4, నవంబర్ 2020, బుధవారం

శాంతి లోపించటానికి ప్రధాన కారణం ఏమిటి ?"*

 *"జీవితంలో శాంతి లోపించటానికి ప్రధాన కారణం ఏమిటి ?"*

_*శ్రద్ధ లోపించటమే కారణం ! శ్రద్ధతో చేసే పనుల వల్ల అశాంతి ఉండదు. శ్రద్ధతో చేసే ప్రతి పని దైవార్పిత కార్యంగా మారి మనసును శుద్ధి చేస్తుంది. కేవలం పూజల్లోనే కాకుండా దైవధ్యానం నిరంతరం జరగాలి. అది శ్రద్ధతో ఉన్న మనసుకే సాధ్యం. ఎక్కడి నుండి తీసిన వస్తువును తిరిగి అక్కడ పెట్టే శ్రద్ధలేని వారికి దైవాన్ని తెలుసుకునే శ్రద్ధ ఎలా వస్తుంది ? చాలా మంది మతిమరుపు ఉందనుకుంటారు. అశ్రద్ధనే మనం మతిమరుపు అనుకుంటున్నాం. ప్రతి చిన్నపనిలో కూడా శ్రద్ధ అలవడితే జీవితమే మధురంగా మారిపోతుంది. అలాగే మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనసులోని స్వార్థం పోతుంది. నిత్యజీవితంలో తనకు అవసరమైన వస్తువులపైనే శ్రద్ధ పెట్టలేని మనసు తనపైన, జపంపైన ఎలా శ్రద్ధ నిలుపగలుగుతుంది ? జీవితంలో శాంతి లోపించేది అశ్రద్ధ వల్లనే !*

కామెంట్‌లు లేవు: