4, నవంబర్ 2020, బుధవారం

భగవంతుడు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀165


            *భర్త – భగవంతుడు*

                ➖➖➖✍️


*పరమాచార్య స్వామి వారి పర్యటనలో భాగంగా ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు.*


*ఒక ఇల్లాలు తన కుమార్తెను, అయిదేండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది.*


*స్త్రీలందరూ ఒక ప్రక్కగా, పురుషులొక ప్రక్కగా నిలబడి, తీర్థం పుక్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెళ్ళో ఉన్న బంగారు గొలుసు కాస్తా, ఏ పుణ్యాత్మురాలో తస్కరించి దాచేసింది.*


*గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమ్మలక్కలంతా ‘అయ్యో గొలుసు పోయిందా!’ అంటూ పిల్లనూ, తల్లినీ ఓదారుస్తున్నారు.*


*తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి   కూడా తీర్థం పుచ్చుకునేందుకు వరుసలో  నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరికీ తీర్థమిచ్చి, ఆమెను మాత్రం వరుసలో నుండి తప్పుకుని, ప్రక్కగా నిలబడమన్నారు స్వామి.*


*స్వామి అలా ఎందుకు అన్నారో ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతలో ఒక ముసలావిడ తీర్థం తీసుకోవడానికి స్వామి దగ్గరకు వచ్చి చెయ్యి చాపింది.*


*ఆమెను ఉద్దేశించి స్వామి, ‘ఇచ్చేసెయ్యి’ అన్నారు.*


*“నా దగ్గరేముంది ఇవ్వడానికి?” అన్నదా ముసలమ్మ.*


*”ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూటకట్టుకుంటావు?” అన్నారు స్వామి.*


*ఆ మాటలు విని కొందరు ఆడవారు చీరె విదిలించమన్నారు. పరిశీలించగా చీరె మడతల్లో దాచిన బంగారం గొలుసు బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు.*


*గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి దగ్గరకు పిలిచారు. తీర్థం ఇచ్చారు. ఇలా అన్నారు...”అదిగో నీ గొలుసు తీసుకో. ఇక నుంచి మాత్రం చెయ్యవద్దన్న పని చెయ్యకు” అన్నారు స్వామి.*


*”ఇకమీదట ఎప్పుడూ అట్లా చెయ్యను స్వామీ” అంటూ చెంపలు వేసుకుని ఆ గృహిణి, పమిట కొంగుతో కన్నులు తుడుచుకుంది.*


*ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు?*


*ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి టైముకి తప్పకుండా వెళ్ళాలి. తనకు అన్నం వడ్డించి తరువాత పూజకు వెళ్ళమని భార్యతో చెప్పాడు.*


*కాని, పూజకు ముందుగా పోవాలని తొందరపడి, ఆదరాబాదరాగా అన్నం వండి, అక్కడ పడేసి, పిల్లను తీసుకుని గబా గబా బయలుదేరి వచ్చింది ఇల్లాలు.*


*“తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నీవు వదలి పెట్టకు, నీ భక్తి కంటే అది అధికమైంది” అని ఆమెకు బోధపడింది.*


*ఎంతటి స్వల్ప విషయంలో నైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలూ, పురుషులూ అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి.*


--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: