11, ఏప్రిల్ 2021, ఆదివారం

Take vaccines be safe*

 ఇందాకా ఒకతను అన్నాడు..... 📌📌


*సార్. వాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కూడా కరోనా రాదని గ్యారెంటీ లేదంట కదా.. వేసుకుని లాభమేమి?*.... అని


నేను: *మీరెలా వచ్చారు సార్?.* 


*అతడు:* బైక్ మీద!! 


నేను: *ఐతే, మీ హెల్మెట్ ఇక్కడే పెట్టి పోండి.*


*అతడు:* అదేంటి సార్! 


నేను: *మీరు హెల్మెట్ పెట్టుకున్నా యాక్సిడెంట్ జరగదని గ్యారెంటీ లేనప్పుడు పెట్టుకుని లాభమేంటి?.* 


*అతడు:* హెలో సార్! హెల్మెట్ పెట్టుకునేది యాక్సిడెంట్ జరగదని గ్యారెంటీ కోసం కాదు. ఒవవేళ యాక్సిడెంట్ జరిగితే మేజర్ డామేజ్ కాకుండా ప్రాణాంతకమైన హెడ్ ఇంజ్యూరీ జరగకుండా కాపాడుతుంది. అర్థమైందా?. 


నేను: *ఇపుడర్థమైందా మరి వాక్సిన్ కూడా ఎందుకేసుకోవాలో*..


*అతడు:* కానీ కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోరు కదా సార్. చాలామందికి లైట్ గా వచ్చి పోతుంది కదా..


నేను: *యాక్సిడెంట్ ఐన వాళ్ళందరూ చనిపోరుకదా సార్. చిన్న చిన్న దెబ్బలు తగిలి బయట పడే వారే ఎక్కువ కదా.* లేదా ఫ్రాక్చర్ లు అయ్యి రికవరీ ఔతుంటారు. మరి అలాంటప్పుడు యాక్సిడెంట్ లో ఎవరో గానీ చనిపోరని తెలిసినపుడు మరి రోజూ హెల్మెట్ వాడటం ఎందుకు?. చిన్న దెబ్బలే తగులుతాయని అలాగే పోవచ్చు కదా.

ఇక్కడే పెట్టిపోండి. హెల్మెట్ వాడటం వేస్టు. అన్నాను.


*ఆలోచనలో పడ్డాడు.  చివరికి, "సార్ నాకు ప్రాణమంటే తీపి" హెల్మెట్ తోటే బయటకు వెళ్తాను. వాక్సినూ తీసుకుంటాను" అని వెళ్ళాడు*


*45 సంవత్సరంలు పైన వయస్సు గలా ప్రతి ఒక్కరూ*


*వెంటనే ఆధార్ కార్డు తో దగ్గర లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికో, లేక ప్రాథమిక  ఆరోగ్య కేంద్రం లేక ప్రైవేటు ఆసుపత్రికో వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి.,,*


మీరు సురక్షితంగా ఉండండి.... 

ఎదుటవారిని సురక్షితంగా ఉంచండి,,,,


*అన్నట్లు వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని షంషేర్ అని బలాదూర్ గా తిరగకండి...*


*మాస్కే రక్షణ కవచం..*

*శానిటైజర్ వాడండి...*

*భౌతికదూరం పాటించండి..*

*మిగతా వారికి వ్యాక్సిన్ వేయించండి....*


నేటి నుండి 45 సంవత్సరంలు పైన వయస్సు గలా ప్రతి ఒక్కరూ, మీ దగ్గరలోని  ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో 


💉 *"కరోన వ్యాక్సిన్"* వేయించుకోగలరు...

💉 🧑🏼‍⚕️ 💉 👩🏼‍🔬 💉 🧑🏼‍⚕️💉


*కరోన వ్యాక్సిన్నేషన్ కొరకు మీ గ్రామంలోని ఆరోగ్య కార్యకర్తలకు సహకరించండి*


*"Live and let Live"*

*Take  vaccines be safe*

మొగలిచెర్ల

 *శ్రీపాద శ్రీవల్లభ మందిరం..2వ భాగం.*


శ్రీ దువ్వూరి భాస్కరరావు గారు శ్రీపాదుల వారి విగ్రహం ఇవ్వడానికి సంసిద్ధత తెలియచేయడం..ఆ మందిర నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిపోయాయని నిన్నటి భాగం లో చదువుకున్నాము..ఇక శ్రీపాదుల వారి గుడి నిర్మాణానికి అయ్యే వ్యయం గురించి చిన్న చర్చ వచ్చింది.."భాస్కరరావు గారూ..మీరు విగ్రహం ఇస్తానని తెలిపిన రోజున..శ్రీపాదుల వారి గుడి నిర్మాణం కోసం కొందరిని సంప్రదించాను..వారూ సుముఖత వ్యక్తం చేశారు..కానీ ఇప్పుడు విగ్రహం చిన్నదే కనుక..ఈ విగ్రహానికి తగ్గ గుడి నిర్మిద్దాము..అప్పుడు మేము అనుకున్న ఖర్చు కూడా తగ్గుతుంది.." అని చెప్పాను..భాస్కరరావు గారు నా వైపు చూసి.."ప్రసాద్ గారూ నా మిత్రుడు శ్రీ పీతా నాగేంద్ర కుమార్ గారు శ్రీపాదుల వారి గుడి నిర్మాణానికి కొంత సహాయం చేస్తానన్నారు..వారిని అడిగి చూస్తాను..నిజానికి ఈ గుడి నిర్మాణం మాత్రం మీరే చేయండి అని గతం లో చెప్పివున్నాను..ప్రస్తుతం ఖర్చు తగ్గింది అన్నారు కనుక..ఒకమాట నాగేంద్రకుమార్ గారిని అడుగుతాను"..అన్నారు.."అడగండి.." అన్నాను..భాస్కరరావు గారు నా ముందే ఫోన్ లో మాట్లాడారు.."ప్రసాద్ గారూ నాగేంద్ర కుమార్ గారు ఈ వ్యయాన్ని భరించేందుకు ఒప్పుకున్నారు..ఇక మీరు నిర్మాణం మొదలుపెట్టండి.." అని చెప్పారు..శ్రీ పీతా నాగేంద్ర కుమార్ గారు ఇచ్చిన విరాళం తో శ్రీపాదుల వారి గుడి నిర్మాసనం దాదాపు పూర్తి అయింది..ఆపై మిగిలిన పని పూర్తి కావడానికి దాతలు సహకారం అందించారు..


శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి గుడి నిర్మించాలనే మా కోరికను..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆ రకంగా మా వెన్నంటి వుండి తీర్చారు..ఈ గుడి లో శ్రీపాదుల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల 11వతేదీ నుంచి మొదలు అవుతుంది..13 వతేదీ గురువారం నాటితో పూర్తి అవుతాయి..శ్రీ దత్తపాదముల కొరకు ఇంతకు ముందు ఒక చిన్న మందిరాన్ని నిర్మించి ఉన్నాము..ఆ దత్తపడముల మందిరమునకు ప్రక్కనే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మందిరం నిర్మించాము..ఈ రెండు మందిరాలకు కలిపి ముందువైపు రేకులతో షెడ్ లాగా వేస్తే..దత్తుడి భక్తులు అక్కడ కూర్చుని..అవధూతల చరిత్రలు కానీ..అవధూతల స్తోత్ర పారాయణం కానీ చేసుకోవడానికి అనువుగా వుంటుందనే ఆలోచన వచ్చింది..విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తరువాత..మహా శివరాత్రి ఆపై వారం లోనే ఉన్నది..ఆ సమయానికి ఆ షెడ్ కూడా వేయించాలని సంకల్పం..


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఉత్తరంగా కొద్దీ దూరం లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం కూడా  నిర్మించడం జరిగింది..ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనారసింహుడి విగ్రహ ప్రతిష్ట కూడా ఇదే ముహూర్తానికి జరుగుతున్నది..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర నిర్వాహకులుగా మాకు రెండు ప్రతిష్టా కార్యక్రమాలు ముఖ్యమైనవే..ప్రతిష్ట తిలకించేందుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము..


మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేయదల్చుకున్నా..ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్ద ఆ కార్యక్రమం గురించి చెప్పుకోవడం ఒక ఆనవాయితీ..స్వామివారి అనుమతి ఉంటే..ఆ పని అమిత వేగంగా పూర్తి అవుతుంది..శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి గుడి..శ్రీ లక్ష్మీనారసింహుడి గుడి..ఈ రెండు ఆలయాలు స్వామివారి సంకల్పమాత్రం తోనే ఏర్పడ్డాయి తప్ప..మేము కర్తలం కాదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).