4, నవంబర్ 2020, బుధవారం

*శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*

 *శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*


 (11వ భాగం)


తారకసురుడి నిరంకుశత్వానికి తోడుగా త్రిపురాసులనే ముగ్గురు రాక్షసులు తపస్సు చేసి వరాలు పొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే మూడు పట్టణాలను నిర్మించుకొని ముల్లోకాల మీద విరుచుకుపడ్డారు. మూడుపురాల మీద ఎగురుతూ అగ్ని గోళాల్ని కురిపిస్తు,పట్టణాలను,పచ్చని పల్లేలను మీద విరుచుకుపడుతూ విద్వంసకాండ సాగిస్తున్నారు జగ్గత్తు అట్టుడి పోతోంది.


వారిని అంతమొందించేగలవాడు శివుడొకడేనని దేవతలందరు భావించి దేవతలందరు కలసి వచ్చి మందిర ప్రాంతంలో ఘోరమైన ప్రార్ధనలు చేశారు.


పెళ్ళాడినకొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు భావించి,త్రిపురాసురులు చేస్తున్న మారణహోమం విన్న మీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశులాన్ని  పట్టుకొని,తన అనుచరుల్ని,ప్రమధగణాలనూ వెంటబెట్టుకొని,త్రిపురాసులను తుద ముట్టించేందుకు ఆవేశంతో కదిలాడు


అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాల్ని బీభత్సం చేస్తూ,ఒక రాక్షస రాజు బయలదేరాడు,బ్రహ్మండమైన ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది.అతడు సాటిలేని గొప్ప శివభక్తుడు. శివుడి వల్ల తప్ప మరొకరివల్ల చావులేని వరం పొందాడు


"శివుణ్ణి నీ లోపల ఉంచేసుకుంటే మరీ మంచిదీ కదా!అని నారదుడు గజాసురుని మేలు కోరుతున్నవాడిలాగ అతడితో చెప్పాడు గజాసురుడు వెంటనే కోపాగ్రేశుడై ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణీ మెప్పించాడు. త్రిపురాసుర సంహారానికని బయలుదేరిన శివుడు గజాసురిడి కోరిక ప్రకారం గజాసురిడి గుండెలో లింగారూపంతో ఉండిపోయాడు.


" శివుడు గజాసురిడి గుండెలో ఉండిపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవవధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికి, పార్వతికి పుట్టవలసిఉన్నవాడివల్లనే కదా తారకాసురిడి అంతం జరగాలి?" అని దేవతలు అంతా దిగులు ముఖాలువేస్తుంటే నారదుడు, "శివుడు ఉబ్బులింగడు కదా!" అని ఉపాయం అందించాడు. మరుక్షణమే దేవతలంతా గజాసురిడి ఎదుట శివుణ్ణి పొగుడుతూ గొంతెత్తి స్తోత్ర పాఠాలు మొదలు పెట్టారు

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: