8, జులై 2024, సోమవారం

నరకాలు

 నానారకాల నరకాలు 

~~~


పురాణాలు చెప్పిన దాని ప్రకారం 

28 రకాల నరకాలున్నాయి.


మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని బలంగా కోరుకుని పెద్దలు ఏర్పరచినవి ఈ నరకాలు.


రాముడిని నమ్మినా, యముడిని నమ్మినా ఫలితం సామాజిక సంక్షేమమే! పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి.


పాప స్వరూపాలను బట్టి యముడు ఆయా నరకాలకు పాపులను పంపుతుంటాడు.


అపరిచితుడు సినిమా గుర్తుంది కదా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు. నిజంగా అవి ఉన్నాయో లేదు తెలియదు కాని, ఆ సినిమా చూసినతరువాత ప్రతి ఒక్కరు తప్పులు చేయాలంటే కాస్త భయపడిపోయారని చెప్పవచ్చు. అసలు గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుంది


1.తమిశ్రం: ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసి ఇదో చిమ్మచీకటి నరక కూపం.


2. అంధతమిశ్రం: ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.


3. రౌరవం: రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు.


4. మహారౌరవం: న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు.


5. కుంభిపాకం: వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హత మార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.


6.కాలసూత్రం: ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పై నుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది.


7. అసితపత్రవనం: విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు.


8.సుకరముఖం: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.


9. అంధకూపం: చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు.


10. తప్తమూర్తి: ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.


11: క్రిమిభోజనం: ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు.


12. శాల్మలి: దీన్నే తప్తశాల్మలి అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు.


13. వజ్రకంటకశాలి: జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది.


14. వైతరణి: అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు.


15. పూయోదకం: వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది.


16. ప్రాణరోధం: కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి.


17. వైశాసనం: పేదలు ఆకలి దపðలతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.


18. లాలభక్షణం: అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరుచు వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది.


19. సారమేయాదానం: ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.


20. అవీచి: నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తపðడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తపðడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకు వస్తారు.


21. అయోపానం: ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి.


22. రక్షోభక్ష: జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం ఈ నరకం ఉంది.


23. శూలప్రోతం: ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను ఈ నరకంలోకి పంపుతాడు యముడు.


24. క్షరకర్దమం: మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు.


25. దందశూకం: తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు.


26. వాతరోదం: అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంది.


27. పర్యావర్తనకం: ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు.


28. సూచీముఖం: గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు.

కామెంట్‌లు లేవు: