11, నవంబర్ 2024, సోమవారం

ముముక్షువులు

 *ముముక్షువులు , సాధకులు భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి నిత్యమైన భగవత్ప్రాప్తికై పరితపించాలి* 


 గురువుల అనుగ్రహం లేకుంటే ఎవ్వరు కూడా తత్వజ్ఞానప్రకాశాన్ని పొందలేరు . భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి వాసనాబద్ద జీవులను సంసారం నుండి విముక్తి పొందటానికి అనేక విధాలుగా సంరక్షిస్తున్నాడు . అయినా ఈ ప్రపంచంలో అనేకులు బద్ధులవుతున్నారు . వీరిని బంధాల నుండి తప్పించడానికై దయామయులైన మహర్షులు , గురువులు భగవదాజ్ఞను అనుసరించి ప్రపంచాన్ని ఉద్ధరించుటకై ప్రయత్నిస్తూనే ఉన్నారు . ధర్మం నశించిపోతున్న సమయంలో భగవంతుడే స్వయంగా అవతరించి ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేస్తుంటాడు , శ్రీరామకృష్ణాది అవతారాలు ఇందుకు నిదర్శనం . వేదములకు ఆస్థానమైనటువంటి భరతభూమిలో విభిన్న మతములు తలెత్తి సనాతన ధర్మాన్నే మట్టుమాపు పరిస్థితులు ఏర్పడినవి . మతమన్న నేమియో నెఱుఁగనివారు మతము పేరిట మారణ హోమాలు జరుపుచుండిరి . వేద ధర్మాన్ని అవలంబిస్తూ విభిన్న పోకడలకు పోయి తమ మతమే గొప్ప అని వాదోపవాదాలకు దిగటంతో సనాతన ధర్మ నిజతత్వమునకు మచ్చలు ఏర్పడినది . ఆ తరుణంలో నాస్తికులకు , పాషండులకు నాయకత్వమైనది ఈ భారతావని. అట్టి తరుణమున భారత దేశమున *సంభవామి యుగేయుగే* అన్నట్లు కైలాసవాసి అయిన పరమేశ్వరుడే సాక్షాత్తు శ్రీ ఆదిశంకరుచార్యుల రూపంలో కేరళ దేశంలో కాలడి అగ్రహారమందు శివగురు ఆర్యామ్బ పుణ్యదంపతులకు అవతరించారు . బాల్యమునందే శంకరులు సర్వజ్ఞుడై ఉన్నారు. అటుపిమ్మట గురువుల వద్ద విద్యను అభ్యసించి వేదవేదాంత శాస్త్ర సారగ్రహీతయైనాడు . స్వార్ధరహితుడైన శ్రీ శంకరులు తానుపొందిన బ్రహ్మజ్ఞానమును ప్రజల కందించటానికి దేశం నలుమూలల ముమ్మార్లు పర్యటన చేసి సనాతనధర్మం యొక్క అసలైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠిత చేసిన అగ్రగణ్యులు . తన దిగ్విజయము చిరస్థాయిగా ఉండాలని దలచి సనాతనధర్మ పరిరక్షణ కొరకు దేశం నందు నాలుగు దిక్కులలో నాలుగు వేదలకు ప్రతీకగా నాలుగు పీఠములను స్థాపన చేసి వీరి నలుగురు ప్రధాన శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు . వీటినే చతురామ్నాయ పీఠాలు అని వ్యవహరిస్తారు . ఇవేకాకుండా బ్రహ్మసూత్రాలకు భాష్యం , వేదాంత భాష్యం , భగవద్గీత భాష్యం రచనలు చేశారు. వీటినే ప్రస్తానత్రయం అంటారు . ఇవి బ్రహ్మజ్ఞానాన్ని సూచించే గ్రంధాలు . ఇవే కాకుండా వేదాంత తత్వాన్ని బోధించే అనేక ప్రకరణ గ్రంధాలు , స్తోత్ర రచనలు కూడా చేశారు . అనేకచోట్ల శ్రీచక్ర స్థాపనలు , దేవాలయాల పునరుద్ధరణ , వేద సంరక్షణను చేసి చివరగా శిష్యులకు దర్శనమిచ్చి వేదాంతం బోధించి కేదారం నందు ఈశ్వరుని దర్శనం చేసుకుని తన అవతార పరిసమాప్తి చేశారు శంకరులు . వీరి జీవితం మనకు ఎంతో ఆదర్శప్రాయం , అందుకే వీరిని *శంకరః శంకరస్సాక్షాత్* అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . ఆస్తికులందరు రోజుకు కనీసం ఒకటైనా శంకరులు వారందించిన ఏదోఒక భాష్యగ్రంధం , ప్రకరణ గ్రంథం , దేవతాస్తోత్రాలు చదువుటకై ప్రతిజ్ఞచేసి బ్రహ్మజ్ఞానం తెలుసుకొనటకై ప్రయత్నం చేయాలని దీక్షపూనండి , అదే వారికి మనమందించే అచంచలమైన గురుసేవ , గురుభక్తి . 🙏🕉️🪷🌸🌹

సర్వం శ్రీ శారదా

చంద్ర మౌళీశ్వరార్పణమస్తు...


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహా స్వామివారు*

చడీశ్వరుని కథ 💐

 💐 చడీశ్వరుని కథ 💐


ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. పైగా గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.


 బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు.


*వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి.*

ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. మరియు రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. 


 ఈ పిల్లవాడికి ఒక ఆలోచన కలిగింది,”ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకు” అని ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.

 *రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు.* అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.


అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఆ పాలను రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ఈ పిల్లవాడు చేస్తున్న అభిషేకము చూచి “‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు” అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.


అదివిన్న యచ్చదత్తనుడు  ఆగ్రహించి ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.


పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారము లతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.


అది చూచిన తండ్రి “అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. అయిన ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపంతో తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది. అదిచూచిన ఆ ఆగ్రహించి  వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి విసిరాడు. అంత తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయి క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే అని అన్నాడు.


నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించి “నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను.ఇవాల్టి నుండి నీవు మా కుటుంబం లో అయిదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడి దే.

నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.” అని మరొక వరం కూడా ఇచ్చాడు.


 లోకంలో వివాహం అనంతరం భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అందు వలననే అది పత్నీభాగం అంటారు. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి.


“పార్వతీ నేను ఈవేళ చండీ శ్వరుడికి ఒక వరం అనుగ్రహిస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు” అన్నాడు.


నాటినుండి ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.*


మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు.


చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.


 విడిచిన సగభాగం చండీశ్వరునికి వెళ్ళి పోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం సరికాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.


 ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే ఉత్సవ మూర్తులలో నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడుఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు గనుక.


ఒక్కసారి శివాలయంలో  అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి.

🙏ఓం నమః శివాయ 🙏

చాగంటి కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు*💐💐

 ఈరోజు అడ్వైజర్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ -  క్యాబినెట్ ర్యాంక్ (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) గా నియమితులైన గురువుగారు శ్రీశ్రీశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు*💐💐


చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -


ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయటపడ్డారు. 


చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. 


చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. 


చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.


ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. 


ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా? 


అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. 


పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ. 


చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. 


ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!! 


చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.....


ధుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో 

ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది 

ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం ధన్యవాదములు🙏🙏

శ్రీ కందాడై రామానుజాచార్యుల జీవిత విశేషాలు

* పరమపదించిన మన న్యూ నాగోలు కాలనీ వాస్తవ్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ కందాడై రామానుజాచార్యుల జీవిత విశేషాలు - ఓ సమీక్ష*

సంస్కృతంలో పోగుపడిన భారతీయ సనాతన ధర్మశాస్త్ర విజ్ఞానాన్ని పిడికిట పట్టి, తెలుగు వారి లోగిళ్ళ ముందు రాశిగా పోసిన వ్యాకరణ పండితుడు డాక్టర్‌ కందాడై రామానుజాచార్య (81) ఇకలేరు. ధర్మ అధ్యయనం, ధర్మ ప్రబోధమే ఊపిరిగా తుది వరకు వారు జీవించిన వైనం అందరికి చిరపరిచితమే.

సనాతన ధర్మ ప్రబోధకుడు కందాడై గారు టీటీడీ సంస్కృత కళాశాల అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా సేవలు ఒనరించారు. అష్టాదశ పురాణాలపై ప్రబోధాలు ఎన్నో చేసారు. వేద సాహిత్య రచనలో ప్రావీణ్యులైనటువంటి వారు ఇక మన మధ్యలో లేరు.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సుమతి, కుమారుడు వనమాలి, కుమార్తె హరిప్రియ ఉన్నారు. మరో కుమారుడు మురళి ఏడాది క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.  

రామానుజాచార్య స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా చీదేళ్ల. తన పదో ఏట హైదరాబాద్‌, సీతారాంబాగ్‌లోని వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాలలో వేదాభ్యాసాన్ని ప్రారంభించారు. కోయిల్‌ కందాడై శఠకోప రామానుజాచార్య శిష్యరికంలో వ్యాకరణ విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (సంస్కృతం) పూర్తిచేశారు. అలంకార మణిహారం అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్‌డీలో బంగారు పతకాన్ని అందుకున్నారు. 

టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో అధ్యాపకుడిగా, ప్రధానాచార్యుడిగా, ప్రత్యేక అధికారిగా 2004 వరకు సేవలందించారు. టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యుడిగా కొంతకాలం కొనసాగారు. అష్టాదశ పురాణాలపై మూలగ్రంథం ఆధారంగా ప్రవచనాలు ఇవ్వగలిగిన కొద్దిమంది ధర్మప్రచారకర్తలలో కందాడై ఒకరు.

వారి వేద సాహిత్య సేవ వర్ణనాతీతము. రామాయణ, మహాభారత, భాగవతాలు, పురాణ, ఇతిహాసాలపై కందాడై కొన్ని వందల ప్రవచనాలిచ్చారు. పలు టెలివిజన్‌, వార్తా పత్రికల్లో *ధర్మ సందేహాలు* పేరుతో వేల మంది అనుమానాలకు సశాస్త్రీయ వివరణతో సమాధానాలిచ్చారు. ఎన్నో సనాతన ధర్మశాస్త్ర గ్రంథాలను సంస్కృతం నుంచి తెలుగులోకి తనదైన వ్యాఖ్యానంతో అనువదించారు. వాటిల్లో భాగవతం, పద్మపురాణం, నారద పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, హరివంశ మహా పురాణం, పరాశర స్మృతి, తెలుగు మాసాల వైశిష్ట్యాన్ని తెలిపే రచనలు ప్రచురితమయ్యాయి. ఏకాదశి వైభవంలోని పన్నెండు వేల శ్లోకాలను తెలుగులోకి అనువదించారు.  

వారు దివంగతులు కావడం భక్తి ప్రపంచానికి ఓ తీరని లోటే. కాని మానవ జీవితం అశాశ్వతం కదా. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పుతుందా. రామానుజాచార్యులు గారు కూడా ఈ మానవ పుట్టు గిట్టుకలకు అతీతులు కారే. వారు చేసిన భగవత్కార్యాల సేవలే వారిని ఇక మీదట శ్రీవారి పాదపద్మముల చెంత సేద తీర్చమని ఆజ్ఞాపించింది కాబోలు. అలాంటివారికి అనారోగ్యమన్నది ఓ మిషనే. నిష్క్రమించే సమయం ఆసన్నమయినట్టుంది. వెడలిపోయారు. 

కాని వారు చేసిన ధర్మప్రబోధాలు, వేద సాహిత్య సేవ, దర్మశాస్త్రాల అనువాదాలు ఇలా ఎన్నెన్నో వారిని మన మదిలో చిరకాలం ఉండేటట్టు చేయగలిగినవి.

ఇందు మూలంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను.

 

శైవక్షేత్రం

🎻🌹🙏కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.  ....!!



*🌹 ఈరోఈ రోజు .శ్రీ భిక్షేశ్వరుడు - శ్రీ గౌతమేశ్వర ఆలయం విశేషాలు తెలుసుకుందాం...కరీంనగర్ జిల్లా : మంథని..*



🌿 పురాతనకాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎందరో  వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకుటం లేదా మంత్రపురి పిలిచేవారు
మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". 
అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి".

🌸 అసలు ఈ క్షేత్రం గొప్పదనం వివరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి....ఎందుకంటే...విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే  అందులో పూజా మందిరమే ఈ మంథని క్షేత్రం అని అంటారు..

🌿 మంథని కేవల గ్రామం కాదు  " ఆలయాల సమాహార ముక్తిధామం" 
తపోనిష్టాగరిష్ఠులను తరింపజేయ "శైలేశ్వరుడిగా", ప్రణవాన్ని ధ్యానించువారికి ధన్యతనిచ్చుటకు "ఓంకారేశ్వరుడిగా" ,తన ఆలయ తీరాన అనుష్టించు  సాధకులను మోక్ష తీరాలకు చేర్చే "గౌతమేశ్వరుడిగా" ముముక్షువులకి మోక్ష భిక్ష పెట్టె " భిక్షేశ్వరుడుగా" .. .గలగల పారే గౌతమీ తీరాన అనునిత్యం 4 రూపాల్లో సిద్ధంగా ఉన్నానంటాడు సదాశివుడు.

🌸ఇంతటి పవిత్రమైన క్షేత్రంలో తప్పక  దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాలు రెండు.
అవి భిక్షేశ్వరుడు మరియూ గౌతమేశ్వరుడు ఆలయాలు.

🌹 భిక్షేశ్వరస్వామి దేవాలయం 🌹

🌿 సాధారణంగా ఆలయాలు ఆగమశాస్త్రానుసారం ఉంటాయి. 
ద్వారం, ధ్వజం ప్రతిదీ శాస్ట్రోక్తంగా ఏర్పాటు చేస్తారు. కొన్ని ఆలయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. అలాంటి గుళ్లు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. 

🌸మంథనిలో కొలువుదీరిన భిక్షేశ్వరస్వామి దేవాలయం అలాంటిదే!
కాశీ తర్వాత అంతటి మహిమాన్విత క్షేత్రంగా కీర్తి గడించింది .
సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంతో నిర్మిస్తారు. కానీ, పశ్చిమ ముఖంతో విరాజిల్లే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి.

 🌿మంథనిలోని భిక్షేశ్వరస్వామి ఆలయం పశ్చిమ ముఖద్వారం కలిగి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుని ఆలయం తర్వాత పశ్చిమ ముఖద్వారం కలిగిన గుడి ఇదే కావడం విశేషం. అంతేకాదు, దేశంలో మరెక్కడా లేనివిధంగా దక్షిణామూర్తి లింగ రూపంలో వెలసిన క్షేత్రం కూడా ఇదే! పశ్చిమ ముఖద్వారం కలిగిన భిక్షేశ్వరుడి ఆలయంలో పశ్చిమ ముఖంలో శివుడు, అదే గర్భగుడిలో దక్షిణ ముఖంతో దక్షిణామూర్తి కొలువుదీరారు. 

🌿 భిక్షేశ్వరుడి అనుగ్రహంతో సర్వకార్యాల్లో విజయం కలుగుతుందని విశ్వాసం. ఈ స్వామికి అభిషేకాలు చేయిస్తే జాతకంలోని శని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. 
వేదవేదాంగాలకు మంథని కేంద్ర
బిందువుగా మారడానికి ఇక్కడి దక్షిణామూర్తి కారణమని చెబుతారు. విద్యకు మారుపేరుగా నిలిచే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మంత్రపురి వేదవిద్యకు నిలయంగా మారిందని స్థానికుల నమ్మకం. 

🌸అందుకు తగ్గట్టే తరాలు మారుతున్నా మంథనిలో వేదం పరిఢవిల్లుతున్నది. 
ఆధునిక విద్యల్లోనూ మంథనివాసులు విశేషంగా రాణిస్తూ దేశదేశాల్లో స్థిరపడి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించడం కూడా దక్షిణామూర్తి అనుగ్రహ ప్రభావమే అని చెబుతారు. 

🌿 ప్రతి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ధ్వజ స్తంభం ఉంటుంది. 
భిక్షేశ్వరుడి గుడిలో ద్వజ స్తంభు లేకపోవడం మరో విచిత్రం. 
ధ్వజస్తంభం లేని ఆలయం దేశంలో ఇదొక్కటేనేమో! 

🌸దక్షిణామూర్తి అనుగ్రహం కోసం విద్యార్డులు వస్తుంటారు. ఎప్పుడూ సందడిగా కనిపించే ఈ క్షేత్రం శివరాత్రి పర్వదినం సందర్భంగా 
మరింత కోలాహలంగా మారుతుంది. భిక్షేశ్వరుడిని దర్శించుకుంటే రాజసూయయాగం చేసినంత ఫలమనీ అంటారు.

🌹  గౌతమేశ్వరాలయం 🌹

🌿 గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల గౌతమేశ్వరాలయం అనే పేరు వచ్చింది. మాఘమాసంలో నియమానుసారం ఇక్కడ స్నానాదానాదులు చేస్తే ఏడుజన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

🌸 గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుమానంతో పార్వతీదేవి గంగను వదిలేయమని శివుడు వేడుకోగా, అందుకు శివుడు అంగీకరించలేదు. 
దాంతో పార్వతి అలుక వహిస్తుంది.
ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి, తమ్ముడు కుమారస్వామిని వెంటపెట్టుకొని గౌతముని ఆశ్రమానికి వస్తాడు.

🌿 అక్కడున్న జయని పిలిచి ఆవురూపం ధరించి గౌతముని చేలలో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తాడు. జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో పడి మేస్తుండుగా, గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే, గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణిస్తుంది. గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోడానికి గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేస్తాడు. అదే గోదావరి నది.
 
🌸 శివుడ్ని కూడా తనతోపాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా, ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిసాడు. 
ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంతో ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకించాడు. అదే గౌతమేశ్వరుడు ఆలయం.

🌿తూర్పు దిశగా ప్రవహించే గోదావరి
ఈ దేవాలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని ఉత్తర ముఖంగా ప్రవహిస్తోంది...స్వస్తి.

కార్తీకపురాణం - 10

 _*🚩కార్తీకపురాణం - 10 వ అధ్యాయము🚩*_


🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము*


☘☘☘☘☘☘☘☘☘


జనకుడు వశిష్టుల వారిని గాంచి *" ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు ? వాడి పూర్వ జన్మ మెటువంటిది ? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను ? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను ? వివరించ వలసినది "* గా ప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా ! అజా మీళుని విష్ణు దూతలు వైకంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మరాజు కడ కేగి , *" ప్రభూ ! తమ అజ్ఞ ప్రకారము అజా మీళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము'* అని భయ కంపితులై విన్నవించు కొనిరి.

*"ఔరా!  !ఎంత పని జరిగెను ? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే ? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును"* అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొని *" ఓహొ ! అది యా సంగతి ! తన అవ సాన కాలమున " నారాయణ" అని వైకంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసి గాని , తెలియక గాని మృత్యువు సమయమున హరి నామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక , అజా మీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా !"* అని అనుకొనెను.

అజా మీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను , సిరి సంపదల చేతను , బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక , శివాలయము యొక్క ధనము నపహరించుచు , శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక , దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి *" నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము",* అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకోనుచు , నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక , అతని 

వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కఱ్ఱతో బాదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొని భర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి , ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి *" ఓయీ ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కొరెను. అంత నా చాకలి *" తల్లి ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నిచాకులస్తుడును , చాకలి వాడిని మిరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పని చేయజాలను"* అని బుద్ది చెప్పి వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివర్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి *" అయ్యో ! నే నెంతటి పాపమునకు ఒడి గట్టితిని ? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిననకామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని"* అని పాశ్చాత్తాపమొంది , ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకు రావలసినదిగ పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి నానా బాధలు పొంది మరల నానా జన్మ మెత్తి సత్య వ్రాతుడను బ్రాహ్మణో త్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజా మీళుడై పుట్టెను. ఎప్పటికి తన అవసాన కాలమున *'నారాయణా'* అని శ్రీ హరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలన నుభవించి ఒక మల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడు శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను.


అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట , దాన ధర్మములు , శ్రీ హరి కథలను ఆలకించుట , కార్తిక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్ష మొందగలరు. గాన కార్తిక మాసము నందు వ్రతములు , పురాణ శ్రవణములు చేసిన వారలిహపర సుఖములు పొంద గలరు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*దశమా ధ్యాయము- పదవ రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

వేద ఆశీర్వcqచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - దశమి - శతభిషం -‌‌ ఇందు వాసరే* (11.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వcqచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

దేవుడిని చూసి

 పెద్ద పెద్ద దేవాలయాలకు చాలా చాలా ఖర్చులు పెట్టివెళ్లి కొద్ది సెకన్ల పాటు దేవుడిని చూసి వస్తుంటాం....


అదే నివసించే ఊరి చివర్లో ఒక బూజు పట్టిన, పల్లంగా నో ఎవరూ అంతగా ఆదరణ లేని గుడి లో

ఎవరు వస్తారాని ఎదురు చూపులతో బక్క చిక్కిన అర్చకుడు ఉంటాడు.


ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి అక్కడ మనసారా పూజచేసి దేవుడిని తదేకంగా చూడండి..నోరారా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఒక చిప్ప ప్రసాదం అనందంగా చేతిలో పెడతాడా అర్చకుడు.

100 రూపాయల కానుక పళ్ళెం లో వేసి ఇంటికి వెళ్ళండి.


ఆరెండో చిప్ప,మీరిచ్చిన 100 తో ఆ అర్చకుడు కొబ్బరి పచ్చడి చేసుకుని అనందంగా తిని మిమ్మల్ని ఆరోజుకి మీరే దేవుడని భావిస్తాడు.


ఆరోజుకి నువ్వే దేవుడివి.


మరుసటి రోజు మరింత ఉత్సాహంగా దేవుడు మరొకరిని పంపుతాడు ..ఆదేవుడే నా కుటుంబాన్ని పోషిస్తాడు అని పూజలు నిర్వర్తిస్తారు.


దేవుడువు అవ్వటం చాలా చాలా తేలిక.


దేవుడిని తెలుసుకోవడం ,చూడటం మాత్రమే కష్టం.

ఉసిరికాయ

 ఉసిరికాయ గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


  ఉసిరికాయను సంస్కృతంలో ఆమలకి , శ్రీఫలా , ధాత్రికా , అమృతా అని అంటారు. 


       ఉసిరిచెట్టు పెద్ద వృక్షం , ఆకులు సన్నగా చింతాకు వలే ఉండును. పువ్వులు సన్నగా కాడల వెంట పచ్చగా పూయును. కాయలు గుండ్రముగా సన్నని ఆరురేఖలు కలిగి ఉండును. ఈ కాయలు ఫాల్గుణ మాసాంతం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో పండి పరిపూర్ణంగా ఉండును. అప్పుడు తెచ్చి ఎండించి దాచి సంవత్సరం వాడవచ్చు . కాయపైన బెరడు ఔషధాల్లో ఉపయోగిస్తారు . ఇవి సర్వత్రా తోటల్లో అరణ్యాలలో ఉండును.


  ఉసిరికాయ ఉపయోగాలు  -


* ఉసిరికాయ వగరుగా, పులుపుగా , మధురంగా ఉండును. శీతలతత్వం కలిగి ఉండును.


* ఉసిరికాయ ఆయువు మరియు ఆరోగ్యాలను ఇచ్చును.


* శరీరంలోని వేడిని , వాంతిని , ప్రమేహాన్ని , నంజును హరించును .


* కఫాన్ని హరించును . రుచికరంగా ఉండును.


* రక్తములో దోషాన్ని హరించును . శరీర శ్రమని పోగొట్టును .


* మలబద్ధకాన్ని పోగొట్టును .  కడుపుబ్బరాన్ని తగ్గించును . అమృతంతో సమానం అయినది.


* ఉసిరికాయ కరక్కాయతో సమానమైన గుణం కలిగినది . రక్తపిత్త రోగాన్ని పోగొట్టును .


* ధాతువృద్ధిని కలిగించును. వాతం, పిత్తం, కఫం మూడింటిని హరించును . త్రిదోష హరమైనది.


* వెంట్రుకలకు మేలు చేయును . మంచి విరేచనకారి.


* నోరు అరుచి రోగమును పోగొట్టును . తొందరగా ముసలితనం రానివ్వదు.


* శరీరంలోని విషపదార్ధాలను హరించును . జ్వరాన్ని తగ్గించును .


* ఎండించిన ఉసిరికాయలను తీసుకొవడం వలన విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోనును.


* నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు ఎండించిన ఉసిరికాయలు తీసుకోవడం వలన చాలా మంచి మేలు జరుగును.


* ఎండించిన ఉసిరికాయలను అరగదీసి శరీరముకు గంధం వలే పూయుట వలన శరీరం యొక్క కాంతి పెరుగును .


* శరీరము నందు కొవ్వు ఉన్న సమస్యతో ఇబ్బంది పడువారు ఎండించి ఉసిరికాయలను సేవించుట వలన కొవ్వు కరుగును.


* ఉసిరికాయలు నుంచి తీసిన ద్రవము త్రిదోషములను , రక్తదోషమును , పిత్తమును , మోహమును నాశనం చేయును .


* ఉసిరికాయ పచ్చడి అన్నం మొదటిముద్దలో తినడం వలన జీర్ణరసాలు సరిగ్గా ఊరతాయి.


* ముత్ర విసర్జన సమయంలో మంట , నొప్పి ఉంటే ఉసిరి కషాయం బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశనం ఉంటుంది.


* రాచ (పెద్ద ) ఉసిరి గింజలను బూడిదగా మార్చి కొబ్బరినూనెలో కలిపి చిక్కగా చేసి రాస్తుంటే శరీరం పైన వచ్చు చిడుము నివారణ అగును.


* ఉసిరికాయల కషాయం అరకప్పు తాగుతుంటే జ్వరం తగ్గును.


* ఆవనూనెలో రాచ ఉసిరికాయలు వేసి ఉసిరికాయలు మునిగేంత వరకు నూనె పోసి వారం రోజులు నానబెట్టి పైన తేరుకున్న నూనెని తలకు రాయుచున్న తలతిప్పు రోగం నయం అగును.


* ఉసిరికలో "సి" విటమిన్ పుష్కలంగా ఉంది. కావున "సి" విటమిన్ లోపం వలన వచ్చు వ్యాధులకు అద్భుత ఔషధం .


* "స్కర్వి" అనే ఈ వ్యాధిలో ఉసిరి అత్యద్భుత ఔషధం . ఈ వ్యాధి సముద్రప్రయాణం ఎక్కువుగా చేసే వారికి వచ్చును.


* ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఉసిరికాయలు తినుచున్నచో ఎక్కిళ్లు వెంటనే తగ్గును.


* ఉసిరికాయల రసంలో పసుపుకొమ్ము చూర్ణం కలిపి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి ఉదయం , సాయంత్రం రెండు పూటలా తీసుకుంటూ చప్పిడి పథ్యం పాటిస్తే కామెర్ల వ్యాధిని తగ్గును.


* పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు పెద్ద ఉసిరికాయలు తింటూ ఉంటే కడుపులో పురుగులు నశించును.


* పెద్ద ఉసిరికాయలను ఎండబెట్టి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరచెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.


* కళ్లు ఎరుపెక్కి మంట పుడుతుంటే ఎండిన పెద్ద ఉసిరికాయలను గ్లాసెడు మంచినీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన ఆ నీటితో కంటిని కడుగుచున్న కంటి ఎరుపు తగ్గును.


* ఉసిరికాయల రసం తీసి అందులో కొంచం పంచదార కలిపి చేతి వ్రేలితో యోని రంధ్రంలో ఆ రసం వ్రాస్తే యోనిమంట తగ్గును.


              ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ముక్కలుగా కోసి ఎండించి దాచుకొనవలెను. ఉసిరికాయలు దొరకనప్పుడు వాటిని వాడుకోవచ్చు . అలా ఎండిన వాటిని "ఉసిరిక వొరుగు " అని పిలుస్తారు . 



మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034