30, సెప్టెంబర్ 2020, బుధవారం

మూడు భిన్నమైన యోగ విధానాలని చెప్పడం జరిగింది

 శుభోదయం.


అతి అనేది నిద్రలో, ఆహారం లో, మెలకువ లో ఉంటే సమత్వం సిద్ధించడం కష్టం. ఎంతసేపు నిద్రపోయిన తర్వాత మీకింక నిద్ర పోవాలి అని అనిపించదో, మీ బడలిక తీరుతుందో, మీరు తాజాగా ఉంటారో, అంత సేపు నిద్రపోతే సరిపోతుంది. ఎవరికి వారు ఈ సమయాన్ని నిర్ణయించుకోవాలి.


మానవులు మూడు రకాలుగా ఉంటారని వర్గీకరించి, మూడు భిన్నమైన యోగ విధానాలని చెప్పడం జరిగింది. బుద్ధి ప్రధానంగా గల ఆలోచనాశీలురకు జ్ఞాన యోగము; భావ ప్రధానులకు భక్తి యోగము; కర్మ ప్రధానులకు కర్మ యోగము.


ఎపుడైనా మీ మనస్సు సుఖంగా ఉంది అంటే, మీరు నిజంగానా? అని ప్రశ్నించాలి. అదే దుఃఖం కలిగితే, ఇలా ప్రశ్నించుకోవాలి: దీన్ని దుఃఖం అనుకోవడం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఇంతకు ముందు మనం ఇప్పుడు కోరుకున్నదే, కోరుకున్నప్పుడు, మనకు కలిగింది ఇదే దుఃఖమా? సుఖాన్ని కోరుకుని, దాన్ని దుఃఖమా? ఆంటూ ప్రశ్నించుకున్నది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే, మన లోపల ఎవరున్నారో, ఎవరికి అన్నీ తెలుసో, వారితో పరిచయం ఏర్పడుతుంది.

కామెంట్‌లు లేవు: