🕉️🌺 #శ్రీమహావిష్ణుసహస్రనామవైభవము-41🌺🕉️
🍂 శ్లోకం 35 🍂
*అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః|*
*అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః*
318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)
319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.
320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.
321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.
322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.
323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.
324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.
325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.
326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు
శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః
అపాం నిధి రధిష్ఠాన మప్రమత్త ప్రతిష్ఠితః !!35!!
-------------------------- (నామాలు 318 – 326)
73. నిత్యమైన వాడు, సత్య ప్రసిద్ధుడు
ప్రాణమిచ్చు చుండు, ప్రాణమతడె
అరయ వాసవునికి యాతడు తమ్ముడే
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : అచ్యుత ... నాశనము లేనివాడు, ప్రథిత ... ప్రసిద్ధుడు, ప్రాణ..ప్రాణము, ప్రాణద ... ప్రాణము ఇచ్చువాడు, వాసవానుజ ... వాసవుని తమ్ముడు.
భావము : నిత్యము, సత్యము అయినవాడు అనగా శాశ్వతమైనవాడు(చ్యుతము అంటే నాశనము అది లేనివాడు అంటే శాశ్వతుడే కదా), ఎప్పటికీ ప్రసిద్ధుడైనవాడు, ప్రాణము తానే, అదిచ్చేదీ (ప్రాణ దా ...ప్రాణము ఇచ్చు అనే కదా) తానే అయిన వాడు, ఇంద్రుని సోదరుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}
( వివరణ : అదితి, కశ్యపులకు ఇంద్రుని (వాసవుని) తర్వాత వామనుని రూపంలో అవతరించిన వాడే శ్రీ మహా విష్ణువు కదా కనుకనే ఆయనను వాసవానుజుడు అంటున్నారు.)
74. జలధి యనగ నతడె, జగతి కాధారమూ
జగతి రక్షణందు జతన మెండు
తవిషి రక్షణకును తానె ప్రతిష్ఠితః
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : అపాం నిథి ... సాగరుడు, అధిష్ఠానం ... ఆధార కేంద్రం, అప్రమత్తత ... అతి జాగ్రత్త, ప్రతిష్ఠిత ... స్వయంగా ప్రతిష్ఠితుడైనవాడు.
భావము : సర్వమూ తానైనవాడే గనుక సాగరుడే అనుకోవచ్చు లేదా దయా సముద్రుడూ అనుకోవచ్చ( అపాం అంటేనే నీరు కదా), సమస్త విశ్వానికి ఆధార కేంద్రమైన వాడు( అధిష్ఠానం అంటే ఆధారపడదగిన అనే కదా..), విశ్వాన్ని రక్షించేందుకు సదా అప్రమత్తుడై యుండువాడు( జతనము అంటే అప్రమత్తత అని కదా), తవిషి అంటే భూమి (అదే ప్రపంచం కూడా ) రక్షణకు తనకు తానుగా ప్రతిష్ఠితుడైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}
-ఓం నమో నారాయణాయ
*హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి