8, జులై 2024, సోమవారం

ఆధ్యాత్మికము దూరమైపోతుంది

 ఒక శ్రీమంతుడు ఉండేవాడు.అతనికేమీ పనిలేదు.కేవలం లోడింగ్ , అన్ లోడింగ్ .అందువలన అతనికి అజీర్ణవ్యాధి వచ్చింది.ఒక స్పెషలిస్టు డాక్టర్ని సంప్రదించాడు. ఆ డాక్టరు ,  "ఓ శ్రీమంతుడా !నీ అజీర్ణమునకు నీవే కారణము.నీ కడుపు ఎంత పడుతుందో నీకు తెలియదా?కేవలము దురాశచేత ఊరికే కూరుతున్నావు .జీర్ణశక్తి తక్కువ తినే పదార్ధము ఎక్కువ!అందుకే అజీర్ణవ్యాధి వచ్చింది.దీనికి ఒక చక్కని మందు చెపుతున్నాను విను.ఎపుడూ నీ నోటిలో ఇ ఉప్పుగడా పెట్టుకొని దాని సారాన్ని మింగుతూ ఉండు."అన్నాడు.ఆ విధంగా చేసేసరికి కొంతకాలానికి అతని అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.ఆ సమయానికి అతని పుట్టినరోజు వచ్చింది.తన పుట్టిన రోజికి అజీర్ణ వ్యాధి తగ్గింది కనుక అందరికీ మిఠాయిలు పంచాలనుకున్నాడు.ఒక మిఠాయి అంగడికి వెళ్ళాడు,అక్కడ మిఠాయి కొంచముగిల్లి నోట్లో వేసుకున్నాడు.ఉప్పగా ఉంది. అదిసరిలేదని మరొక అంగడికి వెళ్ళాడు.అక్కడకూడా మిఠాయిని రుచి చూస్తే ఉప్పగా అనిపించింది.ఈ విధముగా అయిదారు అంగళ్ళు దాటిపోయాడు.ఇతనిపరిస్థితి ఆరవ అంగడివాడు చక్కగా కనిపెట్టాడు.ఈ శ్రీమంతుడు అతనిదగ్గరకు వెళ్ళేసరికి "అయ్యా ! ఎదురుగా కుళాయి ఉన్నది .ముందు నువ్వు నోరు కడుక్కొనిరా ! అప్పుడు లడ్డు రుచి చూపిస్తాను "అన్నాడు.ఆశ్రీమంతుడు కుళాయి దగ్గరకు పోయి నోటిలోఉన్న ఉప్పుగడ్డను పార వేసి నోరు క్లీన్ చేసికొని లడ్డు రుచి చూశాడు. "ఆహా ! చాలా మధురముగా ఉన్నది అన్నాడు.అపుడా అంగడివాడు చెప్పాడు."పిచ్చివాడా ! నోటిలో ఉప్పు గడ్డను పెట్టుకొని లడ్డు తింటే తీయగా , ఉంటుందా ?".   అదే విధముగా నాస్తికత్వమనే రోగమును, దుర్గుణములు,దురాలోచనలు , దుశ్చింతలు అనే చేదును తనయందు ఉంచుకొని మధురమైన దైవనామములు , భగవత్సంబంధమైన విషయములు ఎన్ని విన్నప్పటికి అవి చేదుగానే ఉంటాయి.ఆధ్యాత్మికము దూరమైపోతుంది .   (శ్రీ సత్యసాయి వచనామృతము )

Panchaag


 

లివర్

 లివర్ మరియు స్ప్లీన్ ( ప్లీహ ) వ్యాధులు  - 


 లివర్ అంటే ఏమిటి  ?  - 


   లివర్ మానవ శరీరంలో హృదయానికి పక్కటేముకలకి క్రిందుగా కుడివైపున ఉండే అవయవం . ఇది రక్తం వలన పుట్టినది. దీనిని కార్జం మరియు లివర్ అంటారు. ఇది నలుపు , ఎరుపు మిశ్రమ వర్ణంతో మిక్కిలి మృదువుగా ఉండే మాంస ఖండం . 


  ప్లీహము అంటే ఏమిటి  ?  - 


    ప్లీహము మానవ శరీరంలో ఎడమ బాగంలో హృదయానికి క్రిందుగా ఉండే అవయవం . ఇది కూడా రక్తం వలెనే జనిస్తుంది. రక్తాన్ని తీసుకుని పొయే సిరలన్నిటికి ఈ ప్లీహమే మూలం అని బారతీయ మహర్షులు పేర్కొన్నారు.


  లివర్ , ప్లీహ రోగాలు ఎందుకు వస్తాయి ?  -


 *  శరీరానికి వేడిచేసే పదార్దాలు అయిన మినుములు , ఉలవలు, ఆవాలు మొదలయిన వాటితో వండిన పదార్దాలను అధికంగా సేవించడం .


 *  గేదె పెరుగు ఎక్కువుగా తినడం .


 *  పగటిపూట అధికంగా నిద్రపోవడం.


     ఇటువంటి కారణాల వలన శరీరంలో రక్తం , కఫం ఎక్కువుగా వృద్ది చెంది లివర్ ని మరియు ప్లీహం వృద్ది చెందుతాయి. లివర్ , ప్లీహం చెడిపోయి  ప్లీహం వృద్ది అవుతుంది. దీనినే ప్లీహభివ్రుద్ధి            ( enlargement of spleen ) అంటారు.ఇదే ప్లీహ వ్యాధి అంటారు. ఇదే దోషం వలన లివర్ వృద్ది చెందుతుంది దానిని లివర్ వ్యాధి అంటారు. అయితే లివర్ వ్యాధి కుడివైపున , ప్లీహ వ్యాధి ఎడమ వైపున కలుగుతుంది అని తెలుసుకోవాలి.


  లివర్ మరియు ప్లీహ వ్యాధుల లక్షణాలు  - 


 *  ఈ వ్యాధుల వల్ల రోగులు బాగా కృశించి బలహీనులు అయిపోతారు.


 *  ఎల్లప్పుడు కొద్ది జ్వరం వెంటాడుతూనే ఉంటుంది.


 *  ఉదరంలో జట రాగ్ని మందగించిపోయి అజీర్ణం అగ్నిమాన్ధ్యం కలుగుతాయి.


 *  దీనివలన శరీరంలో రక్తం , కఫం దుషిమ్పబడి వ్యాధికారకం అవుతాయి. కావున శరీరం నందలి రక్తం తగ్గినా , విపరీతంగా పెరిగినా అనర్ధమే .


 *  శరీరమంతా ఎంతో బరువుగా , బడలికగా ఉంటుంది. నీరసం అనిపిస్తుంది.


 *  దేహమంతా వివర్ణం అయి శరీరం తిరిగి పోతున్నట్టుగా ఉంటుంది.


 *  పోట్టపైన చర్మం ఎరుపుగా ఉండి , పొట్ట బరువు పెరుగుతుంది.


 *  మనసుకి మైమరపు, భ్రమ , మొహం కలుగుతాయి .


  లివర్ మరియు ప్లీహ రోగాలకు సులభ యోగాలు -


 *  50 గ్రా శనగలను  నీళ్లలో  వేసి ఉడకబెట్టి రుచికోసం కొద్దిగా ఉప్పు కలిపి రోజు ఉదయం పూటనే తినాలి . కొంత సమయం తరువాత నేతిలో వేయించిన 50 గ్రా శనగలని కొద్దిగా ఉప్పు చేర్చి తినాలి . ఈ ప్రకారంగా కనీసం 15 రోజుల పాటు చేయాలి . ఈ 15 రొజుల్లొ కారం అసలు ముట్టుకోకుడదు చప్పిడి ఆహారమే తినాలి . ఈ నియమం పాటిస్తే ఎంతోకాలం నుంచి పీడించే లివర్ సమస్యలు అయినా పరిష్కారం అయి లివర్ శుభ్రపడుతుంది.


 *  50 గ్రా వాము తీసుకుని బాగా చెరిగి శుభ్రం చేసి ఆ వాముని ఒక మట్టి మూకుడులో పోసి అది మునిగేంత వరకు కలబంద మట్టల లోని రసం పోయాలి. దీనిని ఒక రాత్రి నానబెట్టి ఒక పగలు ఎన్దించాలి . ఎండ ప్రభావానికి వాము కలబంద రసాన్ని పీల్చుకుంటుంది. తరువాత సాయంత్రం పూట మళ్లి కలబంద రసాన్ని పోసి రాత్రి నానబెట్టి తెల్లారి ఎండలో పెట్టాలి. ఇలా మూడు రోజులు చేసిన తరువాత కలబంద రసాన్ని గ్రహించిన వాముని తీసుకుని నిలువచేసుకోవాలి. రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో పూటకు 3 గ్రా మోతాదుగా తింటూ అనుపానంగా కొంచం మంచి నీళ్లు తాగుతూ ఉంటే ప్లీహబివ్రుద్ధి ( కడుపులో పెరిగే బల్ల ) హరించి పొతుంది.


            దీనికి పుదినా పచ్చడి , గోధుమ రొట్టెలు , ముల్లంగి కూర తినాలి . సగం బోజనమే చేయాలి . అంటే కడుపు నిండా తినకుడదని అర్ధం . పప్పులు , దుంపలు , మినుములు , పచ్చిపాలు, వెన్న, నెయ్యి మొదలయిన ఆలస్యంగా జీర్ణం అయ్యే పదార్ధాలు తినకుడదు.


  *  రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో తులసి ఆకుల రసం రెండు మూడు చెంచాలు తాగుతూ ఉంటే క్రమంగా కడుపులో బల్లలు కరిగిపోతాయి.


 *  వెంపలి చెట్లు ప్రతిచోటా పెరుగుతాయి. వెంపలి వేళ్ళు తెచ్చి కడిగి ఎండబెట్టి దంచి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని రోజు 5 గ్రా మోతాదుగా ఆవు మజ్జిగ లో కలుపుకుని తాగుతూ ఉంటే కడుపులో బల్లలు కరిగిపోతాయి . ఆహారం ద్రవ పదార్ధంగా మాత్రమే తీసుకోవాలి . తెల్ల వెంపలి వేళ్ళు వాడటం శ్రేష్టం .


 *  రావిచెట్టు బెరడు తెచ్చి నీడలో ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . దాన్ని జల్లెడ బట్టి నిలువ ఉంచుకొవాలి. దానిని రోజు ఉదయం పూట 2 గ్రా బూడిద ని అరటిపండు ముక్క మద్యలో పెట్టి తింటూ ఉంటే 40 రోజుల్లో లివర్, ప్లీహ సమస్యలు పరిష్కారం అవుతాయి.


 *  ఉత్తరేణి సమూలంగా పీకి తెచ్చి కడిగి చిన్నచిన్న ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . ఈ బుడిదని జల్లెడ పట్టి నిలువ ఉంచుకొవాలి. శోంటి ముక్కలని మంచి నీళ్లలో వేసి శొంటి కషాయం తయారు చేసి ఆ కషాయం 30 గ్రా మోతాదుగా తీసుకుని అందులో రెండు గ్రాముల ఉత్తరేణి భస్మాన్ని కలిపి రోజుకొక మోతాదుగా తాగుతూ ఉంటే మూడు వారాలలొ లివర్, ప్లీహ రోగాలు పొతాయి.


 *  కలబంద మట్టలు చీల్చి లొపల ఉండే గుజ్జు తీసి ఆ గుజ్జుని 10 గ్రా మోతాదుగా అందులో 3 గ్రా పసుపు కలిపి రోజు సేవిస్తూ ఉంటే ప్లీహభివృద్ధి తగ్గిపొతుంది.


 *  నాటు ఆవు యొక్క మూత్రం తెచ్చి గుడ్డలో వడపోసి 50 గ్రా మోతాదుగా తీసుకుని అందులొ చిటికెడు ఉప్పు కలిపి రోజు ప్రాతః కాలంలో తాగుతూ ఉంటే మూడు , నాలుగు వారాలలొ లివర్, ప్లీహ వ్యాదులు తగ్గిపోతాయి . జెర్సీ ఆవులు, పట్టణాలలో ప్లాస్టిక్ కవర్లు తినే ఆవులు మూత్రం పనిచేయదు . పొలాలొ తిరిగే నాటు ఆవులు మూత్రం పనిచేయదు . 


  లివర్ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవల్సినవి -


  *  పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకుని వారానికి ఒకసారి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది. అంతే కాకుండా వెంట్రుకలు తెల్లబడకుండా , కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అంతేకాక వెంట్రుకలు తెల్లబడకుండా కంటిచూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.


 *  పచ్చి గుంటగలగర ప్రతీసారి దొరకనివారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకుని కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోని రోజు పూటకు 3 గ్రా మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండు పూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.


 *  తమలపాకు లకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ ఉంటే లివర్ గట్టిపడటం తగ్గి యధాస్థితి వస్తుంది.


 *  నిమ్మపండ్ల రసం , టమాటో పండ్ల రసం , బొప్పాయి పండ్లు తరచుగా వాడుకుంటూ ఉంటే లివర్ , స్ప్లీన్ వ్యాదులు కలగకుండా ఉంటాయి.

 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034


 

   కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


            9885030034

నరకాలు

 నానారకాల నరకాలు 

~~~


పురాణాలు చెప్పిన దాని ప్రకారం 

28 రకాల నరకాలున్నాయి.


మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని బలంగా కోరుకుని పెద్దలు ఏర్పరచినవి ఈ నరకాలు.


రాముడిని నమ్మినా, యముడిని నమ్మినా ఫలితం సామాజిక సంక్షేమమే! పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి.


పాప స్వరూపాలను బట్టి యముడు ఆయా నరకాలకు పాపులను పంపుతుంటాడు.


అపరిచితుడు సినిమా గుర్తుంది కదా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు. నిజంగా అవి ఉన్నాయో లేదు తెలియదు కాని, ఆ సినిమా చూసినతరువాత ప్రతి ఒక్కరు తప్పులు చేయాలంటే కాస్త భయపడిపోయారని చెప్పవచ్చు. అసలు గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుంది


1.తమిశ్రం: ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసి ఇదో చిమ్మచీకటి నరక కూపం.


2. అంధతమిశ్రం: ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.


3. రౌరవం: రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు.


4. మహారౌరవం: న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు.


5. కుంభిపాకం: వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హత మార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.


6.కాలసూత్రం: ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పై నుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది.


7. అసితపత్రవనం: విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు.


8.సుకరముఖం: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.


9. అంధకూపం: చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు.


10. తప్తమూర్తి: ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.


11: క్రిమిభోజనం: ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు.


12. శాల్మలి: దీన్నే తప్తశాల్మలి అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు.


13. వజ్రకంటకశాలి: జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది.


14. వైతరణి: అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు.


15. పూయోదకం: వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది.


16. ప్రాణరోధం: కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి.


17. వైశాసనం: పేదలు ఆకలి దపðలతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.


18. లాలభక్షణం: అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరుచు వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది.


19. సారమేయాదానం: ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.


20. అవీచి: నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తపðడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తపðడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకు వస్తారు.


21. అయోపానం: ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి.


22. రక్షోభక్ష: జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం ఈ నరకం ఉంది.


23. శూలప్రోతం: ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను ఈ నరకంలోకి పంపుతాడు యముడు.


24. క్షరకర్దమం: మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు.


25. దందశూకం: తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు.


26. వాతరోదం: అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంది.


27. పర్యావర్తనకం: ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు.


28. సూచీముఖం: గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు.

గాజుల మహత్యం

 స్త్రీ ధరించే గాజుల మహత్యం


🧍‍♀️ ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది.

అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.


🧍‍♀️ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..

గాజులేయించకోమ్మా’ అంటాడు.

ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని,

వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ,

తాము పగలకుండా, మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే

మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.


🧍‍♀️గాజుల ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.

గాజులు ఒక్క స్త్రీ కే కాదు ,

పూర్వ కాలంలో పురుషులు కూడా ధరించేవారట.

రాను, రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది.

స్త్రీ మంచి చీరకట్టుకొని , ఎన్ని నగలు మెడలో ధరించినా , చేతులకు గాజులు లేవంటే అందమనేది రాదు కదా ? గాజు లు ధరించడం అనే సాంప్రదాయం ,

పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా ?

ఎలా అంటారా ?

పుట్టిన బిడ్డలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు.


🧍‍♀️అది కేవలం దిష్టి కోసమే కాదు ,

ఆ గాజులనుండి వచ్చే సవ్వడులు,

పసిపిల్లలను పలకరించి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట.


🧍‍♀️గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట.

ఎలా అంటే గాజులు ఎంత సున్నితం గా ఉంటాయో,

గాజులు ధరించిన స్త్రీ అవి పగల కుండా సున్నితం గా నడుస్తుంది , అలాంటి నడకవలన , నడవడిక మారుతుందట.

అంతే కాదు జీవితం చాలా సున్నితమైనది , జాగ్రత్తగా ,పదిలంగా చూసుకోకపోతే గాజుపగిలితే ఎలా అతకదో , అలానే జీవితం కూడా సక్రమంగా ఉండదు

అని అర్దమట.


🧍‍♀️చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్ష్యాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట.

గాజులు అందంతో పాటుగా స్త్రీ సౌభాగ్యం ప్రతిబింబిస్తుంది.

అందుకే గాజులు పగులకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.


🧍‍♀️శ్రీమంతం లో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు..

అనే దానికి మరో అద్బుతమయిన కారణాలు ఉన్నాయి ..


🧍‍♀️అయిదవ నెలలో స్త్రీ గర్భం లో వుండే పిండానికి ప్రాణం వస్తుంది,

శిశువు ఎంత సున్నితం గా వుంటుందో ,

తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ,

గాజుల రూపం లో (గాజులు సున్నితమైనవే కదా ) తెలిజేస్తారట .

మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతం లో

వుండే నాడులు గర్బాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయట.స్వల్ప వత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా

అందుకు అనుగుణంగా ఉత్తేజితమయి,గర్బం లోని కండరాలు సరిగా పనిచేసే దానికి దోహదపడుతాయట.


🧍‍♀️అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్బం లో వుండే శిశువు కు గాజుల సవ్వడి స్పష్టం గా వినబడి ,శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయి..

*శ్రీ సిద్ధేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 372*




⚜ *కర్నాటక  :   హావేరి*


⚜ *శ్రీ సిద్ధేశ్వర ఆలయం*



💠 సిద్ధేశ్వర దేవాలయం ( పురాడ సిద్దేశ్వర అని కూడా పిలుస్తారు) భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలోని హవేరిలో ఉంది.  

ఇది 12వ శతాబ్దపు పాశ్చాత్య చాళుక్యుల కళకు అలంకారమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది మరియు దానిలో ఉన్న హిందూ దేవతల యొక్క అనేక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.



💠 శాసనాల నుండి, హవేరీని మొదట నలపురి అని పిలుస్తారు మరియు ఆధునిక కర్ణాటకలోని పురాతన అగ్రహారాలలో (వేదం నేర్చుకునే ప్రదేశం) ఒకటి.

 పట్టణంలోని 1067 నాటి శాసనం 400 మంది బ్రాహ్మణులకు గ్రామాన్ని మంజూరు చేసినట్లు పేర్కొంది. 


💠 ఈ ఆలయం హవేరి పరిసర ప్రాంతాల్లోని మరికొన్ని చాళుక్యుల దేవాలయాలకు దగ్గరి పోలికలను కలిగి ఉంది; చావుడయ్యదనపురలో ముక్తేశ్వరాలయం, హరలహళ్లిలోని సోమేశ్వరాలయం మరియు నీరల్గిలోని సిద్ధరామేశ్వరాలయం.


💠 ఏది ఏమైనప్పటికీ, 11వ శతాబ్దపు చివరిలో ఆలయం యొక్క ప్రారంభ ప్రతిష్ఠాపన జరిగినట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి.


💠 దేవాలయం యొక్క ఉత్తేజకరమైన అంశం ఏమిటంటే, ఇది తూర్పున ఉదయించే సూర్యునికి ఎదురుగా కాకుండా పశ్చిమం వైపు ఉంది-చాళుక్యుల నిర్మాణాలలో ఒక ప్రమాణం

 ప్రస్తుతం ఇది శివునికి అంకితం చేయబడిన శైవ దేవాలయంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, చరిత్రకారులు ఏ విశ్వాసం లేదా శాఖ ద్వారా ఆలయాన్ని మొదట్లో మరియు ఏ దేవుడికి ప్రతిష్టించారో ఖచ్చితంగా తెలియదు.


💠 ఆలయంలోని మంటపం (హాలు)లో ఉమా మహేశ్వరుడు, విష్ణువు మరియు లక్ష్మి దేవత, సూర్యుడు, నాగ-నాగిని, గణపతి మరియు కార్తికేయ శిల్పాలు ఉన్నాయి. 

ఆలయ ప్రాంగణంలో అనేక పాత కన్నడ శాసనాలు ఉన్నాయి.

వీటిలో మొదటిది ఆలయం లోపల ఒక దూలంపై చెక్కబడింది మరియు 1087 నాటిది అయితే 1108 నాటి మరొక రాతి శాసనం వెలుపల ఉంది.


💠 శివుడు నాలుగు చేతులతో డమరు (డోలు), అక్షమాల (పూసల గొలుసు) మరియు మూడు చేతులలో త్రిశూలం (త్రిశూలం). 

అతని దిగువ ఎడమ చేయి శివ ఒడిలో కూర్చున్న ఉమపై ఆధారపడింది, అతని ముఖంలోకి చూస్తూ తన కుడి చేతితో అతనిని కౌగిలించుకుంది. 

ఉమా శిల్పం దండలు, పెద్ద చెవిపోగులు మరియు గిరజాల జుట్టుతో బాగా అలంకరించబడింది. 

నాగ మరియు నాగిని, వారి తోకలు పెనవేసుకుని, పార్వతి చిత్రంతో పాటు ముందుగది తలుపు వైపున కనిపిస్తారు. 


💠 ప్రధాన మందిరం (గర్భగృహ ) సాదా లింగం (శివుని చిహ్నం) ఉంది. 

 సప్తమాత్రికలు కూడా బయట ఒక మెట్టు బావి గోడలో చెక్కబడి ఉంటాయి.

 సప్తమాత్రిక శిల్పాలలో స్త్రీ దేవతలు ఉంటారు, సాధారణంగా ప్రతి ఒక్కరు మాతృత్వాన్ని సూచించడానికి ఒడిలో ఒక బిడ్డను కలిగి ఉంటారు మరియు వాటి కింద కనిపించే వారి పురుషుడు యొక్క వాహనం ద్వారా గుర్తించబడతాయి.


 💠 ఒక చివర శివుడు మరియు మరొక వైపు గణపతి. శివుడి పక్కన మాతృక (“తల్లి”) దేవతలు ఉన్నారు: 

బ్రహ్మి (లేదా బ్రాహ్మణి), 

బ్రహ్మ భార్య, హంస; 

శివుని భార్య అయిన మహేశ్వరికి నంది (ఎద్దు) ఉంది; 

వైష్ణవి, విష్ణువు భార్యకు గరుడ (డేగ) ఉంది; కౌమారి, కార్తికేయ భార్య నెమలి ఉంది; 

వరాహ భార్య అయిన వారాహికి గేదె (పందికి బదులుగా) ఉంది; 

ఇంద్రుని భార్య ఇంద్రాణికి ఏనుగు ఉంది


💠 ఈ ఆలయం బెంగళూరు నగరానికి 340 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

సంధ్యా దీపం జ్యోతి

 🪔🙏 సంధ్యా దీపం జ్యోతి  🙏🪔

                  నమోస్తుతే 


శుభం కరోతి కళ్యాణం 

            ఆరోగ్యం ధన సంపద,


శత్రు బుద్ధి వినాశాయ 

          దీప జ్యోతిర్ నమోస్తుతే ,

                                                🪔      

దీప-జ్యోతి: పరబ్రహ్మ               

           దీప జ్యోతి జనార్ధనః,


దీపో హారతి మే పాపం 

          దీప-జ్యోతిర్-నమోస్తుతే || 

                                                    🪔


         🙏  ఏ దీపజ్యోతి ఐతే శుభం , 

మంచి , ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో,  చెడు తలపులను తొలగిస్తుంది, ఆ దీపజ్యితికి ప్రణమిల్లుతున్నాను .🪔


            🙏 ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో , 

ఏ దీపజ్యోతి జనార్దనుడో,  

ఏ దీపజ్యోతి మనని పాపములు చేయకుండా కాపాడుతుందో, 

ఆ దీపజ్యోతి ప్రణమిల్లుతున్నాను.🪔


🌹🙏దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపాయానమః 🙏ప్రదోషకాలే సంధ్యా దీపలక్ష్మీ నమోస్తుతే..🙏🌹

యచ్చదత్తనుడు

 


              *యచ్చదత్తనుడు*

                 ➖➖➖✍️


చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివే వాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. 

గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తుండగా గమనించాడు.


అది చూసిన అతని మనసులో బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.

బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.


ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి 

ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. 

ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేద్దామనుకున్నాడు.


 *రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకము నందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.


ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు ‘అయ్యో.. ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయం వినగానే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది.. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచి పెట్టాడు.ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.


ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచి పెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించి పోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.


అతడు చెప్పింది నిజమే ‘వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు’

 అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.


తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. క్రింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు.‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు. 


నెత్తురుకారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. “నాయనా.. ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.”

“మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా, వరంకోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది-అది పత్నీభాగం.” అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు.


”పార్వతీ..నేను ఈవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచి పెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు వేరొకరు తినరాదు!” అన్నాడు. 

ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.

ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని కూడా మరో పేరు.


మనలో చాలా మంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్లి పోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం. ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు. చిటిక వేస్తే ధ్యానము నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.


”ఓహో మా స్వామిని ఆరాధించావా !

ప్రసాదం తీసుకున్నావా !! సరే. తీసుకు వెళ్ళు.” అంటాడు.


ఆయనకు చూపించిన తర్వాత 

ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము దానిని మీరు గుడి యందు విడిచి పెట్టి వెళ్ళిపోతే 

మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. 

చండీశ్వర స్థానము నందు తప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.


అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు. 

ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


విలువ

 *జై శ్రీ రామ్ 

 *🍁

        

"అద్దె కట్టేటపుడు సొంతింటి విలువ

ఆకలేసినపుడు అన్నం విలువ

ఉద్యోగం లేనపుడు డబ్బు విలువ

దూరమైనపుడు మనిషి విలువ

జాగ్రత్త లేనపుడు జీవితం విలువ

తెలుస్తుంది."

       

🌹 *మంచి మాట* 🌼

      

"సముద్రంలో అలలు ఎన్నో

అందులో తీరం చేరేవి కొన్నే.అలాగే

జీవితంలో స్నేహితులు బంధువులు ఎందరో కానీ

మనసులో ఉండేది కొందరే.

వారే నిజమైన స్నేహితులు,ఆత్మీయులు. సర్వే జనా సుఖినోభవంతు 🙏


జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

గడచిన క్షణం

 *గడచిన క్షణం మృత సమానం.*


గతం గురించి చింత, భవిష్యత్తు గురించి బెంగ వదిలేసి- అనుక్షణం వర్తమానంలో జీవించాలి. 


రానున్న క్షణం కళ్లు తెరవని పసికందు. రెండూ నీవి కావు. ఈ క్షణం మాత్రమే నీది. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. 


ఆహారం, ఆహార్యం, నిద్రించే సమయం, శారీరక శ్రమలలో వినూత్నమైన మార్పులు ఏర్పడుతున్నాయి. 


కాలంతో పోటీపడుతూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. నేడు మానసిక ఒత్తిడి లేని మనిషి అంటూ లేడంటున్నారు మనోతత్వ నిపుణులు. 


ధనం కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరూ అమ్మలేరు. ఎవరూ కొనలేరు. 


మనిషి మానసిక జీవనానికి అత్యంత ప్రధానమైనది మనశ్శాంతే. అది మనస్సాక్షికి దిక్సూచి వంటిది. విజయానికి ఇంధనం వంటిది. 


నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు, జీవితం సమతుల్యతతో సాగినప్పుడు  నిజమైన మనశ్శాంతికి నిర్వచనం అవగతమవుతుంది. 


మనశ్శాంతి మనిషికున్న సహజ లక్షణం. అది అదృష్టం వల్ల వచ్చేది కాదు. దురదృష్టం వల్ల కోల్పోయేది కాదు.  


మానసిక ప్రశాంతతకు మూల కేంద్రం. దాన్ని కాపాడుకోవడం తెలిస్తే అడ్డుపడే క్లేశాలు వాటంతటవే తొలగిపోతాయి. వాటి స్థానంలో స్థితప్రజ్ఞ చిగుళ్లేస్తుంది. 


పాపకృత్యాలు చేయకుండా సత్కార్యాలు చేయడం వల్ల మనసు ఎప్పటికప్పుడు ప్రక్షాళనమవుతుంది. మనశ్శాంతికి దగ్గర చేస్తుంది అన్నాడు బుద్ధుడు.


మనిషి తనకు తానే మానసిక ఒత్తిడికి కారణమవుతున్నానని తెలుసుకోవాలి. నేడు మనశ్శాంతి లేదంటూ ఎంతోమంది యువత దారి తప్పుతున్నారు. 


దాన్ని వెతుక్కుంటూ వేటి వేటి వెనకో పరుగులు తీస్తూ ఉన్న ప్రశాంతతను కోల్పోతున్నారు. శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది. 


మనశ్శాంతిని కోల్పోయినవారికి అది అనుక్షణం వెన్నంటే ఉంటుంది. మనిషి ఎప్పుడూ వర్తమానంలో  నిలబడే గతాన్ని, భవిష్యత్తును సందర్శిస్తూ వర్తమానాన్ని కోల్పోతుంటాడు. 


వాస్తవానికి మనిషి ఉండేది ఎల్లప్పుడూ వర్తమానంలోనే అన్నారు రమణ మహర్షి.

పినాకము అను విల్లు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


        శ్లో𝕝𝕝 *పినాకపాణిం భూతేశం*

             *ఉద్యత్సూర్యాయుత ద్యుతిమ్* ।

             *భూషితం భుజగైర్ధ్యాయే*

             *త్కంఠే కాలం కపర్దినమ్* ॥


తా𝕝𝕝 పినాకము అను విల్లు చేతియందు కలవాడును, భూతములకు పతియు, ప్రకాశించుచున్న పదివేల సూర్యుల కాంతి వంటి కాంతి గలవాడును, పాములచేత అలంకరింప బడిన వాడును, నీలమైన కంఠము కలవాడును, జడలు కలవాడును అగు రుద్రుని ధ్యానించ వలెను.

చట్టాలు అమల్లోకి

 *జులై 1 నుంచి ఈ చట్టాలు అమల్లోకి రావడంతోనే పలు మార్పులు చోటుచేసుకున్నాయి...*


1. బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు.


2. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.


3. అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణసాయం లభించే వీలుంటుంది.


4. అరెస్ట్ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది.


5. హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది.


6. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.


7. సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.


8. మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.


9. బాధితులతోపాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నకలును ఉచితంగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, చార్జిషీట్, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండువారాల్లో పొందొచ్చు.


10. కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.


11. సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి.


12. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.


13. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.



ఈశ్వరసాయుజ్యమేనని

 శు భో ద యం🙏

            చొప్పకట్ల.


"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై

 నొప్పంగ సద్భక్తి రం

 జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద  నై

 ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా

 చిత్రంబె? సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.


భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి

ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.


          ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు

సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🌷🙏🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విద్యను వీడి

 *విద్యను వీడి యొక్కరుcడు వేదవిశారదుcడయ్యె నిద్ధరన్*

ఈ సమస్యకు నాపూరణ. 


మద్యపు మత్తు నున్న గని మౌని యొకండు దయార్ధ్రదృష్టితో


ఆద్యపు వర్తనల్ తొలగ నప్పటికప్పుడు తీర్చిదిద్దగా


సాద్యము నైన జీవితము సంస్కృతి నేర్చిన వాడు క్షుద్రమౌ


విద్యను వీడి యొక్కరుcడు వేదవిశారదుcడయ్యె నిద్ధరన్.

(సాద్యము= క్రొత్తది)


అల్వాల లక్ష్మణ మూర్తి.

శ్రద్ధగా గమనించాలి

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*



*🐄గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🐄*

"ఓసారి బుద్ధభగవానుడు శిష్యులతో కలిసి పర్యటిస్తున్నాడు. మధ్యాహ్న భోజనం వేళ ఓ గ్రామంలో భిక్ష లభించలేదు. భగవానుడు సరేనంటూ నడక సాగించాడు. గ్రామీణుల ప్రవర్తన పట్ల బృందంలోని ఓ శిష్యుడు మనసు కష్టపెట్టుకున్నాడు. లోలోపల నిందించుకున్నాడు. జ్ఞాన సిద్ధుడైన గురుదేవుడి వెంట నడుస్తున్నా, తనలో తాను మథనపడుతున్నాడు. ఫలితంగా శిష్యుడిలో అశాంతి హెచ్చింది. క్రమంగా బుద్ధి వశం తప్పుతోంది. ప్రశాంతంగా సాగిపోతున్న బుద్ధభగవానుడు అది గ్రహించాడు. శిష్యుడి వైపు తిరిగి, ‘దాహంగా ఉంది నీళ్ళు తీసుకురా!’ అంటూ ఆ శిష్యుణ్ని సమీపంలోని చెరువుకు పంపించాడు. వెళ్ళిన శిష్యుడు వెంటనే ఖాళీ పాత్రతో తిరిగి వచ్చాడు. తన కన్నా ముందు ఓ ఎడ్లబండి చెరువులోంచి వెళ్ళడం వల్ల నీళ్ళలో బురద తేలిందని చెప్పాడు. కాసేపు పోయాక ఆ శిష్యుణ్ని బుద్ధుడు మరోసారి పంపించాడు. అతడు తొలిసారి లాగే ఖాళీ పాత్రతోనే తిరిగి వచ్చాడు. ఇలా అయిదు సార్లు జరిగాక, ఆరోసారి తేట నీటితో వచ్చిన శిష్యుణ్ని చూసిన బుద్ధుడు, ‘చెరువులో రేగిన కలకలం వల్ల బురదనీరు తేట పడటానికి సమయం పడుతుంది. అలాగే కలత పడ్డ మానసిక స్థితి కుదుటపడేందుకు సహనం అవసరమవుతుంది. చెరువులో పాత్రను ముంచి, మరింత కల్లోల పరచడం వల్ల తేలేది బురదే! కల్లోలిత అంతరంగాన్ని రెచ్చగొడుతున్న కొద్దీ అధికమయ్యేది అశాంతే! నీరు తేటబారే వరకు ఓర్మిని వహించాలి. శ్రద్ధగా గమనించాలి. అప్పుడే స్వచ్ఛమైన జలం లభిస్తుంది. దాహార్తి తీరుతుంది. అంతరంగానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది’ అంటూ నవ్వుతూ పాత్రను అందుకున్నాడు."

రచనా వ్యాసంగము*

 *సంస్థలు - రచనా వ్యాసంగము*




సమాజంలోని సంక్షేమ సహాయ, సహకార సంస్థలు గత  సంవత్సరాలుగా  భౌతికంగా, ఆర్థికంగానే గాకుండా వాజ్ఞ్మయ పరంగా కూడా బ్రాహ్మణ సమాజ సేవ చేస్తున్నవి.  విద్య, ఆధ్యాత్మిక, సాంకేతిక, సాహిత్య,  సాంస్కృతిక అంశాలపై  ఎన్నెన్నో రచనలు అందిస్తూ సభ్యులకు, బంధు మిత్రులకు  సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక  రంగాలలో పూర్తి స్థాయి అవగాహన కలిగించడమే  *సంస్థల* ముఖ్య ఆశయము. 


వయోధికత, పరమపద ప్రాప్తి సృష్టిలోని జీవజాలమునకు తప్పనిసరి మరియు అనివార్యము, ఈ విషయమై మానవులు మినహాయింపు కాదు.  *సంస్థలలోని*  వయోధిక సభ్యులు ఎప్పుడైనా సేవా రంగము నుండి నిష్క్రమించు అవకాశములు మెండు.  సహాయ, సంక్షేమ సంస్ధలు భౌతిక, ఆర్థిక సేవలతో పాటు వాజ్ఞ్మయ  సేవలు కూడా కొనసాగించవలసి ఉంటుంది. *వయోధికుల నిష్క్రమణతో*    *సంస్థలలో*   వాంగ్మయ *సేవలు ఆగిపోకూడదు*. 


బహు అర్థములు కల వాంగ్మయ సేవలో రచనా సేవ కూడా ఒక భాగము. కావున సభ్యులందరూ ఈ విషయము గమనించి...రచనా నైపుణ్యము గల సభ్యులు ముందుకు రావల్సి ఉంటుంది... కార్యవర్గము వారిని ప్రోత్సహించ వలసిఉన్నది.


క్లుప్తంగా రచన అంటే ఏమిటో తెల్సుకుందాము. రచన అంటే మనలోని భావాలను వ్యక్తీకరించడము, ఆలోచనలను క్రమ పద్ధతిలో  వివరించడం. నిజానికి రచన అంటే వ్రాయడమొక్కటే కాదు. వ్యాస రచన, పద్య రచన, చిత్ర రచన, శిల్ప రచన ఆ మాటకొస్తే చక్కగా వంట చేయడం కూడా రచననే. 


ఈ విశ్వంలో ఒక విషయంపై అందరి వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండక పోవచ్చును.  భిన్న భిన్నంగా ఉండే అవకాశాలు కూడా హెచ్చు. అందుకే భిన్న భిన్న రచనలు. రచనకు ముఖ్యంగా ఉపయోగపడే సాధనాలు....స్పందన, అనుభూతి, ఊహా, ఉద్వేగం  అభిప్రాయాలు, ఆలోచనలు, భాష, వ్యక్తీకరణ నైపుణ్యము, ఇంకా చెప్పాలంటే కాల్పనిక అంశాలు కూడా రచనకు మినహాయింపు కాదు. 


*ఏదో ఒకటి వ్రాసేసి జనాల మీదకు త్రోసేసేది  మంచి రచన అనిపించు కోదు, దారుణము కూడా*.  సహాయ, సంక్షేమ, సహకార సంస్థలకు ఇటువంటివి అవసరము లేదు.  రచనల విషయాలలో  వస్తువు,  కౌశలము, విచక్షణ, విశ్లేషణ, అమరిక మరియు క్రమ పద్దతి అవసరము. రచయితలకు పలు ఆలోచనలు, పలు భావాలు పలు వైపుల నుండి వస్తూనే ఉంటాయి. వాటికి  మరింత  ప్రౌడిమ జోడించి అమరిక, విచక్షణలతో రచనలకు ఒక రూపం తేవాలి. *రచనలు సాంఘిక ప్రయోజనాలకు తోడ్పడాలి*. 


సభ్యులకు మరోసారి విజ్ఞప్తి సంస్థలలోని సభ్యులు రచయితలుగా ఎదగాలి.


ధన్యవాదములు.

గుడ్ ఇండియన్స్ కాదు

 మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే..!?


1) మాతృదేవోభవ , పితృదేవోభవ అని చెప్పిన దేశం భారత దేశం.      కానీ దానిని ఆచరించేది  ఆస్ట్రేలియా.


( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)


2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)


3) యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)


4) పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)


5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)


6) కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)


7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)


8) భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్ .( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో  మొదటి స్థానం జపాన్ దే)


9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)


10) విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు  లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)


పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న  దేశాలు ఇవి.. నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్,  న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా . చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. లేకపోతె చెప్పేవి శ్రీరంగనీతులు అవుతాయి. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది.

చెప్పేటందుకే నీతులు ఉన్నాయ్ అనే విధానం లో భారతదేశం మొదటి స్థానం లో ఉంది..


చెప్పటం మాని ఆచరించే రోజు వస్తుందని ఆశిద్దాం...


🙏🙏🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం  -‌ తృతీయ - పుష్యమి/ ఆశ్రేష -‌‌ ఇందు వాసరే* (08.07.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ముదితలు సౌందర్యముగొని

 *2030*

*కం*

ముదితలు సౌందర్యముగొని

మృదుమధుభాషణనమొనరగ  మెండుగ జనముల్

పదులుగ కథలల్లునెపుడు

మదిగలవారలకెయెరుక మర్మము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఆడవారు అందంగా ఉండి మృదువుగా మధురంగా మాట్లాడితే చాలా మంది అటువంటి ఆడవారి పై ఎల్లప్పుడూ రకరకాలుగా కథలల్లుతారు. మనస్సు(బుధ్ధి/జ్ఞానం) ఉన్న వారికి మాత్రమే అందులోని నిజానిజాలు తెలుస్తాయి.

*సందేశం*:-- అందంగా ఉండి చక్కగా మాట్లాడే ఆడవారి గురించి చెప్పే కథలను జ్ఞానం తో పరికించకుండా నమ్మరాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శివార్పణ ఫలితం!*




          *శివార్పణ ఫలితం!*

              ➖➖➖✍️

```

తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో ‘నాగపట్నం’ అనే ఊరు ఉన్నది.                       అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు.


ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు.


ఈ జాలరి వాడికి ఒక దినచర్య... అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని ‘శివార్పణం!’ అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు.


ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతూ ఉంటారు.


ఇతను భక్తిగా చేశాడు. ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం.


నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది. శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. శివభక్తి,శివప్రేమ, శివార్పణం ఇలాంటి మాటలు. ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం!


అటు తర్వాత చేపలు పట్టుకొనేవాడు. ఇతడు జాలరి వాళ్ళకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే. ఒక కట్టు ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి గనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఈనాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు. మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. 


ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతోదూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్యభోజనాలకీ, కుటుంబపోషణలకీ అయిపోయాయి.


చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఇళ్ళల్లో పొయ్యి వెలగట్లేదు.


ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది.


అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది.


దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీనినుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది.


కానీ ఇతనికున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం.


పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప.


ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు. మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన  కలిగినది,  వీళ్ళందరికీ. వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమౌతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజూ శివార్పణం చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు.


అదీ భక్తి అంటే…!


ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి.


పైకి తీశాడు ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు పారేయకు అని!


వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి.    ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకొని ‘శివార్పణం’ అని సముద్రంలో వేశాడు.


వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యంలో వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి “సంతోషించాను!” అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు.


’ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం!’ అని చెప్పడం.``` *‘స్వయం తీర్త్వా పరాన్ తారయతి’* 

```తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు.


ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది.


ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తియై ఇక్కడికి తెస్తారు.


ఆ జాలరి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది.


భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి, తిరగాలి. భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి.


ఇలా ఈ మహానుభావుని ‘శివార్పణం’ కథ చెప్పుకున్నాం. దీనిని భావించినట్లయితే ‘అర్పణ బుద్ధి’ అంటే ఏమిటో తెలుస్తున్నది.


కొంతమంది భగవంతుడి దయవల్ల సంపాదించి మాటిమాటికీ అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని. కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమౌతుందో అనే భయం వాళ్ళకి. ఒకళ్ళకి ఇవ్వడానికి, దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు.


’అర్పణకి’ సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి.


కనుక అర్పించేదే నీది, దాచుకున్నది నీదికాదు. తరువాత ఎవడిదో అవుతుంది. ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి.


ఇలాంటి  నిజ జీవిత గాధలను చిన్నప్పటినుంచీ తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి.


భగవత్కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి.


భగవంతుడు ఒక తల్లిదండ్రులకంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలా వున్నాయి.✍️```

            *ఓం నమ:శ్శివాయ:  !!*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము.🙏

రాజమహేంద్రవరం

 *మా రాజమహేంద్రవరం వైభవం ఎంతటిది?!*

ఇదిగో ఇంతటిది!!

*సాంస్కృతిక రాజధాని నగరం రాజమహేంద్రవరం* అని చెప్పడానికి 

ఇంతకంటే ఏమి కావాలి. 


ఈ నగరం పేరు చెబితే చాలు 

ఒళ్ళు పులకించడానికి ఇంకేమి కావాలి!


నిన్న ఒక సాంస్కృతిక సంబంధమైన కార్యక్రమాన్ని 

కవర్ చేయడానికి వెళ్ళాను.. 


అక్కడ సహస్రావధాని *బ్రహ్మశ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు* 

ఈ కింది మాటలు చెప్పారు!!


"వేదాంత, 

తర్క, 

వ్యాకరణ, 

మీమాంస శాస్త్రాలు" 


నాలుగింటిలోనూ పాండిత్యం కలిగిన మహా పండితులు ఒక్కరే ఉన్నారు.. 


ఆయన ఉన్నది రాజమహేంద్రవరం.. 


ఆయనే 

*బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు.*


వేదాంత విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం రెండూ ఉన్న తిరుపతిలో కూడా మూడు శాస్త్రాలలో పాండిత్యం ఉన్నవారు మాత్రమే ఉన్నారు!!"


*ఆదికవి నన్నయ భట్టారకుడు* నడయాడిన చోటు.. 


*ఆంధ్రమున ఆదికావ్యం* 

*ఆంధ్ర మహాభారతం* ఆవిర్భవించిన చోటు మరి!!


By మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 

🙏🙏🙏