4, నవంబర్ 2020, బుధవారం

*శ్రీ గాయత్రీదేవి

 *శ్రీ గాయత్రీదేవి*


*ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః*

*యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌*

*గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం*

*శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే*

 

సకల వేద స్వరూపం గాయత్రీదేవి. 


అన్ని మంత్రములకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. 


ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది.


‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.

కామెంట్‌లు లేవు: