30, సెప్టెంబర్ 2020, బుధవారం

పునర్వసు నక్షత్రము-గుణగణాలు, ఫలితాలు

 


    పునర్వసు గురు గ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అధితి, పురుష జాతి. పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి. నాలుగవ పాదము కర్కాటక రాశిలో ఉంటాయి. 


పునర్వసు నక్షత్రమున ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. ఎక్కువ శాతం శుభకరమనే చెప్పాలి. ఈ నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే.. ఆమె శాంత స్వభావంతో, బంధువులయందు అమితమైన అభిమానం చూపుతుంది. ఓర్పు ఉంటుంది. ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. క్రమంగా ఆమె ధనవంతురాలు అవుతుంది. ఇక అబ్బాయి జన్మిస్తే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు అయి ఉంటాడు. అయితే అతడు అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు. 


ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. సువర్ణం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు. 


పునర్వసు నక్షత్రము గుణాగణాలు


జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. 


ఇక ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అయితే అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే తత్వం ఉంటుంది. సొంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడే పనికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనుర్విద్య, తుపాకితో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, మటలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది. 

పునర్వసు మొదటి పాదం :- పునర్వసు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. మేషరాసి అధిపతి కుజుడు. పునర్వసు నక్షత్రజాతకులది దేవగణం. కనుక వీరికి గురువు, కుజుడు గ్రహప్రభావం ఉంటుంది. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. వీరు ధైర్యంగా మధ్యవర్తిత్వం వహించగలరు. ధర్మాన్ని రక్షణ చేయడానికి వీరు వెనుకాడరు. భూ సంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయ వృ త్తి వీరికి అనుకులిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరికి బాల్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 15 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. కాలేజ్ చదువులలో కొంత జాప్యం, కొంత మందకొడితనం జరగవచ్చు. కనుక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వివాహం కూడా కొంత జప్యంగా జరుగు తుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి. 51 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ వరకు సాఫీగా జరిగే జీవితంలో తరువాత కేతుదశ కాలం 7 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కానీ తరువాత 58 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితానికి అవకాశం ఇస్తుంది. వృద్ధాప్యం వీరికి సౌఖ్యవంతంగా జరుగుతుంది.


పునర్వసు నక్షత్ర రెండవ పాదం:- పునర్వసు నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది. వృషభరాశి అధిపతి

శుక్రుడు, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు వీరి మీద శుక్రు గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు గురువులుగా లోక పుజితులు ఔతారు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు. వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ పని అయినా సౌమ్యతతో సాధిస్తారు. ఉన్నత ఉపాధ్యాయులుగా , ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. బాల్యంలో వీరు సౌఖ్యాలను అనుభవిస్తారు. 10 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. విద్య లో కొంత మందకొడి తనం నెలకొంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహంలో జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. 46 సంవత్సరాల తరువాత వచ్చే కేతు దశలో కొన్ని సమస్యలు ఎదురైనా 7 సంవత్సరాల అనంతరం 53 సంవత్సరంలో శుక్రదశలో సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం ఔతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా జరిగుతుంది.


  పునర్వసు నక్షత్ర మూడవ పాదం:- పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు . వీరికి బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాధ్యాయులు , విద్యాసంస్థ అధిపతులుగా వీరు రాణిస్తారు. భూ సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. బంగారు వస్తువుల మిద వీరికి ఆసక్తి ఉంటుంది. బాల్యం సౌఖ్యంగా ఆరంభం ఔతుంది. 6 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది. విద్య లో కొంత మందకొడితనం కొనసాగుతుంది. ప్రయత్నా పూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది. 25 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. వీరికి బుధదశ సాఫీ గా జరుగి పోతుంది. 42 సంవత్సరాల తరువాత ఆరంభం అయ్యే కేతు దశ వలన వచ్చే సమస్యలు 7 సంవత్సరాలు ఎదురైనా తరువాత వచ్చే 49 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో వీరికి తిరిగి సౌఖ్యవంతమైన జీవితం మొదలౌతుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.


పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం:- పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది. కతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. వీరికి తల్లితో ఉన్న అనుభందం విడదీయలేనిది. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం. ఉపాద్యవృత్తి కూడా వీరికి అనుకూలమే. తెల్లని వస్తువులు, పసుపు వర్ణ వస్తువులతో సంబంధం ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు వీరికి అనుకూలం. బాల్యం సౌఖ్యంతో మొదలైనా 2 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలంలో సౌఖ్యం కొంత వెనుక పడుతుంది విద్య మందకొడిగా సాగుతుంది. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. 38 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో ఎదురయ్యే సమస్యలు 7 సంవత్సరాల తరువాత తగ్గి 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యాలను అందిస్తుంది. తరువాత జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.  

బాల్యం సుఖవంతంగానే గడుస్తుంది. అయితే క్రమంగా సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 70 

సంవత్సరాల తరువాత సమస్యల నుంచి బయట పడి సుఖ జీవితం కొనసాగించే అవకాశము ఉంది....మీ.... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: