2, ఫిబ్రవరి 2023, గురువారం

వట్టిచేతులతో పోరాదు.

 వీరి వద్దకు వట్టి చేతులతో పోరాదు



*అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ*

*రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుమ్*



అగ్నిహోత్రము దగ్గరకు - గృహమునకు - పంట పొలమునకు - గర్భవతి చెంతకు - వృద్ధ బాలకుల చూచుటకు - రాజు, దేవుని, గురువును దర్శించుటకు - వట్టిచేతులతో పోరాదు.

సద్బోధ

 .


                         *సద్బోధ*

                         ➖➖➖


*గురువు పాత్ర భగవంతుని పాత్ర కొంత మేరకే..! అసలు సిసలైన ముఖ్య పాత్ర మానవ జీవితంలో దుఃఖ సహిత జీవితానికి కారణం….     జన్మ జన్మల              కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా మాత్రమే మంచి చెడు ఆధారపడి ఉన్నది.* 


*పొరపాటుననో లేక తెలిసో తెలియకో చేసిన చెడు కర్మల ఫలితాలే దుఃఖమయ జీవితానికి మూల కారణం..!* 


*గురువులు చెప్పినా, దేవుళ్ళు చెప్పినా దుఃఖమయమైన జీవితం నుండి విడుదలై దుఃఖ రహితమైన జీవితంవైపు అడుగులువెయ్యాలి.* 


*అంటే అది "జ్ఞానాగ్ని కర్మ దగ్దాణాం..." తప్ప ఒకటి మరొకటి ఇంకొకటి లేదు గాక లేదు..!* 


*ఈ సత్యాన్ని తెలుసుకొని సరైన సాధన చేస్తే అంతా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ భగవదైక్యం చెందవచ్చు.* 


*ఈ సత్యాన్ని తెలుసుకొన్నాక సమయాన్ని సరైన సాధన కోసం ఉపయోగిస్తూ విశ్వప్రణాళికలో భాగంగా విశ్వకళ్యాణం కొరకు మనవంతు భాగస్వామ్యం కల్గి యుండవచ్చు..!* 


*మరొక్కసారి అన్నిరకాల సమస్యలకు మూల కారణం జన్మ జన్మల దుష్కర్మల ఫలితమే...*


*గురువైనా, దేవుడు అయినా మార్గం చూపిస్తారు, ఆ మార్గంలో ప్రయాణిస్తూ గమ్యాన్ని అనగా సమస్యలు లేని స్థితికి చేరడానికి ఇది సరైన సాధనం మాత్రమే ఒకే ఒకే మార్గం.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      


       లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

భగవద్గీత

 భగవద్గీత


*రేపు పిబ్రవరి 01 బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను మరియు విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేయండి.*


*భగవద్గీత పారాయణ ఫలం*


‘గీత’ అనే పదం హద్దును లేక రీతిని సూచిస్తుంది. ‘గీత’ హద్దును సూచిస్తే, మహాభారతంలోని ‘గీత’ రీతిని సూచిం చింది. శివగీత, బ్రహ్మగీత, గణశగీత, హనుమద్గీత, దేవీగీత, వశిష్టగీత, పరాశర గీతా ఇలా ఎన్నో గీత గ్రంథాలున్నప్పటికీ మహాభారతంలోని ‘భగవద్గీత’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గీతను అర్జునుడికి బోధించి కర్తవ్యాన్ని సూచించాడు. భగవంతుని ప్రతిరూపమే గీత. ధర్మస్థాపన చేసేందుకు దోహద పడింది.


గీత కర్మయోగంలో ఆరంభమై భక్తిశరణాగతిలో అంతమవుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందు కంటే మానవుని నిత్యజీవితంలోని ఎన్నో సమస్యలకు సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. గీత ఏ మతాన్ని ఏ సంప్రదాయాల్ని కాదనదు అన్ని మతాలవారూ, సంప్రదాయాల వారూ భగవ ద్గీతను ఆదరిస్తున్నారు. విశ్వమానవ కల్యాణం కొరకు సమస్త ప్రాణికోటికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన తత్త్వాజ్ఞానా మృతమే భగవద్గీత. 700 వందల శ్లోకాలతో 18 అధ్యాయాలలో పొందుపరచబడినది.


భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.


మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.


‘క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం’ లో శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత పదమూడవ అధ్యాయంలో మానవ శరీరం ఏ విధంగా ఆవిర్భవించింది. దాని ప్రాముఖ్యత, లక్షణాలు గురించి వివరంగా పేర్కొన్నారు. సత్వ, రజ, తమో గుణాల ప్రాబల్యం వలన మానవుని, నడవడిలోని మార్పులు, వాని ప్రవృత్తులు, శరీర స్పందన గురించి విశదంగా వ్యాఖ్యానించారు.

మానవుని జీవిత నడవడికి భగవద్గీత భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన సందేశం.


మూఢుని మోహాన్ని పోగొట్టి కర్తవ్యపరాయణుని చేస్తుంది. గీతలో కర్మ, జ్ఞాన, భక్తి మూడు విషయాలు కనబడు తుంటాయి. కర్మ సాత్విక, రాజసిక, తామసికమని మూడు విధాలని గీత చెప్పింది. కర్మ ఎప్పటికీ వదలరాదు. ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే. అది కర్తవ్యబుద్ధితో చేస్తుండాలి. ‘కర్మణ వాధికారస్తే మా ఫలేషు కదాచన’ కర్మ చేయడం నీ విధి. దాని ఫలితాన్ని ఇచ్చేది మరొక శక్తి. జ్ఞానం లేని కర్మ వ్యర్థమే. భక్తి లేకపోతే జ్ఞానం అలవడదు. ”సర్వధర్మాన్‌ పరిత్యజ్య” అన్ని ధర్మాలు వదలి తనను మాత్రమే శరణు పొందమని భగవానుడు చెప్పాడు. నిత్తనైమిత్తిక సమస్త ధర్మాల కంటే కర్మలకంటె భగవశ్చరణాగతి ఎన్నో రేట్లు అధిక ఫలం కలిగిస్తుంది. భగవానుని గీత ధర్మమిది.

గీత భగవద్వాణి అగుటవలన వేదరుక్కులతో సమానం. ఇది ఉపనిషత్సారము, అద్వితీయము. భగవద్గీత శ్రీకృష్ణభగవానుని ముఖారవిందం నుండి స్రవించిన దివ్యామృతం.

భగవద్గీత ధర్మాల యొక్క సముదాయమని స్వామి వివేకానందుడు అంటే, వినోభాభావె నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతగా ఉపయోగపడింది అనగా, తిలక్‌ ప్రపంచ సాహిత్యమంతటిలోనూ గీతకు దీటు రాగల గ్రంథం వేరొకటిలేదు. అది మనుషులను పరమానంద పదవికి కొనిపోగల అపూర్వసాధనం అని … ఇలా ఎందరో మహానుభావులు గీత గురించి వ్యాఖ్యానించారు.

భ గవద్గీతా కించి దధీతా గంగాజల లవకణికా పేత సకృదపియేన మురారి సమర్చా క్రియతేత స్వయమ్యో పినచర్చా” అని ఆదిశంకర భగవద్పాదులు భగవద్గీతా ప్రశస్త్యాన్ని వివరించాడు.


గీతను భగవానుడు మార్గశిర శుక్ల ఏకాదశినాడు. అర్జునునికి ఉపదేశించినాడు. కాన ఆనాడే గీతాజయంతిని జరుపుతున్నారు.

గీతామృతాన్ని మనం గ్రోలి ధన్యులమవుదాం!

‘రసస్రవంతి-కావ్యసుధ


పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే


సమస్త గ్రంథాల సారం వేదం. వేదసారం ఉపనిషత్తు. ఉపనిషత్సారాంశం గీత. గీత సారాంశం భగవంతుని శరణాగతి. అనన్యభావంతో శరణు పొందినవానికి సమస్త పాపాలనుండి రక్షింపబడి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. హృషీకేశుడైన శ్రీకృష్ణపరమాత్ముడు యుద్ధరంగంలో చేసిన బోధామృతమే భగవద్గీత. ‘గీ’ అంటే త్యాగం. ‘త’ అంటే తత్వజ్ఞానం. త్యాగాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వివరించేది. లోకంలో కర్మ మార్గం, భక్తిమార్గం, జ్ఞానమార్గాలను అవలంబించే ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షేత్రంలో ఉన్నారు. మోక్షం పొందడానికి కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలనే నాలుగు ద్వారాలగుండా ఏ ద్వారంనుంచైనా వెళ్లి ముక్తిసౌధంలోకి చేరుకోవచ్చు. ఎక్కడెక్కడి నదులన్నీ సముద్రం చేరునట్లు, ఈ మార్గములన్నియు, జీవుని కైవల్యధామానికి చేరుస్తాయి. చిత్తము తమోగుణంతో కూడిన వాసనలతో నిండిపోయి, కఠినశిల వలె ఉన్నంత వరకు, ఎన్ని పూజలు, హోమాలు, ఉపవాసాలు ఉన్నా, భగవంతుని గాంచలేరు. కొన్ని వేల యుగాలలో చేసిన ఫలితాన్ని సులభంగా పొందే మార్గం భగవద్భక్తి.


పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతంలోని భగవద్గీతకు ప్రత్యేక స్థానముంది. భగవద్గీతలోని అక్షరాలకు అనంత శక్తి ఉంది. భగవద్గీత కేవలం భక్తి బోధనే కాదు. హిందూ

సంస్కృతి వికాసానికి మూలాధారాలు అందులో ఉన్నాయి.


ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలోని పాండవులకు, కౌరవులకు మధ్య జరుగునున్న భీకర సంగ్రామం. ధర్మానికి, అధర్మానికి అనాదిగా అవిరామంగా జరుగుతున్న పోరాటం. ఆ పరిస్థితుల్లో పార్థుడే కాదు, ఎవరున్నా, అంతర్మథనానికి లోను కావలసిందే. పార్థుని సందేహాలకు ఇచ్చిన సమాధానమే ఈ గీతాసారం.

నిరాశా నిస్పృహలతో అచేతనావస్థలో ఉన్న పార్థునికి కర్తవ్య బోధ చేసి శ్రీకృష్ణుడు అతనిని యుద్ధోన్ముఖుని కావించాడు. ధర్మసంస్థాపన కోసం బోధించిన ఈ గీత నేటి తరాన్ని కూడా అంతే సమర్థంగా కర్తవ్యోన్ముఖుల్ని చేయగలదు. అనేక సంశయాలకు దారి చూపగల జ్ఞానసంపత్తి ఇది. ఈ జ్ఞాన సంద్రాన్ని మధించిన వారెందరో, మహానుభావులు, విద్యావేత్తలు, తాత్వికులు, వేదాంతులు తమ తమ పరిధిలో వారి అవగాహన ప్రస్ఫుటంగా వివరించారు.

ఇది భారతీయులకే కాక, యావత్ప్రపంచానికీ మహా ప్రసాదం. ఇహపరాలకు, ప్రాపంచిక, ఆధ్యాత్మికాలకు సంబంధించిన అనేక అంశాలు, పండు వొలచినట్లుగా, తర్కబద్ధంగా సుబోధంగా వివరించారు.


గీత అంటే భగవద్గీతే కాదు, వశిష్ట గీత, హంసగీత, భ్రమరగీత, శ్రుతిగీత, బ్రాహ్మణ గీత – ఇలా దాదాపు 18 గీతలున్నాయి. గీత శబ్దం వినబడగానే భగవద్గీత ఒక్కటే మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేది.


నేను యుద్ధం చేయను. బంధువులు, తాతలు, అన్నగార్లు, మేనమామలు, వీరిని చంపి రాజ్యాన్ని పాలించాలి. అందుకే నాకీ రాజ్యం వద్దన్నాడు అర్జునుడు. యుద్ధం ఎందుకు చేయాలో గీతలో చక్కగా విడమర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు. నీ విద్యుక్తధర్మాన్ని నీవు నెరవేర్చు. అది కర్మ చేయడం కన్నా గొప్పది. గీత భౌతిక అజ్ఞానంనుండి వుద్ధరించడమే పరమతత్వం.


ప్రతి ఒక్కరు కర్మలపై ఆశ లేకుండా కర్మలు చేస్తూ వాటిపైన ఆసక్తి చూపాలి. అపుడే మానవుడు అభివృద్ధి చెందుతాడు. జడపదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమం. ఇద్రియాలకంటే మనసు ఉత్తమం. మనసుకంటే ఆత్మ ఉత్తమమైనది. అందుకే మనిషి తాను చేయలదలచిన పని, ఆత్మసాక్షిగా చేయాలి. ఆత్మను ఒప్పిస్తే అన్నిటినీ ఒప్పించినట్లే. ప్రతిఫలాపేక్ష లేకుండా మనము పని చేయడమే మన ధర్మం.


భగవద్గీతలో జ్ఞాన కర్మ మార్గాలలో ఏది విశిష్టమైనది అనేదానికి ఎంతటి జ్ఞాని అయినా కర్మలుచేయక తప్పదని కర్మలు చేస్తే ప్రతిఫలాపేక్ష లేకంఉడా చేస్తే దోషం ఉండదని సమన్వయం కనిపిస్తుంది. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంది. ఒక్కొక్క అధ్యాయ మహత్తు చెప్పడానికి ఒక్కొక్క కథ ఉంది. భగవద్గీతలో 100 శ్లోకాల దాకా సంజయాదుల ప్రశ్నోత్తరాలు, వర్ణనలు, విమర్శలు ఉన్నాయి. గీత మొదటి ఐదు అధ్యాయాలు తన ముఖంగాను, తరువాత వచ్చే 10 అధ్యాయాలు 10 భుజాలుగాను, 16వ అధ్యాయం ఉదరంగాను, 17, 18 అధ్యాయాలు తన రెండు పాదాలుగాను ఉంటాయని శ్రీమహావిష్ణువు చెప్పాడు. భగవద్గీతలో ఒక అధ్యాయమైనా పారాయణం చేయాలి. కనీసం ఒక శ్లోకమైనా త్రికరణ శుద్ధిగా పఠించాలి.

భీష్మ ఏకాదశి

 https://chat.whatsapp.com/F9BOJTM6SmyGsvWQotAOlT

భీష్మ ఏకాదశి,

     శ్రీవిష్ణుసహస్రనామ జయంతి

            


మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ… "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః"                                 


కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది.

 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.


భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?


ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" 

‘హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో!’ అని. 


ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా’ అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.


భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. 


అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతోందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళూ అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు. 


హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. 

కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. 'హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. 


శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. 


అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.


భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. 


అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. 


భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.


ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తి పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.

శ్రీ హరి స్తోత్రం

 శ్రీ హరి స్తోత్రం

🙏🙏🙏🌸🙏🙏🙏

జగజ్జాలపాలం కన:కంఠమాలం

శరత్చంద్రఫాలం మహదైత్యకాలం

నభో నీలకాయం దురావారమాయం

సుపద్మాసహాయం భజేహం భజేహం   1



సదాంభోధి వాసం గళత్పుష్పహాసం

జగత్సన్నివాసం శతాదిత్యభాసం

గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం

హస:చారు వక్త్రం భజేహం భజేహం     2



రమాకంఠహారం

 శృతివ్రాతసారం

జలాంతర్విహారం ధరాభారహారం

చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం

ధృతానేక రూపం

 భజేహం భజేహం   

 3



జరాజన్మహీనం పరానందపీనం

సమాధానలీనం సదైవానవీనం

జగజ్జన్మహేతుం

 సురానీక కేతుం

త్రిలొకైక సేతుం

 భజేహం భజేహం    4



కృతామ్నాయగానం

 ఖగాధీశయానం

విముక్తేర్నిధానం హరారాధిమానం

స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం

నిరస్థార్ధసూలం

 భజేహం భజేహం    5



సమస్థామరేసం

 ద్విరేఫాభ క్లేశం

జగత్బింబలేశం హృదాకాశవేశం

సదాదివ్యదేహం విముక్తాఖిలేహం

సువైకుంఠగేహం

 భజేహం భజేహం   6



సురాళీబలిష్ఠం

 త్రిలోకీవరిష్ఠం

గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం

సదా యుధ్ధధీరం మహవీరవీరం

భవాంభోదితీరం

 భజేహం భజేహం   7



రమావామభాగం

 తలానగ్ననాగం

కృతాధీనయాగం గతారాగరాగం

మునీంద్రై:సుగీతం సురైసంపరీహం

గుణౌగైరతీతం

 భజేహం భజేహం     8



ఫలశృతి:

ఇదం యస్తు నిత్యం

 సమాధాయ చిత్తం

పఠేదష్తకం కష్టహరం మురారే

సవిష్ణోర్విశోకం 

ధ్రువం యతిలోకం

జరాజన్మశోకం పునర్విందతే నో.


ఇతి శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరి స్తోత్రం సంపూర్ణం.

🙏🙏

పాపం చిన్నదే కదా అని భావించకూడదు

 శ్లోకం:☝️

*అయం సహస్రాపరాధీ*

 *కిమేకేన భవేన్మమ ।*

*మత్వా నాఘం స్మరేదీషద్*

 *బిందునా పూర్యతే ఘటః ।*

  - శుక్రనీతి- 3.36


భావం: "లెక్కలేనన్ని నేరాలు ఘోరాలు చేసినవారు కూడా దర్జాగా తిరుగుతున్నారు కాబట్టి, నేనూ ఓ చిన్న నేరం చేస్తే తప్పేమిటి?" అని ఆలోచించేవారు పాపం చిన్నదే కదా అని భావించకూడదు. అలాంటి చిన్న చిన్న చుక్కల వల్ల కుండ నిండిపోతుంది!

గురువు స్థానం... గ్రేట్!*

 *గురువు స్థానం... గ్రేట్!*

                ➖➖➖

 ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది...


*ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ.*


ఒక రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.


తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం....


*హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని జవాబు రాశారు.*


సర్వంసహా రాజ్యాధికారి, తన రాజ్యంలోని పాఠశాలని చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే (పైగా అది ప్రభుత్వ పాఠశాల) *రావద్దనేంత దమ్ముందా ? హెడ్మాస్టారుకి ?*


ఆ దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాసాడు. కారణం కూడా చెప్పాడు...


 *”మా ప్రభువు అయిన మీరు, వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి. ఇప్పటివరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు. నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని, ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం, వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది... క్రమశిక్షణలో మార్పు వస్తుంది. దాని ఫలితం విద్యాభ్యాసం పై పడుతుంది., ఇది మీరు అర్ధం చేసుకోగలరని ప్రార్ధిస్తున్నాను. ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది.”*


హెడ్మాస్టరుగారి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని, ఆయన “తన సమక్షంలో *రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని, తానే టోపీ తీసి హెడ్మాస్టారుని గౌరవిస్తానని”* జవాబిచ్చాడు రాజు. 


అలాగే చేసాడు కూడా... *గ్రేట్... కింగ్!*

*ఇలాంటి ఉదాహరణల నుంచి నేటి పాలకులు ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంది. హెడ్మాస్టర్ లని ఏకవచన సంబోధనతో పిలిచే అధికార/అనధికారులకు ఇలాంటి విషయాలు కనీసం కొద్దిగా అన్నా... అర్ధం అవుతాయా?* 


 *ఎక్కడేతే... విద్య ను గౌరవిస్తారో... అక్కడ సిరిసంపదలు ఉంటాయి..!*


 *ఎక్కడైతే... గురువులు పూజింపబడతారో... అక్కడ ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి - దేశం సుభిక్షంగా ఉంటుంది!* 

  🙏 🙏 .

కృష్ణ మందిర్

 Hyderabad మిత్రులు అందరూ దయచేసి..ఈ గుడినీ ఓ మారు దర్శించాలని మనవి🙏🙏


ఈ గుడి హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉన్న భైరవ స్వామి గుడి., ఇక్కడి పంతులు గారి పరిస్థితి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆ పంతులుగారు ఆటో నడిపిస్తున్నారు 


కాబట్టి చుట్టూ పక్కల ఉన్నవాళ్లు ఆ గుడికి తరచుగా వెళ్ళండి ఆ ప్లేట్ లో ఓ 20 సమర్పించండి.,


ఈ గుడితో పాటు పక్కనే కాశిబుగ్గ ఆలయం, కృష్ణుని గుడికూడా ఉంది..,


పాపం కృష్ణ మందిర్ ముందే ఓ పెద్ద చెత్త కుప్ప., చుట్టూ ముస్లిం ఏరియా..,


కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి., పైగా ఇది 200 సంవత్సర క్రితం కట్టింది..


కాబట్టి ఈ మూడు గుడులకు చుట్టూ పక్కన ఉన్నవారు వెళ్ళండి వెళ్తూ ఉంటే పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది..


ఈ గుడులకు వెళ్లిన వాళ్ళు హుండీలో కాకుండా ఆ పళ్ళెంలో మాత్రమే దక్షిణ వేసి అక్కడి పూజారిని ఆదుకోండి... వాళ్ళ పరిస్థితి కష్టంగా ఉంది... 🙏


Sudha Krish పెట్టిన పై పోస్ట్ చదివి నిన్న సాయంత్రం ఆ ప్రదేశానికి వెళ్ళాను. అది అత్తాపూర్ దాటాక కిషన్ బాగ్ లో ఉంది.

మేముంటున్న మియపూర్ ఏరియా కి సుమారు 25 కి.మీ దూరం.


ముందుగా భైరవస్వామి దేవాలయం చూద్దామని వెళ్లాం. కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వం రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది. ఏమిటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు

 "శ్రీ మురళీమనోహర స్వామి" వారి దేవాలయం. బహుశా దీనినే కృష్ణ దేవాలయం అంటున్నారేమో.


ఈ దేవాలయం కనీసం 250 సం. ల క్రిందట కట్టబడి నట్లు ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడ ని అనుకుని లోపల అంతా రాతి మంటపం నిర్మించి ఉంది. కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది.


అహోబిలం మఠం స్వామి వారు 1750 సం. లో ఈ దేవాలయానికి విచ్చేసినట్లు శిలాఫలకం ఉంది.


ఈ స్వామి వారి మూర్తి చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు. పేరుకు తగ్గట్టే స్వామి వారి మూర్తి మురళీ మనోహరం.


ఈ దేవాలయానికి రెండు కధలు వ్యాప్తిలో ఉన్నాయి. మొదటి దాని ప్రకారం ఢిల్లీలో వుండే రాజా రఘు రాం బహదూర్ కి పిల్లలు లేరు. అయితే ఒకరోజు రాజా వారికి కలలో హైదరాబాద్ లో ఒక తోట, దానిలో భూమిలో 5 అడుగుల క్రింద ఉన్న కృష విగ్రహం కనిపించాయట. వెంటనే రాజా వారు అనుచరులతో కలిసి గుర్రాలు పై హైదరాబాద్ వచ్చి అన్ని తోటల్లో వెతకగా ఈ తోటలో కృష్ణుని విగ్రహం కనిపించడం, ఈ ఆలయం నిర్మించి విగ్రహం ప్రతిషించారట. ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగింది అని ఒక కథనం. 


రెండో కథ ఏమిటంటే.. నిజాం దగ్గర వకీల్ లేదా నిజాం కు ఎజెంట్ గా పైన చెప్పిన రాజవారు వుండేవారు అని వారే ఈ దేవాలయం నిర్మించారు అని.


ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజముల్లా హుసైన్ దర్గా ఉంది. 


ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చుట్టూ ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.. చూడబోతే ఈ విలువైన 

స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో దేవాదాయశాఖ పెద్ద నోటీసులు అంటించింది.


అక్కడకు పోయిన తరువాత నాకు అర్ధం అయింది ఏమిటంటే ఈ దేవాలయాలకు భక్తులు ఉత్సవాలు సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావడం సంఖ్య తగ్గిపోవడానికి ఈ ప్రాంతం ఒక కారణం కావచ్చు. 


ఈ దేవాలయానికి దగ్గరలోనే భైరవస్వామి వారి దేవాలయం ఉంది. చాలా చిన్న దేవాలయం ఈ దేవాలయం కూడా సుమారు 200 సం. ల క్రిందట కట్టినట్లు చెపుతున్నారు. ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది.


చూడబోతే పైన చెప్పిన మురళీమనోహర దేవాలయంలో మంటపం, దీనిలో మంటపం నిర్మాణ శైలి ఒకే లాగా అనిపించాయి.


ఇక్కడ పూజారి గారి పేరు నట్వర్ నాధ్ శర్మ. ఉత్తరాది బ్రాహ్మణులు.

ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో పూజారి గారు ఖాళీ సమయాల్లో పొట్ట కూటి కోసం ఆటో నడుపుకుంటున్నారు.

వారి గూగుల్ పే నెంబర్: 8886511504.


పై కారణాలు దృష్ట్యా మనకు దగ్గరలో గల ఇటువంటి దేవాలయాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కనీసం శని ఆదివారాలు లేదా శలవు రోజుల్లో అయినా ఈ దేవాలయాలు దర్శించే భక్తుల సంఖ్య పెంచవచ్చు. మన భక్తులు ఎంత ఎక్కువగా దర్శిస్తే దేవాలయాలు అంత ఎక్కువగా ప్రాచుర్యం పొంది ప్రాచీన వైభవం సంతరించుకుంటాయి, కబ్జాకు గురి కాకుండా నిలబడతాయి.


ఈ దేవాలయాలకు దగ్గరగా మరొక ముఖ్య దేవాలయం ఉంది. అదే కాశిబుగ్గ ఆలయం.

కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి. ఇది కూడా 200 సంవత్సర క్రితం కట్టింది..


నిన్న నాకు టైం సరిపోక ఆ దేవాలయం దర్శించలేకపోయాను. మరొక్క సారి వెళ్ళాలి.


అందువల్ల అందరూ ఈ దేవాలయాలు తప్పక దర్శించి ఆలయాల పునర్వైభవానికి తమ సహకారం అందించండి..🙏🙏🙏

కోరికలకు

 శ్లోకం:☝

*ఆశాయాః యే దాసాః*

 *తే దాసాః సర్వలోకస్య |*

*ఆశా యేషాం దాసీ*

 *తేషాం దాసాయతే లోకః ||*


భావం: కోరికలకు అధీనంలో ఉన్నవారు (ఆశకు బానిసలు) మొత్తం ప్రపంచానికి దాసులుగా ఉంటారు. కానీ, ఆశ ఎవరి అధీనంలో ఉంటుందో లోకమంతా వారికి దాసోహం అంటుంది.🙏