ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
26, మార్చి 2025, బుధవారం
చెడుకిదూరంగా ఉండాలి.🙏
శు భో ద యం 🙏
చ:-క్షమ కవచంబు,క్రోధమదిశత్రువు,జ్ఙాతిహుతాశనుండుమి
త్రము తగుమందు,దుర్జనులు దారుణపన్నగముల్,సువిద్యవి
త్తము,చితలజ్జ భూషణ,ముదాత్త కవిత్వము రాజ్య,మీక్షమా
ప్రముఖపదార్ధముల్,గలుగుపట్టున ,దత్కవచాదులేటికిన్;
భర్తృహరి సుభాషితములు-ఏనుగు లక్ష్మణ కవి;
భావం:- ఓర్పుఉంటే కవచంతోపనిలేదు.కోపం శత్రువు వంటిది.అన్నదమ్ములు (పాలెగాళ్ళు)నిప్పుతోసమానం.
మిత్రుడు ఔషధంతోసమానం.దర్మార్గులు భయంకరమైనపాములవంటివారు.చక్కనివిద్య చేతిలోనున్న
ధనమువంటిది.తగుమాత్రపుసిగ్గు అలంకారమువంటిది(నగవంటిది)
కాబట్టిమంచిని నేర్చుకోవాలి,చెడుకిదూరంగా ఉండాలి.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐🌷🌷🌷🌷
సంగీత-సౌందర్య దర్శనం!
శు భో ద యం 🙏
సంగీత-సౌందర్య దర్శనం!
రాయల నాటి అష్ట దిగ్గజాలలో ఒకరైన భట్టుమూర్తి (రామరాజ భూషణుడు) తన
వసుచరిత్రలో సంగీతంతో బాటు
సౌందర్య వర్ణనం గూడా మేళగించి అందమైన ఒక పద్యం చెప్పాడు. నేడు , అది మీకోసం
.చిత్తగించండి!
మ: " పదమెత్తం గలహంసలీల , నధర స్పందంబుఁ సేయన్ ,శుభా
స్పదమౌ రాగ కదంబకంబు , శ్రుతిఁ జూపన్ శ్రీవిలాసంబు , కే
ల్గద లింపన్ సుకుమార పల్లవ న వైలాలక్ష్మి , వీక్షింప ష
ట్పదియున్ బొల్చుఁ , దరంబె కన్నెఁ గొనియాడన్ ,గేయవాక్ప్రౌఢిమన్;
వసుచరిత్రము: తృతీయాశ్వాసము -59వ పద్యము;
సందర్భం: మంజు వాణి ప్రణయ దౌత్య ము; వసురాజుతో గిరికను గూర్చి చెప్పుట;
రామ రాజ భూషణుడు సాహిత్యమునందే గాదు ,సంగీతమునందుఁ గూడ నిష్ణాతుడు.
సందర్భమును బట్టి అవకాశము ననుసరించి సంగీత విషయములను గూడ
వసుచరిత్రమునందు నిపుణముగా నుపదేశమొనరించెను. ప్రస్తుత పద్యంలో గిరిక
సౌందర్యముతో బాటు ఆమెగాన కళానైపుణ్యమును గూడ జోడించి నిపుణముగా
నీపద్యమును విరచించినాడు.శ్లేష వలన(శబ్దశక్తి మూలక శ్లేష ) ఇది సాధ్యపడినది.
అర్ధములు:- పదము-కాలు,పాట; కలహంసలీల- రాయంచవలె,హంసధ్వనివలె;
రాగకదంబకంబు:-కడిమిపూల యెర్రదనం, రాగమాలికలు; శ్రుతి- చెవి,
నాదముయొక్కస్థాయి; శ్రీవిలాసంబు- శ్రీకారపు సొంపు, శ్రీరాగము ; నవ+ఏలాలక్ష్మి-కొత్త
ఏలకీతీగె సొగసు,
కొత్తవియగు ఏలల యందము; షట్పది- తుమ్మెద, షట్పద గానము;
వ్యాఖ్యానము: ఆకన్య కాలు కదిపినదా కలహంస నడకలే! పెదవి విప్పెనా అనురాగరాగ
రంజితమే! చెవి జూపెనా శ్రీకార
శోభలే! చేయికదపెనా వసంత లాస్యమే(నవ యేలకీలతలూగిన చందమే)
వసంతలక్ష్మివలె ఉంటుందని చెప్పటం) కన్నులు తెఱచినదో
తుమ్మెదల చాలనమే (కనులు నల్లనై తుమ్మెదలను బోలియుండుననుట)
మ్మెదలకు ద్విరేఫమను నామాంతరమున్నది.రారా యనుట.కన్నులు విప్పెనా
అది ప్రణయాహ్వానమే! యిట్టి లోకోత్తర సౌందర్యముగల కన్య గిరిక యని సౌందర్యపరమైన యర్ధము.
సంగీతము:- ఈకన్య పాట నందుకొన్నదో హంసధ్వని రాగమే! పెదవి విప్పెనా
రాగమాలికలే !శ్రుతి ప్రకటమొనరించెనా శ్రీరాగమే!(పలుకును) చేతులతో తాళము
నందుకొన్నదా సుకుమారమైన యేలలను గీతములే!(పలుకును) కనులు దెరచి
చూచెనా షట్పదులే!( తుమ్మెదపదములు పలుకును) ఆమెసంగీత పాటవమును
యేమని చెప్పను? అంటోంది మంజువాణి.అంటే చెప్పటానికి మాటలు చాలవని ఆమె ఆంతర్యం.
బాహ్య సౌందర్యమేగాదు, మనోల్లాసాన్ని కలిగించే సంగీతంలోకూడా గిరిక దిట్ట!
అని చెపుతున్నది. ప్రభువులుసౌందర్య,సంగీతాది సత్క ళారాధకులు.
ఇదండీ! భట్టుమూర్తిగారి సంగీత సౌందర్యాల "జుగల్ బందీ"!
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
మానవ జన్మ
*🌹🌹🌹🌹 ఎందుకీ మానవ జన్మ?… ఎప్పుడు దీనికి విముక్తి? 🌹🌹🌹🌹*
*జీవితం మీద మనకు విసుగు పుట్టినప్పుడు "ఛీ మనిషిగా ఎందుకు పుట్టాను రా బాబూ" అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం.*
*నిజంగా మానవ జన్మ అంత నీచనికృష్టమైనదా? అసలు మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాం… ఎందుకు చనిపోతున్నాం? చనిపోయాక ఎక్కడికి పోతాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి.*
*మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు ఉత్తమోత్తమమైనది.*
*పునరపి జననం… పునరపి మరణం*
*అంటారు. జన్మ అంటే మళ్లీ పుట్టడం… అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది.*
*మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. అయినా పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు. ఇందులో మరో దారి లేదు.*
*మనుషులకేనా చెట్లకు ఉండవా?*
*ఇవన్నీ మానవ మాత్రులకేనా చెట్టూ చేమలకు ఉండవా అని మీరనుకోవచ్చు. అక్కడికే వద్దాం. ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది. అది పువ్వై ఆ తర్వాత కాయగా మారింది. పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిందెగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తుంటాం.*
*అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ''అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా" అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు…. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు. పండు మొదలు లోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.*
*సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాధే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేయాలి.*
*కర్మ ఫలాలు ఏమిటో తెలుసుకుందాం…*
*జ్ఞానం, కర్మలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఆగామి, సంచితం, ప్రారబ్దం అని మూడు రకాలుగా ఈ కర్మలు ఉంటాయి. నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల కిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి… మరికొన్ని తర్వాతి జన్మల్లో ఫలితాన్ని చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దానదర్మాలు ఏమైనా చేశామా… లాంటివన్నీ ఆగామి కర్మల కిందిదకే వస్తాయి.*
*ఇక సంచిత కర్మలలోకి వెళదాం. మనం పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చాయనుకోండి మనం ఈ జన్మలో కూడా వాటిని అనుభవించకుంటే అవి మళ్లీ రాబోయే జన్మకు వెళ్లిపోతాయి. వీటిని సంచిన కర్మలు అంటారు. ఉదాహరణకు గత జన్మలో మీరు ఒకర్ని హత్య చేశారనుకుందాం ఈ జన్మలో దాని ఫలితం అనుభవించాల్సి ఉన్నా రకరకాల కారణాలవల్ల అది జరగలేదు…*
*అది రాబోయే జన్మకు తరలిపోతుంది. దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని మనం తరచూ అంటూ ఉంటాం.*
*సంచిత కర్మల్లో కచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి. వాటినే ప్రారబ్దం అంటారు. ఇందాకటి ఉదాహరణ విషయానికే వస్తే గత జన్మలో మీరు చాలా హత్యలు చేశారనుకోండి… పైగా మీ దగ్గర పుణ్యబలం కూడా లేదనుకోండి జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు ఆ ప్రారబ్దం తగిన ఫలితం చూపిస్తుంది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది ప్రారబ్ద కర్మ కాబట్టే అతను అనుభవించక తప్పలేదు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.*
*పుణ్య కర్మలు పక్వానికి వస్తే ఆ వ్యక్తి దేవలోకంలో పుడతాడు. ఆ కర్మల ఫలితంగా అనేక భోగాలు అనుభవిస్తాడు. ఆ భోగాలు అయిపోగానే*
*"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి"*
*అన్నట్లు మళ్లీ మానవ లోకాన్ని చేరుకుంటాడు. అక్కడ మళ్లీ మనిషిగానో, జంతువుగానో పుడతాడు. అంతకుముందు అతను దేవలోకంలో పుట్టినా అతనికి కర్మలు చేసే స్థూల శరీరం ఉండదు. ఎందుకంటే అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుంది గాని కర్మలు చేసే అధికారం ఉండదు. పుణ్య కర్మలు పక్కన పెట్టి మనం పాపాలు మాత్రమే చేస్తూ పోయామనుకోండి అవి కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టక తప్పదన్నమాట.*
*సర్వేజనాః సుఖినోభవంతు*
*జై గురుదేవ్ 👏👏*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
తెలుగు భాష ఆవిర్భావము
🙏తెలుగు భాష ఆవిర్భావము🙏
భాష అంటే ఏమిటి? అది ఎలా పుట్టింది? తెలుగు భాష ఎలా పుట్టినది? ప్రశ్నకు సమాధానం
సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏమిటి ? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. ముందుగా….
భాష అంటే ఏంటి?
మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. మాట వినబడనంత దూరంలో ఉంటే మనం సంజ్ఞలు చేస్తాము కాబట్టి అదికూడా భాషయేకదా. భదిరులకు ఉన్న భాష సంజ్ఞలేకదా ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవునికీ భాషలో చాలా మార్పు వచ్చింది. మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూత మయ్యింది.
విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.
భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.
తెలుగు భాష విషయానికి వస్తే
సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాకృత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాకృతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని “తెలుగు” శబ్దం ఏర్పడి ఉండవచ్చని గంటి జోగి సొమయాజి గారు తెలిపారు. “తెలుగు” దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.
“తలైంగు” జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. “తలైంగు” అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.
“తెలుంగు” అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. “తెన్ను” అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.
“తెన్” నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. “తెన్” అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి “తెనుగు” అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.
ఐతే “త్రినగ” నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా “త్రినగ” శబ్దం ఏర్పడిందంటారు.
మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.
విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా “త్రిలింగ” పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గారు, తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.
ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.
పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
అవసరమైనది పొందటం
ప్రతి ఒక్కరి జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు.....!!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.
పూజారి -- కానుకలు
పూజారి -- కానుకలు
~~~
మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు.
హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది.
అని కొన్ని గుళ్ళలో వ్రాసి వుంటారు.
హుండీ ఎవరు తెరుస్తారు ?
ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి ! ఆయనెవరు ?
ప్రభుత్వప్రతినిధి ! .
అంటే
భక్తుడు ప్రభుత్వముద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట!
సరే !
మరి పూజారి ఎవరు ?
పొద్దున్నే తెల్లవారుఝామునే లేచి భగవంతుడికి మేలుకొలుపులు పాడి (దేవుడికంటే ముందే మేలుకొంటున్నాడన్నమాట)
ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తులమదిలో ఒక అలౌకికపవిత్రభావనకలిగేటట్లు అలంకారాలు పూర్తిచేసి ఆయనను అష్టోత్తర, శతసహస్రనామాలతో పూజించి, స్వామీ ! నీ దర్శనానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రీ అని ప్రార్ధించి వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసే భగవంతుడి బంట్రోతు! ...
మరి ఆయన జీతమెంత ?
చాలాచాలా తక్కువ ! బ్రతుకు జట్కాబండి ఈడ్వలేనంత!.
పూజారా ! మేము పిల్లనివ్వం ! అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో.
కట్టుకున్నదానికి కన్నపిల్లలకు న్యాయం చేయలేక బ్రతుకీడుస్తున్న వారు ఎందరో ! కోకొల్లలు!
వారిపట్ల మనకు ఏ బాధ్యతాలేదా?.
మన కుటుంబాలు కార్లలో తిరగాలి.
మన కుటుంబీకులు ఖరీదయిన దుస్తులు వేసుకోవాలి.
విహారయాత్రలకు వెళ్ళాలి.
అందుకు సంపాదన కావాలి ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం. ఆ దేవుడికి కమీషన్లు ఇస్తాం !.
కానీ
ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోము. ఇదెక్కడి న్యాయం.
నా విన్నపం ఏమిటంటే ! హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేటులో మాత్రం కానుక వెయ్యండి లేదా పూజారి చేతికి కానుకలు ఇవ్వండి !
కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియచేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు !
ఉదాత్తానుదాత్తస్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితుడు చేసే పూజలు నిత్యం చూస్తున్నాం!, ఈ రోజు గుళ్ళల్లో అర్చకులు నిరంతరం సుస్వరంతో మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు! .
ఆ వృత్తిలో పూజారులకు తగినంత ఆదాయం వస్తే వారు సలక్షణంగా మరింత భక్తితో, శ్రద్ధతో పూజలు చేస్తారు !
మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా ! పడగొట్టడమా ! ఆలోచించండి.
బొట్టు పెట్టుకోకపోతే
🔴🩸బొట్టు పెట్టుకోకపోతే🩸🔴
ఏమవుతుందోతెలుసుకోండి
మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది.
🩸బొట్టులేని ముఖము,
💮ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో
వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత
ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,
దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.
అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.
కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు.బొట్టు వల్ల రక్షణ
నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు
మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.
మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.
ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.
ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
అంటేమెదడుకుసంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.
కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.
జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎటువంటి ఒత్తిడికి
లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.
సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. నిమ్మ పండు కుంకుమ, పసుపు,గంధం
సువాసన వల్ల (ఆజ్ఞా చక్రం
పినియల్ గ్రాండ్, పిట్యూటరీ గ్రంథి) ఈ మూడు యాక్టివేట్ అయి శిరస్సు కు రక్షణ మరియు జాగృతం అవుతుంది
అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.
ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ
కూడా తొలగిపోతాయి.
అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.
ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.
పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా గంధం, విభూది వంటి వాటి ను ధరించవచ్చు గంగ సింధూరము కూడా
ధరించవచ్చు
ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు.
ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.
మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన యొక్క ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే
హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము.
ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.
👉జిగురు అంటిన స్టిక్కర్లు నిషేదించండి.👈
సర్వే జనా సుఖినోభవంతు
లోకా సమస్త సుఖినోభవంతు🔴🔴🔴
లోపాలు లేని మనిషి
🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏 🏵️ *లోపాలు లేని మనిషి,లోటు లేని జీవితం ఉండదు.. ప్రతీ మనిషి జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది..కుదిరితే పూర్చుకోవాలి.. లేకపోతే ఓర్చుకోవాలి.. అంతే కానీ మానసికంగా కృంగిపోతు మనశాంతి కోల్పోకూడదు..చెడు ఆలోచనలకు ఎప్పుడూ చోటివ్వకండి.. సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్ళున్నా పడవ మునిగి పోదు.. కానీ పడవలోకి నీళ్ళ రావడం వల్ల పడవ మునిగి పోతుంది.. జీవితం కూడా అంతే..చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మన మనసులోకి వచ్చే చెడు ఆలోచనలు వల్లే జీవితం నాశనం అవుతుంది*🏵️జీవితామంతా త్యాగం చేసినా నిన్ను ఎవ్వరు ఎప్పుడు మంచోడు అని అనరు.. ఎక్కడో అక్కడ వెతికి వెతికి ఏదో ఒక చిన్న తప్పుని పట్టుకుని నిందలు మాత్రం వేస్తారు.. ఎవడైనా మన వెనుక మాట్లాడడుతున్నాడు అంటే వాడు ఎప్పుడు ఎనుకే ఉంటాడు.. మనం ముందుంటాము జీవితంలో..పుకార్లు దొంగలకంటే ప్రమాదకరమైనవి.. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు.. కానీ పుకార్లు మనిషి గౌరవాన్ని, నిజాయితీని, కీర్తిని, విశ్వనీయత మొదలగు అన్నిటిని నాశనం చేస్తాయి జాగ్రత్త🏵️మంచితం కూడా మెడిసిన్ లాంటిదే.. డోస్ ఎక్కువ అయితే మనకే ప్రమాదం..ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం.. ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశాంతి.. ఎంత తక్కువ ఆశ పడతామో అంత ప్రశాంతత..ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏
శ్రీ వలియాకోయిక్కల్ శాస్తా ఆలయం
🕉 మన గుడి : నెం 1061
⚜ కేరళ : పందలం
⚜ శ్రీ వలియాకోయిక్కల్ శాస్తా ఆలయం
💠 వలియాకోయిక్కల్ ఆలయం పందళం రాజ కుటుంబానికి చెందిన కుటుంబ దేవాలయం.
ఈ ఆలయం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పందళంలో ఉంది.
ఇది పందళం ప్యాలెస్ ప్రాంగణంలో ఉంది. ప్రధాన దైవం అయ్యప్పన్.
💠 శబరిమల క్షేత్రం వైపు తిరువాభరణం (పవిత్ర ఆభరణాలు) ఊరేగింపు ప్రతి సంవత్సరం మకరవిళక్కు పండుగకు ముందు వలియకోయిక్కల్ ఆలయం నుండి ప్రారంభమవుతుంది.
మకరవిళక్కు పండుగ సీజన్‌లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
💠 పురాణాల ప్రకారం, పందళం రాజ కుటుంబం పందళం అయ్యప్ప ఆలయాన్ని నిర్మించింది మరియు శబరిమల ఆలయానికి సంరక్షకులుగా ఉన్నారు.
💠 పురాణాల ప్రకారం, అయ్యప్ప శివుడు మరియు విష్ణువుల కలయిక నుండి మోహినిగా జన్మించాడు.
విష్ణువు మోహిని అవతారం తీసుకున్నప్పుడు అయ్యప్ప శివుడు మరియు విష్ణువుల మిశ్రమ శక్తితో జన్మించాడు
💠 అతను పందళం రాజు యొక్క పెంపుడు కుమారుడు.
అందుకే, శబరిమలలో తీర్థయాత్రల సమయంలో, అయ్యప్పను పూజించడానికి భక్తులు పందళం అయ్యప్ప ఆలయానికి పోటెత్తారు.
💠 గలవముని అనే మహర్షికి లీల అనే కూతురు ఉంది. ఆమె భర్త దాతన్ ఆమెను శపించాడు మరియు ఆమె గేదె ముఖంతో మహిషి అనే రాక్షసుడిగా పునర్జన్మ పొందింది.
అయ్యప్ప మహిషిని చంపాడు, ఆమె శాపం నుండి విముక్తి పొందింది.
ఆమె శవం నుండి అందమైన స్త్రీగా లేచి, దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ, తనను వివాహం చేసుకోమని అభ్యర్థించింది. అయితే అయ్యప్ప బ్రహ్మచారి కావడంతో ఆమె కోరిక తీరలేదు. అయినప్పటికీ, అతను మహిషిని శబరిమలలో ఉండడానికి అనుమతించాడు మరియు భక్తులు ఆమెను మలికప్పురతమ్మ పేరుతో పూజించారు.
💠 అయ్యప్ప మానవునిగా జననం
కలియుగంలో తన భక్తులను కష్టాల నుండి రక్షించేవాడు అయ్యప్ప అని నమ్ముతారు.
ధర్మశాస్తా, మణికందన్, భూతనాథన్, పందల రాజా, పంబా వాసన్ అనేవి అతని ఇతర పేర్లు.. అయ్యప్ప జన్మ ప్రధాన ఉద్దేశం మహిషి అనే రాక్షసుడిని నాశనం చేయడమే.
💠 చరిత్ర :
పందళం రాజకుటుంబం 903లో పందళం రాజవంశం పాలనలో శబరిమల ఆలయాన్ని స్థాపించింది. పందళం రాజకుటుంబం మధురై పాండ్య రాజుల నుండి వచ్చింది, వారు శతాబ్దాలుగా తమ శాశ్వత నివాసంగా మారిన పందళం చేరుకునే వరకు అక్కడి నుండి మరొక ప్రాంతానికి తరలివెళ్లారు.
💠 పందళం అయ్యప్ప దేవాలయం 1971లో నిర్మించబడింది మరియు భారీ పునర్నిర్మాణం జరిగింది.
పందళం రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ వరకు కూడా విస్తరించింది.
💠 పందళం రాజవంశానికి చెందిన రాజశేఖర రాజు శబరిమల ఆలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత పందళం అయ్యప్ప ఆలయాన్ని నిర్మించాడు. పందళం అయ్యప్ప ఆలయం మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు విలక్షణమైన కేరళ నిర్మాణ శైలిని కలిగి ఉంది.
💠 చతురస్రాకారంలో ఉన్న ఈ ఆలయంలో ఇత్తడి లోహపు పైకప్పు ఉంది.
ఈ మందిరానికి నైరుతి దిశలో మాళికప్పురతమ్మ మందిరం ఉంది. పందళం అయ్యప్ప దేవాలయం యొక్క ప్రధాన దైవం అయ్యప్పన్.
గర్భగుడిలో సహజమైన ఊరేగింపు మార్గం ఉంది, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ప్రత్యేక విగ్రహం లేదు. భక్తులు దేవతను సూచించే చెక్కిన రాయిని (శాలిగ్రామం) పూజిస్తారు.
💠 శబరిమల అయ్యప్ప దేవాలయం తరహాలోనే పందళం అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు.
యాత్రికులు సాధారణంగా శబరిమలకు వెళ్లే ముందు ఆగి దేవతను పూజిస్తారు.
💠 శర్క్కర పాయసం, అరవణం, ఉన్ని అప్పం దేవికి ప్రధాన నైవేద్యాలు. పట్టుపురుకావు దేవి ఆలయం పందళం అయ్యప్ప దేవాలయం నుండి అర కిలోమీటరు దూరంలో ఉంది మరియు భద్రకాళికి అంకితం చేయబడింది.
ఈ ఆలయం మీనం (మార్చి/ఏప్రిల్)లో అశ్వతీ నక్షత్రం రోజున నవరాత్రితో వార్షిక పండుగను జరుపుకుంటుంది.
💠 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు పందళం అయ్యప్ప ఆలయాన్ని సందర్శించకూడదు.
భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు కొబ్బరికాయలు పగలగొట్టాలి. ఇక్కడ మద్యపానం, మాంసాహారం మరియు ధూమపానం ఖచ్చితంగా నిషేధించబడింది.
💠 ఈ ఆలయంలో జనవరి మధ్యలో మకర విళక్కు ఉత్సవం ఘనంగా జరుపుకుంటారు.
మకర విళక్కు పండుగకు మూడు రోజుల ముందు, అయ్యప్ప యొక్క తిరువాభరణం (పవిత్ర ఆభరణాలు) పందళం అయ్యప్ప ఆలయం నుండి శబరిమల వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు.
💠 శబరిమలకు విలువైన ఆభరణాలను మోసుకెళ్లే ఊరేగింపుకు త్రిపుణితుర రాజ రాజ వర్మ రాజ ప్రతినిధి.
గురుస్వామి, కులతినాల్ గంగాధరన్ పిళ్లై నేతృత్వంలో 18 మంది భక్తుల బృందం మూడు చెక్క పెట్టెలను శబరిమలకు తీసుకువెళ్లనుంది.
తంత్రి, మేల్శాంతి, దీపారాధనకు ముందు అయ్యప్ప విగ్రహాన్ని నగలతో అలంకరించనున్నారు.
💠 మకర విళక్కు పండుగ సీజన్‌లో ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
పందళం అయ్యప్ప ఆలయంలో జరుపుకునే ఇతర పండుగలు విషు మరియు ఓనం.
ఉత్సవాలు ముగిసిన తర్వాత తిరువాభరణాన్ని ఊరేగింపుగా పందళం ప్యాలెస్‌కు తిరిగి తీసుకువస్తారు.
💠 సమీప రైల్వే స్టేషన్లు:
చెంగన్నూరు రైల్వే స్టేషన్ మరియు తిరువల్ల రైల్వే స్టేషన్.
Rachana
©️ Santosh Kumar
15-10-గీతా మకరందము
15-10-గీతా మకరందము
పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఈ ఆత్మను ఎవరు తెలిసికొనగలరో, ఎవరు తెలిసికొనలేరో వచించుచున్నారు -
ఉత్క్రామన్తం స్థితం వాఽపి
భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి
పశ్యన్తి జ్ఞానచక్షుషః ||
తాత్పర్యము:-(ఒక శరీరమునుండి మఱియొక శరీరమునకు) బయలుదేఱుచున్నవాడును, లేక, శరీరమునందున్నవాడును, లేక విషయముల ననుభవించుచున్నవాడును, (సత్త్వాది) గుణములతో గూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు (తెలిసికొనజాలరు). జ్ఞానదృష్టిగలవారు మాత్రము చూచుచున్నారు (తెలిసికొనుచున్నారు).(అనగాఆయా క్రియలు జరుపుచున్నపు డాతనిని అజ్ఞులెఱుంగజాలరనియు, జ్ఞానులు మాత్ర మెఱుంగ గలరనియు భావము).
వ్యాఖ్య:-భగవంతుడు మాకేల కానుపించకనున్నారని అనేకులు ప్రశ్నించుచుందురు. దానికి, సమాధానమును శ్రీకృష్ణమూర్తి ఈ శ్లోకమున నొసంగిరి. నీవు జ్ఞాననేత్రమును (ఆత్మానాత్మవివేకమును) సంపాదించినచో ఇచ్చటనే, ఈ శరీరమునందే పరమాత్మను దర్శింపగలవు, అని భగవానుడు నుడువుచున్నాడు. వారికై దూరమున వెతకనక్కఱలేదు. జీవునియొక్క స్వశరీరముననే ఆతనిని కనుగొనవచ్చును. తినుచు, త్రాగుచు, అనుభవించుచున్న ఆ వ్యక్తిని వివేచనతో, సూక్ష్మదృష్టితో, జ్ఞాననేత్రముతో మనుజుడు కనుగొనగలడు (పశ్యన్తి జ్ఞానచక్షుషః). ప్రాపంచిక దృశ్యవాసనాప్రాబల్యము వలన అజ్ఞానులాతనిని తెలిసికొన జాలకున్నారు. అద్దమును ప్రపంచమువైపు త్రిప్పి పట్టుకొనినచో ముఖము అందు కానరాదు. తనవైపు త్రిప్పుకొనినచో మాత్రమే కానవచ్చును. అట్లే మనస్సును బహిర్ముఖముగ, చపలముగ, వాసనాయుక్తముగ గావించినచో ఆత్మవస్తువు అందు గానరాదు. అంతర్ముఖముగ, నిశ్చలముగ, వాసనారహితముగ నొనర్చిన మాత్రమే కానవచ్చును. నిశ్చలమనస్సు, ఆత్మానాత్మవివేకము కలవానికే ఆత్మదర్శనము, లేక భగవద్దర్శనము అగుచుండును. (ఇచట భగవద్దర్శనమనగా భగవదనుభూతి యని అర్థము).
"ఉత్క్రామన్తం…" అని చెప్పుటచే ఆత్మ జీవరూపమున ఈ శరీరమందే తినుచు, త్రాగుచు, మఱియొక శరీరమును బొందుచునున్నదని తెలియుచున్నది. కావున ముముక్షువులు భగవద్దర్శనముకై దూరదూరముగ బోనక్కఱలేదు.
జ్ఞాననేత్రముచే మహనీయులు ఆ యాత్మను తప్పక చూడగల్గుచున్నారని ఇట చెప్పుటవలన జీవితమునందు ప్రతి మానవునియొక్క ప్రథమకర్తవ్యము (అవివేకమును బోగొట్టుకొని, విషయవిరక్తిగలిగి మనస్సును బయటకు పరుగెత్తనీయకుండచేసి జ్ఞాన విచారణద్వారా, హృదయపరిశోధనద్వారా లోనగల) ఆత్మనెఱుంగుటయే యగును. "పశ్యన్తి జ్ఞానచక్షుషః” అని అసందిగ్ధముగ చెప్పివేయబడినందువలన జ్ఞాననేత్రమును సంపాదించుటయే తరువాయి భగవద్దర్శనము జీవునకు లభించియే తీరునని స్పష్టమగుచున్నది. అట్టి జ్ఞాననేత్రము లేనిచో, జీవితము నిరర్థకమే కాగలదు.
ప్రశ్న:- ఆత్మను ఎవరు చూడగలరు? ఎవరు చూడలేరు?
ఉత్తరము:- జ్ఞాననేత్రముగలవారు చూడగలరు. అది లేనివారు అనగా అజ్ఞానులు చూడలేరు. (జ్ఞాననేత్రము అనగా ఆత్మానాత్మవివేకము).
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*
*328 వ రోజు*
*భీముడు కర్ణుని ఎదుర్కొనుట*
వృషసేనుడి రథము ఎకి పారి పోయిన కర్ణుడు " భీమసేనా! " అని ఎలుగెత్తి పిలిచాడు. ఆ పిలుపు విని కోపించిన భీముడు కర్ణుని మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు కూడా భీముని బాణములు తుంచి అతడి మీద అతి క్రూర బాణములు వేసాడు (ఈ సారి పూర్తి శక్తి తో యుద్ధం చేసాడు ). ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. భీముడు కర్ణుని రథాశ్వములను, సారథిని చంపాడు. కర్ణుడు చికాకు పడి పక్కకు పోయి వేరొక రథం ఎక్కాడు " అన్న సంజయునితో ధృతరాష్ట్రుడు " ఛా! సుయోధనుడు ఎంతగానో నమ్మిన కర్ణుడు ఇలా చేస్తుంటే బుద్ధి హీనుడైన సుయోధనుడు ఏమనుకున్నాడో ఏమో అన్ని డంబములు పలికిన కర్ణడు ఆతరువాత ఏమి చేసాడు ? " అన్నాడు. సంజయుడు " అవమాన భారంతో రగిలిపోతున్న కర్ణుడు తిరిగి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి మధ్య పోరు ఘోరమై భీమసేనుడి చేతిలో కర్ణుడి సైన్యం మొత్తము హతమైంది " అనగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అర్జునుడిని జయిస్తాడన్న అహంతోనే కదా సుయోధనుడు మదమెక్కి పాండవులతో యుద్ధానికి దిగాడే ఈ కర్ణుడు కనీసం భీమ సేనుడిని కూడా జయించ లేక పోతున్నాడు. వీడు అర్జునుడిని కృష్ణుని మిగిలిన పాండవులను గెలువగలడా. ఆనాడు శ్రీకృష్ణుని సంధి తిరస్కరించినందుకు ఫలితం అనుభవించ తప్పుతుందా ! " అన్నాడు. తన సేన మొత్తం నాశనం కావడం చూసి కర్ణుడు కోపించి భీమునిపై ముప్పై నిశిత శరములు ప్రయోగించాడు. భీముడు కర్ణుడి రధసారధిని చంపి అతడి రధాశ్వములను చంపాడు. కర్ణుడు తన రధమును తానే తోలుతూ భీమునిపై శక్తి ఆయుధమును ప్రయోగించాడు. భీముడు ఆ శక్తిని తునా తునకలు చేసి కర్ణుని తొమ్మిది వాడి అయిన బాణములతో కొట్టాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమునిపై అవిశ్రాంతంగా శరవర్షం కురిపించాడు. ఇరువురూ సింహనాదాలు చేస్తూ ఒకరితో ఒకరు పోరుతున్నారు. భీముడు కర్ణుని హయనులు చంపి, విల్లు విరిచి, కర్ణుని శరీరమంతా బాణములు గుప్పించాడు.
*భీముడు కురు రాజకుమారులను వధించుట*
కర్ణుడు భీముని చేతిలో ఓడుట చూసి సుయోధనుడు కర్ణునికి సాయంగా దుర్జయుని పంపాడు. దుర్జయుడు అత్యంతసాహసంతో భీమసేనుడిని ఎదుర్కొని భీముడి రధాశ్వములను, సారధిని గాయపరిచాడు. భీముడు ఆగ్రహించి కర్ణుని కంటి ముందే ఒకేబాణంతో దుర్జయుని తల నరికాడు. కర్ణుడు భీముని ఎదుర్కొని భీముని వక్షస్థలం మీద ఒక వాడి అయిన బాణం నాటాడు. భీముడు తన గధ తీసుకుని కర్ణుని రధము విరుగకొట్టాడు. రధము విరిచి, కేతనము తుంచి,సారధిని చంపాడు. అయినా కర్ణుడు వెనుదిరుగ లేదు. సుయోధనుడు తన తమ్ముడైన దుర్ముఖుని కర్ణుడికి సాయంగా పంపాడు. భీముడు ఒక పక్క కర్ణునితో యుద్ధము చేస్తూనే తనను ధైర్యంగా ఎదుర్కొన్న దుర్ముఖుని తొమ్మిది నిశిత బాణములు ప్రయోగించి చంపాడు. దుర్ముఖుని చావు కళ్ళారా చూసిన కర్ణుడు కుమిలిపోయి తిరిగి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమై భీముడు అత్యంత క్రూరబాణములు కర్ణుడి గుండెలకు గురి చూసి కొట్టాడు. భీమునిని దెబ్బకు తాళ లేక కర్ణుడు తన రధమును పక్కకు తొలిగించాడు " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విధి వైపరీత్యము కాకుంటే కర్ణుడు భీముని చేతిలో పరాజుతుడు కావడమేమిటి ఈ కర్ణుని నమ్మే కదా నా కుమారుడు సుయోధనుడితో వైరము పెంచుకుని ఈ యుద్ధానికి దిగాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
తిరుమల సర్వస్వం 189-*
*తిరుమల సర్వస్వం 189-*
*శ్రీవారి ఆభరణాలు -1*
*తిరుమలేశుడు నైవేద్యప్రియుడే కాదు, అలంకారప్రియుడు, ఆభరణ ప్రియుడు కూడా!*
కలియుగ ఆరంభంలో పద్మావతి పరిణయ సందర్భంగా మామగారైన ఆకాశరాజుతో మొదలై; వేలాది సంవత్సరాలుగా ఎందరో మహారాజులు, రాజాధిరాజులు, సామంతరాజులు, జమీందార్ల నుండి సామాన్యుల వరకు; శ్రీవారికి లెక్కలేనన్ని ఆభరణాలను భక్తితో సమర్పించుకున్నారు. ఇంకా సమర్పిస్తూనే ఉన్నారు. శ్రీవారి భక్తులైన ఎందరో పాలకులు బంగారు ఆభరణాలతో తులాభారం తూగి, వాటిని వినమ్రంగా శ్రీవారికి సమర్పించుకున్నారు. భక్తులు నేరుగా అర్పించుకున్న ఆభరణాలే కాకుండా, హుండీలో వచ్చిన ఆదాయం ద్వారా కూడా ఆయా కాలాలలో ఉన్న దేవస్థానం యాజమాన్యాలు తరచూ మేలిమి బంగారంతోనూ, వజ్రవైఢూర్యాల వంటి నవరత్నాల తోనూ కూడిన అమూల్యమైన ఆభరణాలను తయారుచేయిస్తూనే ఉన్నారు.
దేవాలయ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పబడే విజయనగర రాజుల పరిపాలనా కాలంలో అయితే శ్రీవారికి ఆభరణాలు కానుకగా సమర్పించే విషయంలో రాజుల మధ్య తీవ్రమైన స్పర్థ నెలకొని ఉండేది. పోటీలు పడి ఆభరణాలు సమర్పించుకునే వారు. ఆ లక్ష్మీవల్లభునికి ఎన్ని ఆభరణాలు చేయిస్తే అంత గొప్పగా భావించేవారు. ముఖ్యంగా, శ్రీకృష్ణదేవరాయల వారు తన 21 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏడు సార్లు స్వామివారిని ఒంటరిగాను, కొన్నిసార్లు సతీమణుల సమేతంగానూ దర్శించుకొని, వారిని ఆపాదమస్తకం బంగారు ఆభరణాలతో ముంచెత్తాడు. అంతే కాకుండా బంగారు, వెండి పాత్రలను సైతం సమర్పించుకుని, ఆనందనిలయానికి బంగారు పూతపూసి, ఆలయం మొత్తాన్ని బంగారుమయం చేశాడు.
నిజానికి ఈ అమూల్యమైన ఆభరణాలు, హుండీ ద్వారా వచ్చే అపారమైన ఆదాయం వల్లనే మహమ్మదీయులు, బ్రిటిష్ వారు వంటి అన్యమతస్తుల దృష్టి కూడా శ్రీవారి ఆలయం పై పడింది. వాటిని చేజిక్కించుకోవాలని పరాయిపాలకులు శతథః ప్రయత్నించినప్పటికీ, ఆయా సమయాల్లో తిరుమలేశుణ్ణి ప్రాణం కంటే అధికంగా ఆరాధించే భక్తుల, అర్చకస్వాముల మరియు ప్రాంతీయ పాలకుల సమయోచిత నిర్ణయాలతో, వారు చూపించిన తెగువ వల్ల శ్రీవారి ఆభరణాలు చాలావరకూ రక్షింపబడి, ఆ వారసత్వ సంపద భావితరాల వారికి భద్రంగా అందింది.
*శిలాశాసనాల ద్వారా అందిన సమాచారం*
పన్నెండో శతాబ్దం నుండి పాలకులు, శ్రీమంతులు సమర్పించుకున్న ఆభరణాల వివరాలను చాలా వరకు ఆలయకుడ్యాలపై చెక్కబడియున్న శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. అంతకు ముందు సమర్పింపబడ్డ ఆభరణాల వివరాలు తెలిపే శాసనాలు అతికొద్ది మాత్రమే లభ్యమయ్యాయి. ఆలయానికి తరచూ మరమ్మత్తులు జరగటం, పాత కుడ్యాల స్థానంలో కొత్తవాటిని నిర్మించడం మొదలైన కారణాలవల్ల చారిత్రకాధారాలు చాలావరకు లుప్తమై పోయాయి.
*స్థూలంగా శ్రీవారి ఆభరణాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.*
*సదాసమర్పణ ఆభరణాలు*
స్వామివారికి నిత్యం అలంకరిస్తూ ఉండే ఆభరణాలను *'సదాసమర్పణ ఆభరణాలు'* గా పేర్కొంటారు. అంటే, ఈ అభరణాలతో 'ఎల్లవేళలా' స్వామివారిని అలంకరిస్తుంటారన్నమాట. స్వర్ణకిరీటాలు, బంగారు కర్ణాభరణాలు, భుజకీర్తులు, చంద్రహారాలు, నాగాభరణాలు, స్వర్ణ శంఖుచక్రాలు, సూర్యకఠారి, ఇలాంటివెన్నో ఆభరణాలు ఈ కోవకు చెందుతాయి. వంతుల వారిగా వీటిలో కొన్నింటిని ప్రతినిత్యం శ్రీవారికి అలంకరించగా, మిగిలిన వాటిని బంగారువాకిలికి ఆనుకొని ఉన్న స్నపనమండపం లోని బీరువాలలో, ప్రధానార్చకుల పర్యవేక్షణలో భద్రపరుస్తారు. కోట్లాది రూపాయల విలువైన ఈ ఆభరణాలను భద్రపరచడం స్వామివారి కైంకర్యాలలో సదా మునిగి ఉండే అర్చకులకు కత్తి మీద సాము లాంటిదే! అయినప్పటికీ, భగవంతుని మీద భారం వేసి ఆ ఆభరణాల సంరక్షణా భారాన్ని సమర్థవంతంగా, దోషరహితంగా తరతరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నారు.
*విశేషసమర్పణ ఆభరణాలు*
విశేషసందర్భాలలో అంటే ప్రముఖ హైందవ పర్వదినాలలో, మరియు దేశాధినేతల వంటి ప్రముఖ వ్యక్తులు స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించి వారిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తారు. వజ్రఖచిత ఆభరణాలైన కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు వంటి ఆభరణాలను *'విశేష సమర్పణ ఆభరణాలుగా'* వ్యవహరిస్తారు. వీటన్నింటిని *'పారుపత్యదారు'* గా పిలువబడే ఆలయ ఉన్నతాధికారి అధ్వర్యంలో స్నపనమంటపం లోనే వేరే బీరువాలలో భద్రపరుస్తారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
ముందు ఎవరు మాట్లాడాలి...?*
శ్రీరాముని దయచేతను…
*ముందు ఎవరు మాట్లాడాలి...?*
నానాటికీ ఛిద్రమవుతున్న మానవ సంబంధాలు!
దూరమయిపోతున్న రక్తసంబంధీకులు! ప్రతి వ్యక్తికీ ఎదురవుతున్న సమస్య!
ఒక అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మాటపట్టింపు మూలాన అనుబంధం ఎడమయ్యింది. రెండు కుటుంబాలు పరస్పర వైషమ్యంతో దూరమయ్యాయి.
కాలక్రమాన దూరమూ పెరిగింది. తరాలు మారాయి.
అన్నగారి కొడుకు వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల సాధించాడు. అన్నగారు కన్ను మూశారు. కొంతకాలానికి అన్న కొడుకు తన తండ్రికి అభీష్టమైన రామాయణాన్ని పారాయణ చేశాడు. తన నాన్నపై భక్తి, ఆ నాన్నకి ఇష్టమైన రామునిపై భక్తిగా రెండు రూపాలయింది.
నాన్న పై ప్రేమయే రామాయణ పారాయణాన్ని చేయించింది. పారాయణ పూర్తి చేశాక - పెద్ద ఎత్తున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. బంధుమిత్ర బలగాన్ని ఆహ్వానించదలచుకున్నాడు. ఆహ్వాన పత్రాలను కూడా శోభాయమానంగా ముద్రించాడు. మొదటి పత్రం దేవుని పేర రాశాడు. ఇక - తరువాతి పత్రం - మానవ సంబంధాలలోని వారిలో - ఎవరికి తొలిగా ఇవ్వాలనేది ప్రశ్న, నాన్న పరమపదించాడు. ఆ తరువాత? తండ్రి తరువాత తండ్రి బాబాయి. ఏనాడో విడిపోయిన బంధం. ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో..!
కానీ వెతికి సాధించి అయినా మొదటి పత్రం బాబాయికే ఇవ్వాలి - అని నిశ్చయించుకున్నాడు!
ఇన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకోని బాబాయిని, పిల్లలమని కనికరం కూడా లేక, పలకరించని బాబాయిని... తానే ముందుగా పలకరించి పిలవాలా? మహాకష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరదీయని ఆ కుటుంబానికి తానే పని కట్టుకొని, మొదట పిలవాలా?
ఈ ప్రశ్నలు కలిగాయి. కలగడం సహజం కూడా! 'నేను' అనే భావాన్ని అంత తేలిగ్గా వంచడం సాధ్యం కాదు.
కానీ ఆ సమయంలో తాను పారాయణ చేసిన రామాయణం గుర్తుకు వచ్చింది.
*"పూర్వభాషీ ప్రియంవదః" అని రామ చంద్రుని వర్ణించాడు వాల్మీకి.*
"తానే మొదట మాట్లాడతాడు - ప్రియంగా మాట్లాడతాడు" ఇదీ రాముని మాట సొగసు.
అంతేనా - "వేయి అపకారాలైనా మరచిపోయి క్షమించగలడు. ఒక్క చిన్ని ఉపకారాన్ని సైతం కలకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞతా మూర్తి".
"ర్కిణామపివత్సలః" శత్రువుని కూడా క్షమించగలిగే ప్రేమమూర్తి.
ఈ విశేషణాలు స్ఫురించాయి.
అంతే.. కృతనిశ్చయంతో పట్టుపట్టి ఎంతో శ్రమపడి బాబాయి సమాచారం సేకరించి, అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు. బహుకాలం తర్వాత అన్న కొడుకు తనంతట తానే వచ్చి పాదనమస్కారం చేసి పలకరించగానే తమ్ముడి మనసు కరిగింది.
"బాబాయ్! శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను. నాన్న పోయాక, నా చేతులు మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇది. నాన్న తర్వాత అంతటి వాడవు నువ్వే దగ్గరుండి దీనిని నిర్వహించాల్సిన బాధ్యతనీదే" అని ఆదరంగా పిలిచాడు అన్న కొడుకు. కరిగిన మనసు కన్నీరై స్రవించింది బాబాయికి.
గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఇంటిల్లిపాది రాముని పట్టాభిషేకపు పండగకి తరలివెళ్ళారు. అంతా కలసి నిండుగా హాయిగా రామారాధన చేసుకున్నారు.
ఇది ఒక యథార్థ సంఘటన. స్వయంగా ఆ కుటుంబమే చెప్పగా విన్న విషయం.
మన ధార్మిక గ్రంథం వల్ల జీవితపు విలువలు, మానవ సంబంధాల మెరుగుదల ఎంత చక్కగా పటిష్టమౌతాయో తేల్చి చూపిన వాస్తవం.
మనుషుల మధ్య మాట పట్టింపులు, లేదా ఏ చిన్న సంఘటనకో స్నేహ బాంధవ్యాలను తెంపుకొనే తెగింపు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. కానీ వాటిని కొనసాగించుకొని దూరమవడం వాంఛనీయం కాదు.
ముఖ్యంగా తిరిగి వెనకటి ప్రేమలలో నుండి పొంగుతున్న పంతమో పట్టింపో దానిని వెలికి తీయనివ్వదు. దూరం దూరం మిగిలి పెరుగుతుంది.
ఆ పట్టింపు రాతి పొరను ఛేదించే శక్తి పూర్వభాషిత్వం. సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా బిగువు, అహం అడ్డు వస్తాయి. ప్రధానంగా ఒకే రంగంలో ఉన్న వారి నడుమ ఉన్న ఈర్ష్యా స్పర్ధల వలన కూడా ఇటువంటి బిగింపులుంటాయి.
ఆ సందర్భంలో మనమే ముందు పలకరించడం, మాట్లాడడం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలై స్నేహ బంధం దృఢపడుతుంది.
సౌమనస్య భావం సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీవితం సాగితే దానికి మనసారా మాట్లాడుకోవడమే మంచి మార్గం. తానే తొలి అడుగువేసి పలకరించడం ఉత్తమ పురుషుల సంస్కారంగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి.
అందుకే రామాయణాది సద్గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి, నేటి మానవసంబంధ సమస్యలను పరిష్కరించే కరదీపికలుగా నడిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*