కొత్త రాగం ! పల్లవి,చరణాలు పాతవే ! మొదట పాశ్చ్యాత్యమ్ ! తరువాత భారతీయం ! భాషలు వేరు వేరు ! కానీ అర్ధం మాత్రం ఒకటే !సెక్యులరిజం ! ఫ్రాన్స్ అంటే అంతే ! ఆ మాటకొస్తే మొత్తం యూరోపు అంతే ! తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం - తీరా ఆచరణకి వస్తే బేలతనం. హిట్లర్ కి ఎప్పుడూ ఫ్రాన్స్ అంటే చులకన భావమే ! ఫ్రెంచ్ ప్రజలకి ఇంగ్లీష్ వాళ్ళంటే చులకన. మేము గొప్ప. తీరా నాజీ సైన్యం ఫ్రాన్స్ లోకి చొచ్చుకువచ్చి అప్పటికే నిర్మాణం లో ఉన్న ఈఫిల్ టవర్ ముందు నిలబడి తన కమాండర్లతో ఫోటో దిగి మరీ మేము ఫ్రాన్స్ ని ఆక్రమించుకున్నాము తరువాత బ్రిటన్ ఆ తరువాత మొత్తం ప్రపంచం మాదే అంటూ పత్రికలలో పతాక శీర్షికలతో ప్రచారం చేసుకున్నాడు. బేలగా ప్రపంచం నుండి సహాయం అందుతుందేమో అని ఎదురుచూపులు ! ఫ్రాన్స్ దాకా వచ్చిన నాజీ సైన్యం బ్రిటన్ లోకి రాకుండా ఉంటుందా ? ముందు మమ్మల్ని మేము రక్షించుకోవాలి మీకు సహాయం చేయలేము అంటూ బ్రిటన్ నుండి సందేశం ఫ్రాన్స్ కి . ఇక దేవుడే దిక్కు. నాజీ సైన్యం ఫ్రెంచ్ ఆడవాళ్ళని మానభంగం చేయడం నిత్య కృత్యం ఎదురుతిరిగిన వాళ్ళని నిర్దాక్ష్యంగా చంపేది.
భూతల స్వర్గం ఫ్రాన్స్ ! మితిమీరిన స్వేచ్చ కి మారుపేరు ! జపాన్ కనుక అమెరికాలోని పెరల్ హార్బర్ మీద బాంబు దాడులు కనుక చేయకుండా ఉంటే ఫ్రాన్స్ ఎప్పటికీ నాజీ సైన్యం కింద నరకం లో ఉండేదే ! థాంక్స్ జపాన్ ! పెరల్ హార్బర్ మీద బాంబుదాడులతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో తప్పనిసరి పాత్ర పోషించాలివచ్చింది. రష్యా,బ్రిటన్,అమెరికా లు కలిసి జెర్మనీ ని లొంగదీసుకున్నాక అదీ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని బెర్లిన్ రేడియోలో చెప్పిన తరువాత మొదట సంబరాలు చేసుకున్నది ఫ్రాన్స్ ప్రజలే. ఫ్రాన్స్ గుణ పాఠం నేర్చుకున్నది. తరువాతి కాలంలో బ్రిటన్ తో కలిసి కొన్ని, జెర్మనీ,ఇటలీ,నార్వే,డెన్మార్క్ ,స్విట్జర్లాండ్ లతో కలిసి ఆయుధాలని తయారుచేసింది. జాగ్వార్ ఫైటర్ జెట్ ఫ్రాన్స్,బ్రిటన్ ల ఉమ్మడి ఉత్పత్తి. ఇక మీరేజ్ సీరీస్ విమానాలు అన్నీ కూడా విజయవంతమయినవే. ఇప్పుడు యూరోపులో తను ఒక స్వతంత్ర ఆయుధ తయారీదారు. 'చార్లెస్ డి గల్లే ' విమాన వాహక యుద్ధ నౌక ఫ్రాన్స్ నైపుణ్యానికి మచ్చు తునక. ఇంతవరకు బాగానే ఉంది. స్వేచ్చ విషయంలో మాత్రం పాతకాలపు ఆలోచనలతోనే ఉంది. అసలు ఫ్రాన్స్ అంటేనే స్వేచ్చా కదా ? అది ఏ విషయంలో అయినా సరే స్వేచ్చ అంటే అది ఆధునిక సంస్కృతి దానికి ఫ్రాన్స్ ప్రతీక. అదే ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చింది-మితిమీరిన స్వేచ్చ.
ఒకప్పటి క్రూసేడ్ యుద్ధాల చరిత్రని అందరూ మరిచిపోయినా వాటి తాలూకు జ్ఞాపకాలని నిత్యం పాఠాలుగా చెప్పే విద్యాసంస్థలకి కొదువలేదు మరీ ముఖ్యంగా యూరోపులోని మసీదులు,మదార్సాలు ఇంకా ఆ పనిలోనే ఉన్నాయి. మితి మీరిన సెక్యులరిజం ఇప్పుడు యూరోపుని వణికిస్తున్నది. గత రెండు దశాబ్దాలుగా ఫ్రాన్స్ లోని కొందరు అతివాదులు హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ఏ అధ్యక్షుడు వాటిని లెక్కచేయలేదు. ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ అయితే ఫ్రాన్స్ కి మరింత స్వేచ్చ కావాలనేవాడు. మత స్వేచ్చని హరించే హక్కు ఎవరికీ లేదనేవాడు అఫ్కోర్స్ యూరోపు మొత్తం అదే భావనలో ఉంది సిరియా శరణార్ధులు వచ్చే వరకు. జెర్మనీ,ఫ్రాన్స్, బెల్జియం,నార్వే,డెన్మార్క్,ఆస్ట్రియా ఇలా అన్నీ యూరోపు దేశాలలో మత స్వేచ్చ పేరుతో రైళ్లలో,బస్సుల్లో, మెట్రో స్టేషన్లలో బాంబులు పెట్టి పేల్చడం జరుగుతూనే ఉన్నాయి కానీ అప్పడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మళ్ళీ షరా మామూలే అన్న పద్ధతిలో ఉంటూ వచ్చాయి.
గత నెల అక్టోబర్ 16న చరిత్రని బోధించే ఫ్రాన్స్ కి చెందిన ప్రొఫెసర్ సామ్యూల్ పాటీ [47] ని తల నరికి చంపేశాడు చెచెన్య కి చెందిన శరణార్ధి. చెచెన్యా అంటే తెలుసుగా ? గత మూడు దశాబ్దాలుగా రష్యాతో పోరాడుతున్న చెచెన్యా దేశానికి చెందినవాడు. చెచెన్యా కి చెందిన వాళ్ళని ఏ దేశము శరణార్ధిగా అంగీకరించకపోవడానికి కారణం విపరీతమయిన హింస స్వభావామ్ కలిగిఉండడమే కానీ ఫ్రాన్స్ తో పాటు జెర్మనీ కూడా చెచెన్ దేశస్థులని అక్కున చేర్చుకున్నాయి. అఫ్కోర్స్ రష్యా చెచెన్యంల తో డీల్ చేసినట్లు వేరే ఏ దేశము చేయలేదు. అప్పట్లో యూరోపు తో సహా అమెరికా కూడా రష్యా మీద దుమ్మెత్తిపోశాయి మానవ హక్కులు అంటూ.కానీ చేచన్ తీవ్రవాదుల మీద బోలెడంత ప్రేమ కురుపించాయి యూరోపు దేశాలు. తీవ్రవాదులకి మానవహక్కులు ఉంటాయి - యూరోప్. ఇప్పుడు అదే చెచెన్ దేశానికి చెందినవాడు ఫ్రాన్స్ హిస్టరీ ప్రొఫెసర్ ని తల నరికి చంపేశాడు - తీవ్రవాదాన్ని అరికట్టాలి - యూరోప్ . అనుభవం అయితేనే కానీ తత్వం బోధపడలేదు. కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నది - యూరిపియన్ యూనియన్. ఓహ్ ! మానవ హక్కులు, సెక్యులరిజం రెండూ ఒక చోట ఉండలేవు అని భారత్ దేశం ఎప్పటినుండో గట్టిగానే చెప్తూ వస్తున్నది కానీ ఈ తింగరి దేశాలకి అర్ధం కాలేదు. తరుచూ కాశ్మీర్ సమస్యని ఎత్తి చూపుతూ ఆంక్షల కొరడాని ఝళిపించడానికి సిద్ధపడుతూ వచ్చాయి.
అసలు ఫ్రెంచ్ విప్లవం[1792-1848] తరువాత ఫ్రాన్స్ మత ఛాందసమ్ నుండి బయటపడ్డది అంటే పరోక్షంగా చర్చి ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజలు ఎక్కువగా నాస్తికులుగానే ఉండిపోయారు చాలా కొద్ది మంది క్రైస్తవం వైపు మొగ్గు చూపారు కానీ తరువాతి కాలంలో నాస్తికమ్ కాస్తా లెనినినిజం - మార్క్సిజం గా రూపు దిద్దుకుంది. ఇదిగో ఆ నాస్తికత్వం లేదా లెనినిజం తాలూకు పైత్యం దైవ దూషణ. చార్లెస్ హెబ్దో తాలూకు ప్రొఫెట్ మహమ్మద్ ని వ్యంగ్యంగా [అసభ్యంగా ] చూపుతూ గీసిన కారికేచర్ లేదా కార్టూన్ తాలూకు హింస ఇప్పటిది కాదు.2006 చార్లీ హెబ్దో [ఫ్రెంచ్ వ్యంగ్య కార్టూన్ వార పత్రిక ] లో వచ్చిన ఒక కార్టూన్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.చార్లీ హెబ్దో ఒక్క మహమ్మద్ ప్రవక్త మీదనే కాదు వాటికన్ పోప్ మీద కూడా అసహ్యమయిన కార్టూన్లు ప్రచురించింది కాబట్టి చార్లీ హెబ్దో అనే పత్రిక ఇస్లాం కి మాత్రమే వ్యతిరేకం కాదు. అదే కార్టూన్ ని చూపిస్తూ హిస్టరీ ప్రొఫెసర్ తన విద్యార్ధులకి దాని తాలూకు వివరాలు చెప్పే ప్రయత్నం కాస్తా వికటించి మళ్ళీ హింసని ప్రేరేపించింది అతని హత్యకి కారణం అయ్యింది. ఒక చరిత్రని బోధించే ప్రొఫెసర్ ని తన వృత్తిని కొనసాగించే హక్కుని అతని హత్యవల్ల కోల్పోయింది అనేది ఫ్రెంచ్ ప్రభుత్వం వాదన అదే సమయంలో మత సహనం పేరిట సెక్యూరిలిజం అనే పదానికి కొత్త అర్ధం చెప్పడానికి సిద్ధం అయ్యాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మాక్రాన్ మాత్రం ఈ సారి తీవ్రంగానే స్పందించాడు. వివాదాస్పద స్థలాలుగా గుర్తించిన మసీదులు,మదార్సాల మీద నిషేధం విధించాడు. ఇతర దేశాలనుండి మసీదుల్లో, మదర్శాలలో పాఠాలు చేప్ప్డానికి వచ్చే ఇస్లామిక్ స్కాలర్స్ మీద ఫ్రాన్స్ లో రావడానికి నిషేధం విధించాడు. వచ్చే నెలలో ఫ్రాన్స్ చట్టాలలో తీవ్రమయిన మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. సహజంగానే కొత్త చట్టం ముస్లిం లమీద ఆంక్షలు విధించే దిశగానే ఉండబోతున్నది దీనికి ఫ్రాన్స్ ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ లక్షల మందీ వీధుల్లోకి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు ఇది మాక్రాన్ కి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వచ్చే నెలలో చేయబోయే కొత్త చట్టం మరింత వివాదం కాబోతున్నది అన్నది స్పష్టం.
అరబ్ దేశాలు : అనవసరంగా వివాదంలోకి వచ్చాయి. ఫ్రాన్స్ ఉత్పత్తులని బహిష్కరించాలి అనే కువైట్ ప్రభుత్వ నిర్ణయం అంత మంచి నిర్ణయం కాదు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఆయిల్ తప్పితే అంతా దిగుమతుల మీద ఆధారపడ్డ దేశం ఏదయినా ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు.
టర్కీ : ఎర్దోగాన్ కి అందివచ్చిన వరం మాక్రాన్ నిర్ణయం. అసలు టర్కీ కి కావాల్సింది ఇదే ఎందుకంటే టర్కీ దివాళా దిశలో పరుగులు పెడుతున్నది. ఫ్రాన్స్ వివాదం ని ఆడ్డం పెట్టుకొని ఋణ మాఫీ కోసం వల వేస్తున్నాడు. కానీ టర్కీ రుణాలని మాఫీ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. టర్కీ కరెన్సీ లీరా దారుణంగా పతనం అవుతున్నది. ఇంకో పాకిస్తాన్ గా మారినా ఆశ్చ్యర్యపోవక్కరలేదు. దావూద్ కి ఇప్పుడు కేంద్ర స్థానం ఇస్తాంబుల్. FATF వాచ్ లిస్ట్ లోకి ఎక్కబోతున్నది త్వరలో.
జెర్మనీ : యాంజెల మోర్కెల్ మొదటిసారిగా రాడికల్ ఇస్లాం అనే పదం వాడడానికి సిద్ధపడ్డది. అసలు యూరోపులో మారణ కాండకి ఆద్యురాలు మోర్కెల్ అంటే తప్పులేదు. ఆఫ్ఘనిస్తాన్,సిరియా శరణార్ధులని అక్కున చేర్చుకొని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నది. అసలు సిరియా నుండి శరణార్ధులు నేరుగా జెర్మనీ వైపు రావడానికి కారణం మోర్కెల్ ఇచ్చిన అభయ హస్తం అంటే అతిశయోక్తి కాదు. అందరూ మొత్తుకుంటున్నా వినకుండా శక్తికి మించి శరణార్ధులకి ఆశ్రయం కల్పించి తమ సొంత పౌరులకి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు లబో డిబో మని ఏడుస్తున్నది.
బంగ్లాదేశ్ : ఎగుమతుల మీద ఆధారపడి నిలదొక్కుకుంటున్న సమయంలో యూరోపు లో శక్తిమంతమయిన దేశం ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం మంచిది కాదు. ఫ్రాన్స్ అంటే ఒక దేశం అనే ఆలోచన ఉండకూడదు మొత్తం యూరోపు ఫ్రాన్స్ తో ఉంది ఈ రోజున అంటే ఫ్రాన్స్ ఇచ్చే బట్టలు కుట్టే ఆర్డర్ మీద బతుకుకున్న బాంగ్లాదేశ్ తమ భవిష్యత్ ప్రణాలీకకి మోకాలు అడ్డం పెట్టడం లాంటిదే. ఫ్రాన్స్ ,జెర్మనీ,ఇటలీ దేశాల ఆర్డర్లు రద్దు అయితే ఏమిటీ పరిస్థితి ? ఆ ఆర్డర్ వేరే దేశాలకి ఇచ్చి కుట్టించుకుంటారు. బుర్ర తక్కువ వెధవలు.
ఉపసంహరణ : కాశ్మీర్ లో మానవ హక్కులు అంటూ యూరోపియన్ పార్లమెంట్ అరిచి నానా యాగీ చేసి చివరకి కాశ్మీర్ లో పర్యటించేదాకా గోల చేసింది. ఇప్పుడు ? జస్ట్ భారత ప్రధాని మోడీ తమకి సంఘీభావంగా ఒక తీవ్ర ప్రకటన చేయాలని చూస్తున్నది . ఇంతలో ఎంత మార్పు ? కానీ మోడీ ఈ విషయంలో ఆచి తూచి స్పందించారు చాలా డిగ్నిఫైడ్ గా. ఫ్రాన్స్ సంఘటన తరువాత ఒక శక్తిమంతమయిన దేశ ప్రధాని సానుభూతి కోసం చూస్తున్నది పూర్ యూరోప్. వ్యక్తిగతంగా మాక్రాన్ కి మోడీ మద్దతు ఉంటుంది కానీ మొత్తం యూరోపు కి కాదు. ఇలానే ఉండాలి.
జైహింద్ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి