4, నవంబర్ 2020, బుధవారం

పద్య పోరు:

పద్య పోరు:

భువన విజయం ఒక విశేష కవి పండిత సభ రోజు ఎన్నో కొత్తకొత్త సాహిత్య విసేసేశాలు, విశ్లేషణలు. చేతురోక్తులు, చేలోక్తులు, యుక్తులు, కుయుక్తులు. ఇలా నిత్యం సాగే ఆ సాహితి సభను రాయల వారు ఆస్వాదించకుండా ఎలా వుంటారు చెప్పండి. 

ఒక రోజు రాయల వారు సభలో క్రింది సమస్యను ఇచ్చి దానిని పూరించామని కవులను కోరారు. 

కలనాటి ధనములక్కర

గల నాటికి దాచ కమలగర్భుని వశమా

అదృష్టం కలిసి వచ్చినప్పటి సంపదలు అక్కరకు వచ్చు వరకు దాచటం కమల గర్భడు అంటే బ్రహ్మ దేముడికైనా సాధ్యమా అని దీని అర్ధం. 

దానికి వెనువెంటనే అల్లసాని పెద్దన గారు క్రింది విధంగా పూరించారు పరికించండి 

“కలనాటి ధనములక్కర

గల నాటికి దాచ కమలగర్భుని వశమా

నెలనడిమి నాటి వెన్నెల

అలవడునే గాడె బోయ అమవస నిసికిన్.”

అంటే నెల మధ్యలో వున్నా వెన్నెలను అమావాస్య నాటికి ఉంచుకొనగా గాదె ( ధాన్యం దాచుకొను నిర్మాణం) కలదే అంటే లేదు అని అర్ధం. ఇక్కడ గణములు సరిగా వుండాలని అమావాస్య అనే పదాన్ని అమవాస అని వ్రాసారు పెద్దన గారు 

వెంటనే మన తెనాలి రామకృష్ణ గారు ఊరుకోకుండా క్రింది వ్యాఖ్యాన పద్యాన్ని ఆశువుగా చెప్పారు 

 

“ఎమి తిని సెపితివి కపితము

బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో

యుమెతకయ తిని సెపితివో

యమవసనిసి యనెడిమాట యలసని పెదనా”

దీని భావము ఏమి తిని కవిత్వము చెప్పవయ్యా బ్రహ్మపడి వెర్రి పుచ్చకాయ తిన్నావా లేక ఉమ్మెత్త కాయ తిన్నావా అంటే అవి తింటే పిచ్చి ఎక్కుతుందని అర్ధం నీవు ఆమవాసునిసి అనెడి మాట చెప్పావు అని ఎద్దేవా చేసారు. ప్రతి పదాన్ని నిశితంగా పరికించి వంకలు పెట్టటానికి సిద్ధంగా కవులు వుంటారనటానికి ఇది ఒక తార్కాణం. 

అది కేవలం రామ కృష్ణునికే చెల్లింది. 

కామెంట్‌లు లేవు: