30, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన కేసు

 *మధుర కోర్టులో శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన కేసు విచారణ జరిగినది.* 


అసలు శ్రీ కృష్ణ జన్మస్థానానికి సంబంధించిన చరిత్ర ఏమిటి అనేది ఒక్క సారి మనం అందరం కూడా తెలుసుకుంటే హిందువులే హిందువులను ఎలా వంచించారో కూడా తెలుస్తుంది. వివరాలలోకి వెళదామా......


మథుర శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన చరిత్ర రక్తరంజితమైనది.

మథుర సివిల్ కోర్టులో శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన కేసు *విష్ణు జైన్* అనే వకీలు దాఖలు చేశాడు. ఈయన తండ్రి *శ్రీ హరిశంకర్ జైన్* గారు గత 40 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమి కేసులో పోరాటం చేశారు. 

విష్ణుజైన్ ఆయన సహచరులు కలసి ఒక సంవత్సరం నుండి చాలా లోతైన పరిశోధన చేసి, అనేక డాక్యుమెంట్లు సంపాదించి ఈ కేసు వేయడం జరిగింది.

వీర్ సింగ్ ముండేలా అనే రాజు మథురలోని కృష్ణ మందిరాన్ని ఆ నాటి కాలంలో 33 లక్షలు పెట్టి పునర్నిమింపజేశాడు.

1617 లో ఔరంగజేబు ఈ మథురను జయించి ఆక్కడి కృష్ణమందిరాన్ని ధ్వంసం చేయించాడు. ధ్వంసం చేయడంమే కాకుండా, ఒక ఫర్మానా(ఆజ్ఞ) జారీ చేశాడు. మథుర మందిరం లో ఉన్న విగ్రహాలను అన్నింటినీ ఆగ్రా లోని జహనారా మసీదు మెట్లక్రింద పెట్టండి. మసీదుకు వచ్చే వాళ్ళందరూ ఆ విగ్రహాలను తొక్కుకుంటూ వస్తారు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఫర్మానా ను ప్రఖ్యాత చరిత్ర కారుడు జదూనాథ్ సర్కార్ పర్షియన్ భాషనుండి తెలుగులోకి అనువదించాడు. ఈ ఫర్మానా ఇప్పటికీ బికనీర్ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

1618 వరకు శ్రీకృష్ణ జన్మ భూమి అనేక మంది ఆక్రమణదారుల అత్యాచారాలకు గురి అయింది. అనేకమంది ముస్లీం ఆక్రమణదారులు ఆ మందిరాన్ని ధ్వంసం చేశారు ఈ విషయం మనకు మన చరిత్ర ద్వారా తెలుస్తుంది.

5-4-1717 న అంటే ఈ మందిర విధ్వంసం జరిగిన 100 సంవత్సరాల తరువాత మరాఠా సైన్యం మధురను తమ అధీనం లోకి తెచ్చుకుంది. అక్కడ కట్టబడిన మసీదును పడగొట్టి మరలా మందిరాన్ని నిర్మించారు మరాఠాలు. ఈ యుద్దాన్ని బాటిల్ ఆఫ్ గోవర్థన్ పేరుతో పిలుస్తారు. ఆగ్రా మథురలను మరాఠాలు తమ రాజ్యంలో కలుపుకుని ముస్లీములను అక్కడనుండి తరిమి వేశారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లుకూడా కోర్టుకు ఇవ్వబడ్డాయి.

1803 లో వీటన్నింటినీ ఆంగ్లేయులు వశం చేసుకున్నారు. 1815 లో ఆంగ్లేయులు మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆస్తిని వేలం వేశారు. 13.37 ఎకరాల ఈ భూమిని కట్రా కేశవ్ దేవ్ అని పిలుస్తారు. అంటే కృష్ణపరమాత్మ కంసుడి జైలులో జన్మించాడు. అందుకని దీనిని కట్రా కేశవదేవ్ అని పిలుస్తారు. బనారస్ కు సంబంధించిన రాజా పట్నీమల్ ఈ ఆస్తిని బ్రిటీషు వారి వేలంలో కొన్నాడు.

8-2-1944 న రాజా పట్నీమల్ వంశస్తులు ఈ ఆస్తిని 13400 కు పండిత మదన్ మోహన్ మాలవ్యకు అమ్మి వేశారు. ఒక ఆ మొత్తాన్నికూడా వారు పండిత మదన్ మోహన్ మాలవ్యకు ఇచ్చి ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా మందిరాన్ని పునర్నిర్మించమని చెప్పారు. కానీ మందిర నిర్మాణం జరగకుండానే మదన్ మోహన్ మాలవ్యగారు పరమపదించారు.

21-2-1951 మదన్ మోహన్ మాలవ్యగారి ఆశయానికి రూపం ఇవ్వడానికి, సేట్ జుగల్ కిషోర్ బిర్లా, శ్రీకృష్ణ జన్మభూమి నిర్మాణ ట్రస్టు ఏర్పాటు చేశారు. మదన్ మోహన్ మాలవ్య పేరుమీద ఉన్న ఈ ఆస్తి ట్రస్టుకు అప్పజెప్పబడింది.

12-10-1968 లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవాసంఘ అనే సంస్థ కోర్టులో ఈద్గాహ్ మసీద్ కు వ్యతిరేకంగా ఒక కేసు దాఖలు చేసింది. ఈద్గాహ్ మసీదు వారు ఈ స్థలాన్ని కబ్జాచేస్తున్నారు వారిని ఆపమని కేసు వేశారు. అదే రోజు అంటే కేసువేసిన 12-10-1968 ననే కేసుఎత్తివేసి సయోద్య కుదుర్చుకున్నారు. ఎంత స్థలాన్ని ఈద్గాహా మసీదు వారు ఆక్రమించుకున్నారో అంతవరకుఉన్న భూమిని మీరు తీసుకుని ఇక ముందుకు రాకండి అని సయోద్య కుదుర్చుకున్నారు. ఈ కుట్ర చేసింది ఎవరు అనేది మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదను కుంటాను. ఆనాటి ప్రభుత్వం నడిపిన తతంగం ఇది. ఈ కుట్రలో మన హిందువులే భాగస్వాములు. ఆనాటి భారత ప్రథాని ఇందిరా గాంధీ, ఆనాడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రపతి పాలనలో ఉండింది. అసలు ఆస్తి శ్రీ కృష్ణ జన్మాస్థాన్ నిర్మాణ ట్రస్టుది, ఈ సేవాసంఘం ఏ అధికారంతో ఒప్పందం కుదుర్చుకున్నారో మీరు ఆలోచించుకోవచ్చు. ఈ కాంప్రమైజ్ దస్తావేజులో ట్రస్టుకు సంబంధించిన ఎవరి సంతకమూ లేదు. ఇది న్యాయ విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని విష్ణజైన్ తన కేసు లో చేర్చారు.

20-7-1973 లో కోర్టు డిక్రీ ఇచ్చింది. కానీ సుప్రీం కోర్టు, ఏదైనా కాంప్రమైజ్ మోసం తో చేయబడితే దానిని క్రింద కోర్టులు ఆమోదించినా అది చెల్లదు అని అనేక తీర్పుల్లో తీర్పు ఇచ్చింది. ఇది సెక్షన్ 44 కు విరుద్దం. ఇది రామజన్మ భూమి కంటే బెటర్ కేస్. ఇక్కడ అన్ని డాక్యుమెంటెడ్ ఎవిడేన్సులు ఉన్నాయి.

ఇక పోతే చాలా మంది నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో 1947 నాటికి ఏ ఏ భూములు ( మందిరాలవి, మసీదులవి, చర్చిలవి) ఎవరి అధీనం లో ఉన్నాయో అవి వారి అధీనంలో నే ఉండాలని బిల్ పాస్ చేశాడు కదా అని ప్రశ్నిస్తున్నారు... వారికి ఒక్కటే సమాధానం ఈ కేసులో 1947 నాటికి భూమి పట్నీమల్ వంశస్తుల అధీనం లో ఉండింది. కాబట్టి ఈ బిల్లు ఈ కేసుకు వర్తించదు. 1951 తరువాత అది మదన్ మోహన్ మాలవ్య ఆస్తి.

ఖచ్చితంగా ఈ కేసు తీర్పు హిందువులకు అనుకూలంగా నే వస్తుంది అని ఆశిద్దాం....

కామెంట్‌లు లేవు: