4, నవంబర్ 2020, బుధవారం

హిమనగంబు

 హిమనగంబు

౼౼౼౼౼౼౼౼

ఘన పుణ్యతీర్థాలు గంగోత్రి యమునోత్రి

       క్ష్మాజేర చోటిచ్చు క్ష్మాధరంబు

కీర్తిత క్షేత్రస్థు కేదార నాథేశు

        మోదాన సేవించు  భూధరంబు

అలకనందా స్నాతు నాబదరీనాథు

         ఎదభక్తిగొల్చు న్మహీధరంబు

ఆ హిమానీ నదాహ్లాదు నమరనాథు

          సేవేచ్ఛనే పొందు క్షితిధరంబు


విమల కాశ్మీరు కుంకుమ విరులశోభ

అమల ఫలభక్ష్యరాశుల నలరుదీప్తి

బ్రహ్మపుత్ర సట్లెజు నదీవారి నిథుల

నిడుచు భరతాంబకండయౌ హిమనగంబు.


రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

కామెంట్‌లు లేవు: