4, నవంబర్ 2020, బుధవారం

గౌరవం

 ఏ గొప్ప రిలేషన్‌కైనా అత్యంత ముఖ్యమైన ఎలిమెంట్ "గౌరవం". ఒకర్నొకరు గౌరవించుకోవడం! ఎప్పుడైతే తోటి మనుషులకి కనీస respect ఇవ్వాలన్న సంస్కారం కూడా కోల్పోతున్నామో అప్పుడే అందరూ మనకు దూరం అవుతారు.


నువ్వు ఆస్థులు ఇవ్వాల్సిన పనిలేదు.. డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు.. ఎదుటి మనిషికి జస్ట్ ఓ చిన్న respect ఇవ్వు చాలు.. అది లైఫ్‌లాంగ్ గుర్తుంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఇవ్వాళ రేపు జనాల్లో విపరీతమైన ఏటిట్యూడ్.. మూర్ఖత్వం.. ఎవర్నీ లెక్కచెయ్యనితనం కన్పిస్తోంది. అవేం గొప్ప క్వాలిటీలు కాదు, అవి తమ మెడకే చుట్టుకుంటాయన్న విషయం వాళ్లకి తెలీదు.


నీ ఎదురుగా ఉన్న మనిషి ఎంతో లైఫ్ చూసి వచ్చి ఉంటారు.. ఎంతో అనుభవం ఉండి ఉంటుంది.. లేదా ఏం అనుభవం లేని చిన్న పిల్లాడే కావచ్చు, అయినా అతనూ మనిషే కదా.  Respect ఇవ్వడం నీ కనీస సంస్కారం కదా? ఈ బేసిక్ థింక్ కూడా తెలీనప్పుడు ఏ మనిషీ నిన్ను ఎంటర్‌టైన్ చెయ్యలేడు.


కొన్ని జీవితాలుంటాయి.. ఎందుకూ పనికిరాని జీవితాలు.. మనుషులంటే గౌరవం ఉండదు, లైఫ్ అంటే గౌరవం ఉండదు.. సొసైటీ అంటే గౌరవం ఉండదు.. అసలు తిండి కూడా దండగే అలాంటి మనుషులకి. నువ్వు కూడా అలాంటి కోవకే చెందుతావేమో కాస్త దృష్టిపెట్టి ఆలోచించుకో. ఎక్కడైతే ప్రతీ మనిషి దగ్గరా తలెగరేస్తావో అక్కడే నీ పతనం పాతాళానికి జర్నీ మొదలుపెడుతుంది. మనుషుల్ని గౌరవించు.. వినయంగా ఉండు.. ఎదుగు.. పదిమంది ఎదుగుదలనీ అప్రిషియేట్ చెయ్యి.. ఇదీ గొప్ప యాటిట్యూడ్. అంతే తప్పించి నీ మూర్ఖత్వం గొప్ప అనుకుంటే నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను చూసి జాలితో ఓ నవ్వు నవ్వుకుని తన పని తాను చేసుకుపోతుంటుంది.

కామెంట్‌లు లేవు: