17, జులై 2021, శనివారం

ఇంటర్నెట్ యుగం

 *ఒక సెకండ్లో  57 సినిమాలు డౌన్లోడ్..... అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్.*


ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్ 1 ఎంబీపీఎస్ స్పీడ్ అంటే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. అత్యంత వేగమైన డేటా ట్రాన్స్ఫర్ చేసేందుకు దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జపాన్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలో అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడు తాజాగా జపాన్ అందుకుంది. జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ ఐసీటీ) పరిశోధకుల బృందం ఒక్క సెకనుకు ఏకంగా 319 టెరాబైట్ల(Tbps) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసి విజయం సాధించారు.


ఈ ఇంటర్నెట్ స్పీడ్తో కేవలం ఒక్క సెకనులో 57వేల సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వేగాన్ని అందుకోవడానికి శాస్త్ర వేత్తలు ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగించారు. ఇందుకోసం పరిశోధకులు 30,001 కిలోమీటర్లకు పైగా సుదూర ట్రాన్సామిషన్ను ఏర్పాటు చేశారు. బెంజమిన్ జె.పుట్నం నేతృత్వంలోని పరిశోధకులు బృందం 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సుదూర దూరం మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ చేయడంలో విజయం సాధించారు. ఇదిలా ఉంటే జపాన్ సాధించిన ఈ ఘనతపై ఇండియన్ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనిటీ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా భారత్ కి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఏ దిశలో నిలబడి స్నానం

 🔸

ఏ దిశలో నిలబడి స్నానం

చేయాలి

🔸

స్నానం చేయడానికి అనేక

నియమాలను వివరిస్తున్నాయి మన పురాణ గ్రంధాలు.

ఎప్పుడు, ఎలా  స్నానం

చేయాలనే విధి విధానాలు తెలుపుతున్నవి.

జలాశయాలలో  పడమటిదిశగా నిలబడి

స్నానం చేయకూడదు.

వస్త్రాలు ధరించకుండా

స్నానం చేయకూడదు.

 చలికాలంలో బావి నీటితో వేసవిలో నదీలో స్నానం మంచిదని ప్రాచీన

కాలం నుండి అనుసరిస్తున్న విధానాలు.


నిత్యం రెండు సార్లు స్నానం చేయిలనే నియమం పెద్దలు ఏర్పరిచారు.


స్నానం చేయగానే ప్రధమంగా వీపు తుడుచుకోవాలనే నియమాన్ని పెద్దలు ఏర్పరిచారు.


దీపావళికి తప్ప మిగతా వ్రత దినాలలో నూనె రాసుకుని తలంటుకోకూడదు.🙏

కార్డియాలజిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్ర౦....

 .. రాయపూడి.....కార్డియాలజిస్ట్  చెప్పిన ఆరోగ్యసూత్ర౦.... 

రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు?  


కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లుతాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్రవిసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా!


అసలు - రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?


ఒక కార్డియాలజిస్ట్ (గుండె వైద్యుడు) ఏమి చెప్పాడంటే - 


మీరు నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్ళలో వాపు ఉంటుంది (ముఖ్య౦గా మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ) ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రి౦ది భాగాలులో, ముఖ్య౦గా కాళ్ళలో ఎక్కువ నీళ్ళు నిలువు౦టాయి. 


అదే, మీరు పడుకుంటే మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్ళు మొదలైనవి) మీ మూత్రపిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటు౦ది కనుక, మూత్రపిండాలు ఎక్కువ నీటిని తొలగి౦చేదానికి సులభంగా ఉ౦టు౦ది.


మూత్రంద్వారానే మన రక్తంలోని మలినాలు,విషపదార్ధాలు విసర్జింపబడతాయి.


అటువ౦టప్పుడు నీళ్ళు త్రాగడానికి సరైన సమయం ఏమిటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.


*హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు*


1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది


2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది


3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది!)


4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!)


5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.


6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.


ఒక కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి ఈ సందేశాన్ని పంపి౦చగలిగితే, కనీసం ఆ పది మ౦దిలో 1 ప్రాణాన్ని కాపాడుకోగలుగుతా౦.”


నేను నాపనిచేసేసాను ఇప్పుడిక మీపనిని మీరుచేసి పదిమందికి సహాయపడండి.

👍👍👍

ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే..

 *రాజస్థాన్ రాష్ట్రం ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే...*


ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే వీధి వీధి సంబంరాలు. ఆఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా. అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్‌ సహరన్‌.


ఆయనెమన్న ధన వంతుడా అనుకునేరూ.. కానే కాదు సాదాసీదా మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. 1) రోమా, 2) మంజు, 3) అన్షు, 4) రీతు, 5) సుమన్‌, అని నామకరణం చేశారు. కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్‌. అయితే తనకు కలెక్టర్‌ కావాలన్న కోరిక ఉండగా...ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా... కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ఈ అరుదైన కుటుంబం రాజస్తాన్‌లోని హనుమాఘర్‌ లో నివసిస్తోంది. 2018 లో నిర్వహించిన రాజస్తాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా... అన్షు, రీతు, సుమన్‌ లకు రాజస్తాన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ (ఆర్‌ఎఎస్‌)కు ఏకకాలంలో ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా... తమ వైపుకు దృష్టిని ఆకర్షించేలా చేశారు ఈ యువతులు. ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం. ఆర్‌ఎఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌ షేర్‌ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

2014 కి ముందు.

 2014 కి ముందు..


రోగం వచ్చిన ఏళ్ల తరబడి టీకా కోసం పరాయి దేశాల మీద ఆధారపడే దేశాన్ని మౌనంగా చూసిన మనమే కరోన వచ్చిన ఏడాదిలో రెండు టీకాలు తయారుచేసి 40 కోట్ల డోసులు ఇచ్చిన దేశాన్ని గర్వంగా చూస్తున్నాం..


కాశ్మీరులో మువ్వన్నెల జెండా తగలబెడుతుంటే మౌనంగా చూసిన మనమే ఇప్పుడు కశ్మీర్ నలుమూలలా మన జెండా ఎగురుతుంటే గర్వంగా చూస్తున్నాం..


ఉగ్రవాదులు ఇంటి అల్లుళ్ళ మాదిరి దేశంలోకి వచ్చి బాంబు దాడులు చేస్తూ మన వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే మౌనంగా చూసిన మనమే కశ్మీర్ దాటి రాలేని ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వార్తలు గర్వంగా చూస్తున్నాం..


ఇక్ష్వాకూణాం ఇహం భూమిః సశైల వనకాననా అన్న ఈ భూమిలో మన రాముడి గుడి కట్టుకోలేక మౌనంగా చూసిన మనమే భవ్య రామ మందిర నిర్మాణాన్ని గర్వంగా చూస్తున్నాం..


మనకో చట్టం కాశ్మీరు ప్రజాలకో చట్టం అంటూ 370 ఆర్టికల్ ద్వారా దేశాన్ని విడదీస్తే మౌనంగా చూసిన మనం కశ్మీర్ దేశంలో అంతర్భాగం అక్కడ కూడా ఒకటే చట్టం ఒకటే జెండా అంటే గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు పాకిస్థాన్ మాట్లాడితే మన మీద ఉగ్రవాదుల్ని పంపి  రెచ్చిపోతుంటే మౌనంగా చూసిన మనమే మన సైనికులు సరిహద్దు దాటి మరి వాళ్ళని చంపుతుంటే గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు రాత్రి పుస్తకం పట్టుకోగానే పవర్ కట్ అయ్యి గుడ్డి దీపాల్లో చదువులు సాగుతుంటే మౌనంగా చూసిన మనమే ఇప్పుడు 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతుంటే ఇది నయా భారత్ అని గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే డెలివరీ కోసం రోజుల తరబడి మౌనంగా వేచిచూసిన మనమే ఇప్పుడు సెల్ ఫోన్లో బుక్ చేస్తే బుక్ చేసిన 24 గంటల్లో సిలిండర్ ఇంటికి రావడం గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు దూరంగా ఉన్న ఆత్మీయులతో మాట్లాడాలి అంటే సమయం లెక్కలు డేటా లెక్కలు చూసిన మనమే ఇప్పుడు లెక్కలేని లెక్కకురాని సంభాషణలు చేస్తూ గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు ఎరువుల కోసం దుకాణం ముందు చెప్పులు పెట్టి పోయిన రైతన్నల బాధలు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు వద్దంటే వస్తున్న ఎరువుల సరఫరా గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు చైనా అంటే అగ్రదేశం ఆ దేశం ముందు పనికిరాము అన్న పాలకుల మాటలు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు ప్రధాని స్వయంగా సరిహద్దుల్లో నిలబడి ఖబడ్దార్ చైనా అనే హెచ్చరికలు గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు సూది కూడా దిగుమతి చేసుకునే పరాయి ఆధార భారత దేశాన్ని మౌనంగా చూసిన మనమే ఇప్పుడు ఆత్మనిర్బర్ భారత్ అంటూ మొబైల్ ఫోన్లు కూడా ఎగుమతి చేస్తున్న నయా భారత్ గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు సైనికులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా సరిహద్దుల్లో వాళ్ల ఇబ్బందులు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు బులెట్ ప్రూఫ్ జాకెట్టు అత్యాధునిక ఆయుధాలతో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్న సైనికులను గర్వంగా చూస్తున్నాం..


ఒకప్పుడు తుపాకిలో బుల్లెట్ కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి మౌనంగా చూసిన మనమే ఇప్పుడు మిత్ర దేశాలకి బ్రహోస్ క్షిపణి అమ్ముతుంటే గర్వంగా చూస్తున్నాం..


అత్యవసర మందులు నల్ల మార్కెట్లో అమ్ముతుంటే మౌనంగా చూసిన మనమే ప్రపంచం విపట్టుకి దాసోహం అంటే మనం టెస్టులు చికిత్స ఉచితంగా ఇస్తుంటే గర్వంగా చూస్తున్నాం..


చిన్నపాటి కరువుకు ప్రజలు ఆకలి చావులు చస్తుంటే మౌనంగా చూసిన మనమే గత పదమూడు నెలలుగా దేశ ప్రజలు అందరికి ఉచితంగా రేషన్ ఇస్తున్న ప్రభుత్వాన్ని గర్వంగా చూస్తున్నాం..


ఇలా ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించిన నా దేశం ప్రపంచం ముందు గొప్పగా నిలబడే స్థితికి చేర్చిన ఈ ప్రభుత్వం చేతుల్లో నేను నా పిల్లలు వారి భవిష్యత్తు భద్రం అని గర్వంగా చెప్పుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై..

నవగ్రహాల దోష నివారణకు

 నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ 

క్షేత్రాలు..!  (మొదటి భాగము):-


ఓం నమో నారశింహాయనమః🙏


హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో 

వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి. 


1️⃣.జ్వాలా నరసింహ క్షేత్రము.🙏

(కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. 

ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి 

ఘనమైన చరిత్ర ఉంది . 

పూర్వం  యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. 

అప్పుడు  శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.

అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, 

జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు 

అనే రూపాలలో కనిపించాడట. 

ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. 

స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.


వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, 

కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరశింహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని 

"జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. 

ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే 

కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

పరమాచార్య ఇచ్చిన భరణం

 పరమాచార్య ఇచ్చిన భరణం


పంచపకేశన్ అనే ఒక పెద్దాయన 1952 దాకా శ్రీమఠంలో కైంకర్యం చేసేవారు. పరమాచార్య స్వామివారికి కైంకర్యం చెయ్యడమే ఆయన జీవితాశయం. కొద్దిగా అనారోగ్యం చేయడం వల్ల పరమాచార్య స్వామి వద్దనుండి సెలవు తీసుకుని తంజావూరు దగ్గరనున్న అతని స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. కంచి మఠాని వదిలి వెళ్ళినా అతను మాత్రం ప్రతినిత్యమూ పరమాచార్య స్వామివారిని ఆరాధించేవాడు. ఎల్లప్పుడూ స్వామివారి స్మరణ చేసేవాడు. స్వామివారి పూజ విషయంలో చిన్న అలసత్వాన్ని కూడా చేసేవాడు కాదు. అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. అందరికి పెళ్ళిళ్ళయ్యాయి. తన తండ్రి అంత అనారోగ్యంలో కూడా ఇంకా పరమాచార్య స్వామివారి కైంకర్యం చెయ్యడం చూసి, అతని పెద్దబ్బాయి ఇలా అన్నాడు.


“ఎందుకు నాన్న ఎప్పుడూ పరమాచార్య స్వామి వారి సేవలో తలమునకలై ఉంటావు? మీరు చదివిన చదువుకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసినట్లైతే, మీకు ఈపాటీకి దండిగా ఫించను(భరణం)గా వచ్చేది. ఆ డబ్బుతో మీరు హాయిగా బ్రతకేవారు కదా, ఏమంటారు?”


“రేయ్! మహాస్వామి వారి కైంకర్యం చెయ్యాలంటే పెట్టిపుట్టుండాలి రా! నాకు ఆ అదృష్టం దక్కింది. ఆసేవలో స్వామివారికి దగ్గరగా ఉన్నాను. దాని వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏముంది? మంచి చదువులు చదువుకున్నారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. కేవలం మనుష్య రూపంలో ఉన్న ఆ భగవంతుడే మనకు ఏలోటు రాకుండా చూసుకోగలడు” అంటూ తన కొడుకు అలా అనడంతో ఆవేదనగా చెప్పసాగాడు. 


”లేదు నాన్న, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఉంటే ఈపాటికి మీకు పింఛను వస్తుండేది కదా అనే ఉద్దేశంతో నేను అలా అన్నాను” అని ఈ విషయం ఇంతటితో ముగించాడు. 


ఈ సంఘటన కొన్నిరోజుల తరువాత చెన్నైలో ఒక వివాహం జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఆ వివాహానికి అతని పెద్దబ్బాయి కూడా వెళ్ళాడు. పెళ్ళిక్రతువు ముగిసిన తరువాత వధూవరులిద్దరిని కంచికి తీసుకునివెళ్ళారు స్వామివారి ఆశీస్సులకోసం. పంచపకేశన్ పెద్ద కుమారుడు కూడా వారితో పాటు కంచి వెళ్ళాడు. ఒకరి తరువాత ఒకరు స్వామివారి అశీస్సులు అందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇతని వంతురాగానే స్వామివారిముందు నిలబడ్డాడు. స్వామివారు తలెత్తి అతణ్ణీ చూసి, “నువ్వు పంచపకేశన్ కుమారుడివి కదూ?” అని అడిగారు. ఆశ్చర్యపడుతూ అవునని సమాధానమిచ్చాడు. “మీ తండ్రిగారు ఎలా ఉన్నారు? నాపై ఎంతటి భక్తి తెలుసా మీ నాన్నకి? వారిని బాగా చూసుకోండి. ఎంతమంది పిల్లలు మీరు?” మొదలైన విషయాలు అడిగారు. 


“ఈ మఠంలో సేవచేసేవారికి చాలా చెయ్యాలని నాకు ఆశ. కాని నేను ఇక్కడ మఠం పరిపాలకుణ్ణి మాత్రమే. కనుక పెద్దగా ఏమి చెయ్యలేను. ప్రజలు ఇచ్చినదానితో మఠాన్ని పరిపాలిస్తున్నాను. ఇది ప్రభుత్వ కార్యాలయం కాదుగా. అందరూ బావుండాలని ఆ పరదేవత కామాక్షిని ప్రార్థించడం తప్ప ఏం చెయ్యగలను. కాని మీ తండ్రి భక్తికి అతని ఈ మఠానికి చేసిన సేవకి తనకి ఏమైనా చెయ్యాలని నా ఆశ. కనుక ప్రతినెలా 25 కలాల(12 మరక్కల్ ఒక కలం, 8 లీటర్లు ఒక మరక్కల్) ధాన్యం అందుతుంది ‘భరణం’గా” అని అన్నారు. 


ఇది వినగానే అతడు స్వామివారికి సాష్టాంగపడి, ఏడ్చాడు. “సర్వేశ్వరా! కేవలం వారిగురించి ఆలోచించి అలా అన్నాను కాని మీకు చేసిన సేవని నేను నిందించలేదు. నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు. ”నేను నిన్ను నిందించడం లేదు. పెద్ద సహాయం చెయ్యలేను కాబట్టి మీ నాన్నకి ఈ చిన్న ఏర్పాటు చేశాను” అని ఆ త్రికాలజ్ఞాని అతణ్ణి ఓదార్చాడు.


తన తండ్రిసేవకి ఈ ఫలితం చాలు అనుకున్న ఆ కుమారుడు కూడా తన తండ్రి దారిలోనే నడిచి పరమాచార్య స్వామివారికి సేవకుడయ్యాడు. ఈనాటికి నీడమంగళంలోని అతని ఇంటికి అతని భరణం ధాన్యం రూపంలో వస్తోంది. 


--- “కంచి మహనిన్ కరునై ఉళ్ళమ్” పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

అవధూత శ్రీ రంగన్న బాబు

 🏵️🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹🏵️

_"శ్రీరామ జయ రామ 🏹 జయజయ రామ"_

*అవధూత శ్రీ రంగన్న బాబు గారి లీలా సంపుటి 25 వ భాగం*

_*నీలమేఘ రాముడు నిక్షిప్తం చేసిన వక్షస్థల నామాలు*_ 

రంగన్న బాబు గారు ఫోటోలు తీయుటకు అంగీకరించే వారు కారు. రంగన్న గారికి తెలియకుండా ఒక ఫోటోగ్రాఫర్ స్నాప్ 📷 తీసి డెవలప్ చేయుటకు డార్క్ రూమ్ లోనికి వెళ్లి ఫిలిం డెవలప్ చేయుటకు ప్రయత్నించగా, ఒక వెలుగు వచ్చి ఫిల్మ్ మాడిపోయినదట. అంతట ఫోటోగ్రాఫర్ భీతి చెంది  బాబుగారి కాళ్ళపై పడి జరిగిన వృత్తాంతము చెప్పిరి. _*"రాములవారి ఆజ్ఞ లేనిదే ఫోటోలు తీయరాదు"*_ అని తెలియపరచగా ఫోటోగ్రాఫర్ బాబు గారిని ఫోటో తీయుటకు అనుమతి కోరుతూ ప్రాధేయపడగా, *రాములవారిని అడిగి చెబుతా* నని చెప్పిరి. తర్వాత స్వామి అనుగ్రహించడం ఫోటో 📸 తీయడం జరిగినది. ఫోటోలోని విశేషమేమంటే _*రంగన్న బాబుగారి వక్షస్థలములో ఊర్ధ్వ పుండ్ర ములలోని శ్రీ చూర్ణ స్థానమున* *"కోదండరాముడు"*_ *ప్రత్యక్షమైనాడు.*  రంగన్న గారికి రాములవారితో ఉన్న సాన్నిహిత్యానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావలె ? అదే ఫోటో భక్తుల ఇండ్లలో ఈనాటికీ పూజింపబడుతున్నది.

*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

_"జయ జయ సాయిరాం"_

🏵️🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹🏵️

బ్రాహ్మణుల-ధర్మం

 బ్రాహ్మణులు వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తారు. మద్యమాంసాలను ముట్టరు.

బృంహ్  - విస్తరణే - అనే  ధాతువు నుండి బ్రహ్మ అనే పదము వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము బ్రహ్మము. ఆ బ్రహ్మమునే అంతటా దర్శించేవాడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణులు వ్యక్తిగత సుఖాన్ని, స్వార్థాన్ని విడిచి పెట్టి, వైదికాచారాలను పాటిస్తూ, శాంతస్వభావులై, ఏకాంతప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ, దయాళువులై ఉంటారు.
*" బ్రాహ్మణస్య దేహోయం న సుఖాయ ప్రకల్పతే " !!*
బ్రాహ్మణుని శరీరము అతని సుఖం కోసం కాదు, లోక క్షేమం కోసం పరమాత్మ తో కల్పించబడింది. బ్రాహ్మణుడు తన సుఖం చూసుకోడు. సర్వ మానవాళి సంక్షేమం కోసం పాటు పడతాడు కనుక,  మిగతావారందరూ బ్రాహ్మణుని సంక్షేమం కోరాలి.
బ్రాహ్మణ కులములో  తాము వేదములోని ఏ  శాఖకు సంబంధించిన వారో, ఆ వేదశాఖను శిక్షాది షడంగాలతో పూర్తిగా అధ్యయనము చెయ్యటము బ్రాహ్మణుల కర్తవ్యము.  బ్రాహ్మణోచితమైన అధ్యయనము, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాలనే షట్కర్మలను ఆచరించటం బ్రాహ్మణుల విధి.
*"యజనం యాజనం దానం*
*బ్రాహ్మణస్య ప్రతిగ్రహః !*
*అధ్యాపనం చాధ్యయనం*
*షట్కర్మాణి ద్విజోత్తమాః"!!*
అగ్ని ఆరాధన, యజ్ఞ నిర్వహణ బ్రాహ్మణుల కర్తవ్యములు. నాలుగు వేదాలను, వేదాంగాలను అధ్యయనం చెయ్యటం, శిష్యులకు బోధించటం బ్రాహ్మణుల పని. వీరు పాపరహితులై, శుద్ధ మనస్కులై ఉండాలి. వీరు ఇంద్రియాలను తమ వశములో ఉంచుకుని, ధర్మం తప్పకుండా జీవించాలి.

సేకరణ 
సుబుద జన విధేయుడు 
సి. భార్గవ శర్మ , న్యాయవాది.