30, సెప్టెంబర్ 2020, బుధవారం

శివామృతలహరి

 

శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

శివుడెవ్వండతడేడ నుండునని ప్రశ్నించున్ జనంబజ్ఞతన్

శివుడెవ్వండదిగాదు లే డెచట? వీక్షింపంగ లోగంట నా

శివుడే స్థావరజంగమ ప్రకృతిలో చిత్రంబుగా నిండి పా

ర్ధివ దేహంబుల నాత్మయై వెలుగఁడే శ్రీ సిద్ధలింగేశ్వరా !


అసలు ఈ శివుడు ఎవరు?

ఎక్కడ ఉంటాడు? అని కొందరు జనులు అజ్ఞానంతో ప్రశ్నిస్తూ ఉంటారు.

అలా కాకుండా

శివుడు కానిది ఎవరు?శివుడు లేని ప్రదేశమేది? అని మనల్ని మనం ప్రశ్నించుకొని,ధ్యానంలో నిమగ్నమై పరిశీలిస్తే,ఈ చరాచర జగత్తులోని అన్నింటిలోనూ శివుడే నిండి ఉన్నాడని గోచరమవుతుంది.

మట్టి సమానమైన మన అందరి దేహల్లోను ఆత్మ స్వరూపంగా శివుడే వెలుగొందుతున్నాడని అర్థమవుతుంది కదా స్వామి! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: