నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ
క్షేత్రాలు..! (మొదటి భాగము):-
ఓం నమో నారశింహాయనమః🙏
హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో
వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.
1️⃣.జ్వాలా నరసింహ క్షేత్రము.🙏
(కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది.
ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి
ఘనమైన చరిత్ర ఉంది .
పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట.
అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.
అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు,
జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు
అనే రూపాలలో కనిపించాడట.
ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట.
స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.
వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు,
కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరశింహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని
"జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.
ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే
కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి