ కారు నడుపుతుంటే విమల సుబ్బారావుని పట్టుకొని కారు  వెనుక సీట్లో కూర్చొన్నది  అందరు సుబ్బారావు  ఇంటికి వెళ్లారు. విమల చేయిపట్టుకుని చిన్నగా సుబ్బారావును కారులోంచి దింపింది . అప్పుడే నిద్రనుంచి లేచిన  విమల పిల్లలకు తన తండ్రి పేషంటుగా ఆస్పటల్ నుండి రావటం చూసి  భయపడ్డారు.  
సుబ్బారావుని చిన్నగా బెదురూములోకి తీసుకొని వెళ్లి పడుకోపెట్టారు. కొంతసేపటి తరువాత చిన్నగా పండ్లుతోముకున్నాడు. తరువాత విమల రాత్రి ఎందుకు విరోచనాలు అయ్యాయి మీరు నాకు చెప్పకుండా ఏమిటిన్నరని వాఁకపు చేసింది. తలవంచుకొని అసలు విషయం చిన్నగా చెప్పాడు. నిన్న సాయంత్రం తానూ తన స్నేహితుడు రామారావు ఆఫీసునించి వస్తూవుంటే దారిలో మిరపకాయలబండి కనపడితే తిడ్తారు చేరి ఆరు మిరపకాయల బజ్జిలు లాగించారట. అది సంగతి.  ఆ బజ్జీల బండి వాడు ఏ నూనె వాడతాడో ఏమిటో గాని అది వికటించి సుబ్బారావుకు ఫుడ్ పాయసన్ అయ్యింది. అన్నట్లు మరిచాను నా ఫ్రెండ్ రామారావు యెట్లా వున్నదో అని రామారావుకు ఫోన్చేసాడు  సుబ్బారావు. రామారావు భార్య ఫోను ఎత్తింది. అన్నయ్య మా ఆయనకు రాత్రి ఎడతెరపిలేకుండా మోషన్స్ అయ్యాయి ఇప్పుడే ఆస్పాట్లనుంచి వచ్చాము అని చెప్పింది. 
విషయం తెలుసుకున్న పక్కింటి  నాగభూషణం సుబ్బారావుని చూడటానికి వచ్చి జరిగింది తెలుసుకొని ఎందుకయ్యా సుబ్బారావు అంట గాబరా పడ్డావు నాకు చెపితే విరోచనాలు మంచు ఇచ్చేవాడినిగా అని ఇలా అన్నాడు వర్షాకాలంలో నీటి కాలుష్యంవలన ఇంకా బయటి తిండివలం సాధారణంగా విరోచనాలు అవుతూవుంటాయి. అందుకే మనం ఎప్పుడు పతంజలి కంపెనీ కుటజారిష్ట ఇంట్లో ఉంచుకోవాలి ఎప్పుడు విరోచనాలు అయినా వెంటనే ఒక డోసు మందు నీటిలో కలుపుకొని తాగితే వెంటనే కట్టుతాయని చెప్పాడు. అది విన్న తరువాత
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లైందిసుబ్బారావుకు.




 

కామెంట్‌లు లేవు: