.
*సద్బోధ*
➖➖➖
*గురువు పాత్ర భగవంతుని పాత్ర కొంత మేరకే..! అసలు సిసలైన ముఖ్య పాత్ర మానవ జీవితంలో దుఃఖ సహిత జీవితానికి కారణం…. జన్మ జన్మల కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా మాత్రమే మంచి చెడు ఆధారపడి ఉన్నది.*
*పొరపాటుననో లేక తెలిసో తెలియకో చేసిన చెడు కర్మల ఫలితాలే దుఃఖమయ జీవితానికి మూల కారణం..!*
*గురువులు చెప్పినా, దేవుళ్ళు చెప్పినా దుఃఖమయమైన జీవితం నుండి విడుదలై దుఃఖ రహితమైన జీవితంవైపు అడుగులువెయ్యాలి.*
*అంటే అది "జ్ఞానాగ్ని కర్మ దగ్దాణాం..." తప్ప ఒకటి మరొకటి ఇంకొకటి లేదు గాక లేదు..!*
*ఈ సత్యాన్ని తెలుసుకొని సరైన సాధన చేస్తే అంతా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ భగవదైక్యం చెందవచ్చు.*
*ఈ సత్యాన్ని తెలుసుకొన్నాక సమయాన్ని సరైన సాధన కోసం ఉపయోగిస్తూ విశ్వప్రణాళికలో భాగంగా విశ్వకళ్యాణం కొరకు మనవంతు భాగస్వామ్యం కల్గి యుండవచ్చు..!*
*మరొక్కసారి అన్నిరకాల సమస్యలకు మూల కారణం జన్మ జన్మల దుష్కర్మల ఫలితమే...*
*గురువైనా, దేవుడు అయినా మార్గం చూపిస్తారు, ఆ మార్గంలో ప్రయాణిస్తూ గమ్యాన్ని అనగా సమస్యలు లేని స్థితికి చేరడానికి ఇది సరైన సాధనం మాత్రమే ఒకే ఒకే మార్గం.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
లోకాః సమస్తాః సుఖినోభవన్తు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి