4, నవంబర్ 2020, బుధవారం

ప్రధమస్కంధం

 పోతన భాగవతం  ప్రధమస్కంధం


నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి !!
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి,!! దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, !! మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్!!,
మోదకఖాదికిన్,!! సమద మూషక సాదికి, సుప్రసాదికిన్!!.

పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.. 

కామెంట్‌లు లేవు: