2, సెప్టెంబర్ 2024, సోమవారం

ఎంతో పుణ్యం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*దవనముతో శివుని ప్రార్థిస్తే*

         *ఎంతో పుణ్యం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*సులువుగా శివలోక ప్రాప్తిని పొందేంత పుణ్యం.*


*దవనము సువాసన భరితమైన లత( తీగ ) వంటిది. దీనిని పరిమళం కోసం పూలతో కలిపి మాలకడుతూ ఉంటారు. శివారాధనకు దవనము అత్యుత్తమైనదని శివరాత్రి, మాస శివరాత్రుల నాడు, పండుగలు పర్వదినాలు వంటి పుణ్య తిధులలో శివున్ని సహస్రనామాలతో దవనముతో పూజిస్తే ఆ బోళ శంకరుడు కోరిన వరాలను ప్రసాదిస్తాడు.*


*దవనము పుట్టుక గురించి అగ్నిపురాణంలో ఒక కథ ఉంది.* 


*శివుడు ఒకానొక సమయంలో ఆగ్రహానికి లోను కావడం వల్ల శివుని క్రోధము నుండి భైరవుడు (మనం కుక్కను వ్యవహారములో భైరవతారముగా భావిస్తాము) పుట్టుకొచ్చాడు. భైరవుడు శివ సంకల్పాన్ని పట్టించుకోకుండా దేవతలని హతమార్చసాగాడు. దేవతలంతా భక్త వసుడైన పరమేశ్వరుని పాహిమాం రక్షమాం శంకర నీవే మాకు దిక్కు అంటూ ప్రార్థించారు. దేవతలకు శివుడు అభయమిచ్చి భైరవుడిని భూలోకములో వృక్షముగా పుట్టమని శాపం ఇచ్చాడు. భైరవుడికి జ్ఞాన నక్షత్రం తెచ్చుకుంది "దేవాదిదేవ నా తప్పును మన్నించు నాకిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకో" అంటూ ప్రాధేయపడగా శివుడు కొంత శాంతించి భూలోకంలో నీవు పరిమళభరితమైన వృక్షముగా పుడతావు అందరూ నిన్ను పూజిస్తారు. నిన్ను పూజించిన వారికి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు సౌభాగ్యం ప్రసాదిస్తూ ఉండు అని చెప్పాడు.*


*శివుని క్రోధం నుండి జన్మించిన భైరవుడు శివుని శాపం కారణంగా పూజనీయమైన వృక్షంగా మారాడు. ఆ వృక్ష దళంతో శివుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు యోగాలు తప్పక ప్రసాదిస్తాడని పండితుల వాక్కు.*


*ఓం నమఃశివాయ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: