30, సెప్టెంబర్ 2020, బుధవారం

ఆరోగ్య నియమాలు - 2 .

 పురాతన ఆయుర్వేద గ్రంథాల యందలి ఆరోగ్య నియమాలు - 2 . 


 * అలంకారముల అన్నింటిలో వస్త్రము ముఖ్యమైనది . పరిశుభ్రతని చేకూర్చి సౌందర్యమును హెచ్చించును . గాలిని , ఎండనుండి కాపాడును. దారిద్ర్యంను పోగొట్టును . మెత్తని సన్నని బంగారు జరీతో ఉన్న తెల్లని వస్త్రము శ్లేష్మవికారములను పోగొట్టును . 


 * నీలవస్త్రము గాని , పట్టువస్త్రముగాని దానమిచ్చునప్పుడు , చికిత్స చేయునప్పుడు , యుద్దము చేయునప్పుడు ధరింపదగును. ఇట్టిది సర్వసిద్ధులను కలగచేయును . 


 * శీతాకాలం నందు పట్టువస్త్రము , వేసవికాలం నందు కాషాయ వస్త్రమును , వర్షాకాలము నందు ధరించవలెను . 


 * పట్టుబట్ట , కలంకారీ బట్ట , ఎర్రనిబట్ట వాతాశ్లేష్మములను పోగొట్టును . శీతాకాలము నందు ధరింపతగి ఉండును. పట్టువస్త్రము పరమ పవిత్రమైనది. శిశిరఋతువు నందు చల్లగాలి తగలనీయకుండా ఉండును. వాతమును శమింపచేయును . 


 * కాషాయవస్త్రము పైత్యమును పోగొట్టును . మేధాశక్తిని వృద్దిచేయును . వేసవికాలం నందు ధరింపతగినది. శరత్కాలము నందు సుకుమారంగా ఉండు వారికి హితముగా ఉండును. 


 * మెత్తని అంచుగల కాషాయ వస్త్రము చలువచేయును . పిత్తమును తగ్గించును . వేసవికాలం నందు ధరింపతగినది. 


 * తెల్లని వస్త్రము చలువచేయును . చలిని , ఎండని తగులనివ్వదు . సమశీతోష్ణమైనది. కాబట్టి వర్షాకాలమున తెల్లని వస్త్రము ధరించవలెను . 


 * ఉన్నితో చేసిన ( శాలువ ) కఫవాత హరము . చలిని పోగొట్టును . రోగహరమైనది . శిశిరఋతువు నందు హితమైనది . 


 * కంబళి వేడిచేయును . చలిగాలిని , వాతదోషమును , వాతరోగమును పోగొట్టును . అగ్నిదీప్తిని కలిగించి పైత్యప్రకోపమును పోగొట్టును . శిశిర, గ్రీష్మకాలములకు హితమైనది .


 * తలపాగా శిరస్సునకు గాలి తగలనివ్వదు. దుమ్ము చేరనివ్వదు. నేత్రవ్యాధులను తగ్గించును . 


 * మిక్కిలి ఎర్రనిది , నల్లనిది , మాసినది , చినిగినది , అంచు లేనిది , గుచ్చుకొనునది , ఎలుకలుగాని , పురుగులు కాని కొట్టినది , రెండుగా చించి కుట్టినది , న్యాయముగా సంపాదించనిది , ఇతరులది , స్త్రీలు కట్టి విడిచినది , శతృవులు పంపినది , దేవతలకు సమర్పించదగు వస్త్రము శుభదినమున కొన్నను ధరింపరాదు. 



        తరవాతి పోస్టు నందు మరికొన్ని విలువైన విషయాలు మీకు తెలియచేస్తాను . 


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: