...
ఆ రాత్రి కీకారణ్యములో మొదటిరాత్రి వారు మువ్వురికి.
.
సాధారణమానవుడై జరిగిన విషయాలు తలచుకొని దుఃఖితుడయ్యాడు మరలా రామచంద్రమూర్తి.
.
లక్ష్మణా నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఏ తల్లిబిడ్డలను విడదీసినదో కానీ ఆవిడకు పుత్రవియోగము ప్రాప్తించినది.అంతటి మహాధార్మికుడైన మనతండ్రికి ఈ వయస్సులో ధర్మము,అర్ధము కంటే కామమే ప్రధానమైనదికదా ! .
.
ఈ లోకంలో ఎవడైనా తనకు అత్యంత విధేయుడైన కుమారుడిని ఒక ఆడుదాని మాటమీద విడిచేవాడుంటాడా?.
.
ముదిమివయస్సులో నేను దూరమయ్యానన్న దిగులుతో రాజు మరణిస్తాడు,భరతుడు రాజ్యాన్ని నిష్కంటకంగా ఏలుకుంటాడు.
.
చూడబోతే ఈ కైక నన్ను అడవులపాలుచేయడానికి,దశరధుడినిచంపడానికి,భరతుడిని రాజు చేయడానికే మన ఇంట చేరినదేమో అని అనిపిస్తున్నది.
.
కైక తనకు కలిగిన ఈ సౌభాగ్యముతో కన్నుమిన్నుగానక కౌసల్యా,సుమిత్రలను కష్టపెడుతుందేమో!
.
లక్ష్మణా నీవు రేపు తెల్లవారగనే తిరిగి అయోధ్యకు వెళ్ళిపో! అనాధ అయిపోయిన నా తల్లిని రక్షించుము .
.
ఇది అమ్మకు దగ్గర ఉండి సేవ చేయవలసిన సమయము.
తల్లికి అనంతమైన శోకము కలిగిస్తున్నాను నేను.
ఏ ఆడుదీ నా వంటి కొడుకును కనకుండుగాక,
వ్యర్ధజన్ముడను నేను.
.
లక్ష్మణా నేను కోపిస్తే అయోధ్యనేమిటి,సమస్తభూమండలాన్నే స్వాధీనమొనర్చుకొనగలను .
,కానీ ఇది పరాక్రమము చూపే సందర్భముకాదు కదా!.
.
ఇలా అంటూ కంటినిండా నీరునింపుకొని దైన్యముతో ఇంకా ఏమీ మాటాడలేక అలాగే కూర్చుండిపోయాడు రాముడు.
.
విలపిస్తున్న రాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు.
.
అన్నా నీవే ఇలా దిగులుపడితే నేనూ ,వొదినగారూ ఏం కావాలి? నీవు దగ్గరలేక పోతే నేను గానీ ,సీతమ్మకానీ నీటినుండి బయటకు తీసిన మత్స్యములమైపోతామయ్యా!
క్షణకాలము కూడా భూమిపై మనలేము.
.
శత్రుసంహారకుడవైన ఓ రామా ! నిన్ను విడిచి నా తల్లి సుమిత్రనుకానీ,శత్రుఘ్నుని కానీ,తండ్రినికానీ ఆఖరికి అది స్వర్గమైనా కానీ నేను వెళ్ళను.
.
సర్వలోకాలను ఆనందింపచేయువారలలో శ్రేష్ఠుడైన రాముడు(రామో రమయతాం శ్రేష్ఠః) తమ్ముడి మాటలతో తేరుకొని మనస్సును దృఢం చేసుకొని వనవాసము పూర్తిగావించుకొనుటకు సంకల్పించుకొన్నాడు.
.
అప్పుడు ఆ అన్నదమ్ములిరువురూ పర్వతచరియలపై నిర్భయముగా సంచరించే రెండు సింహాలలాగ ప్రకాశించారు.
.
NB
.
ప్రతి మనిషికి జీవితంలో ఇలాంటి ఘట్టాలు దాదాపు గా ఏదో ఒక సందర్బంలో ఎదురవుతూనే ఉంటాయి .మనసు నీరవుతూనే ఉంటుంది అయినా ఎన్నుకున్న మార్గంలో ముందుకు నడిచే వాడే ధీరుడు...
.
అనుకోలేదాయన అడవులకు వెళ్ళాల్సి వస్తుందని !
కానీ పిడుగులాంటి ఆ నిర్ణయం తనకు తనే చేసుకున్నాడు . మార్పును ఆహ్వానించాడు .ఆ మార్పుకు అలవాటుపడే క్రమంలో రాముడి మనస్సుకు దర్పణమిది!
.
CHANGE MANAGEMENT!.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి