**అద్వైత వేదాంత పరిచయం**
06. ఉపాసనా యోగం
వైదికులు పొందాల్సిన నాలుగు లక్ష్యాలనూ, అందులో అంతిమ లక్ష ్యమైన మోక్షం గురించీ చూసాము. అవి పొందటానికి వాళ్ళు పాటించాల్సిన మార్గాలను
మూడు విధాలుగా విభజించవచ్చు. అవి
1. కర్మయోగం 2. ఉపాసనాయోగం 3. జ్ఞానయోగం
ఇంతకుముందు కర్మయోగం గురించి చూసాము. కర్మయోగం అంటే అంతర్గత ఎదుగుదలకి తోడ్పడేటట్లు పనులు చేయటం.ప్రాపంచిక సుఖాలకోసం పాటుపడకుండా
ఆధ్యాత్మిక ఎదుగుదలకి పాటుపడాలి. దృక్పథంలో మార్పు వస్తే, అకర్తా, అభోక్తాగా పనులు చేయవచ్చు. దీన్ని
భగవద్గీతలో మూడవ అధ్యాయంలో వివరంగా చూడవచ్చు.
ఇక ఉపాసనాయోగం విషయానికి వస్తే శంకరాచార్యుల వారు దీన్ని సమాధియోగం అనికూడా అంటారు. పురుషార్థం సాధించటానికి మన వ్యక్తిత్వాన్ని సంసిద్ధం
చేయటమే ఉపాసనాయోగం ఉద్దేశం. పురుషార్థయోగ్యతా సంపాదనార్థం. మన జీవిత అంతిమ లక్ష ్యం మానవ లక్ష్యాలను సాధించే నిరంతర ప్రయాణం కాబట్టి, ఉపాసనని, యోగ్యత
సంపాదించే కార్యక్రమంగా అభివర్ణించవచ్చు.
కఠోపనిషత్తులో, మన లక్ష ్యసాధనలో మనని ఒక రధంతో పోల్చారు.ఎలాగైతే ప్రయాణంచేసి, గమ్యం చేరటానికి వాహనం మంచి స్థితిలో ఉండాలో, అలా మన
శరీరం కూడా మంచి స్థితిలో ఉండాలి. అందుకని,శాస్త్రాలు మన శరీరాన్ని కొన్ని భాగాలుగా విభజించాయి. శరీర
నిర్మాణం క్లిష్టంగా ఉండి, ఒక్కసారిగా మనకి అర్థంకాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా వివిధ విభాగాలుగా విభజించింది. ఒక కోణంలోంచి కోశపంచకం అన్నారు. ఇంకో
కోణంలోంచి శరీరత్రయం అన్నారు. మన అధ్యయనం కోసం మన శరీరాన్ని మూడు భాగాలుగా విభజిద్దాం.ఇది శాస్త్రప్రకారం జరిగింది,కాబట్టి, చాలా యోగ్యమైన విభజనగా పరిగణించాలి.
1. కాయిక అంశ -భౌతిక కాయం
2. వాచిక అంశ-వాక్కు
3. మానసిక అంశ-మనసు
వాక్కు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. మనసు అంతకన్నా క్లిష్టమైనది, కాని అత్యంత ముఖ్యమైనది కావటంతో దాన్ని నిర్లక్ష ్యం చేయలేము. శాస్త్రం ఈ మూడు
భాగాలని నియంత్రించేందుకు ప్రోగ్రాములని నిర్దేశించింది.
అద్వైత వేదాంత పరిచయం
6.2. వాచిక అంశ :
వ్యక్తిత్వంలోని రెండో అంశ వాచిక అంశ. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. వివేకచూడామణిలో శంకరాచార్యులు చెప్పారు:
యోగస్య ప్రథమం ద్వారం వాక్ నిరోధోపరిగ్రహ: నిరాశా చ నిరీహా చ।
కృష్ణుడు భగవద్గీత, పదిహేడవ అధ్యాయంలో వాచిక తపస్సుకి నాలుగు అంశాలను సూచించాడు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి