4, నవంబర్ 2020, బుధవారం

సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు..!

 🌹🌼సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు..!!🌺💐


🌻🌹💐🌸🌼🌷🌻🌼🌸🌺🥀


1.సర్వ బాధ నివారణ మంత్రం.


"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||

సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"


2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.


"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||

సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||"


3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.


"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||


4.దరిద్ర నివారణ దత్త మంత్రం.


"దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||

దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"


5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.


"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||

యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||"


6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.


"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||

మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"


7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.


"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||"


8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.


అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||


9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.


అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||

దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||


10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.


విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||


11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..


కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||


విధానం


ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి ..


🌹🌻జై గురుదత్త🙏

అద్భుత_శిల్పం

 




నమ్మశక్యం_కాని_అద్భుత_శిల్పం!!

🙏🕉 ఓం నమఃశివాయ హర హర మహదేవ శంభో శంకర 🕉🙏


సహస్రశీర్షా పురుష: సహస్రాక్ష: సహస్రపాత్.

సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ దశాంగులం


సహస్ర పురుష లో వెయ్యి తలలు, 

వెయ్యి కళ్ళు మరియు,

వెయ్యి అడుగులు ఉన్నాయి,

(వెయ్యి అసంఖ్యాకతను సూచిస్తుంది, ఇది యూనివర్సల్ జీవి యొక్క సర్వవ్యాప్తిని సూచిస్తుంది), అతను ప్రపంచాన్ని అన్ని వైపుల నుండి కప్పివేస్తాడు 

(అనగా అతను సృష్టి యొక్క ప్రతి భాగాన్ని విస్తరిస్తాడు), మరియు విస్తరించాడు  

పది దిశలలో దాటి

(పది వేళ్లు ప్రాతినిధ్యం వహిస్తుంది).

🙏🕉🌺🏵💮🌸💐🕉🙏

ప్రధమస్కంధం

 పోతన భాగవతం  ప్రధమస్కంధం


నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి !!
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి,!! దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, !! మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్!!,
మోదకఖాదికిన్,!! సమద మూషక సాదికి, సుప్రసాదికిన్!!.

పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.. 

తెలుసుకోండి

 🅱️➕ 

*నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి* నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి *కూర్చుని త్రాగండి*

🅱️ ➕ 

వేగంగా తిరిగే *ఫ్యాన్ గాలి క్రింద* లేదా *A. C.లో* పడుకుంటే శరీరం పెరిగి *లావై పోతారు.*

🅱️ ➕ 

*70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు ఏ పేన్ కిల్లర్ కూడా అంతగా చేయదు.

🅱️ ➕ 

*కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.

🅱️ ➕ 

*అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలు అనారోగ్యం చేయటానికి చేసేవారు.

🅱️ ➕ 

*షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు అమృతం వలె పనిచేస్తాయి.అ

🅱️ ➕ 

*పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగా అవుతారు*

🅱️➕ 

*దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.

🅱️➕ 

మంచి మాటలు, మంచివారికి, తమ ఇష్ట మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారిమి అవుతాం.

😇 !!!!! ధన్యవాదములు !!!!!

తులసీ ద్వాదశ నామ స్తోత్రం

 శ్రీ తులసీ ద్వాదశ నామ స్తోత్రం 


ప్రథమం తులసీ నామ ద్వితీయం కృష్ణప్రియాం 

తృతీయం బృందా నామ చతుర్ధం జలంధరవల్లభాం 

పంచమం దేవవంద్యా చ షష్ఠం మైథిలిపూజితాం

సప్తమం యశస్వినీ నామ అష్టమం మోక్షదాయినీం 

నవమం కల్యాణీ నామ దశమం పాపమోచనీం  

ఏకాదశం పావనచరితా నామ ద్వాదశం అద్వైతనిలయాం ||


     సర్వం శ్రీతులసీదివ్యచరణారవిందార్పణమస్తు

సిద్ధ యోగం

 శరీరములో ముల్లుగుచ్చుకొని రానప్పుడు ప్రయోగించవలసిన సిద్ధ యోగం - 


     శరీరము నందు యే భాగము నందైనా ముల్లు లోపలిదాకా దిగి బయటకి రాకుండా ఉన్న సమయములో ఆపరేషన్ అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న యోగం పాటించండి. 


         ఉమ్మెత్తాకు తీసుకుని బాగుగా శుభ్రపరచి బెల్లము నందు పెట్టి తినిపించవలెను . ఎంతటి ప్రమాదకరమైన ముల్లు అయినా శరీరము నుంచి బయటకి వచ్చును. అదేవిధముగా ఉమ్మెత్త ఆకును శుభ్రపరచి ఆముదంలో వేయుంచి పసుపు కలిపి నూరి ముద్దలా చేసి కట్టినను శరీరంలోపల విరిగిన ఎముకల ముక్కలు , ముళ్లు బయటకి వచ్చును 

            ఇది నా అనుభవపూర్వకం ........

మొలలనొప్పిని వెంటనే హరించు సిద్దయోగం - 


    మొలలవ్యాధి అనేది శరీరము నందు వేడి విపరీతముగా పెరిగినప్పుడు సంప్రాప్తిస్తుంది. మలద్వారం నందు మొలకలు జనియించి తీవ్రమైన నొప్పి వచ్చును. మలబద్ధక సమస్య కూడా ఉత్పన్నం అగును. బలంగా మలమును బయటకి పంపుటకు ప్రయత్నించినప్పుడు మొలకలు తెగి తీవ్ర రక్తస్రావం జరుగును. ఒక్కోసారి రక్తస్రావం ఆగకపోవడం వలన ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చు. వ్యాధి ముదరక ముందే సరైన చికిత్స తీసుకోవలెను . 


            ఇప్పుడు నేను చెప్పబోయే సిద్దయోగం మొలల నొప్పిని వెంటనే హరించును . 


      ఒక గుప్పెడు మునగ ఆకును తీసుకుని మరుగుతున్న నీటి యందు వేసి వచ్చు ఆవిరిని మొలల స్థానమునకు పట్టించిన వెంటనే నొప్పి తగ్గిపోవును . 


తామర హరించుటకు సులభ యోగం - 


      చింత గింజని సాన మీద 4 చుక్కల నిమ్మరసం వేసి అరగదీసి వచ్చిన గంధమును రెండు పూటలా తామర మచ్చలపైన రాయుచున్న వారం రోజుల లోపు తామర హరించును . 


      చేపలు , మాంసం , మినప పదార్ధాలు , పాతపచ్చళ్లు , వంకాయ, గోంగూర నిషిద్దం. 



 

             .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు


    

ఇప్పటికైనా కళ్ళు తెరవండి

 ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజాలు తెలుసుకోండి!

లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది!


మన దేశంపై కార్గిల్ దాడి చేయించిన ముషారఫ్ దిష్టిబొమ్మను భారత ముస్లింలు కాల్చలేదు!

మన దేశంపై పుల్వామా దాడి చేయించిన ఇమ్రాన్ ఖాన్ బొమ్మమీద భారత ముస్లింలు నడవలేదు!

మన దేశంపై ముంబై టెర్రర్ దాడి జరిగాక నవాజ్ షరీఫ్ దిష్టిబొమ్మను భారత ముస్లింలు చెప్పులతో కొట్టలేదు!


కానీ, 

మన దేశానికి రాఫెల్ జెట్‌లను పంపి,

చైనాపై యుద్ధం చెయ్యడానికి, మన దేశానికి సహాయం చేసిన 

ఫ్రెంచ్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా 

భారతీయ ముస్లింలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు!


మన దేశానికి కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లు ఇచ్చిన 

ఫ్రాన్స్‌పై భారతీయ ముస్లింలు పగ పెంచుకుంటున్నారు!


1998లో మన దేశం పోఖ్రాన్ అణు పరీక్షలను ఖండించని ఫ్రాన్స్‌,  

వస్తువులను బహిష్కరించాలని భారత ముస్లింలు కోరుతున్నారు!


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 

భారత్ కు మద్దతు ఇచ్చిన ఫ్రాన్స్‌ను 

బహిష్కరించాలని భారత ముస్లింలు కోరుతున్నారు!


మన దేశానికి అణు ఇంధనం మరియు 

రియాక్టర్లను సరఫరా చేసిన ఫ్రాన్స్‌కు 

వ్యతిరేకంగా భారత ముస్లింలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు!


2019 సర్జికల్ స్ట్రైక్స్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఉపయోగించిన 

మిరాజ్ 2000 యుద్ధ విమానాలను మన దేశానికి ఇచ్చిన ఫ్రాన్స్ ను 

భారత ముస్లింలు అసహ్యించుకుంటున్నారు!


మీకు అర్ధమవుతుందా???

🤔

ప్రతి తండ్రి అదృష్టంలో

 🎻🌹🙏*ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!* 

*********

దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు.

అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెబుతాడు.

అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.!

అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని.....

రాజా!మీరు పెద్దవారు.

పైగా వరుని పక్శం వారు.!

ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?

గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా!?అని అంటాడు.

అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన.,సుందరమైన జవాబు చెబుతాడు.

*మహారాజా మీరు దాతలు.!* 

*కన్యదానం చేస్తున్నారు.!!* 

*నేనైతే యాచకున్ని.!* 

*మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను.!* 

*ఇప్పుడు చెప్పండి.* 

*దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప?* అని అంటాడు.

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ....ఇలా అంటాడు.

*ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో?!వాళ్ళు భాగ్యవంతులు.!* 

*ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు!* 

*కానీ* 

*ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!!!*  

ఇదీ భారతీయత✊

ఇదీ సంస్కృతి🤝

ఇదీ రామాయణం నీతి👍

🚩జైశ్రీరాం.🚩సేకరణ..💐👌😊🙏🌹🎻

మనమూ మారదాం

 కాసేపు కాలక్షేపం...


మనమూ మారదాం. భక్తి పారవశ్యం లోకి ....

..........................................................

   " ఏంటమ్మా ఇది.. "

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. 

    అమ్మా! అరవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా? అన్నట్టు నీవైపు చూశాడు. 

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. 

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*. 

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

    మీ ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వశిన్యాది దేవతలు. 

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది. 

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

    అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా* 

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! 

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

  *“సాగర మేఖల చుట్టుకొని - సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో, 

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, 

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల. 

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ* *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా! అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే! 

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. 

    ఈరోజు నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను. 

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, 

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, 

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 

    కానీ నీ సంగతి అలా కాదు కదా! 

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.* 

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను. 

    *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

                       *స్వస్తి!*

                     శ్రీ మాత్రేనమః


Source: what's App

ఈ పద్యాన్ని గుర్తించండి

 ఈ పద్యాన్ని గుర్తించండి.


నరసింహ కృష్ణరాయా

దురమున నీ పేరిటేఱు తురకలఁజంపెన్

గరిరాజవరదుఁడంచును

గరిఘట లట మిమ్ముఁజూచి గ్రక్కున వచ్చెన్.


కృష్ణరాయా నీ పేరు గల ఏరు(కృష్ణా నది) వరదలు, తురకలు ను జంపెను.

ఏనుగుల రాజును (గజేంద్రుడిని) రక్షించితివని కాన, వారి(తురకల) ఏనుగులు మిమ్మల్ని జూచి మీకడ జేరినవి.


తురుష్కులు కృష్ణానది వరదలో కొట్టుకుపోగా వారి ఏనుగులు మాత్రం నీటి దాడికి తట్టుకుని కృష్ణదేవరాయల పంచన చేరినట్టు వృత్తాంతము.


అంటే రాయల కాలంలో రాయలు అక్కర్లేదు తన పేరు పెట్టుకున్న ఎవరైనా శత్రువు సైన్య మూకను మట్టి కరిపించగలరు అని.

సందేహం

 సందేహం (?):* 

*భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా!! హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?*


*నివృత్తి (√):*


ముఖం మన దగ్గరే ఉంది. 

కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దంలో చూసుకొంటాము. 


అద్దంలో ప్రాణం లేదు. కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.


అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం. తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండూ కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి. *అదే విగ్రహం ....* 


భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు. అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి. 


మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....

అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....


అందుకే గుడికి వెళ్ళాలి....


🌷🌳🌷🌳🌷🌳

తాపత్రయం

 తాపత్రయం..


"నా కూతురి బిడ్డ..మనుమరాలు.. ఈ పిల్ల, దీని భర్త బెంగుళూరు లో వుంటారు..పెళ్లై ఆరేళ్ళు అయింది..ఇంకా సంతానం కలగలేదు..డాక్టర్లకు చూపించుకుంటున్నారట..మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు నాతో చెప్పింది..స్వామి దగ్గరకు తీసుకొని వచ్చాను..కానీ ఏం లాభమయ్యా..తనకు ఇటువంటి మొక్కుల మీద నమ్మకం లేదట..స్వామి సమాధి వద్దకు రమ్మని చెపుతుంటే వినటం లేదయ్యా..మీ దంపతులు నచ్చచెప్పి..దీనికి స్వామివారి సమాధి వద్దకు పంపించండి.." అని సుబ్బమ్మగారు మాతో చెప్పుకొని బాధపడుతున్నారు..ఆవిడ ప్రక్కనే ఆమె మనుమరాలు నిలబడి ఉన్నది..


"ఏమ్మా.. నీ పేరేంది?" అని మా ఆవిడ అడిగింది.."లావణ్య.." అని చెప్పింది.."మీ అమ్మమ్మ అంతగా బ్రతిమలాడుతోంది కదా..ఒకసారి స్వామివారి సమాధి ని దర్శించుకొని రాకూడదా?..నీ గురించే కదా ఆవిడ తాపత్రయం.." అని అడిగింది.." పిల్లలు పుట్టలేదని  నేనూ మావారు బాధపడుతున్నాము ఆంటీ..డాక్టర్లకూ చూపించుకుంటున్నాము..నాకెందుకో ఇటువంటి విషయాల మీద పెద్దగా నమ్మకం లేదు..ఏమీ అనుకోకండి.." అన్నది.."సరేనమ్మా నే ఇష్టం.." అని చెప్పేసాము..సుబ్బమ్మగారు నిట్టూర్చారు..మేమూ చేసేదేమీ లేక ఊరుకున్నాము..అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది.."సరేనయ్యా..దేనికైనా ప్రాప్తం ఉండాలి..ఎంతమందికో స్వామివారి దయవల్ల సంతానం కలిగారు..మీరూ చూస్తున్నారు..నేనూ చూసాను..నేనే మొక్కుకుంటాను..సత్రం దగ్గరకు వెళ్లి..భోజనం చేసి..నాలుగు గంటల బస్సుకు తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు సుబ్బమ్మగారు.."అలాగేనమ్మా.." అని చెప్పాము..


సుబ్బమ్మగారు, ఆమె మనుమరాలు ఇద్దరూ భోజనం చేసి..మళ్లీ మంటపం లోకి వచ్చారు..వాళ్ళు కందుకూరు వెళ్ళాలి..మరలా నాలుగు గంటలకే బస్సు ఉంది..అందుకని సుబ్బమ్మగారు మంటపం లో ఒక ప్రక్కగా పడుకున్నారు..ఆవిడ ప్రక్కనే లావణ్య కూర్చుంది..పదిహేను నిమిషాల తరువాత లావణ్య కూడా తన అమ్మమ్మ ప్రక్కనే పడుకొని నిద్రపోయింది..వాళ్ళిద్దరికీ మెలుకువ వచ్చేసరికి..నాలుగు గంటల బస్సు వచ్చి, వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది..మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు బస్సు ఉంది..లావణ్య ముభావంగా ఉంది..బస్సు తప్పిపోయినందుకు కోపంగా ఉందేమో అనుకున్నాము..ఐదు నిమిషాల తరువాత..సుబ్బమ్మగారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది.."ఏమైందమ్మా..అలా ఉన్నావు?" అని సుబ్బమ్మగారు అడిగారు.."అమ్మామ్మా..నాకు బాగా నిద్ర పట్టింది..నిద్రలో ఎవరో బాగా పొడుగ్గా ఉన్న సన్యాసి కనబడ్డాడు..ఒడి పట్టమన్నాడు..చీరచెంగు పట్టుకున్నాను..అందులో ఒక అరటిపండు వేసాడు..పో..పోయి..స్వామిని వేడుకో.. నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు..అంతా నిజం లాగే ఉంది..నాకు అయోమయంగా ఉంది..ఒక్కసారి స్వామివారి సమాధి దగ్గరకు వెళదాము.." అన్నది..


సుబ్బమ్మగారు పట్టరాని సంతోషంతో.."పద తల్లీ ..ఇప్పుడే దర్శించుకుందాము.." అని చెప్పి..మనుమరాలిని వెంటబెట్టుకొని మా దగ్గరకు వచ్చి..విషయం అంతా చెప్పి.."అయ్యా..నువ్వు ఒప్పుకుంటే..దీనిని ఒక్కసారి స్వామివారి సమాధి వద్దకు తీసుకెళ్తాను.." అని ప్రాధేయపూర్వకంగా అడిగారు.."లక్షణంగా తీసుకెళ్లు.." అని చెప్పాను..ఇద్దరూ లోపలికి వెళ్ళి వచ్చారు..లావణ్య లో ఇంటకుమునుపు ఉన్న నిర్లక్ష్యం లేదు..ఆ సాయంత్రం కందుకూరు వెళ్లాల్సిన ఆ ఇద్దరూ..ఏమి ఆలోచించుకున్నారో.. ఆరాత్రికి  స్వామివారి మందిరం లోనే వున్నారు..అక్కడే నిద్ర చేశారు..తెల్లవారి మొదటి బస్సులో కందుకూరు వెళ్లిపోయారు..


మరో నెల తరువాత..లావణ్య తన భర్తతో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది.."ఆరోజు అమ్మమ్మ తో వచ్చి వెళ్లిన తరువాత..స్వామివారి పై నమ్మకం ఏర్పడింది ఆంటీ..అందుకే ఈరోజు మావారిని తీసుకొచ్చాను..ఇక్కడ ఇద్దరమూ మూడు రోజులు ఉంటాము.." అన్నది.."సరేనమ్మా.." అని చెప్పాము..స్వామివారి సమాధి వద్దకే పోను అని మొండి కేసిన ఆ అమ్మాయి తన భర్తతో కలిసి మూడు రోజులు స్వామివారి మందిరం లో ప్రతిరోజూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొన్నది..అలా వరుసగా మూడు నెలల పాటు..ప్రతినెలా మూడురోజులు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చి నిష్ఠతో ప్రదక్షిణాలు చేసి వెళ్లారు..ఆ తరువాత ఆ దంపతులు రావడం ఆగిపోయింది..ఈలోపల సుబ్బమ్మగారు కాలం చేశారు..


మరో పదిహేను నెలల తరువాత..లావణ్య తనభర్తతో కలిసి బిడ్డను ఎత్తుకొని స్వామివారి మందిరానికి వచ్చింది.. "స్వామివారి ప్రసాదం అంకుల్.." అని బిడ్డను చూపిస్తూ లావణ్య భర్త చెప్పాడు..దంపతులిద్దరూ తమ బిడ్డతో సహా స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు.."అమ్మమ్మ మా గురించి చాలా తాపత్రయపడ్డారు..తీరా మాకు సంతానం కలిగాక..చూడటానికి ఆవిడ లేరు.. ఎవరికి ఏది ఎలా నిర్ణయించాలో స్వామివారికే తెలుసు.." అని కన్నీళ్ళతో లావణ్య చెప్పింది..


లావణ్య మనసులో ముందుగా తన మీద భక్తిని స్థిరపరచి..ఆపై సంతానయోగం కలుగచేశారు స్వామివారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

పద్య పోరు:

పద్య పోరు:

భువన విజయం ఒక విశేష కవి పండిత సభ రోజు ఎన్నో కొత్తకొత్త సాహిత్య విసేసేశాలు, విశ్లేషణలు. చేతురోక్తులు, చేలోక్తులు, యుక్తులు, కుయుక్తులు. ఇలా నిత్యం సాగే ఆ సాహితి సభను రాయల వారు ఆస్వాదించకుండా ఎలా వుంటారు చెప్పండి. 

ఒక రోజు రాయల వారు సభలో క్రింది సమస్యను ఇచ్చి దానిని పూరించామని కవులను కోరారు. 

కలనాటి ధనములక్కర

గల నాటికి దాచ కమలగర్భుని వశమా

అదృష్టం కలిసి వచ్చినప్పటి సంపదలు అక్కరకు వచ్చు వరకు దాచటం కమల గర్భడు అంటే బ్రహ్మ దేముడికైనా సాధ్యమా అని దీని అర్ధం. 

దానికి వెనువెంటనే అల్లసాని పెద్దన గారు క్రింది విధంగా పూరించారు పరికించండి 

“కలనాటి ధనములక్కర

గల నాటికి దాచ కమలగర్భుని వశమా

నెలనడిమి నాటి వెన్నెల

అలవడునే గాడె బోయ అమవస నిసికిన్.”

అంటే నెల మధ్యలో వున్నా వెన్నెలను అమావాస్య నాటికి ఉంచుకొనగా గాదె ( ధాన్యం దాచుకొను నిర్మాణం) కలదే అంటే లేదు అని అర్ధం. ఇక్కడ గణములు సరిగా వుండాలని అమావాస్య అనే పదాన్ని అమవాస అని వ్రాసారు పెద్దన గారు 

వెంటనే మన తెనాలి రామకృష్ణ గారు ఊరుకోకుండా క్రింది వ్యాఖ్యాన పద్యాన్ని ఆశువుగా చెప్పారు 

 

“ఎమి తిని సెపితివి కపితము

బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో

యుమెతకయ తిని సెపితివో

యమవసనిసి యనెడిమాట యలసని పెదనా”

దీని భావము ఏమి తిని కవిత్వము చెప్పవయ్యా బ్రహ్మపడి వెర్రి పుచ్చకాయ తిన్నావా లేక ఉమ్మెత్త కాయ తిన్నావా అంటే అవి తింటే పిచ్చి ఎక్కుతుందని అర్ధం నీవు ఆమవాసునిసి అనెడి మాట చెప్పావు అని ఎద్దేవా చేసారు. ప్రతి పదాన్ని నిశితంగా పరికించి వంకలు పెట్టటానికి సిద్ధంగా కవులు వుంటారనటానికి ఇది ఒక తార్కాణం. 

అది కేవలం రామ కృష్ణునికే చెల్లింది. 

*హిందూ ధర్మం - 36*

 *హిందూ ధర్మం - 36*


ప్రకృతి వనరులు అంటే గనులు, బొగ్గు, వజ్రాలు లాంటివే అనుకోకండి. నీరు, గాలి కూడా ప్రకృతి వనరులే. నీటి నుంచి, బొగ్గు నుంచి ఉత్పతి చేస్తున్న విద్యుత్తు కూడా ప్రకృతి వనరే. మరి మనం నీటిని పొదుపుగా వాడుతున్నామా? ఆ నీటి నుంచి ఉత్పతి అయిన విద్యుత్తును పొదుపుగా ఉపయోగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మాకు బిల్లు కట్టే స్థోమత ఉందండి, అందుకే మాకు విద్యుత్ పొదుపు చేయవలసిన అవసరం లేదనంటారు ఒకాయన. దానికి మన సంస్కృతి ఒక్కటే జవాబు చెప్తుంది.


మీరు ఈ ప్రకృతి వనరులకు డబ్బు చెల్లించలేరు. అవి అమూల్యమైనవి. మీరు డబ్బు చెల్లిస్తున్నది దాని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకే. అది ఉత్పత్తి, సర్ఫరా చేయడానికి అవుతున్న ఖర్చుకు మాత్రమే మీరు మూల్యం చెల్లిస్తున్నారు, అంతే. కానీ నిజానికి మీరు కానీ, ఆ కంపేనీలు కానీ ప్రకృతి వనరులకు యజమానులు కారు, అవి ఎప్పటికి మీవి కావు. మీకు వాటిని మీ అవసరానికి మాత్రమే వాడుకునే అవకాశం మాత్రమే ఉన్నది. ఆహారం విషయంలో కూడా అంతే. మీకు అవసరమంతమేరకు తినే అవకాశమే ఇచ్చాడు కానీ ఆహారాన్ని వృధా చేసే అధికారం భగవంతుడు ఇవ్వలేదు. 


మనం దేవుడి పేరును అడ్డం పెట్టుకుని ప్రకృతిని కలుషితం చేసినా దాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా కాదు, ఇలా కాదు అంటూ మనలని మనం సమర్ధిచుకునే ప్రయత్నం చేస్తున్నామే తప్ప, పైవాడిని మాత్రం ఒప్పించలేం. ఈ సృష్టిలో మానవులకు జీవించే అధికారం ఎంత ఉందో, ఇతర జీవాలకు అంతే అధికారం ఉంది. మనం వాటి ఆవాసాలను, ఉనికిని నాశనం చేయడమంటే వాటి అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవడమే. ఈ సృష్టికి అధికారి అయిన ఈశ్వరుడి నుండి మీరు బలవంతంగా అధికారం లాక్కుంటున్నారు, ఆయన సర్వాధికారాన్ని వెక్కిరిస్తున్నారు, ఆయన ఇచ్చిన స్వేచ్చను దాటిపోతున్నారు, ఆయన చెప్పిన పరిమితులను ఉల్లంఘిస్తున్నారు. అది స్తేయం. అంటే అధర్మం. అలా కాకుండా ఆయన చెప్పినట్టుగా జీవించడం, మీకు ఏ వస్తువు అంతవరకు అవసరమో, అంత వరకే వాడుకోవడం, దేన్నీ కలుషితం చేయకపోవడం, మీ పరి ధిని గుర్తించి అంతవరకే పరిమితం కావడం అస్తేయం. అదే ధర్మం.

*సౌందర్య లహరి*

 *సౌందర్య లహరి* 


*శ్రీ శంకర భగవత్పాద విరచితము*


శ్లోకము - 35


*మనస్త్వం వ్యోమ త్వం* 


*మరుదసి మరుత్సారథి రసి*


*త్వమాపస్త్వంభూమి*


*స్త్వయిపరిణతాయాంనహిపరం*


*త్వమేవ స్వాత్మానం*


*పరిణమయితుం విశ్వ వపుషా*


*చిదానన్దాకారం*


*శివ యువతి భావేన బిభృ షే !!*


*భావము:-*


ఓ భగవతీ ! మనస్సు నువ్వు , ఆకాశం నువ్వు , మరుత్తు నువ్వు , అగ్ని నువ్వు , జలం నువ్వు , భూమి నువ్వు . నువ్వు పరిణమించిన దానవవుతూంటే నీకంటే యితరం ఏదీ లేదు. . నువ్వే నీ స్వరూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమింప చేయ

టానికి చిదానందాకారాన్ని ( చిచ్ఛక్తి ఆనందభైరవుల

ఆకారం) ధరిస్తున్నావు.


*ఓం హిమగిరితనయాయైనమః*


*ఓం అన్నపూర్ణాయైనమః*


*ఓం గణేశజనన్యైనమః*


🙏🙏🙏


*హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం*

భజగోవిందం

 


*మోహముద్గరః(భజగోవిందం)*


12) 


*దినయామిన్యౌ సాయం ప్రాతః*


*శిశిరవసంతౌ పునరాయాతః |*


*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః*


*తదపి న ముంచత్యాశావాయుః ||*


*భావము*


కష్టపడి సంపాదించిన అన్నింటిని ఏం చేసి జీవుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు ?

పగలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది. పోనీ ఆ చీకటి అలాగే ఉంటుందా? ఉండదు. ఉదయం అనేది వస్తుంది. వెలుగు రేకలు తెస్తుంది. మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగుతుంది. చివరకు సాయంకాలమనే సంధ్యారాగంలో కలిసిపోతుంది. ప్రతిరోజూ ఇంతే. కాలచక్రంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక్క క్షణమైనా ఆగదు కాలం. శిశిరం, వసంతం గ్రీష్మం అంటూ ఆరు ఋతువులున్నాయి. అవీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కాలచక్రం అలా అలా దొర్లుతుంటూ వెళ్ళిపోతుంది. ఇలా కాలచక్రం దొర్లిపోతూ ఉంటే - అలా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాణుల యొక్క ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది. సంవత్సరాని కొకసారి బర్త్ డే చేసుకుంటాం. అంటే ఆయుష్కాలంలో మరొక సంవత్సరం తగ్గిపోయిందీ అని గుర్తు. కాలం ముందుకు వెళ్తుంటే మృత్యువు దగ్గరకొస్తున్నదని గుర్తు. కాలం కదిలిపోతుంటే భవిష్యత్తు వర్తమానంగాను, వర్తమానం భూతకాలంగాను మారిపోతుంటుంది. కనుక ఏదీ నిత్యం కాదు, శాశ్వతం కాదు.

  “కఠోపనిషత్తు”లో నచికేతుడు చెప్పినట్లు ఈ జీవితం అనిత్యమైనది. ఎంత శ్రమపడ్డా, ఎన్ని అనుభవించినా, ఎంత ప్రోగుచేసినా ఒక నాటికి మృత్యువు అనేది అతడి నుంచి అన్నింటిని బలవంతంగా లాక్కుంటుంది. కష్టపడి సంపాదించిన అన్నింటిని విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే అతడు తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి సంపాదించుకొన్న సంచిత కర్మల, వాసనల మూటను మాత్రమే. ఎంత శోచనీయం! ఎంత హృదయ విదారకం!

🙏🙏🙏


#శ్రీమహావిష్ణుసహస్రనామవైభవము-41🌺🕉️

 🕉️🌺  #శ్రీమహావిష్ణుసహస్రనామవైభవము-41🌺🕉️


           🍂 శ్లోకం 35 🍂


*అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః|*


*అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః*


318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)

319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.

320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.

321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.

322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.

323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.

324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.

325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.

326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు

శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః


అపాం నిధి రధిష్ఠాన మప్రమత్త ప్రతిష్ఠితః !!35!!


-------------------------- (నామాలు 318 – 326)


73. నిత్యమైన వాడు, సత్య ప్రసిద్ధుడు


ప్రాణమిచ్చు చుండు, ప్రాణమతడె


అరయ వాసవునికి యాతడు తమ్ముడే


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : అచ్యుత ... నాశనము లేనివాడు, ప్రథిత ... ప్రసిద్ధుడు, ప్రాణ..ప్రాణము, ప్రాణద ... ప్రాణము ఇచ్చువాడు, వాసవానుజ ... వాసవుని తమ్ముడు.


భావము : నిత్యము, సత్యము అయినవాడు అనగా శాశ్వతమైనవాడు(చ్యుతము అంటే నాశనము అది లేనివాడు అంటే శాశ్వతుడే కదా), ఎప్పటికీ ప్రసిద్ధుడైనవాడు, ప్రాణము తానే, అదిచ్చేదీ (ప్రాణ దా ...ప్రాణము ఇచ్చు అనే కదా) తానే అయిన వాడు, ఇంద్రుని సోదరుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


( వివరణ : అదితి, కశ్యపులకు ఇంద్రుని (వాసవుని) తర్వాత వామనుని రూపంలో అవతరించిన వాడే శ్రీ మహా విష్ణువు కదా కనుకనే ఆయనను వాసవానుజుడు అంటున్నారు.)


74. జలధి యనగ నతడె, జగతి కాధారమూ


జగతి రక్షణందు జతన మెండు


తవిషి రక్షణకును తానె ప్రతిష్ఠితః


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : అపాం నిథి ... సాగరుడు, అధిష్ఠానం ... ఆధార కేంద్రం, అప్రమత్తత ... అతి జాగ్రత్త, ప్రతిష్ఠిత ... స్వయంగా ప్రతిష్ఠితుడైనవాడు.


భావము : సర్వమూ తానైనవాడే గనుక సాగరుడే అనుకోవచ్చు లేదా దయా సముద్రుడూ అనుకోవచ్చ( అపాం అంటేనే నీరు కదా), సమస్త విశ్వానికి ఆధార కేంద్రమైన వాడు( అధిష్ఠానం అంటే ఆధారపడదగిన అనే కదా..), విశ్వాన్ని రక్షించేందుకు సదా అప్రమత్తుడై యుండువాడు( జతనము అంటే అప్రమత్తత అని కదా), తవిషి అంటే భూమి (అదే ప్రపంచం కూడా ) రక్షణకు తనకు తానుగా ప్రతిష్ఠితుడైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


-ఓం నమో నారాయణాయ


*హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం*

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత  మూక పంచశతి


 శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన


 ఆర్యా శతకం*


🌹35

శ్లోకము:-


*ఉరీకరోమి సంతతమ్ ఊష్మలఫాలేన


 లాలితం పుంసా*


*ఉపకంప ముచితఖేలనమ్


 ఉర్వీధరవంశ సంపదున్మేషమ్ II  


‌భావము:


ఆవిరులు చిమ్ముతున్న ఫాలనేత్రముగల పురుషునిచే నిరంతరము లాలింపబడిన కంపానదీతీరమున తగిన ఆటలాడుకొను పర్వత వంశసంపదకు వికాశము కలిగించిన అమ్మవారిని అంగీకరించెదను.


వివరణ:


ఫాలమావిరులు కలది ఆనగా ఫాలమునందు అగ్ని ఉన్నదని అర్ధం. ఫాలమందు అగ్ని ఉన్నదనగా ముఖమునందు అగ్ని ఉన్నట్లే. కాని అగ్నిర్ముఖమ్ , అగ్నియే పరమేశ్వరుని ముఖమను విషయమూ ఉన్నది.మరియూ ముఖాదింద్రశ్చాగ్నిశ్చ అని పరమేశ్వరుని ముఖము నుండి అగ్ని పుట్టినదని పురుషసూక్తమునందు ఉన్నది.అట్లే పరమేశ్వరుని కన్నునుండి సూర్యుడు పుట్టినాడనియు పురుషసూక్తము చెప్పును.ముఖమంతయూ అగ్నియే కావున కన్నునుండి అగ్నిభేదమైన సూర్యుడు పుట్టుట ఉపపన్నమగుచున్నది. ఆ సూర్యుడు పుట్టుట కుడికన్నునుండి.అందువలన దక్షణాక్షి పురుషోపాసనము, సూర్యోపాసనము సాన్నిహిత్యము కలిగి ఉన్నవి.చక్షురింద్రియము ఒక్కటే రెండు కన్నుల నుండి పనిచేయునట్లు సూర్యుడే సూర్యచంద్రాగ్ని రూపమున శివుని ముఖమునందలి మూడు కన్నులలో పనిచేయుచున్నాడనియూ లేక ఒకే అగ్ని త్రినేత్రములలో సూర్యచంద్రాగ్ని రూపమున పనిచేయుచున్నదనియూ చెప్పవచ్చును.

అందరికీ కన్నులు రెండే ఉండగా శివునకు మూడు కన్నులు ఉన్నవి. మూడవది ఫాలమునందు ఉన్నది.అందరూ అజ్ఞానులు.శివుడు జ్ఞాని. ఫాలనేత్రము అందలి అగ్ని జ్ఞానమునకు ప్రతీకము.యోగ దృష్టిలో జ్ఞానాగ్ని ప్రపంచ ప్రవిలాపమును ఒనరించును.బూడిదచేసినట్లు చెప్పును. ఊష్మమును చిమ్నఫాలము గల పురుషునిచే లాలింపబడుట అమ్మవారి సౌభాగ్యము.మరే పడతికి ఆ భాగ్యము కలుగలేదు.అమ్మవారు పుట్టుటచే పర్వత వంశమునందు ఉపదున్మేషము జరిగినది కావున ఆమెయే ఆ ఉన్మేషముగా చెప్పబడినది.ఒక్కొక్క బాలిక జన్మించిన పిదప ఆ వంశమున ఆ ఇంట సంపద పెంపొందుట జరుగును. హిమవంతుని ఇంట త్రైలోక్య సంపదయే ఉన్మేషమునందినది.

తదుపాసనముచే యోగిలోకము ధన్యమైనది. భ్రూమధ్యమున జ్యోతి దర్శనము యోగులు చేయగలుగుదురు.శివుడు మహాయోగి.అతని ఫాలమున జ్యోతి ఎప్పుడూ దర్శనమిచ్చును.ఆ జ్యోతి దర్శనముచే త్రిపురములైన కారణ,సూక్ష్మ, స్థూలదేహములయందు అభిమానము నశించును.ఆ జ్యోతీరూప కుండలి‌ని శివుడు లాలించినాడు. ఆమే కుండలినీ రూప కామాక్షి.కాంచి దగ్గర కంపాతీరమున విహరించుచున్నది. తొలుత మూలాధారమున కుమారిగా కుండలిని విహరించునని తరువాత పతిప్రియమై సహస్రార చంద్రమండలి శివుని చేరుకొనుననియూ తంత్రములు పేర్కొనును.ఆ కంపాతీర కాంచీఖేలనము మూలాధార తొలితటి విహారములు!. శివుని ఆ లాలనము సంతతము అనగా నిరంతరము!.

{ ఈ శ్లోకమున అమ్మ శివునిచే లాలింపబడినది అని చెప్పబడినది.}


🔱 ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ..


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవస్తు🌹


సశేషం....


🙏🙏🙏

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం*


ధర్మో రక్షతి రక్షితః

*మహాభారతము*

 *దశిక రాము*


*మహాభారతము* 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


121 - విరాటపర్వం.


కౌరవవీరులంతా అర్జునుని చేతిలో పరాజితులై పారిపోతుంటే, భీష్ముడు గమనించి, సింహనాదం చేస్తూ తన శంఖాన్ని పూరించాడు.  అర్జునుని ముందు నిలబడ్డాడు. 


భీష్ముడు అర్జునినిపై మొదటగా 8 బాణాలువేసి పోరు ప్రారంభించాడు. అర్జునుడు   వాటిని యెదుర్కొని, తాతగారిని యెక్కువసేపు శ్రమపెట్టడం యిష్టంలేక, రెండు చేతులతో బాణాలు ప్రయోగిస్తూ, గాండీవాన్ని మండుతున్న కొలిమిలా ప్రకాశింపజేశాడు.  భీష్ముని గొడుగును చ్ఛిద్రం చేసాడు.  సారధిని, అశ్వాలను గురిచూసికొట్టి గాయ పరిచాడు.  ఇంకొకబాణంతో భీష్ముని సువర్ణభరితమైన,  తేజోవంతమైన ధనుస్సును ఖండించాడు.   వేరొక ధనుస్సు తీసుకుని అర్జునునికి యేమాత్రం తీసిపోకుండా పోరు సలుపసాగాడు కురువృద్ధుడు.  


ఒక అద్భుత సంగ్రామంగా యిరువురిపోరు సాగింది.  ఒకదశలో అర్జునుడు పై చేయికాగా, పదిబాణాలతో, అర్జునుడు భీష్ముని వక్షస్థలం పై కొట్టాడు.  ఆదెబ్బకు భీష్ముడు చలించి  రధం పట్టుకుని నిశ్చలంగా నిలబడిపోయాడు.  అది గమనించి, అప్పటికే గాయపడిన అతని సారధి, రధాన్ని దూరంగా తీసుకునిపోయాడు.  


ఆ పరిస్థితిలో, దుర్యోధనుడు పెద్ద శంఖనాదంతో అర్జునుని పైకి రధం పోనిచ్చాడు.  వస్తూనే, బాణంతో అర్జునుని నుదిటిపై కొట్టి,అర్జునుని గాయపరిచాడు.  దుర్యోధన, ధనంజయుల యుద్ధం భీకరంగా సాగుతున్నది.  దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు, అన్నకు సాయంగా ఒక మదపుటేనుగుపై వచ్చాడు.   ఒకే ఒక దెబ్బతో, వికర్ణుని యేమీ చెయ్యకుండా, అతని మదపుటేనుగు కుంభస్థలం పగిలేటట్లుఒక బాణం వేసి, దానిని కుప్పకూల్చాడు.  వికర్ణుడు భీతావహుడై, దూరంగా పారిపోయి, వివింశతి అనే వాడి రథమెక్కి తలదాచుకున్నాడు.  


అర్జునుడు నిరంతరంగా సాగుతున్న పోరుకు యిక అడ్డుకట్ట వెయ్యాలని, మిక్కిలి కోపంతో, దుర్యోధనుని రొమ్మును గురిచూసి, ఒకేఒక్క బాణం వేసాడు.   ఆ చుట్టుప్రక్కల గుమిగూడిన దుర్యోధనుని సైన్యాన్ని కూడా, ఒక్కరినీ వదలకుండా, బాణాలతో బాధించి, వారిని పరుగులు పెట్టించాడు.   


అర్జునుని ఉగ్రరూపం చూసి, భయపడి పారిపోతున్న దుర్యోధనుని సమీపించి,  సింహనాదం చేస్తూ అర్జునుడు, 'ఓరీ కపట రాజనీతివిశారదా ! దుర్యోధనా !  పిరికిపందలాగా యుద్ధం  నుండి పారిపోతున్నావా ?  దమ్ముంటే నిలిచి పోరాడు.  నీకు దుర్యోధనుడు అని నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు సార్ధకమవ్వాలంటే, నాతో పోరాడు.  యద్ధంనుండి పారిపోయేవాడికి దుర్యోధన నామమెందుకు?  ఇప్పుడు నిన్ను రక్షించేవారు యెవరూ యిక్కడలేరు.  నీప్రాణాలు నాగుప్పిటిలో వున్నాయి.  శకునిమామను సహాయం తెచ్చుకుని మాయాద్యూతం ఆడి నీప్రాణాలు దక్కించుకుందామనుకుంటున్నావేమో !  ఇక్కడ పరాక్రమం ప్రధానం.  జూదమిక్కడ ఆడలేవు.  కాచుకో ! '  అని అస్త్రసంధానం చెయ్యగానే, పారిపోతున్న దుర్యోధనుడు బిక్కచచ్చి మళ్ళి వచ్చి యుద్దానికి నిలబడ్డాడు.  ఈలోగా మిగిలిన వారు  గాయపడిన దేహాలతోనే  వచ్చి దుర్యోధనుని ప్రక్కన నిలువగా,  యుద్ధం ముగించే క్రమంలో వారి బాణాలు ఎదుర్కుంటూ, అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు, అక్కడ వున్న వారందరు   సమ్మోహనాస్త్రం ప్రభావం వలన  విచలిత మనస్కులై, స్పృహతప్పి పడిపోయారు.      


రాకుమారి ఉత్తర,  కౌరవవీరుల రంగు రంగుల తలపాగా కుచ్చులు అడిగిన విషయం మదిలో కదలగా,  అర్జునుడు ఉత్తరకుమారునితో,  ' ఉత్తరా ! అదుగో అటుచూడు, ఆ తెల్లని తలపాగాతో వున్నవారు ద్రోణాచార్యులు.  పసుపుపచ్చని వస్త్రమువాడు కర్ణుడు, నీలివస్త్రాలతో వున్నవారు అశ్వద్దామా, దుర్యోధనుడు.  వారు స్పృహ నుండి లేవకుండా, త్వరగా వెళ్లి, వారి తలపాగా కుచ్చులను ఖండించుకురా !  నీచెల్లెలి కోరిక మేరకు.  పొరబాటున కూడా భీష్మాచార్యుని వద్దకు వెళ్ళకు.  ఆయనపై, నా సమ్మోహనాస్త్రం పని చెయ్యదు. ఆయన  కేవలం నిద్ర నటిస్తున్నాడు, ఆ అస్త్రంపై గౌరవంతో. '  అని విశదంగా జాగ్రత్తలు చెప్పి పంపించాడు.  


చెప్పిన విధంగానే ఉత్తరుడు వడివడిగా రధం పైనుండి దూకి, వారి రంగురంగుల తలపాగా కుచ్చులను కోసి, భీష్ముని వద్దకు వెళ్లకుండా తిరిగివచ్చి, రధం యెక్కాడు.  సమ్మోహనాస్త్రం వ్యవధి అయిపోగానే, భీష్ముడు ముందుగా లేచి, అర్జునునితో పోరుకు సిద్ధమయ్యాడు.  ఈలోపు దుర్యోధనాదులు కూడా లేచారు.  జరిగినది యేమిటో, తెలియక, '  తాతా ! అర్జునుడు ఒక్కడూ అలా యెలా నిలువగలిగాడు, మిమ్ములను తప్పించుకుని.  నాకేమయ్యింది  యేదో మగత కమ్మినట్లయింది.'  అంటూ హడావుడి చేయసాగాడు.  


భీష్ముడు చిరునవ్వుతో, ' దుర్యోధనా ! విలువైన అస్త్రవిద్య,  మేటియోధుడు ప్రదర్శిస్తే దాని ప్రభావం అలాగే వుంటుంది.  మీ అందరి శక్తియుక్తులూ యెందుకూ కొరగాకుండా పోయాయి.  మీరు స్పృహ కోల్పోయినపుడు, కిరీటి, మీమీద యే దారుణకార్యమూ వొడిగట్టకుండా, కేవలం మీ తలపాగాల కుచ్చులు మాత్రం కోసి,  మీ పరాజయాన్ని తెలియజెప్పాడు.   పాండవులు ధర్మపరులు కాబట్టే, అతడు మనలను వధించకుండా వదిలిపెట్టాడు.  జరిగిన పరాభవం చాలు.  ఇక హస్తినకు తిరుగుప్రయాణం కండి, అందరూ.  వారి గోసంపదనను  వదలిపెట్టండి.  '  అని సూచించాడు భీష్ముడు.  అందరూ ఆమోదయోగ్యంగా, అక్కడనుంచి హస్తినకు మరలారు.  


వీడ్కోలుగా అర్జునుడు భీష్మునికి, ద్రోణునికీ శిరస్సు వంచి నమస్కరించి, అశ్వద్దామా, కృపాచార్యులకు వందనబాణాలు సమర్పించాడు.    దుర్యోధనుని రత్నఖచితమైన, మణిమయ కిరీటాన్ని, ఒకేబాణంతో,   దుర్యోధనుని ఓటమి సూచకంగా, తుత్తునియలు చేసాడు.  విజయసంకేతంగా,  విజయుడు, దేవదత్తాన్ని అతి పెద్దగాపూరిస్తూ, శత్రువుల పరాభవాన్ని జగత్తుకు తెలియజేసాడు.


కౌరవులు వెనుదిరగగానే, ' ఉత్తరకుమారా !  మన గోసంపదతో విజయులమై విరాట నగరం చేరుకోవచ్చు.   నీ తండ్రిగారికి  మా మారువేషముల గురించీ, నా యుద్ధకౌశలం గురించీ నీవేమీ ప్రస్తావించకు.  ఆయన నీవలననే విజయం సిద్ధించిందని అనుకుంటూ వుంటారు.  అలాగే ఆనందించనీ !.  నిదానంగా తెలుసుకుంటారు. '  అని ఉత్తరకుమారునికి చెప్పి, రధాన్ని జమ్మిచెట్టు వద్దకు తీసుకువెళ్లి, ఆయుధాలను మళ్ళీ అక్కడే వుంచి, తాను బృహన్నల రూపంలో రథసారధిగా కూర్చొనగా, ఉత్తరుడు  రధమధిరోహించాడు, వీరుని స్థానంలో.  ' విజయా !  నేను అల్పుడను.  నీవు అనన్య సామాన్య పరాక్రమశాలివి.  నీముందు,  నేను యుద్ధం చేసి విజయం సాధించానని నా తండ్రిగారికి,  అబద్ధం చెప్పలేను.  నేనుమౌనంగా వుంటాను.  నీకు తోచిన విధంగా  నాన్నగారికి వివరించు, ఇక్కడ జరిగింది. '  అని యెంతో అమాయకంగా, వినయంగా ఉత్తరకుమారుడు, విజయునితో అన్నాడు.


గోగణం ముందు కదులుతుండగా,  రధం  విరాటనగరం వైపు సాగిపోతున్నది.  


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

*శ్రీమద్భాగవతము*

 *శ్రీమద్భాగవతము*


 చతుర్థ స్కంధం -15


భూమినిబితుకుట 


పుణ్యచరిత్రా! మైత్రేయా! భూమి ఎందుకు గోరూపం ధరించింది? దానికి ఏది దూడ అయింది? పిదుకుటకు తగిన పాత్ర ఏది? దోగ్ధయైన పృథుచక్రవర్తి ఏ పదార్థాలను పిదికాడు? భూమి సహజంగా మిట్ట పల్లాలతో విషమంగా ఉంటుంది కదా! అది సమరూపాన్ని ఎలా పొందింది? ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని ఎందుకు దొంగిలించాడు? అంతేకాక సనత్కుమారుని వల్ల విజ్ఞానాన్ని పొందిన పృథువు ఎటువంటి సుగతిని పొందాడు? పరబ్రహ్మ స్వరూపుడు, పుణ్య శ్రవణ కీర్తనుడు, సర్వేశ్వరుడు, భగవంతుడైన కృష్ణుని ఇతర అవతార పుణ్యకథలను, పుండరీకాక్షుడు పృథుచక్రవర్తి అవతారాన్ని ధరించి గోరూపాన్ని పొందిన భూమిని పిదకడం మొదలైన కథల నన్నింటిని నీవు, విష్ణుదేవునకు భక్తుడనైన నాకు వివరంగా చెప్పు’’ అని విదురుడు ప్రశ్నించాడు. వాసుదేవుని కథలయందు ఆసక్తి కల విదురుని కొనియాడుతూ మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. “ఆ విధంగా బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ప్రజాపరిపాలనా కార్యంలో నియుక్తుడైన పృథుచక్రవర్తి రాజ్యం చేస్తుండగా సారహీనమైన భూమినుండి అన్నం లభింపక పోవడం చేత ఆకలి బాధతో ప్రజలు కృశించిపోయి పృథుచక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. రాజా! చెట్టు తొఱ్ఱలో పుట్టిన అగ్నిచేత దహింపబడే చెట్టువలె మేము ఆకలితో బాధపడుతున్నాము. రక్షణ కోరేవారికి అభయమిచ్చే నిన్ను శరణు వేడుకుంటున్నాము. రాజా! దయతో మాకు అన్నం పెట్టి రక్షించు’’ అని వినయంతో వంగి నమస్కరించి ప్రార్థించగా…పృథుచక్రవర్తి వారి దీనాలాపాలను విని దానికి తగిన మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. వెంటనే త్రిపుర సంహారకుడైన శివుని వలె రౌద్రమూర్తియై వింట బాణాన్ని సంధించాడు. ఈ విధంగా బాణాన్ని సంధించినట్టి…పృథుచక్రవర్తిని చూచి భూమి గోరూపాన్ని ధరించి వణికిపోతూ కుటిలుడైన వేటగానిని చూచి అడవిలోనికి పారిపోయే లేడివలె పరుగెత్తింధి. ఈ విధంగా గోరూపాన్ని ధరించి భూమి పరుగెత్తగా పృథుచక్రవర్తి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో దానిని వెంబడించాడు. అది దశదిశలలో ఎక్కడికి పోతే అక్కడికి వింటిని ఎక్కుపట్టి దానిని వెంటాడాడు. అప్పుడు మరొక దిక్కు లేక మృత్యువుకు భయపడే ప్రజల వలె భయపడుతూ పరితపిస్తూ భూదేవి పృథువుతో ఇలా అన్నది. “వేనపుత్రా! నీవు ధర్మం తెలిసినవాడవు. ఆపదలో నున్న వారిని ఆదుకొనేవాడవు. మహానుభావుడవు. సకల ప్రాణులను రక్షించడానికి నియమింపబడినవాడవు. అటువంటి నీవు ఆడదాననైన నన్ను చంపడానికి ఎందుకు పూనుకున్నావు? నేను దిక్కు లేనిదాన్ని. ఏ తప్పూ చేయనిదాన్ని. నావెంట ఎందుకు పడ్డావు? ధర్మరహస్యం తెలిసినవాళ్ళు స్త్రీలు తప్పు చేసినా దీనవాత్సల్యంతో చంపరుకదా!” అని చెప్పి భూదేవి పృథుచక్రవర్తితో మళ్ళీ ఇలా అన్నది. రాజచంద్రా! నేను మిక్కిలి దృఢశరీరం కలిగి సమస్త భూజనులకు నావ వలె ఎప్పుడూ ఆధారభూతనై ఉంటాను. ఇటువంటి నన్ను దయమాలి ఖండఖండాలు చేసి చంపుతానంటున్నావు. పుణ్యచరిత్రా! నామీద ఉన్న ప్రజలను నీటిలో మునిగిపోకుండా ఎలా కాపాడుతావు?” అని భూదేవి పలుకగా రాజు ఇలా అన్నాడు. “ఓ భూదేవీ! నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేకాదు, యజ్ఞాలలో హవిర్భాగాలను అందుకొంటూ ధాన్యం మొదలైన వానిని పెంపొందింపకుండా ఉన్నావు. గోరూపం ధరించి తృణభక్షణం చేస్తూ పాలు ఇవ్వకుండా నీలోనే దాచి ఉంచుకున్నావు. పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఓషధీ బీజాలను నీ దేహమందే అణచి పెట్టుకొని వెలుపలకు వెలుపలకు రానీయకుండా ఉన్నావు. నీవు మూర్ఖురాలవు. మందబుద్ధివి. ఈ విధంగా తప్పు చేసిన నీ శరీరాన్ని నా బాణాలతో తూట్లు పొడిచి నిన్ను వధిస్తాను. నీ మాంసంతో ఆకలితో మలమల మాడుతున్న ఈ ప్రజల ఆర్తిని తొలగిస్తాను. స్త్రీ వధ దోషం కదా అని అన్నావు. స్త్రీ పురుష నపుంసకులలో భూతదయ లేకుండా తమ పొట్టలు మాత్రమే నింపుకొనే ఎవ్వరినైనా సరే రాజులు చంపవచ్చు. అది వధ కాదు. కాబట్టి దానివల్ల పాపం రాదు. నీవు స్త్రీవైనా గర్వాంధురాలవై కొయ్యబారి ఉన్నావు. మాయా గోరూపం ధరించి పారిపోతున్న నిన్ను నువ్వుగింజలంత ముక్కలుగా నరికి నా యోగప్రభావంతో జీవులను రక్షిస్తాను’’ అంటూ యమునివలె రోష భీషణాకారుడైన పృథుచక్రవర్తిని చూసి భూమి వణికిపోతూ దోసిలి ఒగ్గి ఈ విధంగా ప్రార్థింపసాగింది. “ఓ భూపతీ! నీవు సాక్షాత్తుగా భగవంతుడవు. స్వకీయమైన మాయాగుణం చేత నానావిధాలైన శరీరాలను ధరించి సగుణుడవుగా కనిపిస్తావు. నీ చరిత్ర సంస్తవనీయమైనది. అటువంటి నీవు…నన్ను సకల ప్రాణికోటికి ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లనే నేను నానావిధాలైన ప్రాణికోటిని భరిస్తున్నాను.అది అలా ఉండగా… రాజా! నన్ను నీవే ఆయుధమెత్తి చంపడానికి పూనుకున్నావు. కరుణాసముద్రా! ఇంక నేను ఎవరిని శరణు వేడుకొనాలి? అంతే కాక…ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచేత ఈ చరాచర ప్రపంచాన్ని సృజించావు. నీవు ధర్మరక్షకుడవు. కొత్త తామరల వంటి కన్నులు కల ఓ ప్రభూ! నీ మాయను లోకులెవ్వరూ జయింపలేరు. నీవు స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచేత సకల లోకాలను సృజింప జేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథు చక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తమందూ వెలుగొందుతావు. ఇంకా మహాభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకార అనే శక్తుల చేత ఈ లోకాలను సృజించి, పెంచి, త్రుంచుతున్నవు. విరుద్ధాలైన శక్తులతో నిండి ఉండే నీకు నమస్కారం చేస్తున్నాను. అటువంటి భగవంతుడవైన నీచేత నిర్మింపబడిన ఈ విశ్వాన్ని సంస్థాపించాలని పూర్వం పూనుకొని…ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తి మహాజలాలపైన నావ వలె నన్ను నిలిపావు. నాపైన ప్రాణులను నిలిపావు. నాపై నున్న ప్రజలను రక్షించటం కోసం పృథు రూపాన్ని ధరించావు. ఈ విధంగా భూభారం వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవల పాలకోసం నన్ను సంహరించాలని భావిస్తున్నావు. రాజచంద్రా! పుణ్యగుణ సాంద్రా! అనద్యుడవు, వేదవేద్యుడవు, విశ్వరక్షకుడవు అయిన నీకిది విచిత్రంగా లేదూ? భగవంతుని మహిమోపేతమైన మాయచేత మోహం పొందిన మనస్సు కలిగిన మావంటి వారికి హరిభక్తుల చర్యలు తెలుసుకోవటం శక్యం కాదు. ఇక శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకొనగలం? అటువంటి యశోనిధులైన జితేంద్రియులకు, మహాత్ములకు మొక్కుతున్నాను” అని ఈ విధంగా కోపంతో పెదవులు అదురుతున్న పృథుచక్రవర్తిని సంస్తుతించి ధైర్యం తెచ్చుకొని భూమి మళ్ళీ ఇలా అన్నది. నిర్మలమైన మనస్సు కల ఓ రాజా! గొప్ప పౌరుషము కలవాడ! నాకు అభయం ప్రసాధించు. ఆగ్రహాన్ని చాలించు. నన్ను మన్నించి దయతో నా విన్నపం ఆలించు. పువ్వులు కందకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా సారాంశాన్ని, కావలసిన దానిని నేర్పుగా గ్రహిస్తాడు.

క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అంటు పృథు చక్రవర్తితో భూదేవి చెప్తోంది. ఇంకా విను. తత్త్వదర్శనులైన మునులు ఇహపరలలో పురుషులకు ఫలం చేకూర్చే కృషిని, అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను అనుష్ఠించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అటువంటి ఉపాయాలను లెక్క చేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు ఎంత పండితుడైనా అతనికి ఆయాసమే తప్ప ఫలం సిద్ధించదు. వెయ్యి మాటలెందుకు? ఎంతకాలం గడచినా వాని స్థితి అంతే!” అని చెప్పి భూమి మళ్ళీ ఇలా అన్నది.పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన ఓషధులను కలుషాత్ములు, నియమభ్రష్టులు అయిన దుష్టులు భుజించటం చూసి కూడా రాజులు వారిని అడ్డగింపలేదు. అందువల్ల నేను పెక్కుసార్లు దొంగల బాధకు గురియై రక్షణ లేనిదాననై క్రుంగి కృశించిపోయాను. మహారాజా! సాటిలేని యజ్ఞకర్మలు లేకపోవడంతో నేను ఆదరాన్ని కోల్పోయాను. లోకమంతా దొంగలతో నిండిపోగా నేను చూచి…యజ్ఞాలు మొదలైన సత్కర్మలకు ఉపయోగపడే ఆ ఓషధులను చోరులు దొంగిలించకుండా వాటిని మ్రింగినాను. రాజా! అవి నాలో జీర్ణమైపోయాయి. రాజేంద్రా! విను. ఆ ఓషధులను ఒక ఉపాయంచేత మళ్ళీ పొందవచ్చు. ఓ సుచరిత్రా! నీమీద ఉండే ప్రేమచేత ఆ ఉపాయాన్ని నీకు తెలియజేస్తాను. రాజా! నీవు నాకు తగిన దూడను, తగిన పాత్రను, తగిన దోగ్ధను (పాలు పితికే నేర్పరిని) సమకూర్చు. అలా నీవు సమకూర్చినట్లయితే…ఈ ప్రాణులకు ఇష్టమైనవీ, బలకరమైనవీ, దుగ్ధాన్న రూపమైనవీ అయిన కోరికలను ప్రసాదిస్తాను. నా మాటలను గమనించు. మహారాజా! ఇప్పుడు నేను మిట్టపల్లాలతో విషమంగా ఉన్నాను. వానకాలంలో కురిసిన నీరు ఆ వానకాలం గడచిపోయిన తరువాత కూడా భూమిలో ఇంకిపోకుండా అంతటా నిలిచిపోవడానికి వీలుగా నన్ను సమంగా చదును చేయి. మనువుతో సమానమైనవాడా! నా విన్నపం 

మన్నించు”. అని ఈ విధంగా భూదేవి పలికిన తియ్యని మాటలను పృథు చక్రవర్తి విని తన మనస్సులో ప్రేమ పొంగులెత్తగా…పృథు చక్రవర్తి మనువును గోవత్సంగాను, తన చేతిని పాత్రగాను చేసి తాను దోగ్ధయై భూమినుండి సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా అతనిపై వాత్సల్యం కలిగిన గోరూప ధారియైన భూమినుండి ఇతరులు కూడా తమ కోరికలను తీర్చుకున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని, దేవతలు ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్య దానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా చేసికొని ఇనుపపాత్రలో సురాసవమయమైన క్షీరాన్ని, అప్సరసలు గంధర్వులు విశ్వావసువును దూడగా చేసుకొని పద్మమయమైన పాత్రలో…మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని, పితృదేవతలు సూర్యుని దూడగా చేసుకొని ఆమపాత్రలో కవ్యమనే క్షీరాన్ని, సిద్ధులు కపిలుని దూడగా చేసుకొని ఆకాశపాత్రలో సంకల్పనా రూపమైన అణిమాదిసిద్ధి అనే క్షీరాన్ని, విద్యాధరులు మొదలైనవారు కపిలుని దూడగా చేసికొని ఆకాశపాత్రలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుని దూడగా చేసుకొని ఆత్మపాత్రలో సంకల్పమాత్ర ప్రభవమూ అంతర్ధాన రూపమూ అద్భుతాత్మకమూ అయిన మాయ అనే క్షీరాన్ని, యక్ష రక్షో భూత పిశాచులు రుద్రుని దూడగా చేసికొని కపాలపాత్రలో రుధిరాస్వరూపమైన క్షీరాన్ని, అహి దందశూక సర్ప నాగాలు తక్షకుని దూడగా చేసుకొని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, పశువులు ఆబోతు దూడగా అరణ్యపాత్రలో తృణమనే క్షీరాన్ని, క్రూరమృగాలు సింహాన్ని దూడగా చేసికొని స్వకళేబరపాత్రలో మాంసం అనే క్షీరాన్ని, పక్షులు గరుత్మంతుని దూడగా చేసుకొని స్వదేహపాత్రలో కీటకాలు, ఫలాలు అనే క్షీరాన్ని, వసస్పతులు వటవృక్షాన్ని దూడగా చేసికొని భిన్నరోహ రూపమైన క్షీరాన్ని, పర్వతాలు హిమవంతుని దూడగా చేసికొని సానువులనే పాత్రలో నానాధాతువులు అనే క్షీరాన్ని ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్ఠులను దూడలుగా చేసుకొని, తమకు తగిన పాత్రలలో, తమకు తగిన క్షీరాలను భూమినుండి పిండుకున్నారు. ఆ ప్రకారంగా క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సములను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పిదుకుకున్నారు. అలా ఆ రాజు కూడ సముచితానందను పొందెను. ఎంతో సంతోషించి అన్ని కోరికలను తీర్చే భూమిని తన పుత్రిగా స్వీకరించాడు. తన వింటికొప్పుతో పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలను పొడి పొడి చేసి…పృథుచక్రవర్తి తన భుజబలంతో నేలంతా సమతలంగా చేసాడు. ఆ ప్రభువు తండ్రి యై ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించాడు, శాశ్వత మైన యశస్సు గడించాడు. అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలయాలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు మొదలైన పెక్కు విధాలైన నివాస స్థానాలను కల్పించాడు.ప్రజలు భయం తొలగి ఆయా నివాసాలలో సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. అటువంటి ధర్మమూర్తి అయిన పృథుచక్రవర్తిని కీర్తించడం ఈలోకంలో ఎవరికి శక్యం?

🙏🙏🙏

సేకరణ

భజగోవిందం

 దశిక రాము


మోహముద్గరః(భజగోవిందం)


12) 


దినయామిన్యౌ సాయం ప్రాతః 


శిశిరవసంతౌ పునరాయాతః |


కాలః క్రీడతి గచ్ఛత్యాయుః


తదపి న ముంచత్యాశావాయుః ||


కష్టపడి సంపాదించిన అన్నింటిని ఏం చేసి జీవుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు ?

పగలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది. పోనీ ఆ చీకటి అలాగే ఉంటుందా? ఉండదు. ఉదయం అనేది వస్తుంది. వెలుగు రేకలు తెస్తుంది. మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగుతుంది. చివరకు సాయంకాలమనే సంధ్యారాగంలో కలిసిపోతుంది. ప్రతిరోజూ ఇంతే. కాలచక్రంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక్క క్షణమైనా ఆగదు కాలం. శిశిరం, వసంతం గ్రీష్మం అంటూ ఆరు ఋతువులున్నాయి. అవీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కాలచక్రం అలా అలా దొర్లుతుంటూ వెళ్ళిపోతుంది. ఇలా కాలచక్రం దొర్లిపోతూ ఉంటే - అలా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాణుల యొక్క ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది. సంవత్సరాని కొకసారి బర్త్ డే చేసుకుంటాం. అంటే ఆయుష్కాలంలో మరొక సంవత్సరం తగ్గిపోయిందీ అని గుర్తు. కాలం ముందుకు వెళ్తుంటే మృత్యువు దగ్గరకొస్తున్నదని గుర్తు. కాలం కదిలిపోతుంటే భవిష్యత్తు వర్తమానంగాను, వర్తమానం భూతకాలంగాను మారిపోతుంటుంది. కనుక ఏదీ నిత్యం కాదు, శాశ్వతం కాదు.

  “కఠోపనిషత్తు”లో నచికేతుడు చెప్పినట్లు ఈ జీవితం అనిత్యమైనది. ఎంత శ్రమపడ్డా, ఎన్ని అనుభవించినా, ఎంత ప్రోగుచేసినా ఒక నాటికి మృత్యువు అనేది అతడి నుంచి అన్నింటిని బలవంతంగా లాక్కుంటుంది. కష్టపడి సంపాదించిన అన్నింటిని విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే అతడు తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి సంపాదించుకొన్న సంచిత కర్మల, వాసనల మూటను మాత్రమే. ఎంత శోచనీయం! ఎంత హృదయ విదారకం!

🙏🙏🙏

సౌందర్య లహరి శ్లోకము - 13

 దశిక రాము


సౌందర్య లహరి శ్లోకము - 13


శ్రీ శంకర భగవత్పాద విరచితము


శ్రీ లలితాంబికాయైనమః


శ్లోకమ్ 13


నరం వర్షీయాంసం 


నయన విరసం నర్మసు జడం


తవా పాఙ్గా లోకే 


పతిత మనుధావన్తి శతశః'


గళద్వేణీ బన్ధాః 


కుచకలశవిస్రస్తసి చయా


హఠాత్త్రుట్య త్కాఞ్చ్యో


విగళిత దుకూలా యువతయః !!                                           


తల్లీ ! కనికరం ఉట్టిపడే నీ కడకంటి చూపుకు

పాత్ర మైన వాడు ఎంత ముదుసలి ఐనా, వికార

రూపుడైనా , మన్మథ క్రీడలలో మందుడైనా యువతులు అతగాడినే వలచి తమ కొప్పులు వీడగా ,  పైటలు జారగా, మొలనూళ్ళు విడివడి

జారుతూండగా, పోక ముడులు వీడిపోయి కట్టుకున్న పట్టుకోకలు కిందికి జారిపోతుంటే వందలాది ఏతెంచి ఆ పురుషుణ్ణి వెంబడించి

నరుగెత్తి వస్తారు .


ఓం నిత్యాయైనమః


ఓం నిర్మలాయైనమః


ఓం అంబికాయైనమః

*శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*

 *శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*


 (11వ భాగం)


తారకసురుడి నిరంకుశత్వానికి తోడుగా త్రిపురాసులనే ముగ్గురు రాక్షసులు తపస్సు చేసి వరాలు పొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే మూడు పట్టణాలను నిర్మించుకొని ముల్లోకాల మీద విరుచుకుపడ్డారు. మూడుపురాల మీద ఎగురుతూ అగ్ని గోళాల్ని కురిపిస్తు,పట్టణాలను,పచ్చని పల్లేలను మీద విరుచుకుపడుతూ విద్వంసకాండ సాగిస్తున్నారు జగ్గత్తు అట్టుడి పోతోంది.


వారిని అంతమొందించేగలవాడు శివుడొకడేనని దేవతలందరు భావించి దేవతలందరు కలసి వచ్చి మందిర ప్రాంతంలో ఘోరమైన ప్రార్ధనలు చేశారు.


పెళ్ళాడినకొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు భావించి,త్రిపురాసురులు చేస్తున్న మారణహోమం విన్న మీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశులాన్ని  పట్టుకొని,తన అనుచరుల్ని,ప్రమధగణాలనూ వెంటబెట్టుకొని,త్రిపురాసులను తుద ముట్టించేందుకు ఆవేశంతో కదిలాడు


అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాల్ని బీభత్సం చేస్తూ,ఒక రాక్షస రాజు బయలదేరాడు,బ్రహ్మండమైన ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది.అతడు సాటిలేని గొప్ప శివభక్తుడు. శివుడి వల్ల తప్ప మరొకరివల్ల చావులేని వరం పొందాడు


"శివుణ్ణి నీ లోపల ఉంచేసుకుంటే మరీ మంచిదీ కదా!అని నారదుడు గజాసురుని మేలు కోరుతున్నవాడిలాగ అతడితో చెప్పాడు గజాసురుడు వెంటనే కోపాగ్రేశుడై ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణీ మెప్పించాడు. త్రిపురాసుర సంహారానికని బయలుదేరిన శివుడు గజాసురిడి కోరిక ప్రకారం గజాసురిడి గుండెలో లింగారూపంతో ఉండిపోయాడు.


" శివుడు గజాసురిడి గుండెలో ఉండిపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవవధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికి, పార్వతికి పుట్టవలసిఉన్నవాడివల్లనే కదా తారకాసురిడి అంతం జరగాలి?" అని దేవతలు అంతా దిగులు ముఖాలువేస్తుంటే నారదుడు, "శివుడు ఉబ్బులింగడు కదా!" అని ఉపాయం అందించాడు. మరుక్షణమే దేవతలంతా గజాసురిడి ఎదుట శివుణ్ణి పొగుడుతూ గొంతెత్తి స్తోత్ర పాఠాలు మొదలు పెట్టారు

🙏🙏🙏

సేకరణ

BOON FOR SENIOR CITIZENS

 MODI GOVERNMENT'S BOON FOR SENIOR CITIZENS - MEDICAL CONSULTING TOTALLY FREE


The Central Government has launched an excellent consulting scheme for senior citizens and all other citizens. 

Elderly people, especially those with high blood pressure, diabetes, etc., don't rush to the hospital for OPD.  They seek treatment at home for minor ailments like headaches, physical pain, and are not ready to go to the hospital. 


You can now access consultancy and treatment on Google Chrome via the link below. Note:


1.  Select patient registration.


2. Type your mobile number. Type OTP on mobile for registration.


3. Enter patient details and district. Now, you will connect with the doctor online. After that, you can consult a doctor for any of your health problems through the video. The doctor will prescribe the medicine online. You can take the medicine by showing it in the medical pharmacy shop.


This service is completely free.  

                                      

You can use this service every day from 10.00 am to 3.00 pm, including Sunday.


Please send this to senior citizens in your contact list.


This is the Central Government website: 


https: //www.eSanjeevaniopd.in


 https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd


Guys this is a fantastic step for senior citizens....

Please take advantage  & Forward it to All Senior Citizens You know.

🙏🙏🙏🙏🙏

మహాభారతము ' ...67.

 మహాభారతము ' ...67. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


తదేకంగా ఊర్వశి నాట్యం చూస్తున్న అర్జునుని చూసి, ఇంద్రుడు, నాట్యాచార్యుడు,  తన అనుచరుడైన  చిత్రసేనుని పిలిపించాడు. ' చిత్రసేనా !   అర్జునుడు మన అతిధి.  ఏదో మనోవ్యాకులతతో వున్నాడు. అతనికి  ఆనందం  కలిగించడం మన కర్తవ్యం.  వెంటనే ఊర్వశిని తన అందచందాలతో  అర్జునుని సంతోషపెట్టమని చెప్పు. '  అని ఆదేశించాడు.


ఊర్వశి వద్దకువెళ్లి చిత్రసేనుడు తాను వచ్చినపని చెప్పాడు.  ఆమె సంతోషంగా అంగీకరించింది.  నా మనసులో మాటే ఇంద్రుడు ఆజ్ఞాపించాడు, యింకా అడ్డేముంది ? అని తనలో అనుకుని, చిత్రసేనుని పంపివేసింది. అర్జునుని యేకాంతంగా కలిసే సమయం కోసం యెదురు చూడసాగింది.  


రాత్రి చంద్రోదయమైంది.  చక్కగా అలంకరించుకుని అర్జునుని శయ్యాగారంలోనికి మందగమనంతో, ప్రవేశించింది ఊర్వశి.  ఊర్వశికి అభివాదం చేస్తూ స్వాగతం పలికాడు అర్జునుడు. ' నేను తమ సేవకుడను. చెప్పండి, ఏమి చెయ్యాలో ' అని చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు అర్జునుడు, ఊర్వశి ముందు.  


అతనిమాటలకు ఊర్వశి ఆశ్చర్యపోయి, తనను అట పట్టిస్తున్నాడు అనుకుని, ' చిత్రసేనుడు పంపగా నేను వచ్చాను.'  అని నర్మగర్భంగా తనకోరిక తెలియజేసింది. ' నేను నాట్యమాడుతుండగా, నీవు కన్నులార్పక నా అందాలు గ్రోలితివని  ఇంద్రుడు గ్రహించి, చిత్రసేనుని ద్వారా నీ వద్దకు నన్నుపంపాడు.   ఆయన ఆజ్ఞ నాకు వరంగా తోచింది.  నీపై మరులు పెంచుకున్న నా తృష్ణ అనే అగ్నికి యీ వార్త ఆజ్యమయ్యింది.  ఇక ఆలశ్యం చెయ్యకు. దగ్గరకు రా ! '  అని ఆహ్యానించింది.  


ఆమె మాటలకు అర్జునుడు, వణికిపోయాడు. సిగ్గుతో తల దించుకున్నాడు.  ' అమ్మా !  నీవు నాకు తల్లిలాంటి దానవు.  నాకు కుంతీ మాద్రీ యెంతో, నీవూ అంతే !  నీవు మా పురువంశానికి తల్లివి.  పురూరవ చక్రవర్తికి భార్యగా, మా వంశోద్ధరణకు తోడ్పడ్డావు.  ఆ జ్ఞాపకాలు నాలో మెదిలి నిన్ను గౌరవభావంతో, నీలో వున్న నాట్యకళా విన్యాసానికి ఆశ్చర్యపోయి అలా చూస్తూవుండిపోయాను.   అంతేకానీ, నాలో యే నీచభావమూ,  నీయందు లేదు. ' అన్నాడు.


' అర్జునా !  యెంత అమాయక ధోరణిలో మాట్లాడుతున్నావు.  మేము అప్సరసలమని నీవెరుగవా?  మాతో రమించడం, తప్పుగాదు.  మేము పూజార్హులం కాదు. మాతో భోగించడమే మాకు ఆనందము.  నేను కామానురక్తనై నీవద్దకు వచ్చాను.  నన్ను నిరాశపరచకు, నీ ధర్మపన్నాలతో. ' అన్నది ఊర్వశి, రోషంగా.   '  అమ్మా !  నా పై కోపించవద్దు.  నేను నీబిడ్డను.  నీవు మా వంశమూలానివి.  నన్ను నీ మాటలతో చిత్రహింస చెయ్యవద్దు. ' అని మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి ప్రార్ధించాడు అర్జునుడు.


అర్జునునిమాటలకు, యింకా ఆగ్రహం తెచ్చుకున్నది ఊర్వశి.   అంతలో దుఃఖించింది. స్వరం గద్గదమైంది. నీతండ్రి ఇంద్రుడు పంపగా వచ్చి, నాకోరిక తీర్చమంటే నీతి వాక్యాలు పలికి, నా కోపానికి గురి అవుతున్నావు.  నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. నపుంసకుడవై, సిగ్గు యెగ్గులు తెలియక, ఆడపిల్లల మధ్య, వారితో  ఆటపాటలతో సంచరింతువుగాక ! '   అని అర్జునుని శపించి, కోపంగా తిరిగి వెళ్ళిపోయింది, ఊర్వశి. 


జరిగిన విషయం చిత్రసేనుని ద్వారా ఇంద్రునికి నివేదించాడు అర్జునుడు.  ఇంద్రుడు అర్జునుని పిలిచి,  జరిగిన సంఘటనకు చింతించవలదని, యీశాపం, పాండవుల అజ్ఞాతవాసం సమయంలో అర్జునుని యెవరూ గుర్తించకుండా అక్కరకు వస్తుందనీ, అజ్ఞాతవాసం పూర్తవగానే, మళ్ళీ మామూలు రూపం వస్తుందనీ, శాపం యొక్క అంతరార్ధం చెప్పి, ఓదార్చాడు.    అర్జునుడు కూడా సంతృప్తి చెందాడు.


ఒకనాడు, ఇంద్రునితో అర్ధ సింహాసనం పంచుకుని కూర్చున్న అర్జునుని చూసి, అక్కడకు విచ్చేసిన లోమశమహర్షి,  అర్జునుని అదృష్టానికి అచ్చెరువొందాడు.  అది గ్రహించి ఇంద్రుడు ' మహాత్మా ! ఈ అర్జునుడు యెవరోకాదు.  పూర్వం బదరికాశ్రమంలో నరనారాయణులనే మహర్షులు తపస్సు చేసేవారు.  వారే కృష్ణార్జునులుగా అవతరించి, ధర్మ సంస్థాపన కోసం  భూమిమీద జన్మించారు.  మహర్షీ !  మీరు భూలోకం వెళ్తున్నారు కదా !  అర్జునుని యోగక్షేమాలు పాండవులకు చెప్పి,వారిని సంతోషింపజెయ్యండి. ' అని ప్రార్ధించాడు.  అర్జునుడు కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.


అర్జునుని యోగక్షేమాలు లోమశమహర్షి చెప్పగా, పాండవులు పరమానందాన్ని పొందారు.  శస్త్ర, అస్త్రాలు సముపార్జనలో వున్నాడని గ్రహించి స్థిమిత పడ్డారు. లోమశమహర్షి వెళ్లి పోయిన కొంతకాలానికి, భీమసేనుడు, మరలా ధర్మరాజుని నిష్టురవాక్యాలతో బాధించ సాగాడు. వెంటనే యుద్ధం ప్రకటించమన్నాడు. ధర్మసూక్ష్మత ప్రకారం క్లిష్ట సమయంలో ఒక దివారాత్రము ఒక సంవత్సరంగా పరిగణించవచ్చు అన్నాడు.  కృచ్రవ్రతమనే ఒక వ్రతం పదమూడు రోజులు ఆచరిస్తే, పదమూడు సంవత్సరాలు గడిచినట్లే అని నచ్చజెప్పి,  ఆ వ్రతమాచరించమని బలవంత పెట్టసాగాడు.  


అలా గాక పదమూడు సంవత్సరాలూ గడిచి మళ్ళీ కౌరవులను కలిసినా, నీకు రాజ్యం వారు యివ్వరు.  మళ్ళీ జూదానికి పిలుస్తారు.  నీవు జూదమాడతావు.  మమ్ములను అరణ్యాల పాలుచేస్తావు.  ఆ విధంగా ప్రతి పదమూడు సంవత్సరాలకూ, కేవలం జూద మాడడం కోసమే మనం నగరప్రవేశం చేస్తాము.  అదే మనకు వ్రాసిపెట్టి వున్నది. '  అని అనేకవిధాల ములుకులలాంటి మాటలతో బాధించసాగాడు.  


ధర్మరాజు, భీమునికి పదమూడు సంవత్సరాలు ఓపిక పట్టమని చెబుతుండగా, బృహదశ్వుడు అనే తపోనిది, వారిని చూడడానికి వచ్చాడు.  ఆ మహర్షిని ధర్మరాజు ఆహ్వానించి, సత్కరించి పూజించాడు.  .  


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ  

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844.

సూర్యాది శట్ గ్రహారాధన స్తోత్రమ్

 సూర్యాది శట్ గ్రహారాధన స్తోత్రమ్

_________

     సూర్య గ్రహ స్తోత్రమ్


జపాకుసుమ సంకాశం 

కాశ్యపేయం మహాద్యుతిమ్ l 

తమోరిం సర్వపాపఘ్నం

 ప్రణతోస్మి దివాకరమ్. ll


జటిలం హేమ మారాధ్యం

శక్తి స్వస్తిక ధారిణమ్ l

వరదాభయ హస్తం చ 

ధ్యాయేత్ వహ్నిం జపారుణమ్ 


జ్వాలా మాలా వృతం  రుద్రం

 వహ్నిమండల మధ్యగమ్ l

ధ్యాయేత్ కళా దశ యుతం

శక్తి స్వస్తిక ధారిణమ్ ll


        చంద్ర గ్రహ స్తోత్రం 


దధి శంఖ తుషారాభం 

క్షీరోదార్ణవ సంభవం l

నమామి శశినం సోమం

 శంభోర్మకుట భూషణం ll


దవళం  మకరారూఢం

పాశ పాణిం  ప్రచేతసంl

శాంతాయుధం  సుశాంతం చ 

చింతయేత్ ధ్యాన గోచరం ll


గౌరీం సువర్ణ  వర్ణాభాం

స్వర్ణ పద్మ  సువాసినీమ్l 

పాశాంకుశధరాం  భూతి

ధరాం ధ్యాయామి వల్లభాం ll

         

          బుధ గ్రహ స్తోత్రం 


ప్రియంగు గుళికా శ్యామం

 రూపేణాప్రతిమం  బుధం l 

సౌమ్యం సౌమ్య గుణోపేతమ్ 

 తం బుధం  ప్రణమామ్యహం ll



మహావిష్ణుమ్  శంఖ పద్మ

 సుదర్శన  గదాధరమ్ l

ధ్యాయేహం నీల గౌరాంగం

పద్మస్థ  కమలాపతిమ్ ll


పీత పద్మాసనా సీనం

 చతుర్బాహుం కిరీటినం

చింతయే శంఖ  చక్రాభ్యామ్

గదాధారిణ  మచ్యుతమ్ ll

      

         గురు గ్రహ స్తోత్రం 


దేవానాంచ ఋషీణాంచ 

గురుం కాంచన సన్నిభం l 

బుద్ధిమంతం  త్రిలోకేశం 

తం నమామి బృహస్పతిమ్ ll


బ్రహ్మాణం రక్త  గౌరాంగం

చతుర్ వక్త్రం జగత్ ప్రభుం l

అక్ష స్రక్కుండి కా భీతి

వర పాణిమ్ విచింతయే ll


ఇంద్ర  మైరావతారూఢం

వజ్రాయుధ ధరం ప్రభుమ్l

పూర్వ దిక్పాలకం దేవం 

సర్వదేవ  నమస్కృతం ll


         శుక్ర గ్రహ స్తోత్రం 


హిమ కుంద మృణాళాభం 

దైత్యానాం పరమం గురుం l 

సర్వశాస్త్ర  ప్రవక్తారం

 భార్గవం ప్రణమామ్యహంll


సింహాసనస్థాం ద్విభుజాం

స్వర్ణాభాం చ సు సుందరీమ్ l

శిలాసనాం   శచీం ధ్యాయే

 రక్తాంబుజ కరాంబుజామ్ ll

  

ఇంద్రం శీతం చతుర్ బాహుం 

సహస్ర  నయనోజ్వలమ్ l

వజ్రాం కుశాసి సంయుక్త

పాణిం ధ్యాయే సు సంయుతం ll


 శని గ్రహ స్తోత్రం


నీలాంజన సమాభాసం

 రవిపుత్రం యమాగ్రజం

 ఛాయామార్తాండ సంభూతం

 తం నమామి శనైశ్చరం


 దండ పాణిమ్ యమం దేవమ్ 

 మహిషోత్తమ  వాహనం

 యమునా భ్రాతరం  ప్రీత్యా

 యమమ్ ఆవాహయామ్య హం


విరించిం వాక్పతిమ్ శ్వేతమ్ 

పంకజాసన మచ్యుతం 

అక్షస్రక్కుండికా  భీతి 

వరపాణిం విచింతయే.

బడి పిలిచిన వేళ

 బడి పిలిచిన వేళ 

- బ్రతుకు భయం 


విదేశీ మూకీసినిమాలో లాగా.. 

రంగువెలిసిన పికాసో చిత్రమై.. 

బడి పిలిచిన వేళ..... 

బ్రతుకు భయం నీడలూ జాడలూ!


సున్నపుపెచ్చులు రాల్చే ప్రహరీ నిట్టూర్పులు.. 

రోజూ వెయ్యిసార్లు కిర్రుమంటూ పిల్లలతో బాటూ 

అల్లరిచేసే అతుకుల గేటు !

కుళాయి కుమిలిపోతున్నది బుజ్జిచేతుల స్పర్శ తలుచుకొని.. 

నేరేడు,బాదం చెట్లూ ఉడతమ్మ 

అన్నీ సందడే లేదని గుసగుసలు ఆరునెలలుగా!

పిల్లల్ని చూడకుండానే రిటైర్ అయిపోతానేమోననే బెంగ,

ఎప్పుడూ చిటపటలాడే వాచ్ మెన్ కీ.. 


బడి గంట తుప్పుపట్టి గంగవెఱ్ఱులెత్తుతుంది!

నల్లబల్ల ముఖం ఇంకానల్లగా పెట్టుకోనీ.. 

డస్టర్ దుమ్ముకొట్టుకోని.. 

చాక్ పీస్ల డబ్బా చకితురాలై.. 

ఆ కపటం లేని చిన్నారుల  నవ్వులూ,గోడలూ వినేలా చెప్పే టీచర్ అంకితభావనల స్వర మాధురి!


    ఒకవేళ పిల్లలు వచ్చినా కొన్ని గొల్లున నవ్వులూ,కొన్ని తొర్రిపళ్ళ నవ్వులూ.. కొన్ని చెవిలో రహస్యాలు.. కొన్ని తెచ్చిపెట్టుకున్న పిల్లగంభీరతలూ.. 

ఇదివరకులా కనిపించడం అత్యాశ!బ్రతుకు భయం మాస్క్ రూపంలో.. అడుగుల దూరం మైలుదూరమై మనసు ల్లో !

బడి పిలిచినవేళ ప్రతి టీచర్ సతీ సావిత్రిలా.. 

తనబడి పిల్లల ప్రాణరక్షణ కోసమే!!ఇదో విషాద పిరియడ్!

వ్యాక్సిన్ వరం కొంగున పడేదాకా.. కోవిడ్ ని గద్దిస్తూ.. అర్థిస్తూ.. !!

********

✍️ ఎం. వి. ఉమాదేవి 

       నెల్లూరు

భగవంతుడు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀165


            *భర్త – భగవంతుడు*

                ➖➖➖✍️


*పరమాచార్య స్వామి వారి పర్యటనలో భాగంగా ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు.*


*ఒక ఇల్లాలు తన కుమార్తెను, అయిదేండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది.*


*స్త్రీలందరూ ఒక ప్రక్కగా, పురుషులొక ప్రక్కగా నిలబడి, తీర్థం పుక్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెళ్ళో ఉన్న బంగారు గొలుసు కాస్తా, ఏ పుణ్యాత్మురాలో తస్కరించి దాచేసింది.*


*గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమ్మలక్కలంతా ‘అయ్యో గొలుసు పోయిందా!’ అంటూ పిల్లనూ, తల్లినీ ఓదారుస్తున్నారు.*


*తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి   కూడా తీర్థం పుచ్చుకునేందుకు వరుసలో  నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరికీ తీర్థమిచ్చి, ఆమెను మాత్రం వరుసలో నుండి తప్పుకుని, ప్రక్కగా నిలబడమన్నారు స్వామి.*


*స్వామి అలా ఎందుకు అన్నారో ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతలో ఒక ముసలావిడ తీర్థం తీసుకోవడానికి స్వామి దగ్గరకు వచ్చి చెయ్యి చాపింది.*


*ఆమెను ఉద్దేశించి స్వామి, ‘ఇచ్చేసెయ్యి’ అన్నారు.*


*“నా దగ్గరేముంది ఇవ్వడానికి?” అన్నదా ముసలమ్మ.*


*”ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూటకట్టుకుంటావు?” అన్నారు స్వామి.*


*ఆ మాటలు విని కొందరు ఆడవారు చీరె విదిలించమన్నారు. పరిశీలించగా చీరె మడతల్లో దాచిన బంగారం గొలుసు బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు.*


*గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి దగ్గరకు పిలిచారు. తీర్థం ఇచ్చారు. ఇలా అన్నారు...”అదిగో నీ గొలుసు తీసుకో. ఇక నుంచి మాత్రం చెయ్యవద్దన్న పని చెయ్యకు” అన్నారు స్వామి.*


*”ఇకమీదట ఎప్పుడూ అట్లా చెయ్యను స్వామీ” అంటూ చెంపలు వేసుకుని ఆ గృహిణి, పమిట కొంగుతో కన్నులు తుడుచుకుంది.*


*ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు?*


*ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి టైముకి తప్పకుండా వెళ్ళాలి. తనకు అన్నం వడ్డించి తరువాత పూజకు వెళ్ళమని భార్యతో చెప్పాడు.*


*కాని, పూజకు ముందుగా పోవాలని తొందరపడి, ఆదరాబాదరాగా అన్నం వండి, అక్కడ పడేసి, పిల్లను తీసుకుని గబా గబా బయలుదేరి వచ్చింది ఇల్లాలు.*


*“తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నీవు వదలి పెట్టకు, నీ భక్తి కంటే అది అధికమైంది” అని ఆమెకు బోధపడింది.*


*ఎంతటి స్వల్ప విషయంలో నైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలూ, పురుషులూ అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి.*


--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

handle Corona virus

 How to handle Corona virus in our daily life, and at the same time get our works done unintaruptedly?  Answer is simple.   SMS.  Sanitizers,  Mask and Social distancing.   First two are in our hands.   What about Social Distancing.   Very often this is proved that it's not in your hands.   Then what's to be done?  Again answer is simple.  1.  Use Ezi-Hale capsules.   Daily morning and evening take hot water and put Ezi-Hale drops and inhale it for 5 minutes.   2. Ovidin germicide gargle.  In warm water pour a little quantity of  syrup and gargle the same both morning and evening.   3.  Limcee 500 C-Vitamin tablets.   Use one or two tablets daily.  4. Cipcal 500 Calcium and Vitamin D3 tablets daily one.   All these are a must and precautions for prevention of this virus.   As all are aware this virus can enter in our body through eyes, nose and mouth.  Further it stays in our mouth,  nose for 3 to 4 days before entering lungs.  Better let us attack it by following the above precautions in the initial stages itself most effectively.  Any other precautionary measures,  members are requested to suggest.

విశ్వనాథ సత్యనారాయణకు

 సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్‌ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు.


‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె. 


ఆమె తన ‘కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు.


ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం’’ అన్నారట. అప్పుడు ప్రతాపరెడ్డి నవ్వుతూ, ‘‘ఏది ఏమైనా మీరీ వేళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అన్నారట. 

అందుకు విశ్వనాథ ‘‘నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, అదే నాకు పదివేలు’’ అన్నారట.

(పురాణంవారి ‘విశ్వనాథ ఒక కల్పవృక్షం’ ఆధారంగా)

            

ఇక సాని అంటే ఏమిటో చూద్దాం..

సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం

మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం. 


సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని.

స - నుండి ని - వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సంపాదించుకొన్న

గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు. 

ఈ బిరుదుపొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే అయి ఉండాలి.

తరువాత కాలంలో సాని అనేది ఒకబిరుదుగా ఉండేది. 


ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.  

కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది. 

పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన 

బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని. 


ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని అనే పదాలు

గుణి యెఱుగు గుణుల గుణములు 


 గౌరవప్రదమైనవే కాని నీచమైనవికావు. 


రానురాను ఈ పదం విశిష్టత అంతరించి కళంకాన్ని ఆపాదించే 

నీచమైన  అర్థంగా మారిపోయింది.

 (ఈ సమాచారం డా. నటరాజు రామకృష్ణ గారి రుద్రగణిక నుండి.)

కొత్త రాగం

 కొత్త రాగం ! పల్లవి,చరణాలు పాతవే ! మొదట పాశ్చ్యాత్యమ్ ! తరువాత భారతీయం ! భాషలు వేరు వేరు ! కానీ అర్ధం మాత్రం ఒకటే !సెక్యులరిజం ! ఫ్రాన్స్ అంటే అంతే ! ఆ మాటకొస్తే మొత్తం యూరోపు అంతే ! తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం - తీరా ఆచరణకి వస్తే బేలతనం. హిట్లర్ కి ఎప్పుడూ ఫ్రాన్స్ అంటే చులకన భావమే ! ఫ్రెంచ్ ప్రజలకి ఇంగ్లీష్ వాళ్ళంటే చులకన. మేము గొప్ప. తీరా నాజీ సైన్యం ఫ్రాన్స్ లోకి చొచ్చుకువచ్చి అప్పటికే నిర్మాణం లో ఉన్న ఈఫిల్ టవర్ ముందు నిలబడి తన కమాండర్లతో ఫోటో దిగి మరీ మేము ఫ్రాన్స్ ని ఆక్రమించుకున్నాము తరువాత బ్రిటన్ ఆ తరువాత మొత్తం ప్రపంచం మాదే అంటూ పత్రికలలో పతాక శీర్షికలతో ప్రచారం చేసుకున్నాడు. బేలగా ప్రపంచం నుండి సహాయం అందుతుందేమో అని ఎదురుచూపులు ! ఫ్రాన్స్ దాకా వచ్చిన నాజీ సైన్యం బ్రిటన్ లోకి రాకుండా ఉంటుందా ? ముందు మమ్మల్ని మేము రక్షించుకోవాలి మీకు సహాయం చేయలేము అంటూ బ్రిటన్ నుండి సందేశం ఫ్రాన్స్ కి . ఇక దేవుడే దిక్కు. నాజీ సైన్యం ఫ్రెంచ్ ఆడవాళ్ళని మానభంగం చేయడం నిత్య కృత్యం ఎదురుతిరిగిన వాళ్ళని నిర్దాక్ష్యంగా చంపేది.

భూతల స్వర్గం ఫ్రాన్స్ ! మితిమీరిన స్వేచ్చ కి మారుపేరు ! జపాన్ కనుక అమెరికాలోని పెరల్ హార్బర్ మీద బాంబు దాడులు కనుక చేయకుండా ఉంటే ఫ్రాన్స్ ఎప్పటికీ నాజీ సైన్యం కింద నరకం లో ఉండేదే ! థాంక్స్ జపాన్ ! పెరల్ హార్బర్ మీద బాంబుదాడులతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో తప్పనిసరి పాత్ర పోషించాలివచ్చింది. రష్యా,బ్రిటన్,అమెరికా లు కలిసి జెర్మనీ ని లొంగదీసుకున్నాక అదీ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని బెర్లిన్ రేడియోలో చెప్పిన తరువాత మొదట సంబరాలు చేసుకున్నది ఫ్రాన్స్ ప్రజలే. ఫ్రాన్స్ గుణ పాఠం నేర్చుకున్నది. తరువాతి కాలంలో బ్రిటన్ తో కలిసి కొన్ని, జెర్మనీ,ఇటలీ,నార్వే,డెన్మార్క్ ,స్విట్జర్లాండ్ లతో కలిసి ఆయుధాలని తయారుచేసింది. జాగ్వార్ ఫైటర్ జెట్ ఫ్రాన్స్,బ్రిటన్ ల ఉమ్మడి ఉత్పత్తి. ఇక మీరేజ్ సీరీస్ విమానాలు అన్నీ కూడా విజయవంతమయినవే. ఇప్పుడు యూరోపులో తను ఒక స్వతంత్ర ఆయుధ తయారీదారు. 'చార్లెస్ డి గల్లే ' విమాన వాహక యుద్ధ నౌక ఫ్రాన్స్ నైపుణ్యానికి మచ్చు తునక. ఇంతవరకు బాగానే ఉంది. స్వేచ్చ విషయంలో మాత్రం పాతకాలపు ఆలోచనలతోనే ఉంది. అసలు ఫ్రాన్స్ అంటేనే స్వేచ్చా కదా ? అది ఏ విషయంలో అయినా సరే స్వేచ్చ అంటే అది ఆధునిక సంస్కృతి దానికి ఫ్రాన్స్ ప్రతీక. అదే ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చింది-మితిమీరిన స్వేచ్చ. 

ఒకప్పటి క్రూసేడ్ యుద్ధాల చరిత్రని అందరూ మరిచిపోయినా వాటి తాలూకు జ్ఞాపకాలని నిత్యం పాఠాలుగా చెప్పే విద్యాసంస్థలకి కొదువలేదు మరీ ముఖ్యంగా యూరోపులోని మసీదులు,మదార్సాలు ఇంకా ఆ పనిలోనే ఉన్నాయి. మితి మీరిన సెక్యులరిజం ఇప్పుడు యూరోపుని వణికిస్తున్నది. గత రెండు దశాబ్దాలుగా ఫ్రాన్స్ లోని కొందరు అతివాదులు హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ఏ అధ్యక్షుడు వాటిని లెక్కచేయలేదు. ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ అయితే ఫ్రాన్స్ కి మరింత స్వేచ్చ కావాలనేవాడు. మత స్వేచ్చని హరించే హక్కు ఎవరికీ లేదనేవాడు అఫ్కోర్స్ యూరోపు మొత్తం అదే భావనలో ఉంది సిరియా శరణార్ధులు వచ్చే వరకు. జెర్మనీ,ఫ్రాన్స్, బెల్జియం,నార్వే,డెన్మార్క్,ఆస్ట్రియా  ఇలా అన్నీ యూరోపు దేశాలలో మత స్వేచ్చ పేరుతో రైళ్లలో,బస్సుల్లో, మెట్రో స్టేషన్లలో బాంబులు పెట్టి పేల్చడం జరుగుతూనే ఉన్నాయి కానీ అప్పడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మళ్ళీ షరా మామూలే అన్న పద్ధతిలో ఉంటూ వచ్చాయి.

గత నెల అక్టోబర్ 16న చరిత్రని బోధించే ఫ్రాన్స్ కి చెందిన ప్రొఫెసర్ సామ్యూల్ పాటీ [47] ని తల నరికి చంపేశాడు చెచెన్య కి చెందిన శరణార్ధి. చెచెన్యా అంటే తెలుసుగా ? గత మూడు దశాబ్దాలుగా  రష్యాతో పోరాడుతున్న చెచెన్యా దేశానికి చెందినవాడు. చెచెన్యా కి చెందిన వాళ్ళని ఏ దేశము శరణార్ధిగా అంగీకరించకపోవడానికి కారణం విపరీతమయిన హింస స్వభావామ్ కలిగిఉండడమే కానీ ఫ్రాన్స్ తో పాటు జెర్మనీ కూడా చెచెన్ దేశస్థులని అక్కున చేర్చుకున్నాయి. అఫ్కోర్స్ రష్యా చెచెన్యంల తో డీల్ చేసినట్లు వేరే ఏ దేశము చేయలేదు. అప్పట్లో యూరోపు తో సహా అమెరికా కూడా రష్యా మీద దుమ్మెత్తిపోశాయి మానవ హక్కులు అంటూ.కానీ చేచన్ తీవ్రవాదుల మీద బోలెడంత ప్రేమ కురుపించాయి యూరోపు దేశాలు. తీవ్రవాదులకి మానవహక్కులు ఉంటాయి - యూరోప్. ఇప్పుడు అదే చెచెన్ దేశానికి చెందినవాడు ఫ్రాన్స్ హిస్టరీ ప్రొఫెసర్ ని తల నరికి చంపేశాడు - తీవ్రవాదాన్ని అరికట్టాలి - యూరోప్ . అనుభవం అయితేనే కానీ తత్వం బోధపడలేదు. కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నది - యూరిపియన్ యూనియన్. ఓహ్ ! మానవ హక్కులు, సెక్యులరిజం రెండూ ఒక చోట ఉండలేవు అని భారత్ దేశం ఎప్పటినుండో గట్టిగానే చెప్తూ వస్తున్నది కానీ ఈ తింగరి దేశాలకి అర్ధం కాలేదు. తరుచూ కాశ్మీర్ సమస్యని ఎత్తి చూపుతూ ఆంక్షల కొరడాని ఝళిపించడానికి సిద్ధపడుతూ వచ్చాయి.

అసలు ఫ్రెంచ్ విప్లవం[1792-1848] తరువాత ఫ్రాన్స్ మత ఛాందసమ్ నుండి బయటపడ్డది అంటే పరోక్షంగా చర్చి ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజలు ఎక్కువగా నాస్తికులుగానే ఉండిపోయారు చాలా కొద్ది మంది క్రైస్తవం వైపు మొగ్గు చూపారు కానీ తరువాతి కాలంలో నాస్తికమ్ కాస్తా లెనినినిజం - మార్క్సిజం గా రూపు దిద్దుకుంది. ఇదిగో ఆ నాస్తికత్వం లేదా లెనినిజం తాలూకు పైత్యం దైవ దూషణ. చార్లెస్ హెబ్దో తాలూకు ప్రొఫెట్ మహమ్మద్ ని వ్యంగ్యంగా [అసభ్యంగా ] చూపుతూ గీసిన కారికేచర్ లేదా కార్టూన్ తాలూకు హింస ఇప్పటిది కాదు.2006 చార్లీ హెబ్దో [ఫ్రెంచ్ వ్యంగ్య కార్టూన్ వార పత్రిక ] లో వచ్చిన ఒక కార్టూన్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.చార్లీ హెబ్దో ఒక్క మహమ్మద్ ప్రవక్త మీదనే కాదు వాటికన్ పోప్ మీద కూడా అసహ్యమయిన కార్టూన్లు ప్రచురించింది కాబట్టి చార్లీ హెబ్దో అనే పత్రిక ఇస్లాం కి మాత్రమే వ్యతిరేకం కాదు. అదే కార్టూన్ ని చూపిస్తూ హిస్టరీ ప్రొఫెసర్ తన విద్యార్ధులకి దాని తాలూకు వివరాలు చెప్పే ప్రయత్నం కాస్తా వికటించి మళ్ళీ హింసని ప్రేరేపించింది అతని హత్యకి కారణం అయ్యింది. ఒక చరిత్రని బోధించే ప్రొఫెసర్ ని తన వృత్తిని కొనసాగించే హక్కుని అతని హత్యవల్ల కోల్పోయింది అనేది ఫ్రెంచ్ ప్రభుత్వం వాదన అదే సమయంలో మత సహనం పేరిట సెక్యూరిలిజం అనే పదానికి కొత్త అర్ధం చెప్పడానికి సిద్ధం అయ్యాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మాక్రాన్ మాత్రం ఈ సారి తీవ్రంగానే స్పందించాడు. వివాదాస్పద స్థలాలుగా గుర్తించిన మసీదులు,మదార్సాల మీద నిషేధం విధించాడు. ఇతర దేశాలనుండి మసీదుల్లో, మదర్శాలలో పాఠాలు చేప్ప్డానికి వచ్చే ఇస్లామిక్ స్కాలర్స్ మీద ఫ్రాన్స్ లో రావడానికి నిషేధం విధించాడు. వచ్చే నెలలో ఫ్రాన్స్ చట్టాలలో తీవ్రమయిన మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. సహజంగానే కొత్త చట్టం ముస్లిం లమీద ఆంక్షలు విధించే దిశగానే ఉండబోతున్నది దీనికి ఫ్రాన్స్ ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ లక్షల మందీ వీధుల్లోకి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు ఇది మాక్రాన్ కి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వచ్చే నెలలో చేయబోయే కొత్త చట్టం మరింత వివాదం కాబోతున్నది అన్నది స్పష్టం.

అరబ్ దేశాలు : అనవసరంగా వివాదంలోకి వచ్చాయి. ఫ్రాన్స్ ఉత్పత్తులని బహిష్కరించాలి అనే కువైట్ ప్రభుత్వ నిర్ణయం అంత మంచి నిర్ణయం కాదు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఆయిల్ తప్పితే అంతా దిగుమతుల మీద ఆధారపడ్డ దేశం ఏదయినా ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. 

టర్కీ : ఎర్దోగాన్ కి అందివచ్చిన వరం మాక్రాన్ నిర్ణయం. అసలు టర్కీ కి కావాల్సింది ఇదే ఎందుకంటే టర్కీ దివాళా దిశలో పరుగులు పెడుతున్నది. ఫ్రాన్స్ వివాదం ని ఆడ్డం పెట్టుకొని ఋణ మాఫీ కోసం వల వేస్తున్నాడు. కానీ టర్కీ రుణాలని మాఫీ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. టర్కీ కరెన్సీ లీరా దారుణంగా పతనం అవుతున్నది. ఇంకో పాకిస్తాన్ గా మారినా ఆశ్చ్యర్యపోవక్కరలేదు. దావూద్ కి ఇప్పుడు కేంద్ర స్థానం ఇస్తాంబుల్. FATF వాచ్ లిస్ట్ లోకి ఎక్కబోతున్నది త్వరలో. 

జెర్మనీ : యాంజెల మోర్కెల్ మొదటిసారిగా రాడికల్ ఇస్లాం అనే పదం వాడడానికి సిద్ధపడ్డది. అసలు యూరోపులో మారణ కాండకి ఆద్యురాలు మోర్కెల్ అంటే తప్పులేదు. ఆఫ్ఘనిస్తాన్,సిరియా శరణార్ధులని అక్కున చేర్చుకొని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నది. అసలు సిరియా నుండి శరణార్ధులు నేరుగా జెర్మనీ వైపు రావడానికి కారణం మోర్కెల్ ఇచ్చిన అభయ హస్తం అంటే అతిశయోక్తి కాదు. అందరూ మొత్తుకుంటున్నా వినకుండా శక్తికి మించి శరణార్ధులకి ఆశ్రయం కల్పించి తమ సొంత పౌరులకి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు లబో డిబో మని ఏడుస్తున్నది.

బంగ్లాదేశ్ : ఎగుమతుల మీద ఆధారపడి నిలదొక్కుకుంటున్న సమయంలో యూరోపు లో శక్తిమంతమయిన దేశం ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం మంచిది కాదు. ఫ్రాన్స్ అంటే ఒక దేశం అనే ఆలోచన ఉండకూడదు మొత్తం యూరోపు ఫ్రాన్స్ తో ఉంది ఈ రోజున అంటే ఫ్రాన్స్ ఇచ్చే బట్టలు కుట్టే ఆర్డర్ మీద బతుకుకున్న బాంగ్లాదేశ్ తమ భవిష్యత్ ప్రణాలీకకి మోకాలు అడ్డం పెట్టడం లాంటిదే. ఫ్రాన్స్ ,జెర్మనీ,ఇటలీ దేశాల ఆర్డర్లు రద్దు అయితే ఏమిటీ పరిస్థితి ? ఆ ఆర్డర్ వేరే దేశాలకి ఇచ్చి కుట్టించుకుంటారు. బుర్ర తక్కువ వెధవలు.

ఉపసంహరణ : కాశ్మీర్ లో మానవ హక్కులు అంటూ యూరోపియన్ పార్లమెంట్ అరిచి నానా యాగీ చేసి చివరకి కాశ్మీర్ లో పర్యటించేదాకా గోల చేసింది. ఇప్పుడు ? జస్ట్ భారత ప్రధాని మోడీ తమకి సంఘీభావంగా ఒక తీవ్ర ప్రకటన చేయాలని చూస్తున్నది . ఇంతలో ఎంత మార్పు ? కానీ మోడీ ఈ విషయంలో ఆచి తూచి స్పందించారు చాలా డిగ్నిఫైడ్ గా. ఫ్రాన్స్ సంఘటన తరువాత ఒక శక్తిమంతమయిన దేశ ప్రధాని సానుభూతి కోసం చూస్తున్నది పూర్ యూరోప్. వ్యక్తిగతంగా మాక్రాన్ కి మోడీ మద్దతు ఉంటుంది కానీ మొత్తం యూరోపు కి కాదు. ఇలానే ఉండాలి.

జైహింద్ !

రామాయణమ్..114

 రామాయణమ్..114

..

అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్న సీతారామలక్ష్మణులు ఆయనకు నమస్కరించి నిలుచున్నారు.వీరిని చూడగనే ఎక్కడలేని సంతోషము కలిగింది మహర్షికి.ఆయన రాముడిని స్వంత కొడుకులాగ ఆదరించాడు.స్వయంగా తానే ఆతిధ్యమిచ్చాడు.

.

ఆయన తన భార్య అయిన అనసూయాదేవిని అక్కడికి పిలిచి ఆమెసముఖంలో మంచిమాటలతో వారిని సంతోషపెట్టాడు.

.

సీతాదేవిని అనసూయామాతకు అప్పగించి ....

ఆవిడగూర్చి రాముడితో .....

.....ఈవిడ అనసూయ గొప్పతపఃసంపన్నురాలు,పదివేల సంవత్సరములు తపస్సు చేసినది.ఎన్నో వ్రతాలు పూర్తిచేసినది.ఈమె తన గొప్పపనులచేత "అనసూయ" (కోపము,అసూయ లేనిది)అని లోకంలో ప్రసిద్ధి చెందినది.

.

అనసూయామాత వద్దకు సీతాదేవి వచ్చి ఆవిడకు ప్రదక్షిణము చేసి వినయంగా తన పేరుచెప్పి నమస్కరించింది.

.

అప్పుడు ఆ వృద్ధ తాపసి అమ్మాయీ విన్నానే నీగురించి ! నీవు ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావని తెలుసుకొన్నాను.

బంధుజనాన్ని,అహంకారాన్ని వదలి అడవికివెడుతున్న నాధుడిని అనుసరిస్తున్నావు .

.

ఏ స్త్రీ అయితే భర్తవనములో ఉన్నా ,నగరములో ఉన్నా ,వాడుపాపాత్ముడుకానీ ,పుణ్యాత్ముడుకానీ అతనిని అనుసరిస్తూ ఉంటుందో ఆ స్త్రీ కి ఉత్తమ లోకములు కలుగుతాయి.

.

సీతా ,భర్తను మించిన బంధువు ఎవడైనా ఉన్నాడా?

.

మనస్సును కామమునకి వశం చేసిన స్త్రీలు భర్తలమీద అధికారం చెలాయిస్తూ మంచిచెడ్డలు తెలుసుకోలేరు.

.

అమ్మా స్త్రీ కి భర్తపూజ్యుడు అనే విషయము నాకు తెలియును.భర్త ఎంత చరిత్రహీనుడైనా అతనిని తప్పక పూజించవలసినదే.

.

అలాంటిది గుణములచేత శ్లాఘింపదగినవాడు,దయామయుడు,జితేంద్రియుడు,

స్థిరమైనప్రేమగలవాడు,ధర్మాత్ముడూ,నాతల్లివలే,తండ్రివలే నాకు చాలా ఇష్టుడు అయిన నా భర్తగురించి వేరే చెప్పాలా?

.

తన తల్లి కౌసల్యవిషయములో ఏ విధముగా ప్రవర్తించునో ఇతర రాజభార్యల విషయములో కూడా అలాగే ఉంటాడు.

.

అంత ఎందుకు దశరథుడు ఒక్కమాటు చూసిన స్త్రీ ని కూడా తన తల్లి లాగ గౌరవిస్తాడు.

.

అమ్మా! నాకు నా తల్లి,అత్తగారు ఇరువురూ ఉపదేశించిన మాటలను మనస్సులో ఉంచుకొన్నాను.

.

స్త్రీ కి పతి శుశ్రూషే పెద్ద తపస్సు వేరే ఏ తపస్సు అవసరములేదు.

.

నాకు సావిత్రి ,రోహిణి ఆదర్శము అని పలుకుతున్న సీతమ్మను దగ్గరకు తీసుకొని ముద్దుగా శిరస్సుపై ఆఘ్రాణించింది అనసూయామాత.

.

NB

.

సీతమ్మ దృష్టిలో రాముడు ఎంత గొప్పవాడో చూడండి.

అలాగే దశరథుడు ఎంత కాముకుడో కూడా గమనించగలరు.అంత కాముకుడైన తండ్రికి ఏకపత్నీవ్రతుడైన కొడుకు.!

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణం మాసంస్కృతి"*

 🙏జైశ్రీమహాదేవ🙏

ఈ *మాట* ఏ దేశం అన్నదో మీకు తెలుసా? 

 *ఇస్లాం మామతం*

----కానీ---

*"రామాయణం మాసంస్కృతి"* 


👉 తెలీదా? అయితే చదవండి.


ఒకసారి పాకిస్తానీ నియంత జనరల్ జియావుల్ హక్ *ఇండోనేషియా* వెళ్ళాడు. 

అది ఒక ముస్లిం దేశమని అందరికీ తెలిసిన విషయమే. ఆ దేశ సైన్య శిక్షణానంతరం ఉండే Passing Out Parade కి జియావుల్ హక్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించారు. 


అయితే ఈ పరేడ్ మొత్తం 

*శ్రీ హనుమంతుని విగ్రహం* ముందు జరుగుతున్నది. అధికారులు ఒక్కొక్కరిగా స్వామి విగ్రహం ముందే శపథం స్వీకరిస్తున్నారు. ఇది చూసిన జియావుల్ కి ఒళ్ళు మండిపోయింది. 

అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు. అతను ఎంతో గర్వంగా, గౌరవంగా మాట్లాడుతూ౼౼

*"తాము మతాన్ని మార్చుకున్నామేగానీ ,* *మా సంస్కృతిని, పూర్వీకులను మార్చుకోలేదని సమాధానమిచ్చాడు.*


వాళ్ళు పరిరక్షిస్తున్న *సనాతన సంస్కృతి* మన భారతీయుల నుండి వారసత్వంగా గ్రహించినదే కదా! 

మతం మార్చుకున్నవాళ్లే తమ సంస్కృతి పరిరక్షణకై అంత శ్రద్ధ తీసుకుంటున్నపుడు సనాతన ధర్మ వారసులం, హిందువులం, భారతీయులమైన మనం, 

మన సంస్కృతీపరిరక్షణలో *ఇంకెంత శ్రద్ధ వహించాలి???* 

ముసుగు దొంగలు, దేశ ద్రోహులు సృష్టించిన *సెక్యులరిజం* అనే మాయలో, గోలలో పడిపోయిన భారతీయ హిందువులు - మతనిరపేక్షదేశం నుండి సంస్కృతీనిరపేక్ష దేశంగా ఎందుకు వెళ్ళిపోతున్నాము??? అత్యంత పురాతన, విశిష్ట,  దైవిక సంబంధమైన మన సంస్కృతిని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇదెలాగో ఉదాహరణలతో మాట్లాడుకుందాం.

 *1950వ దశకంలో ఇండోనేషియాలో అంతర్జాతీయ రామాయణమహోత్సవం* జరిగింది. అందులో భాగంగా జరిగే ఒక నృత్య నాటికలో పాల్గొనుటకు కళాకారులను పంపమని ఆ దేశం ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపింది. కొన్ని ముస్లిం దేశాలు కూడా కళాకారులను పంపాయి.

 కానీ *అప్పటి ప్రధాని నెహ్రూ -* *"మనది సెక్యులర్ దేశమనీ, అందువలన కళాకారులను పంపటం కుదరదు"* అని తెలిపాడు. అంటే *మన దేశ సంస్కృతీ పరిరక్షణ కన్నా ఆయన కి సెక్యులరిజం ఎక్కువైపోయింది.* 


ఇక మరో విషయాన్ని చెప్పుకుంటే -- *ఇందిరాగాంధీ* ఇంకొకపని చేసారు. మొరాకో రాజధానిలో జరిగే *అంతర్జాతీయ ముస్లిం సమ్మేళనానికి* అప్పటి *కేంద్రమంత్రి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ను పంపారు.*

 అసలు విషయమేమంటే - *మనకు అసలు ఆహ్వానం అందనే లేదు.* 

పైగా ఆవిడ  ఏమని సమర్థించుకున్నారో  తెలుసా? చాలా ముస్లిం దేశాలకన్నా మనదేశంలో *ముస్లింల జనాభా* ఎక్కువట, కాబట్టి పంపక తప్పలేదట. 

"మీరంతా తెలివైనవారు కాబట్టి నేను మొత్తం  విషయాన్ని వివరించనవసరం లేదు."


 కొంతకాలం కిందట *ఇండోనేషియా దేశం యొక్క విద్య మరియు సంస్కృతీ శాఖామంత్రి అనీస్ బాస్వేదన్* మనదేశం వచ్చారు. 

ఏమన్నారో చూడండి:-  - 

"మా దేశం రామాయణ ప్రదర్శనలకు పెట్టిందిపేరు. 

మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీదేశంలోని వివిధ నగరాలలో పర్యటించి రామాయణ ప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. 

మీ కళాకారులు కూడా మా దేశానికి రండి. 

ఇరుదేశాలు కలిసి ప్రదర్శనలు చేద్దాము. 

ఇరుదేశాల విద్యార్థులకు కూడా శిక్షణ ఇద్దాము. 

మా విద్యా విధానంలో రామాయణం పవిత్ర గ్రంధాన్ని చేర్చాము. అని అన్నారు. 

"ఈ విషయం మీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించిందా? లేదా? చెప్పండి. 

ఇండోనేషియా మొదటి రాష్ట్రపతి సుకర్ణో సమయంలో, పాకిస్థాన్ కు చెందిన డెలిగేషన్ ఒకటి అక్కడ పర్యటించింది. అపుడు వాళ్ళు *రామలీల* ప్రదర్శించడాన్ని చూసి షాక్ తిన్నారట. ఒక ముస్లిం దేశంలో రామలీలా? అని అడిగారట. దానికి ఇండోనేషియా పాలకులు సుకర్ణో సమాధానమేమిటో తెలుసా? - 


👉 *"ఇస్లాం మా మతం అంతే...*

*కానీ రామాయణం మా సంస్కృతి."* 


ఇండోనేషియా దేశపు *కరెన్సీ నోట్ పైన బొజ్జ గణపయ్య చిత్రం* ముద్రించారు.


 అటువంటి దేశాధ్యక్షుడికి, తమ సంస్కృతీ పరిరక్షణలో భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇండోనేషియా ముస్లింలకు శతకోటి ప్రణామాలు చేద్దాం. 

🙏🙏🙏🙏🙏

*ఈ వాస్తవాలు మన భారతీయ హిందూ సమాజానికి మేలుకొలుపు అవుతుందని, లౌకికవాదం, సెక్యూలరిజం వంటి మాటలు ముమ్మాటికీ హిందూ వ్యతిరేక పాలకుల కుట్రలు అని గుర్తించి, ఈ క్షణం నుండే దేవాలయం వైపుగా, మన సనాతన ధర్మ ఆచరణ దిశగా అడుగులు వేద్దాం. మన హిందూ ధర్మమే ఉత్తమ జీవన విధానమని, గొప్ప విజయాలకు, అభివృద్ధికి మూలమని నేటి కరోనా పరిస్థితులు ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశాయి. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి. 

*హిందువుగా గర్వంగా జీవిద్దాం.* 


🙏  ధన్యోస్మి  🙏

శ్రీమహాదేవపీఠమ్

చెడగొట్టు

 😫 *చెడగొట్టు* ?? 😪

~~~~~~~~~~~~~~~~~~~

అడవి పై వల వేసి

ఎడారిలో తప్పిపోతాడు ?!

* * *

నదులను ఆమ్లఆమ్లంచేసి

గుక్కెడు గుక్కెడు నీటికోసం

గుక్క పెట్టి ఏడుస్తాడు ?!

    * * * 

తెలివి మీరి

తన తల పై తానే

చేయి పెట్టుకుని

బూడిద బొమ్మై పోతాడు !?

* * *

మనిషి

పుట్వడిగా

ఎంత ఎంత గొప్పో

అంత చెడగొట్టు ?!

* * *

స్వర్గాన్ని

నరకం చేసుకుని - 

కడాయిలో

జీవితాంతం ఈదుతుంటాడు !? 

        - కందాళై రాఘవాచార్య

అంతర్గతంగా ఉన్న పరాశక్తిని

 ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.


యంత్రమంటే ఏమిటి ?


యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు. అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.


నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.


శ్రీ చక్ర ఆవిర్భావం


ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.


కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే ”పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.


శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు


అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి. 1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.


మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.


శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.


శ్రీ చక్ర నిర్మాణం


బిందువు, త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము – బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణము లతో కూడినది శ్రీచక్రం.


శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదూ శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది.


నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం.


శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.


1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం


2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం


3. అష్ట దళ పద్మం – సర్వ సంక్షోభిణీ చక్రం


4. చతుర్దశారము – సర్వ సౌభాగ్య చక్రం


5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం


6. అంతర్దశారము – సర్వ రక్షాకర చక్రం


7. అష్ట కోణము – సర్వ రోగహర చక్రం


8. త్రి కోణము – సర్వ సిద్ధిప్రదా చక్రం


9. బిందువు – సర్వానందమయ చక్రం


ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు. శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్‌, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిద ఆవరణములలోని వివిధ దేవతలు నమస్కార నవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలు అణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధ రకములైన మానసిక ప్రవృత్తులు.


శ్రీ చక్రం – మానవ శరీరం


గమనించవలసిన విషయమేమంటే, ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవునియందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే – నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో, మన మేరుదండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.


మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.


శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్‌చక్రమని, నవయోనిచక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.


దేహో దేవాలయః ప్రోక్తో


జీవో దేవస్సనాతనః


త్యేజేదజ్ఞాన నిర్మాల్యం


సోహంభావేన పూజయేత్‌ !


శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.


కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి. విశ్వంలోని శక్తులన్ని ఈ నవావరణముల ద్వారా ద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.


నిరంతర సాధన మార్గం


శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి, వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!


త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు, తొలగించుకో వలసిన తెరలు, అనుభవించవలసిన సుఖదుఃఖాలు అన్ని శ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి. ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు. మనమే జాగ్రత్తగా, నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి. వాటిని లేకుండా చేయలేం. అందువల్లనే త్యాగరాజస్వామి కూడా తెరను తొలగించమని ప్రార్థించారు తప్ప, తెరలేకుండా చేయమనలేదు. మనలోని ప్రాపంచిక మైన ముప్పది ఆరు తత్వములు, త్రిపుటలు, నవా వరణములను నిర్లిప్తతతో, నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలే తప్ప వేరొక మార్గం లేదు.