🏵️🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹🏵️
_"శ్రీరామ జయ రామ 🏹 జయజయ రామ"_
*అవధూత శ్రీ రంగన్న బాబు గారి లీలా సంపుటి 25 వ భాగం*
_*నీలమేఘ రాముడు నిక్షిప్తం చేసిన వక్షస్థల నామాలు*_
రంగన్న బాబు గారు ఫోటోలు తీయుటకు అంగీకరించే వారు కారు. రంగన్న గారికి తెలియకుండా ఒక ఫోటోగ్రాఫర్ స్నాప్ 📷 తీసి డెవలప్ చేయుటకు డార్క్ రూమ్ లోనికి వెళ్లి ఫిలిం డెవలప్ చేయుటకు ప్రయత్నించగా, ఒక వెలుగు వచ్చి ఫిల్మ్ మాడిపోయినదట. అంతట ఫోటోగ్రాఫర్ భీతి చెంది బాబుగారి కాళ్ళపై పడి జరిగిన వృత్తాంతము చెప్పిరి. _*"రాములవారి ఆజ్ఞ లేనిదే ఫోటోలు తీయరాదు"*_ అని తెలియపరచగా ఫోటోగ్రాఫర్ బాబు గారిని ఫోటో తీయుటకు అనుమతి కోరుతూ ప్రాధేయపడగా, *రాములవారిని అడిగి చెబుతా* నని చెప్పిరి. తర్వాత స్వామి అనుగ్రహించడం ఫోటో 📸 తీయడం జరిగినది. ఫోటోలోని విశేషమేమంటే _*రంగన్న బాబుగారి వక్షస్థలములో ఊర్ధ్వ పుండ్ర ములలోని శ్రీ చూర్ణ స్థానమున* *"కోదండరాముడు"*_ *ప్రత్యక్షమైనాడు.* రంగన్న గారికి రాములవారితో ఉన్న సాన్నిహిత్యానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావలె ? అదే ఫోటో భక్తుల ఇండ్లలో ఈనాటికీ పూజింపబడుతున్నది.
*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*
_"జయ జయ సాయిరాం"_
🏵️🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి