30, సెప్టెంబర్ 2020, బుధవారం

See the



 

*What is ORAC ?*

 


*Please read this without fail, only 30 seconds..*



*ORAC is Oxygen Radical Absorbance Capacity.*


*Higher ORAC, Better will be oxygen carrying capacity of blood & Lungs oxygen capacity.*


*In the Future, our survival will be based on our Immunity* 


*Why spices are important for our Life? Look at their ORAC Values....👍*


*Clove : 314,446 ORAC*


*Cinnamon : 267,537 ORAC*


*Turmeric : 102,700 ORAC*


*Cocoa : 80,933 ORAC*

 

*Cumin : 76,800 ORAC*


*Parsley : 74,349 ORAC*


*Tulsi : 67,553 ORAC*

 

*Thyme : 27,426ORAC*


*Ginger : 28,811 ORAC*

 


*Extracts of Ginger , Tulsi, Turmeric are at least 10 times higher ORAC Values. That's how they become effective.*


*OXYGEN CARRYING CAPACITY OF THE BLOOD CAN BE ENHANCED USING NATURAL FRUITS, VEGETABLES, SPICES, HERBS ....THAT HAVE HIGH ORAC VALUE !*


*OXYGEN RADICAL ABSORBANCE CAPACITY*


*PREVENTS : CANCERS, NEURO - DEGENERATIVE DISORDERS, DIABETES, & SO MANY CHRONIC CONDITIONS*


*Nature boosts immunity ...*


 

*High ORAC foods and Nutrients such as iron, vitamin C, Zinc, omega 3, Magnesium and Vitamin D helps boost our body's defence mechanism.* 


*Apart from Tulsi, Ginger, Pepper, Turmeric, Cinnamon. Clove... herbs like Brahmi, Ashwagandha, Shatavari, Mulethi, Arjunarishtam, Peppermint, coriander seeds, cumin black seeds are catching attention of Scientists.* 


*So, this is more than any vaccine one need for self immunity. Without any side effects.*


*Since 80% of virus positive patients had no symptoms at all , leaves uncertainity for all of us !*



*Testing 130 crore population of India is next to impossible.* 


*Even if we test daily 1,00,000 people, we will need over 35 years to just test !*


*This suggests .... our future is our immunity.... just like intel inside in computers, we have to inbuilt immunity inside!*


*That's why they say our Kitchen Masala dabba is a biggest Pharmacy for the whole family.*


*Share to maximum people to know that our Right Desi food is the best medicine to fight every disorders. Feed body with good food to experience Best Health.*

Please share with others... 👏👏👏🙂

Srisailum




 


మహాత్ములు


 

మెదడుకు


 

గానం


 

ఎమర్జెన్సీ


 

కరోనా మందులు


 

గుండె పోటు


 

Bolneme kya jathahi


 

Book record


 

సవ్యసాచి


 

సంగీతం


 

జీళనపోరాటం


 

వెంకటేశ్వర


 

హిందూ


 

ఆరోగ్య నియమాలు - 2 .

 పురాతన ఆయుర్వేద గ్రంథాల యందలి ఆరోగ్య నియమాలు - 2 . 


 * అలంకారముల అన్నింటిలో వస్త్రము ముఖ్యమైనది . పరిశుభ్రతని చేకూర్చి సౌందర్యమును హెచ్చించును . గాలిని , ఎండనుండి కాపాడును. దారిద్ర్యంను పోగొట్టును . మెత్తని సన్నని బంగారు జరీతో ఉన్న తెల్లని వస్త్రము శ్లేష్మవికారములను పోగొట్టును . 


 * నీలవస్త్రము గాని , పట్టువస్త్రముగాని దానమిచ్చునప్పుడు , చికిత్స చేయునప్పుడు , యుద్దము చేయునప్పుడు ధరింపదగును. ఇట్టిది సర్వసిద్ధులను కలగచేయును . 


 * శీతాకాలం నందు పట్టువస్త్రము , వేసవికాలం నందు కాషాయ వస్త్రమును , వర్షాకాలము నందు ధరించవలెను . 


 * పట్టుబట్ట , కలంకారీ బట్ట , ఎర్రనిబట్ట వాతాశ్లేష్మములను పోగొట్టును . శీతాకాలము నందు ధరింపతగి ఉండును. పట్టువస్త్రము పరమ పవిత్రమైనది. శిశిరఋతువు నందు చల్లగాలి తగలనీయకుండా ఉండును. వాతమును శమింపచేయును . 


 * కాషాయవస్త్రము పైత్యమును పోగొట్టును . మేధాశక్తిని వృద్దిచేయును . వేసవికాలం నందు ధరింపతగినది. శరత్కాలము నందు సుకుమారంగా ఉండు వారికి హితముగా ఉండును. 


 * మెత్తని అంచుగల కాషాయ వస్త్రము చలువచేయును . పిత్తమును తగ్గించును . వేసవికాలం నందు ధరింపతగినది. 


 * తెల్లని వస్త్రము చలువచేయును . చలిని , ఎండని తగులనివ్వదు . సమశీతోష్ణమైనది. కాబట్టి వర్షాకాలమున తెల్లని వస్త్రము ధరించవలెను . 


 * ఉన్నితో చేసిన ( శాలువ ) కఫవాత హరము . చలిని పోగొట్టును . రోగహరమైనది . శిశిరఋతువు నందు హితమైనది . 


 * కంబళి వేడిచేయును . చలిగాలిని , వాతదోషమును , వాతరోగమును పోగొట్టును . అగ్నిదీప్తిని కలిగించి పైత్యప్రకోపమును పోగొట్టును . శిశిర, గ్రీష్మకాలములకు హితమైనది .


 * తలపాగా శిరస్సునకు గాలి తగలనివ్వదు. దుమ్ము చేరనివ్వదు. నేత్రవ్యాధులను తగ్గించును . 


 * మిక్కిలి ఎర్రనిది , నల్లనిది , మాసినది , చినిగినది , అంచు లేనిది , గుచ్చుకొనునది , ఎలుకలుగాని , పురుగులు కాని కొట్టినది , రెండుగా చించి కుట్టినది , న్యాయముగా సంపాదించనిది , ఇతరులది , స్త్రీలు కట్టి విడిచినది , శతృవులు పంపినది , దేవతలకు సమర్పించదగు వస్త్రము శుభదినమున కొన్నను ధరింపరాదు. 



        తరవాతి పోస్టు నందు మరికొన్ని విలువైన విషయాలు మీకు తెలియచేస్తాను . 


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

🌹🌿 తులసి యొక్క ప్రాధాన్యత 🌿🌹

 Hindu Dharmam Vardhillali (హిందూ ధర్మం వర్ధిల్లాలి):



🌿 హిందూ సంప్రదాయాలలోనూ, ఔషధీ పరంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు.


🌿 పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడువది వది.


🌿 శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది. 


🌿 ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు.


🌿 హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్ధం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది.ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి,వాతావరణ కాలుష్యాన్ని నివారించి,ఆరోగ్యాన్ని రక్షించుకొని,తులసి తీర్ధం సేవించండి.


🌿 తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. 


🌿 తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.


🌿 తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.


🌿 తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు.

వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. 


🌿 జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.


🌿 పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.


🌿 తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.


🌿 చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.


🌿 ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.


🌿 ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును.


🌿 ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్'

(1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).


🌿 ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.


🌿 రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.


🌿 "రేడియేషన్" కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు


ాయి. అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా.


🌿 తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు.

తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.

తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.

ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.


🌿 కార్తీక శుక్ల ఏకాదశి నాటినుండి పౌర్ణమి వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.

పెళ్లి కావాలంటే ఈ మంత్రాలు పాటించండి🙏

 అబ్బాయికైనా అమ్మాయికైనా త్వరగా పెళ్లి కావాలంటే ఈ మంత్రాలు పాటించండి🙏


 మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయని మన పురాణ సాహిత్యం చెబుతోంది. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో కూడా అవి వివరించాయి. ఆసక్తి, నమ్మకం ఉన్నావారు వాటిని పాటించి ఫలితాలు పొందొచ్చు.


అయితే మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని విమర్శించేవారు వీటి జోలికి పోకపోవడం ఉత్తమం. విశ్వాసమే అన్నింటికీ పునాది. ఇక చాలా మంది వివాహ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం కూడా మన పురాణాల్లో మంత్రాలు ఉన్నాయి.


త్వరగా పెళ్లి కావాలంటే.. ఈ క్రింది మంత్రాలు పఠించాలి.


1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ

నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః


2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః

కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర


3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే


4 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే


రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా సత్వర వివాహానికి ఉపకరిస్తుంది. అలాగే.. పెళ్లికాని కన్యలు నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4, 11, 27 శ్లోకాలలో ఏదో ఒకదాన్ని పఠించాలి. ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది🙏


*సేకరణ*

ఆశ్చర్యంగా చూడకండి


 

గోపురం


























 

Advani


 

*ఓ నెల్లూరుపెద్దారెడ్డిగారి బాధ*



యోయ్ ! యేందయ్యా ! బాలసుబ్రమన్యం ! అట్టా చెప్పా పెట్టకుండా యెళ్ళిపోయావేంది ? కరోనాని మహమ్మారి.. అంటన్నారుగా. కాస్త జాగర్తగుండాల్సిన పన్లా ? నువు పోతే యెట్టయ్యా సామి ? ఈ పిల్లకాయలు చూడు. యెట్టా దిగాలుగా వుండారో ? నువ్వు చేస్తావే ..అదేంది..... పాడుతా తీయగా... అందుట్లో పాడుదామని యెదురుచూస్తుండ్లా. ఒక్క పిల్లకాయలేందిలే.. పెద్దోళ్ళం మేం యెంత బాద పడ్డామనుకొన్నా ? రెండు మూడు రోజులు మాకు అన్నమే సయించలేదనుకో. యేందిరా ? యిట్టయిందనే ఆలోచనే.. యేందో.. మా అన్నయ్యో, మా బాబాయో, మా మేనమామో.. అట్టా మా సొంత మడిసి పోయాడన్న బాద. ఆ రోజు కార్యక్కమాలయినాక.. స్నానం చేసి.. నీ అత్మకి శాంతి కలగలాని దేవుడుకి దణ్ణం పెట్టుకొని.. యింట్లొ పొయ్ రాజేసుకున్నామయ్యా.. యెందుకట్ట చేసామో తెలీదు సామీ!


నేనంత చదువుకోలేదు కాని - ఒకటి చెప్పగలనయ్య.. నీ పాట చానా బాగుంటదయ్యా.. కాని నీ పాట కంటే నీ మాట యింకా బాగుంటది.. కాకపోతే నీ మాట కంటె నీ పాట బాగుంటదయ్యా.. యేందో యెట్టా చెప్పాలో అర్దం కావట్లా.. అవును నాకు తెలవక అడుగుతా ? యిన్ని బాసల్లో యిన్ని పాటలు యెట్టా పాడావు సామి ? యెప్పుడంటే అప్పుడు యే పాటైనా యిట్టే పాడేటోడివి. మడిసన్నోడికి అది సాద్యమంటావా? అందుకే సామి నువ్ మడిసివి కాదు.. మరేందో నాకు తెలవదు.  

 

మన నెల్లూరుకి బలే పెరు తెచ్చావులే అటు చేసి యిటు చేసి. అయినా నువ్ నెల్లూరోడివేం దయ్యా? ఆ మద్య ఆడెవడో నువ్వు తెనాలోడివని వాట్సాప్లో పెట్టాడంట. యేమనుకోబాకలే.. మేం పిచ్చోళ్ళం. యిట్టాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. నీకు బాసేంది? కులమేంది ? మతమేంది? ప్రాంతమేంది? రాస్ట్రమేంది ? ఆయనెవరో చెప్పినట్టు నువ్వు యిస్వ నరుడువి.. యిస్వ గాయకుడివి.. యిస్వ నాయకుడివి.. పోన్లే.. మా మడుసుల్ని మన్నించు... మేం యింతకంటే ఆలోచించలేంలే. .. మొత్తానికి బలే చేసావులే సామీ ? చూద్దాం.. నిన్ను యెప్పుడు మరిచి పోతామో.. యెట్టా మరిచి పోతామో.. అయినా యెట్టా మరిచి పోతాం? నువు యెక్కడోక్కడ కనబడుతూనే వుంటావు.... వినబడుతూనే వుంటావు కదా సినిమా పాటున్నన్నాళ్ళు.. అది సాల్లే మాకు.. చివరగా.. ఒకటి మాత్రం చెబుతా సామి! నా కంత సంగీతం, సాహిత్తెం తెలీదుకాని.. నాకు తెలిసినంతమటుకు చెబుతా.. నీ అసుమంటోడు మళ్ళీ పుట్టడయ్యా.. పుట్టడు.... అంతే…కళ్ళెంబడ నీళ్ళొస్తన్నయి గాని.. యికుంటా ! ! !

 


మీ వూరోడందామనుకొన్నా గాని అనకూడదులే..

అందుకే

నీ చచ్చే అభిమాన్ని. నెల్లూరోణ్ణి

ఉంటా అయితే

హెల్ప్‌లైన్‌ నంబర్లు

 *ఏపీ:lo మీకు ఏవైనా సమస్యలున్నాయా.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే*


*❇️1902 (ప్రజా సమస్యలు)*


*రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. ఈ నంబర్‌ (1902)కు ఫోన్‌ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువులోగా వాటిని పరిష్కరించుకోవచ్చు.. లేని పక్షంలో మళ్లీ ఫిర్యాదు చేయొచ్చు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి.*


*❇️1907 (వ్యవసాయం)*


*వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబరుకు ఫోన్ (1907)‌ చేయవచ్చు. సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు.*


*❇️1912 (విద్యుత్‌ సేవలు)*


*విద్యుత్‌ సరఫరాలో, సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌ (1912)కు ఫోన్‌ చేసి, పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది*



*❇️14500 (ఇసుక, మద్యం)*


*ఎక్కడైనా సారా అమ్మకాలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిస్తే 14500 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా సాయం పొందొచ్చు. అలాగే ఇసుక డోర్‌ డెలివరీ పొందాలనుకొనే వారు కూడా ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.*



*❇️14400 (అవినీతి నిరోధం)*


*వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్‌ ఏర్పాటు చేశారు. 14400 నంబరుకు ఫోన్‌ చేసిన వారి పేరు, వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్‌ చేయొచ్చు.*



*❇️108 (ప్రభుత్వ అంబులెన్స్‌)*


*అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రమాదాలకు గురై, గాయపడిన వారు 108కు ఫోన్‌ చేయవచ్చు. కాల్‌ సెంటర్‌ నుంచి సమీపంలోని 108 వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు.*


*❇️104 (వైద్యం, ఆరోగ్యం)*


*ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు.*


*❇️100 (పోలీసు సేవలు)*


*ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ 24 గంటలూ పని చేస్తుంది.*


*❇️112, 181 (దిశ)*


*లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్‌ చేస్తే కంట్రోల్‌ రూము నుంచి వారు ఫోన్‌ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు.*



*❇️101 (అగ్నిమాపక కేంద్రం)*


*ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు*

ఉండవలసిన పుస్తకాలు

 ప్రతీ హిందువు ఇంట్లో ఉండవలసిన పుస్తకాలు ఏమిటి.

వేదాలు,పురాణాలు భగవత్గీత. కదా..

కానీ మరో రెండు పుస్తకాలను నేను పరిచయం చేస్తున్నాను..మీదగ్గర ఉంటే సరి.. లేకుంటే మాత్రం వెంటనే కొని చదవండి..చదివించండి...

మనలో చాలా మందికి చరిత్ర తెలీదు..ఒక వేళ చదివినా అది ఆ బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన బానిస రచనలే..సుసంపన్న మైన మన ధర్మాన్ని విడిచి లేనిపోని రొచ్చులు లేనివి ఉన్నట్టు చూపించిన ఆ పుస్తకాలనే మనం చదివి గొప్ప జ్ఞానులం అయిపోయినట్టు ఊహించుకుంటాం..కానీ వాస్తవాలు తెలిసాక నీలోని రక్తం ఉడకక మానదు ఆవేశం ఉప్పొంగక ఆగదు..

అసలు హిందూ మతం అంటే ఏమిటి అనాది కాలం నుంచి హిందువుల జీవన విధానం ఏమిటి పరాయి పాలన లో వాళ్ళు అనుభవించిన కష్టాలు ఏమిటి అన్నీ తెలిసిన వాడే సరైన హిందువు అవుతాడు.మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు దాచేసిన భయంకర నిజాలను మీ ముందు ఉంచేవే ఈ రెండు పుస్తకాలు..

మరి ఎందుకు ఆలస్యం ఈ పుస్తకాలను సంపాదించండి..రేవు నీ ధర్మం మీదకి దాడికి వచ్చేవాడికి సమాధానం చెప్పడానికి సిద్ధం గా ఉండండి

🙏🙏🙏





శ్రీబాలాత్రిపురసుందర్యష్టకం

  


1) అజ్ఞానమాలిన్యభంజన జ్ఞానాంజనప్రదాయినీం 

   ద్వైతభావవివర్జిత అద్వైతామృతవర్షిణీం 

   నవవర్షప్రాయ షడక్షరనవాక్షరమాతృకాం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||


2) సహస్రహంససారధ్యకర్ణిరథారూఢ భండాసురపుత్రభంజనీం

   సకలజీవముఖ్యప్రాణస్వరూప బిందుత్రికోణమధ్యగాం 

   అక్షమాలాపుస్తకధర సర్వవ్యాపకచైతన్యరూపిణీం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||




3) మంగళపరంపరాప్రదాయక కల్హారకుసుమాసీనాం 

   సృజనాత్మకశక్తిప్రదాయక అభయవరదకమలహస్తాం 

   సర్వాభరణభూషిత మృదుమంజీరపల్లవపదాం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||


4) యోగాగ్రగణ్యహృత్కమలసంస్థిత కరుణాంతరంగిణీం 

   జీవన్ముక్తచైతన్యస్థిత పరబ్రహ్మస్వరూపిణీం 

   చతుర్దశభువనైకపాలక బాలాలీలావినోదినీం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||







5) బలోత్సాహరూపప్రదాయక సృష్టిస్థిత్యంతకారిణీం 

   శ్రీలలితాంబికాస్వర్ణకవచఆవిర్భావ మందస్మితాననాం 

   అణిమాద్యష్టసిద్ధినవనిధిప్రదాయక మహాశక్తిస్వరూపిణీం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||


6) స్వాధిష్ఠానాదిసప్తచక్రనివాస అమృతకిరణరూపిణీం 

   బిందునాదకళాతీత మంత్రయంతతంత్రరూపిణీం 

   బ్రహ్మవిద్యాప్రదాయక గురుమండలరూపిణీం 

   శ్రీబాలత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||







7) సర్వపాపౌఘభంజన సర్వసౌభాగ్యదాయినీం 

   సకలవిజయప్రదాయక సకలశోకవినాశినీం 

   సకలపీఠాంతరస్థిత సర్వాభిచారదోషభంజనీం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||


8) మహాజ్వరాదినివారణ మహాకాంతిస్వరూపిణీం 

   మహాభయాపహార మహానందస్వరూపిణీం 

   దహరాకాశప్రకాశ జ్ఞానానందస్వరూపిణీం 

   శ్రీబాలాత్రిపురసుందరీం భగవతీం శ్రీవిద్యబీజాత్మికాం ||


       సర్వం శ్రీబాలాత్రిపురసుందరీదివ్యచరణారవిందార్పణమస్తు

కదలలేని చెట్టే

 






ఏ తల్లికి పుట్టిందో తెలియదు పాపం, పుట్టినప్పటి నుండి.. 

ఒంటరిగా..

ఎటూ కదలకుండా.. 

అలా పదులు, వందల సంవత్సరాలు.. 

ఒకే చోట.. 

ఏపుగా ఎదిగి..

నువ్వు నిలుచుంటే నీడగా, 

నీ ఇంటికి కలపగా, 

నీ వంటకి మంటగా,

పూజ ఆంటే పూలు, 

ఆకలికి పండ్ల దిగుబడినిచ్చి, 

నీ విడిచిన విషాన్ని మింగి.. 

అమృత వాయువును నీకిచ్చి... 

ఇచ్చి ఇచ్చి ఇచ్చి.. 


నడక లేదు, బాష రాదు, కదలలేని చెట్టే

ఇన్ని అద్భుతాలు చేస్తుంటే.. 

నడక, 

బాష, 

తెలివి, 

విజ్ఞానంతో మంచి,చెడు విషక్షణ తెలిసిన నువ్వు అత్యద్భుతాలు చెయ్యగలవు!

గుర్తుపెట్టుకో!!! 

*పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు

 *పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*


👏👍👋😷



పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..* 


పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..


వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..


ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)


🔥 తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..

🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

🔥 లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

🔥 కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

🔥 గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

🔥 తిడితే వస్తువులను విసిరి కొడతారు..


ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..


🔥 ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥 ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥 అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥 బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

🔥 కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 వారిస్తే వెర్రి పనులు..


మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..


*అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...


కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*


ఒక్కసారి ఆలోచన చేయండి...


*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*


కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..


పిల్లలకు..👇


👉 *బాధ్యత* 

👉 *మర్యాద*

👉 *గౌరవం* 

👉 *కష్టం* 

👉 *నష్టం* 

👉 *ఓర్పు*

👉 *సహనం*

👉 *దాతృత్వం*

👉 *ప్రేమ*

👉 *అనురాగం*

👉 *సహాయం*

👉 *సహకారం*

👉 *నాయకత్వం*

👉 *మానసిక ద్రృఢత్వం* 

👉 *కుటుంబ బంధాలు*

👉 *అనుబంధాలు*    

👉 *దైవ భక్తి*

👉 *దేశ భక్తి*


*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*


కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*


పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...


మనం కూడా మమేకమవుదాం...


*భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం..

💐💐💐💐💐

Online Yoga classes

 కరోనాతో కలిసి మనం అందరం సహజీవనం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రాణాయామం, యోగా లు మనకు ఎంతో సహాయకారిగా ఉంటాయని మనందరికీ తెలుసు.


ఇందులో భాగంగానే

శ్రీమతి. రాధిక శాస్త్రి గారు మరియు

శ్రీమతి. లీలావతి గారు

(యోగా శిక్షకులు)

ఎలాంటి రుసుము లేకుండా, ఉచితంగా, సేవాదృక్పదంతో మనందరికీ online లో, ప్రతిరోజూ సాయంకాలం 5.30 నుండి 6.30 వరకు, online యోగశిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 

వీరు దత్త యోగా పద్ధతిని అవలంభిస్తారు.


అందరూ దీనినుండి లాభపడవలసినదిగా సూచన.


Online Yoga classes లో చేరదలచినవారు, ఈ క్రింది నంబర్లకు call చేసి తెలిపినచో, మీరు join అగుటకు అవసరమైన Google meet link పంపబడును.


 రాధిక శాస్త్రి గారు - 8328414993

లీలావతి గారు - 7675073909.

Inviting

 











Girls be careful


 

*కర్మ సిద్ధాంతం (doctrine of karma )*



*ఈ జన్మలో అనుభవానికి రాకుండా మిగిలిపోయిన కర్మఫలం విధిగా జీవుడిని మరొక జన్మ(పునర్జన్మ)ఎత్తేటట్లు చేస్తుంది.*


*మనిషి నిరంతరం అంతులేని కోరికల వలయంలో చిక్కుకొని తిరుగుతుంటాడు. ఆ కోరికలే దుఃఖానికి కారణం. కోరికలు తీరడానికి తగ్గ పనిని మనిషి చేస్తూనే ఉండాలి.*


*మరి మనిషి చేసిన పని వృథా పోదు కదా! ప్రతి పనికి మంచిదో చెడుదో ఫలితం ఉంటుంది.ఆ పలితాన్ని మానవుడు అనుభవించక తప్పదు.*


*కొన్ని కర్మల ఫలితాలను అప్పటికప్పుడు అనుభవిస్తాడు. కొన్నింటిని ఆ తర్వాత అనుభవిస్తాడు. కొన్ని కర్మల పలితాలను ఈ జన్మలో అనుభవించలేక పోవచ్చు.*


*మనిషి మరణించినా కర్మఫలం నశించదు. అది ఆత్మను వాసనా రూపంలో అంటిపెట్టుకొని కొనసాగుతూనే ఉంటుంది.*


*కర్మఫల శేషం పునర్ఙన్మకు దారి తీస్తుంది.*


*ఈ జన్మలో అనుభవానికి రాకుండా మిగిలి పోయిన కర్మఫలం విధిగా జీవుడిని మరొక జన్మ ఎత్తేటట్లు చేస్తుంది.*


*మళ్లీ జీవుడు ఆ జన్మలో కొన్ని కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలాలలో కొన్ని మిగిలిపోతాయి. మళ్లీ జన్మ ఎత్తుతాడు. కొన్ని కర్మఫలాలు అనుభవించాక కొన్ని మిగిలిపోతాయి.*


*వాటిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. పాత కర్మల అనుభవాలు తరిగిపోతుంటే కొత్తవి పెరిగిపోతుంటాయి.*


*మానవుడు జనన మరణ పరంపర చక్రభ్రమణంలో, చక్రనేమి క్రమంలో పడి తిరుగాడుతుంటాడు.*


*పునర్జన్మ ఒక నిరంతర చక్రం. దానికి ఆది లేదు. అంతం లేదు. అందుకే మానవుడు జనన మరణ పరంపర అనే చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు.*


*అదే కర్మసిద్ధాంతం. (Law of Karma). దీనినే ఫిజిక్స్ లో (Law of Conservation Energy)తో పోల్చారు విజ్ఞులు.*


*ఎనర్జీకి నశింపులేదు. రూపాంతరం చెందుతుంది. అలాగే కర్మ కూడా. అది మానవుని జన్మాంతరాలకు కూడా వెన్నాడుతూనే ఉంటుంది.*


*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరే శయనం*

*ఇహ సంసారే బహుదుస్తారే*

*కృపయా పారే పాహి మురారే*


*– — భజగోవిందం — శంకరులు.*


*భావం :*


*పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ ! దయతో నన్ను రక్షించు (తరింపచెయ్యి).*


*శంకరులు కూడా జగత్తును (మానవ జీవితాన్ని) దుఃఖమయంగా భావించారు.*


*భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి?*


*ఆత్మానాత్మ వివేకం” అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు .*


*ప్రశ్న : ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?*


*జ)పూర్వ జన్మ లలోని కర్మ వలన.*


*ప్రశ్న : కర్మ ఎందుకు జరుగుతుంది?*


*జ)రాగం (కోరిక) వలన.*


*ప్రశ్న: రాగాదులు ఎందుకు కలుగుతాయి?*


*జ : అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.*


*ప్రశ్న : అభిమానం ఎందుకు కలుగుతుంది?*


*జ) అవివేకం వలన*


*ప్రశ్న : అవివేకం ఎందుకు కలుగుతుంది?*


*జ)అజ్ఞానం వలన*


*ప్రశ్న : అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?*


*జ) అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.*



*అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి*

*ఇంద్రుడు - వరాహ జన్మ*




ఒకప్పుడు ఇంద్రుడు కర్మవశాత్తు పందిగా జనించ వలసి వచ్చింది. ఆయన నారదమహర్షిని దర్శించి, మహాత్మా, నేను పందిగా ఉపాధిని పొందినప్పుడు మీరు వచ్చి ప్రబోధించితే నేనా ఉపాధిని వదలి మళ్ళా ఇంద్రత్వం స్వీకరిస్తానూ అని బ్రతిమాలాడు. నారదుడు నవ్వి సరే అన్నాక ఆయన సూకరోపాధిని పొందటమూ మాట ఇచ్చినట్లే నారదమహర్షి పోయి ప్రబోధించటమూ జరిగింది. అప్పుడేం జరిగిందో చూసారా. ఆ పందిరూపంలో ఉన్న ఇంద్రుడు అన్నాడు కదా, ఈ జన్మం ఇంత హాయిగా ఉందే, దీనిని వదలిపెట్టమని చెబుతావేమి టయ్యా, ఠాట్ కుదరదంటే కుదరదూ అని. ఇదండీ జీవుణ్ణి పశువుని చేసి ఆడించే వాసనారూపకమైన పాశం అంటే. ఇటువంటి పాశం అమ్మకు ఆయుధంగా అమరి ఉంది.

{ఈ వివరణ లలితా సహస్రనామ వివరణ లోనిది}


మన పురాణాలలో ఇంద్రుడికి కలిగినన్ని శాపాలు మరెవరికీ కలగలేదు. ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో, ఒక ముని ఇంద్రుడు చేసిన పనివల్ల కోపించి, ‘నీవు మగ పందివై, భూమ్మీద ఒక సంవత్సరకాలం జీవింతువుగాక’ అని శపించాడు. ముని వాక్యం అమోఘం. వెంటనే ఇంద్రుడు భూమ్మీద ఒక మగ పందిగా పుట్టాడు. కొంతకాలానికి, ఆ పంది ఒక సుందరమైన ఆడ పంది ప్రేమలోపడి, మోహించి, వ్యామోహితుడై, ఆ సుందరాంగి లేకపోతే బ్రతుకే వృధాఅని, ఇక బ్రతుకలేనని అనుకోని, ఆ ఆడ పందిని సమీపించి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. వారి ప్రేమ సుఖాంతం అయింది. వారి పెళ్ళి అయింది. కొంతకాలం వారి ప్రణయ జీవితం హాయిగా జరిగింది. అప్పటికే సంసారమనే పాముతో కాటేయబడ్డ ఇంద్రుడికి (మగ పంది) విషం పైపైకి ఎక్కటం మొదలైంది. ఆ జంటకి అనేకంగా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను, తన భార్యను చూస్తూ, ఎంతో ఆనందిస్తూ, బురదగుంటల్లో పొర్లుతూ, దొర్లుతూ, వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు.


చూస్తుండగానే ఒక సంవత్సరకాలం తెలియకుండానే కరిగిపోయింది. ఇంద్రుడికి స్పృహేలేదు. ఆనందంగా, విలాసంగా వున్నాడు. ఇంతలో, అక్కడ ఇంద్రలోకంలో, దేవతలందరూ ఇంద్రుడి రాకకై ఎదురుచూస్తూ, స్వాగత ఏర్పాట్లు అన్నీ చేసుకొని సిద్ధంగావున్నారు. సమయానికి, ఇంద్రుడు రాలేదు. కారణం తెలియక, వారు అగ్నిదేవుడ్ని పిలిచి, భూమ్మీదకువెళ్ళి, ఏంజరిగిందో తెలుసుకొని రమ్మన్నారు. అగ్నిదేవుడు వెళ్ళి, బురదగుంటలో భార్యా, పిల్లల సమేహితుడై ఇంద్రుడు ఆనందంగా వుండటం చూసాడు. అప్పుడు, అగ్నిదేవుడు, ఆర్యా, మీరు ఇందృడు, స్పృహలోకిరండి; మీ శాపం సమయం తీరిపోయింది. కాబట్టి, వెంటనే ఇంద్రలోకానికి విచ్చేయండి, అందరూ మీ రాకకై వేచిచూస్తున్నారు అని విన్నవించాడు. ఆ మాటలువిన్న ఇంద్రుడు, అగ్నిదేవా, నాకు ఇక్కడ చాలా బాగుంది, అంతేకాకుండా నేను నా భార్యని, ముద్దులొలికే నా పిల్లల్ని వదిలి ఇప్పుడు రాలేను. కాబట్టి నీవు వెళ్ళిపో. నేను కొంతకాలం తరువాత వస్తాను అని చెప్పాడు. అయినీ, అగ్నిదేవుడు చాలాసార్లు వచ్చేయమని బతిమాలాడు. ఇంద్రుడుకి కోపంవచ్చి, నేను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళీపో అని అన్నాడు. చేసేదిలేక ఆయన వెళ్ళిపోయి, జరిగిందేమిటో దేవతలందరికీ చెప్పాడు. ఆతరువాత వరుణుడుకూడా వెళ్ళి ప్రయత్నంచేసి, విఫలుడై తిరిగి వచ్చాడు. ఏంచేయాలో వారికి తెలియలేదు. ఇంద్రలోకంలో ఇంద్రుడులేక పరిపాలనంతా ఆగిపోయింది. అప్పుడు మరొక దిక్పాలకుడు యముడుని పిలిచి నీవు వెళ్ళి ప్రయత్నంచేసి రమ్మన్నాడు. నేను వెళ్ళినా అదే జరుగుతుందికదా ఏమిటి ప్రయోజనం? అని అన్నాడు. అప్పుడు ఆ దిక్పాలకుడు, యమా, ఒకవేళ ఇంద్రుడు నీమాట విని రాకపోతే, వరాహరూపంలోవున్న ఆయన్ని చంపివేయి. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది, వెళ్ళిరా అని పంపించాడు.


యమధర్మరాజు వెళ్ళి ఇంద్రుడిని స్వర్గలోకాని రమ్మని బతిమాలాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరందరూ, ఒకరితరువాత మరొకరువచ్చి, నన్ను విసిగిస్తున్నారు. ఇక్కడ నేను నా భార్యా,పిల్లలతో నేను చాలా సుఖంగావున్నాను. మీరు నన్ను ఇన్నిసార్లు విసిగించారుకనుక, నా నిర్ణయం చెబుతున్నాను విను: నేను స్వర్గలోకానికి ఇక ఎప్పటికీ రాను. నాకు ఇక్కడే స్వర్గలోకంల్లాగావుంది. ఇక వెళ్ళిపో అని హూంకరించాడు. సరేనని చెప్పి, యముడు కొంచెం దూరం వెళ్ళి, వెనుకగా వచ్చి, ఆ మగపందిని తన కత్తితో చంపేసాడు. పంది శరీరం పడిపోయిందికాబట్టి, చేసేదేమీలేక, ఇంద్రుడు ఆ పంది శరీరాన్ని వదిలివేయాల్సివచ్చింది. అప్పటివరకూ ఆ వరాహ శరీరంతోవున్న బంధనం తెగిపోయింది. వాస్తవాన్ని తెలుసుకున్న ఇంద్రుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు.

*ధైర్యం*



 “ధైర్యే సాహసే లక్ష్మీయని” అష్టలక్ష్ములలో చేర్చిన ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారున్న లోకమిది. ‘ధైర్యమే వెలలేని ఆభరణమని’ భావించి జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన వారూ ఉన్నారు.  

 

“ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియన్న” భర్తృహరి సుభాషితాన్ని నిజం చేస్తూ యక్షప్రశ్నలకు సమాధానాలిచ్చి నలుగురు సోదరులను దక్కించుకున్న పాండవాగ్రజుడు స్థితప్రజ్ఞత లోకానికి ఆదర్శం. 


“కార్యసాధనలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, అపజయమెదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదని, సత్య, ధర్మాలదే విజయమన్న” పురాణాలు , అంతిమ విజయాలు దక్కించుకున్న రాముడు , పాండవుల చరితలను రామాయణ, మహాభారతాల్లో వర్ణించాయి. 


“ ఆపదల నుండి కాపాడేది, దుఃఖాన్ని చేరనీయనిది, కార్యసాధనకు మార్గమైనది ధైర్యమేనని” మనుచరిత్రలో పెద్దన లిఖించినట్టు యముణ్ణి మెప్పించి పతిని దక్కించుకున్న సావిత్రి, నలుడికి దూరమై బాధలనుభవించినా ధైర్యంగా ఎదుర్కొన్న దమయంతిల చరితలను పురాణాలు అందించి మహిళలకు మార్గదర్శనం చేశాయి.     


 “పరులెవ్వరూ సాధించలేని కార్యాలను, విశ్వసించిన సిద్ధాంతానికి కట్టుబడి కొనసాగించడమే ధైర్యమని” గ్రంథాలు చెప్పినట్టు భరతమాత స్వేఛ్చకై బ్రిటీషు వారినెదిరించిన మహాత్ముడు నిరూపించాడు.   


“ఆశ, ధైర్యాలు విజయ కిరీటంలో రెండు వజ్రాలన్న” మాటలకు ప్రతిరూపాలన్నట్టు ప్రవర్తించిన వారున్నారు. కాల్చమని ఆంగ్లేయులకు రొమ్ము చూపిన టంగుటూరి ప్రకాశం, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు, శత్రువుకు తలవంచక ఆత్మార్పణం చేసుకున్న చంద్రశేఖర ఆజాద్, ఉరికంబమెక్కినా భయమెరుగని భగత్ సింగ్ తదితరులు నిరూపించారు.  


“ధైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని” పెద్దలన్నట్టుగా ముందుకు సాగిన మహానుభావుల్ని చరిత్ర గుర్తించింది. పత్రికల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన కాశీనాధుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, సి.వి. చింతామణి , అయ్యదేవర గార్లు బ్రిటీషు ఆగడాల నెదుర్కొన్నారే తప్ప వెనుకడుగేయలేదు. కేసరి , మరాఠా పత్రికల్లో స్వాతంత్య్ర వార్తలు వ్రాసినందుకు బాలగంగాధర్ తిలక్, తెలుగు స్వరాజ్య పత్రికలో సంపాదకీయం వ్రాసినందుకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావులకు జైలు శిక్షలు విధించినా భయపడి వెనక్కు తగ్గలేదు.  


   ​కుటుంబాలకు దూరమై శీతోష్ణస్థితుల కతీతంగా విధులు నిర్వర్తిస్తూ దేశరక్షణకై ప్రాణాలొడ్డుతున్న వీరసైనికుల ధైర్య సాహసాలే కాదు త్యాగాలూ తిరుగులేనివిగా కీర్తించాలి. 

 

“ఏ కార్యం తలపెట్టినా ధైర్యంగా ముందడుగేయాలని, లేనప్పుడు విజయం దక్కదని” విశ్వసించినప్పుడే పరాజయం ఎదురైనా తట్టుకుని నిలబడే ధైర్యం కలుగుతుంది.

 

“పుట్టుకతో ధైర్యసాహసాల్ని వెంట తెచ్చుకోరని, పరిస్థితులు, అనుభవాలే మనిషిని తీర్చిదిద్దుతాయన్నట్టు” ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలను శరణు వేడకూడదు. ధైర్యంగా జీవితాన్ని కొనసాగించే వారికి లోకమే దాసోహమవుతుంది.

నైవేద్యం*

 *


దేవతల నివేదనకు యోగ్యమైన పదార్థం నైవేద్యం. పక్వాన్నాలు, మధుర పదార్థాలు, పండ్లు, రసాలు... ఇలా ఎన్నో నైవేద్యానికి ఉపయోగపడుతుంటాయి. పూజించేవారి శక్తి సామర్థ్యాలను అనుసరించి తారతమ్యాలు ఎన్ని ఉన్నా- అన్నీ భక్తి ముందు చిన్నవే. భగవంతుడు కూడా భక్తితో పత్ర, పుష్ప, ఫల, తోయాలలో ఏది సమర్పించినా దానినే తాను స్వీకరిస్తానని భగవద్గీతలో అన్నాడు. నివేదనకు భక్తే ముఖ్యం కానీ పదార్థాలు కాదు.

అసలు నైవేద్యం ఎందుకు పెట్టాలి, ఎలాంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలని ప్రశ్నించుకుంటే కొన్ని విషయాలు బహిర్గతమవుతాయి. భగవంతుడికి చేసే పూజ సఫలం కావాలని, తనకు శ్రేయస్సు లభించాలని మనిషి కోరుకుంటాడు. కనుక పూజలో చివరగా తన కోరికలు సఫలం కావాలని పదార్థ నివేదనం చేస్తాడు. తాజాగా చేసిన వంటలు, తాజాగా లభించిన పండ్లు, కాయలు, మధుర రసాలు ఊరే పదార్థాలు... భగవంతుడికి ప్రీతిపాత్రాలు. వాటిని భక్తితో సమర్పించి, ప్రసాదంగా స్వీకరించి, మనిషి తృప్తి చెందుతాడు.

భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తింటాడా? తినడు కదా? ఎందుకీ నైవేద్యాలని ప్రశ్నించేవారుంటారు. నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపైన గల కృతజ్ఞతాభావాన్ని నైవేద్యం సూచిస్తుంది. అంటే లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతి అంటే భగవంతుడే కదా? ఈ చరాచర ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు అర్పించే నైవేద్యం కృతజ్ఞతావిష్కరణమే. నైవేద్యాల్లో ఉండేవేమిటి? పంచభూతాలే! మట్టిలో నుంచి పుట్టిన మొక్కల నుంచి వచ్చిన చెట్లు అందించినవే అమృతఫలాలు. గిరుల నుంచి పుట్టిన ఝరులు ఇచ్చినవే నిర్మలజలాలు. పక్వాన్నాలేవీ అగ్నిదేవుడి సహాయం లేకుండా లభించవు. స్వచ్ఛమైన గాలి వల్లనే ప్రకృతి సజీవంగా ఉండగలుగుతున్నది. ఇలా ప్రకృతి రూపంలో పరమేశ్వరుడు ప్రసాదించిన సంపదలే మానవాళికి, ఇతర ప్రాణికోటికి జీవనాధారాలు. కనుక మనిషి భగవంతుడికి యథాశక్తిగా నివేదించుకొని తృప్తి చెందుతాడు.

పరమార్థంగా ఆలోచించినప్పుడు మనిషి జీవితం భోగాల కోసం కాదని, అమృతయోగాల కోసం, అద్భుత త్యాగాల కోసమేనని సమస్త పురాణేతిహాసాలు ప్రబోధిస్తున్నాయి. మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని నివేదన చెబుతుంది. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని మహనీయులంటారు. వారి జీవితాలు అలాంటి ఆదర్శాలకు నెలవులు. భగవంతుడికి చేసే నివేదన కూడా ఈ సత్యాన్నే ప్రతిఫలిస్తుంది. సర్వసమర్పణ భావమే సర్వదా శ్రేయస్కరం.

ఏ విధమైన పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన సంపన్నులదాకా అందరూ పూజలు చేస్తారు. ఎందరో భక్తితో నైవేద్యాలు సమర్పిస్తారు. భగవంతుడికి అందరూ సమానులే. భక్తితో ఇచ్చినది ఏదైనా భగవంతుడికి ప్రీతిపాత్రమే అనడానికి భక్త శబరి, భక్త కన్నప్ప వంటివారి చరిత్రలు ఉదాహరణలవుతాయి. భక్తి లేకుండా ఎవరు ఇచ్చినా వ్యర్థమే అవుతుందికాని సార్థకం కాదు. సమస్త మంగళాలకు, శుభాలకు ఆలవాలమైన భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును, ఓజస్సును వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయుష్యం పెరుగుతుందని, ఆరోగ్యం సంప్రాప్తిస్తుందని పెద్దల ఉపదేశం.

నైవేద్యం అంటే భగవంతుడు ప్రసాదించే అమృతభాండమే. దాన్ని భక్తితో స్వీకరించి, సేవించి, భుజించి, మనిషి చిరంజీవి కావాలి!

*పాప, పుణ్యకార్యాలు*



మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం. ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?


"పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం" అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.


పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి. పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాపఫలమే కాక వేరొకటి కాదు.


పాపదోషం అనుభవించితే తప్ప పోదు. అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి


"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం" అని విదురవాక్కు. పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.


ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం. తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది. ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి రేపు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి.

ఉన్నత స్థితి’కి

 వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

🔸 అతినిద్ర

🔸 బద్ధకం

🔸 భయం

🔸 క్రోధం

🔸 అలసత్వం

🔸 ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. 


ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..


నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 


రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. 


అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. 


ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.


అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. 


అలాగే.. 


ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.

స్థిరచిత్తం



జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.


ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.


మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.


అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.


మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.


సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!

త్రైలింగ_స్వామి

 







                  పుట్టింది తెలుగు దేశం లో అయినా ,ఆయన గడిపిన కాలమంతా కాశీ లోనే .ఆయన చూపించిన మహిమలు అపారం .వారు పొందిన సిద్దులనేకం .వారి దివ్య విభూతి అనంతం .ఆయనే త్రైలింగ స్వామి .అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం 19 -12 -1607 తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుంచి ఐహిక వాంచల మీద కోరిక లేదు .నలభై ఏళ్ళకు తండ్రి ,యాభై రెండో ఏట తల్లి చని పోయారు .శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి ,అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.


        స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో బస్తుర్ చేరాడు ..అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళాడు .ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు .అప్పటికి అయ్యగారి వయస్సు డెబ్భై ఎనిమిది .గురు సమక్షం లో పదేళ్ళ సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు .గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు ..అక్కడ స్వంత ఊరి వారు కని పించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళ లేదు ..రామేశ్వరం లో ఒక బ్రాహ్మణ బాలుడు చని పోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే ,గుండె కరిగి కమండలం లోని నీరు వాడి మీద చల్లాడు .వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్య పరచాడు ..ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీ రామ లింగేశ్వరుడే గణ పతి స్వామి అనుకోన్నారందరూ .అక్కడి నుండి నేపాల్ చేరాడు .అక్కడ అడవి లో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయన కు ఎదురు గుండా కదల కుండా కూచుని పోయింది .రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడై నాడు పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు .ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు .నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుక లిస్తే తీసుకో కుండా జంతు హింస చేయ వద్దని హితవు చెప్పాడు స్వామి .అక్కడి నుంచి టిబెట్ ,తరువాత మానస సరోవరం సందర్శించి ,దారిలో ఎన్నోఅద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలమ్ తపస్సు చేసి నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు ..ఒక రోజూ తెల్ల వారు జామున నర్మదా నది లో పాలు ప్రవహిస్తున్నట్లు ,ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూశారు .గణపతి లోని మహిమేమిటో గ్రహించారు .విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు.


              1733 లో . ప్రయాగ చేరారు .తపో నిష్టలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పదవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు .అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే .దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు .శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడి లోను మహాశక్తులు అజ్ఞాతం గా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు.


                  1737 లో కాశీ చేరారు దిగంబర గణ పతి స్వామి .అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు .కాశీ లో 150 ఏళ్ళు గడి పాడు .ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం .గడ్డాలు ,మీసాలు పెరిగి దీర్ఘ శరీరం తో దిశ మొలతో .మెడ లో పెద్ద రుద్రాక్ష మాల తో ,పెద్ద బాన పొట్ట తో కాశీ నగర వీధుల్లో సంచ రించే వాడు .గంటల సేపు గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు .అలాగే గంటల కొద్దీ కాలమ్ నదీ గర్భం లో మునిగి ఉండే వాడు .అంటే కుంభక విద్య లో అద్భుత మైన నేర్పు ఆయనకు ఉండేదాన్న మాట ..కుష్టు రోగులకు సేవ చేసి వారి ని ఆదరించాడు బాబా .వెద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతా నాద బంద్యో పాద్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి ,హనుమాన్ ఘాట్ చేరాడు .ఒక మహారాష్ట్ర స్త్రీ రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజూ చూస్తూ ఏవగించు కొనేది .ఆమె భర్త కు రాచ పుండు .ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించ మని కోరారు .కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళ టానికి సందేహించింది .చివరికి వెళ్లి కాళ్ళ మీద పడింది .ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది


                  కాశే మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గా ఉన్నారు .వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు .ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టారు .తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా .అప్పటి నుంచి ఆ పేరే స్థిర పడి పోయింది .1800 లో తన మకాం ను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవం కు మార్చారు.


ఎప్పుడూ మౌనమే ,ధ్యానమే ,తపస్సు యోగ సమాధే .అనుకే ఆయన్ను ”మౌన బాబా ”అన్నారు .కాశీ రాజు వీరిని తన పడవ లోకి ఆహ్వానిస్తే వెళ్ళారు .రాజు బ్రిటిష్ వారు బహుమతి గా ఇచ్చిన కత్తి ని స్వామి చూడాలని ముచ్చట పడితే ఇచ్చారు .అది పొరపాటున గంగలో జారి పడి పోయింది .రాజుకు కోపం వచ్చి తిట్టాడు .స్వామి తన చెయ్యి గంగా నది లో పెట్టి ఒకే రకం గా ఉండే రెండు కత్తులను తీసి అందు లో రాజుదేదో గుర్తించి తీసుకో మన్నాడు .రాజు గుర్తించ లేక పోతే తానె గుర్తించి చెప్పి ఇచ్చాడు .రెండో దాన్ని గంగలోకి విసిరేశారు స్వామి.


           దిగంబరం గా తిరగటం కొంత మందికి నచ్చక కేసు పెట్టారు .కోర్టు లో కేసు నడి చింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వేశాడు .అలాగే తెచ్చారు .ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివ రించారు .ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు .స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు .వెంటనే తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు .మతి పోయింది మేజిస్ట్రేట్ కు .అయితే సుగంధ పరి మళం కోర్టు అంతా వ్యాపించింది .స్వామి మహిమ తెలిసి దిగంబరం గా తిరిగే హక్కు ఇచ్చాడు.

ఒక సారి ఒక ఆకతాయి దుండగులు కొందరు సున్న పు తేట ఇచ్చి పాలు అని చెప్పారు .శుభ్రం గా తాగేశాడు స్వామి . .వెంటనే మూత్ర రూపం లో దాన్ని అంతట్ని విసర్జించాడు.


                      శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయ నాద్ తో కలిసి మౌన స్వామిని దర్శించారు .ఆయనకు బాబా నశ్యం వేసు కొనే కాయ కానుక గా ఇచ్చారు .స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పారట పరమ హంస ..ఇంకో సారి అర్ధ మణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించారట .పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పారు స్వామి .పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరు మహా పురుషులే .పరమ హంసలే .ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంత గా గౌర విన్చా రంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది ..ఒక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికికేదార్ ఘాట్ లో ఉన్న మన స్వామి దగ్గరకు వచ్చారు .ఇద్దరు గాడ్హం గా ఆలింగనం చేసుకొన్నారు .కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరు మాయమైనారు .అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు .తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.


            

     పంచ గంగా ఘట్టం లో చిన్న భూ గృహం నిర్మింప జేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని ,భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధి లో ఉంది ,తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి ,బ్రహ్మ రంధ్రాన్ని చేస్దించుకొని 26 -12 -1887

న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలారు .ఆ రోజూ నుండి ఈ రోజూ వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగు తాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషం .పతంజలి యోగం లో విభూతి పాదం లో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు ,కుంభక యోగం లో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు .ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో రాశారు.


కాని మన తెలుగు వారి ద్రుష్టి ఇంకా దాని పై పడక పోవటం విచారకరం అంటారు బాధతో రామ రాజు గారు .280 సంవత్సరాలు జీవించి ,స్వచ్చంద మరణాన్ని పొంది ,యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి .

*🌷అధికమాసం పౌర్ణమి విశేష పౌర్ణమి🌷*

 అధికమాసంలో వస్తున్న పౌర్ణమి రేపు, మీ కులదేవత అంటే ఇంటి దేవుడు ఎవరు ఉన్నారు ఆ దేవతా ఆరాధన విశేషంగా ఆరాధించాలి విగ్రహం ఉంటే పసుపునీళ్లు పాలతో అభిషేకం చేయాలి.. బియ్యంపిండి లేక గోధుమపిండి తో ప్రమిధలు చేసి పానకం వడపప్పు తో పాటు పరమాన్నం నైవేద్యం పెట్టాలి..


👉మీరు ఉపాసనలో ఉంటే ఆ ఉపాసిస్తున్న దేవతని అష్టోత్తరం సహస్రనామoతో అర్చించాలి జపం అధిక సంఖ్యలో చేయాలి. 


👉ఇవన్నీ చేయలేని వారు కూడా రేపు ఏదైనా ధానం చేసి అధికఫలితం పొందవచ్చు బ్రాహ్మణులకు స్వయంపాకం, బీదవాళ్ళకు భోజనం, మజ్జిగ ధానం చేయటం చాలా మంచిది రేపు పూజ చేస్తున్న వారు కూడా తోచినంత గా బీదవాళ్ళకు మీ పిల్లలతో ధానం చేయిస్తే మంచిది.


👉ముఖ్యంగా ఉద్యోగం సమస్యలో ఉన్నవారు లక్ష్మీదేవి కానీ శివయ్యకు కానీ పాలల్లో తెన కలిపి అభిషేకం చేసి ఉసిరికాయ , పానకం నైవేద్యంగా పెట్టి స్త్రోత్ర పారాయణం చేసి అవుకు ఏదైనా పండు తినిపిస్తే వారికి ఉన్న ఆ సమస్య గట్టెకుతుంది..


👉ముఖ్యంగా సంతానం లేని వారు కృషుడు కి పాలకోవ, పాలు, వెన్నెలో పటికబెల్లం కలిపి, అటుకులు తులసి ఇవన్నీ కృష్ణయ్యా కు నైవేద్యం పెట్టి సంతాన వేణుగోపాలస్వామి మంత్రం , మధురాష్టకం, అష్టోత్తరం ఇవన్నీ స్త్రోత్రం చేసి మీరు నైవేద్యంగా పెట్టిన పాలకోవ కొద్దిగా తీసుకుని తర్వాత ఆ ప్రసాదాన్ని గర్భవతి కానీ పసి పిల్లలకు కానీ పంచాలి. దంపతులు ఇద్దరు కలిసి గో పూజ చేయించు కుంటే సంతాన దోషం తొలగిపోతుంది.


👉మహావిష్ణువు కి విష్ణు సహస్రనామ పారాయణం పంచామృత అభిషేకం అర్చన తులసి, పచకర్పూరం వేసిన తీర్థం సమర్పించి పూజించాలి.


👉మనమందరం శివునికి, దుర్గమ్మకి, లక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్యం స్వామికి, వినాయకుడి కి విశేషం గా అభిషేకం , అర్చన, స్త్రోత్రం, కుంకుమాపూజ, దీపాలంకరణ సేవతో పూజిస్తాము కాబట్టి ఎవరి ఓపిక, శ్రద్దను బట్టి కూడా వారు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు హోమం చేయించుకుంటే అధికమాసంలో అధికంగా ఫలితం ఉంటుంది..


👉పౌర్ణమి పారాయణ చేస్తున్న మా బంగారు తల్లులు యధాశక్తిన తల్లిని పూజించి అర్చించి వెన్నెల పారాయణ చేయండి. ఇది అధికమాసం లో.పౌర్ణమి కనుక ఇంటి దేవున్ని రేపు ఎంత ఉదయాన్నే పూజిస్తే అంత మంచిది అంటే సూర్యోదయం సమయానికి దీపారాధన చేసేయాలి..


రేపు పూజకు కావాల్సిన బియ్యంపిండి, అభిషేకం పదార్థాలు, పూజకు కావలసినవి, దీపాలు అన్ని ఈ రోజు సిద్ధం చేసుకోండి.. ప్రత్యేకంగా రేపు ఉదయం 3 గం (శివ /విష్ణు/ శక్తి) మీరు ఉపాసించే దేవతకు అభిషేకం విశేష ఫలితాలు ఇస్తుంది పూజించిన పర్వాలేదు కానీ ఘడియలు అప్పుడు ఉన్న లగ్న బలం మీకు ఎన్నో రెట్లు ఫలితం ఇస్తుంది పూజ తర్వాత ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కనుక వీలైతే ప్రయత్నం చేయండి


👉 ఇల్లు కొనాలి అనుకునే వారు ఇంటి పైన సమస్య ఉన్నవారు 108 సార్లు మణిద్వీపం పారాయణ రేపు పూర్తి చేసే విధంగా చేయాలి.


👉 ఏకవారం గురుచరిత్ర పారాయణ కూడా ఒక్కరోజులో చేసే వారు రేపు చేసుకోవచ్చు


*🙏శ్రీ మాత్రే నమః🙏* 

*🛕గుడి అంటే కాస్మిక్‌ ఎనర్జీ*



👉విశ్వంలో మనకు కనిపించని శక్తి దాన్ని *కాస్మిక్ ఎనర్జీ* అంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే *పాజిటివ్ ఎనర్జీ* మనలో వున్న చెడు ఆలోచనలను దూరం చేసి మంచి ఆలోచనలకు తోడ్పడుతుంది మనసు ప్రశాంతంగా వుంటుంది.


*ఈ శక్తి భూమి క్రింద, పైన కూడా వుంటుంది*


*విషయంలోకి వెళితే:-*

గుడి కట్టే ముందు గర్భగుడి కింద సరిగ్గా విగ్రహం పెట్టే చోట *సప్తధాతువులు* వేస్తారు 

పాదరసములు, బంగారము, తగరములు, వెండి, రాగి, వీటిని సప్తదాతువులు అంటారు

 అలాగే *నవరత్నాలు, పంచలోహాలు* వేస్తారు

ఇవన్నీ భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీ కి రిసీవర్ గా పనిచేస్తాయి

*ఒక సోలార్ పవర్* ని ఎలా ఉత్పత్తి చేస్తుందో అదే విధంగా భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి ఇవి సరిగ్గా *విగ్రహం* పెట్టే పీఠంకింద వుంటాయి తరువాత పీఠం పెట్టే ముందు పీఠం కింద *యంత్రం* పెడతారు కింద సప్తధాతువులలో వున్న పవర్ అంతా ఈ *యంత్రంలోకి వస్తాయి*

అంతేకాక అక్కడ పలికే మంత్రాలు కూడా యంత్రం లోకి వెళతాయి 

ఇది *విగ్రహం* కింద జరిగే ప్రక్రియ

*గుడిపైన పూర్ణకలశం* పెట్టడం జరుగుతుంది దాన్నే గుడి *శిఖరం* అంటారు

భూమి కింద వున్న శక్తిని యంత్రం ఎలా గ్రహించిందో 

భూమి పైన వున్న కాస్మిక్ ఎనర్జీకి *శిఖరం రిసీవర్ గా* పనిచేచేస్తుంది 

అందుకే సరిగ్గా విగ్రహం *పాదాల కింద యంత్రం తలపైన శిఖరం* వుండేటట్లు పెట్టడం జరుగుతుంది 

*గౌరీపట్నం లేదా కృష్ణ శిల* ఈ రెండు రకాల రాళ్లతో తయారు చేసిన విగ్రహం పెట్టడం జరుగుతుంది 

ఈరెండు రాళ్లతో తయారు చేసిన విగ్రహమే ఎందుకు పెడతారు అంటే కాస్మిక్ ఎనర్జీని లాగుకునే శక్తి ఈ రెండు రాల్లకే వుంటుంది 

ఈ రాళ్లు నల్లగా నీలం రంగులో ఉంటాయి

విగ్రహం కింద నుంచి యంత్రం పై నుంచి శిఖరం ఈ రెండు *కాస్మిక్ ఎనర్జీని విగ్రహం పైకి పంపిస్తాయి* 

విగ్రహం మొత్తం *తరంగాల శక్తితో* నిండి ఉంటుంది

అందుకే *విగ్రహానికి* ఎదురుగా *గంట* పెట్టడం జరుగుతుంది *భక్తులు* గంట కొట్టగానే ఆ ధ్వని ఆలయం లోపల అన్ని చోట్లకు చేరుతుంది

*గంట శబ్ధం* వినగానే విగ్రహం పైనున్న *శక్తి* నేరుగా గంటకు తగిలి ఆ ధ్వని చేరిన అన్ని చోట్లకు కాస్మిక్ ఎనర్జీ చేరుతుంది

అలా గుడి మొత్తం *పాజిటివ్ ఎనర్జీతో* నిండి ఉంటుంది

ఆ ఎనర్జీ భక్తులపై పడుతుంది ఆ క్షణం భక్తులకు మనసు ప్రశాంతంగా వుంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే విగ్రహం దగ్గర పెట్టే తీర్థంలో కాస్మిక్ ఎనర్జీ తో కలసి వుంటుంది ఆ ఎనర్జీ మన లోపలకు వెళితే మంచిదని తీర్థం తప్పని సరిగా తీసుకోవాలి అంటారు.

అందుకే మనసు బాగలేనప్పుడు గుడికి వెళ్ళండి అని మన *పెద్దలు* చెప్తుంటారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

* శివుడికి అన్నపూజ చేస్తారెందుకు?

 Hindu Dharmam Vardhillali (హిందూ ధర్మం వర్ధిల్లాలి):



ఇష్టదైవానికి అన్నంతో అర్చన చేయటం అన్నపూజ. అన్నం పరబ్రహ్మ స్వరూపమనీ, పరమాత్మకు ప్రీతిపాత్రమనీ వేద వాఙ్మయం చెబుతోంది. అలాంటి అన్నంతో ఇష్టదైవాన్ని ఆరాధించడమే అన్నపూజ. అన్నంతో అభిషేకం చేస్తూ అన్నసూక్తం పఠించడం సంప్రదాయం. తర్వాత అన్న సంతర్పణ చేస్తారు. అన్నాన్ని దైవంగా చూడటం, అందరికీ అన్నం పెట్టడం దైవారాధనగా భావించటమూ ఈ విధానంలోని ఆంతర్యం...


అన్నాభిషేకంలో అన్నమే పూజాసామగ్రి. పసుపు కుంకుమలూ పూజాపుష్పాలూ అన్నీ అన్నమే. ఆవాహనం, ధ్యానం, ఆసనం మొదలైన షోడశోపచారాలు సమర్పించి, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఆధారంగా అర్చన నిర్వహిస్తారు. పరమశివుడికి అన్నపూజ నిర్వహిస్తే.. కర్తకు అన్నపానాదులకు లోటుండదని విశ్వాసం.


ఓం నమః శివాయ...

శంభో శంకర హర హర మహాదేవ...


దారిద్ర్య దహన గణపతి స్తోత్రం


మహా మహిమాన్వితమైన ఈ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ప్రతీ రోజూ పటిస్తే మహా గణపతి అనుగ్రహం వలన దారిద్ర్యం దహింపబడి అదృష్టం చేకూరుతుంది.


దారిద్ర్య దహన గణపతి స్తోత్రం


సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం

గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధం

చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం

ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః


కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం

ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం

ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం

సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం


సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం

గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం

కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం

షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం


విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం

గిరీశ దర్శనేచ్చయా సమార్పితం పరాంబయా

నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః

మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం


మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం

ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం

అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం

నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం


దారిద్ర్య విద్రావణ మాశు కామదం

స్తోత్రం పఠెదేత దజస్ర మాదరాత్

పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ

పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్


ఇతి శ్రీ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం


అందరం భక్తితో " ఓం గం గణపతయే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు


ఓం గం గణపతయే నమః

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము

 


             రచన . 

గోపాలుని మధుసూదన రావు 



శ్రీనైమిశ వనమందున 

 శౌనక ముఖ్యాదులైన సంయమివర్యుల్ 

మానితమగు నొక మఖమును 

 పూనిరి సేయంగ మిగుల పూనిక తోడన్. 1

                    

అనయము భగవన్నామము 

 మనమందున దలచునట్టి మహనీయుండున్ 

ఘనుడగు నారదు డొచ్చెను

 మునిసంఘము లుండు వనికి మోదము తోడన్ 2   


మునిసంఘము నారదుగని 

మనమున యానందమొంది మన్నన సేయన్ 

మునియంతట చిఱునగవున 

ఘనమగు యీ సవనమునకు కర్తెవరనియెన్ 3


హవ్యంబుల భోక్తెవరని 

దివ్యుమ్డగు నారదుండు తెలియగ నడుగన్ 

"మువ్వురు మూర్తులె " యనుచును 

భవ్యులు యచటున్న మునులు పల్కిరి భక్తిన్ 4


విని యా మాటలు సంయమి 

యనియెను నీ రీతి నంత నాశ్చర్యముతో

" ఘన మునులగు మీరెప్పుడు 

వినలేదా సవనవిధులు విజ్ఞులు నుడువన్ 5


మువ్వురు మూర్తుల కొఱకును 

హవ్యము నీయంగ తగదు , యందొక వ్యక్తిన్ 

దివ్యునిగ నెన్నుకొనియును 

నివ్వగ హవ్యంబు , జన్న మిచ్చును ఫలమున్ 6


మువ్వురు మూర్తుల యందున 

నెవ్వడు యత్యంత ఘనుడొ యేర్పడ నెఱిగీ 

నవ్వాని పెద్ద జేసియు 

నవ్వానికె నీయవలయు హవ్యంబెపుడున్ ". 7

శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన కేసు

 *మధుర కోర్టులో శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన కేసు విచారణ జరిగినది.* 


అసలు శ్రీ కృష్ణ జన్మస్థానానికి సంబంధించిన చరిత్ర ఏమిటి అనేది ఒక్క సారి మనం అందరం కూడా తెలుసుకుంటే హిందువులే హిందువులను ఎలా వంచించారో కూడా తెలుస్తుంది. వివరాలలోకి వెళదామా......


మథుర శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన చరిత్ర రక్తరంజితమైనది.

మథుర సివిల్ కోర్టులో శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన కేసు *విష్ణు జైన్* అనే వకీలు దాఖలు చేశాడు. ఈయన తండ్రి *శ్రీ హరిశంకర్ జైన్* గారు గత 40 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమి కేసులో పోరాటం చేశారు. 

విష్ణుజైన్ ఆయన సహచరులు కలసి ఒక సంవత్సరం నుండి చాలా లోతైన పరిశోధన చేసి, అనేక డాక్యుమెంట్లు సంపాదించి ఈ కేసు వేయడం జరిగింది.

వీర్ సింగ్ ముండేలా అనే రాజు మథురలోని కృష్ణ మందిరాన్ని ఆ నాటి కాలంలో 33 లక్షలు పెట్టి పునర్నిమింపజేశాడు.

1617 లో ఔరంగజేబు ఈ మథురను జయించి ఆక్కడి కృష్ణమందిరాన్ని ధ్వంసం చేయించాడు. ధ్వంసం చేయడంమే కాకుండా, ఒక ఫర్మానా(ఆజ్ఞ) జారీ చేశాడు. మథుర మందిరం లో ఉన్న విగ్రహాలను అన్నింటినీ ఆగ్రా లోని జహనారా మసీదు మెట్లక్రింద పెట్టండి. మసీదుకు వచ్చే వాళ్ళందరూ ఆ విగ్రహాలను తొక్కుకుంటూ వస్తారు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఫర్మానా ను ప్రఖ్యాత చరిత్ర కారుడు జదూనాథ్ సర్కార్ పర్షియన్ భాషనుండి తెలుగులోకి అనువదించాడు. ఈ ఫర్మానా ఇప్పటికీ బికనీర్ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

1618 వరకు శ్రీకృష్ణ జన్మ భూమి అనేక మంది ఆక్రమణదారుల అత్యాచారాలకు గురి అయింది. అనేకమంది ముస్లీం ఆక్రమణదారులు ఆ మందిరాన్ని ధ్వంసం చేశారు ఈ విషయం మనకు మన చరిత్ర ద్వారా తెలుస్తుంది.

5-4-1717 న అంటే ఈ మందిర విధ్వంసం జరిగిన 100 సంవత్సరాల తరువాత మరాఠా సైన్యం మధురను తమ అధీనం లోకి తెచ్చుకుంది. అక్కడ కట్టబడిన మసీదును పడగొట్టి మరలా మందిరాన్ని నిర్మించారు మరాఠాలు. ఈ యుద్దాన్ని బాటిల్ ఆఫ్ గోవర్థన్ పేరుతో పిలుస్తారు. ఆగ్రా మథురలను మరాఠాలు తమ రాజ్యంలో కలుపుకుని ముస్లీములను అక్కడనుండి తరిమి వేశారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లుకూడా కోర్టుకు ఇవ్వబడ్డాయి.

1803 లో వీటన్నింటినీ ఆంగ్లేయులు వశం చేసుకున్నారు. 1815 లో ఆంగ్లేయులు మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆస్తిని వేలం వేశారు. 13.37 ఎకరాల ఈ భూమిని కట్రా కేశవ్ దేవ్ అని పిలుస్తారు. అంటే కృష్ణపరమాత్మ కంసుడి జైలులో జన్మించాడు. అందుకని దీనిని కట్రా కేశవదేవ్ అని పిలుస్తారు. బనారస్ కు సంబంధించిన రాజా పట్నీమల్ ఈ ఆస్తిని బ్రిటీషు వారి వేలంలో కొన్నాడు.

8-2-1944 న రాజా పట్నీమల్ వంశస్తులు ఈ ఆస్తిని 13400 కు పండిత మదన్ మోహన్ మాలవ్యకు అమ్మి వేశారు. ఒక ఆ మొత్తాన్నికూడా వారు పండిత మదన్ మోహన్ మాలవ్యకు ఇచ్చి ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా మందిరాన్ని పునర్నిర్మించమని చెప్పారు. కానీ మందిర నిర్మాణం జరగకుండానే మదన్ మోహన్ మాలవ్యగారు పరమపదించారు.

21-2-1951 మదన్ మోహన్ మాలవ్యగారి ఆశయానికి రూపం ఇవ్వడానికి, సేట్ జుగల్ కిషోర్ బిర్లా, శ్రీకృష్ణ జన్మభూమి నిర్మాణ ట్రస్టు ఏర్పాటు చేశారు. మదన్ మోహన్ మాలవ్య పేరుమీద ఉన్న ఈ ఆస్తి ట్రస్టుకు అప్పజెప్పబడింది.

12-10-1968 లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవాసంఘ అనే సంస్థ కోర్టులో ఈద్గాహ్ మసీద్ కు వ్యతిరేకంగా ఒక కేసు దాఖలు చేసింది. ఈద్గాహ్ మసీదు వారు ఈ స్థలాన్ని కబ్జాచేస్తున్నారు వారిని ఆపమని కేసు వేశారు. అదే రోజు అంటే కేసువేసిన 12-10-1968 ననే కేసుఎత్తివేసి సయోద్య కుదుర్చుకున్నారు. ఎంత స్థలాన్ని ఈద్గాహా మసీదు వారు ఆక్రమించుకున్నారో అంతవరకుఉన్న భూమిని మీరు తీసుకుని ఇక ముందుకు రాకండి అని సయోద్య కుదుర్చుకున్నారు. ఈ కుట్ర చేసింది ఎవరు అనేది మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదను కుంటాను. ఆనాటి ప్రభుత్వం నడిపిన తతంగం ఇది. ఈ కుట్రలో మన హిందువులే భాగస్వాములు. ఆనాటి భారత ప్రథాని ఇందిరా గాంధీ, ఆనాడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రపతి పాలనలో ఉండింది. అసలు ఆస్తి శ్రీ కృష్ణ జన్మాస్థాన్ నిర్మాణ ట్రస్టుది, ఈ సేవాసంఘం ఏ అధికారంతో ఒప్పందం కుదుర్చుకున్నారో మీరు ఆలోచించుకోవచ్చు. ఈ కాంప్రమైజ్ దస్తావేజులో ట్రస్టుకు సంబంధించిన ఎవరి సంతకమూ లేదు. ఇది న్యాయ విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని విష్ణజైన్ తన కేసు లో చేర్చారు.

20-7-1973 లో కోర్టు డిక్రీ ఇచ్చింది. కానీ సుప్రీం కోర్టు, ఏదైనా కాంప్రమైజ్ మోసం తో చేయబడితే దానిని క్రింద కోర్టులు ఆమోదించినా అది చెల్లదు అని అనేక తీర్పుల్లో తీర్పు ఇచ్చింది. ఇది సెక్షన్ 44 కు విరుద్దం. ఇది రామజన్మ భూమి కంటే బెటర్ కేస్. ఇక్కడ అన్ని డాక్యుమెంటెడ్ ఎవిడేన్సులు ఉన్నాయి.

ఇక పోతే చాలా మంది నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో 1947 నాటికి ఏ ఏ భూములు ( మందిరాలవి, మసీదులవి, చర్చిలవి) ఎవరి అధీనం లో ఉన్నాయో అవి వారి అధీనంలో నే ఉండాలని బిల్ పాస్ చేశాడు కదా అని ప్రశ్నిస్తున్నారు... వారికి ఒక్కటే సమాధానం ఈ కేసులో 1947 నాటికి భూమి పట్నీమల్ వంశస్తుల అధీనం లో ఉండింది. కాబట్టి ఈ బిల్లు ఈ కేసుకు వర్తించదు. 1951 తరువాత అది మదన్ మోహన్ మాలవ్య ఆస్తి.

ఖచ్చితంగా ఈ కేసు తీర్పు హిందువులకు అనుకూలంగా నే వస్తుంది అని ఆశిద్దాం....