17, జులై 2021, శనివారం

ఇంటర్నెట్ యుగం

 *ఒక సెకండ్లో  57 సినిమాలు డౌన్లోడ్..... అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్.*


ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్ 1 ఎంబీపీఎస్ స్పీడ్ అంటే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. అత్యంత వేగమైన డేటా ట్రాన్స్ఫర్ చేసేందుకు దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జపాన్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలో అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడు తాజాగా జపాన్ అందుకుంది. జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ ఐసీటీ) పరిశోధకుల బృందం ఒక్క సెకనుకు ఏకంగా 319 టెరాబైట్ల(Tbps) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసి విజయం సాధించారు.


ఈ ఇంటర్నెట్ స్పీడ్తో కేవలం ఒక్క సెకనులో 57వేల సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వేగాన్ని అందుకోవడానికి శాస్త్ర వేత్తలు ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగించారు. ఇందుకోసం పరిశోధకులు 30,001 కిలోమీటర్లకు పైగా సుదూర ట్రాన్సామిషన్ను ఏర్పాటు చేశారు. బెంజమిన్ జె.పుట్నం నేతృత్వంలోని పరిశోధకులు బృందం 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సుదూర దూరం మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ చేయడంలో విజయం సాధించారు. ఇదిలా ఉంటే జపాన్ సాధించిన ఈ ఘనతపై ఇండియన్ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనిటీ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా భారత్ కి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు: