1, జూన్ 2021, మంగళవారం

దాచేస్తే దాగదు సత్యం

 దాచేస్తే దాగదు సత్యం..- శ్రీశ్రీ.

.

తూర్పుగోదావరి జిల్లాలో కోరంగి వైభవం - నౌకానిర్మాణంపై బ్రిటన్ చేసిన కుట్ర!


నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది.


ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి.


అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది.


కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే.


కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది.


మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది.


ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకున్నారు. పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే పరమ మూర్ఖత్వంతో తిరగబడతారు. కులాలపిచ్చితో కుమ్ములాటలు మొదలు పెడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ బానిసత్వ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు బయటపడతామో ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడతామో కదా?


సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము.


ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు.


ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది.


*ఆఖరి ముక్క:*

1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన బ్రిటీషు ప్రభుత్వానికి రాలేదు. ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది.


సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా?


Contribution by - గమనిక - ఇది నాకు ఎవరో షేర్ చేస్తే చదివాను దీనిని చదివి గూగుల్ చేశాను ఈ విషయం మీద చాలా సమాచారమే వుంది కనుక నేను షేర్ చేశాను - కనుక మీ అభిప్రాయలను దీనిలో లోపాలు ఏమైనా వుంటే వాటినీ తెలియచేయవచ్చు లేదా సమర్ధించనూ వచ్చు ఏమైనా మంచి భాషలో వ్యక్తం చేయవచ్చు . - గౌతమ్ కశ్యప్

పితృదోషం అంటే

 💐💐*పితృదోషం అంటే..? ఏంటీ? ఎందుకు..? ఎలా ఏర్పడుతాయి..?*  💐💐


కుటుంబ పెద్దలు ఎవరైనా కాలం చేస్తే వారికి శాస్త్ర విధిగా పిండ ప్రదానాలు, ఆబ్దికాలు ( సంవత్సరీకాలు ) క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.అలా బంధాన్ని సంబంధం లేకుండా ప్రవర్తిస్తే దాని తాలూకు దోషాలు కుటుంబంపై చూపిస్తాయి.


ఇంట్లో అన్ని అరిష్టాలు,అనర్ధాలు జరుగుతున్నట్లు భావిస్తే వెంటనే జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతక పరిశీలన చేయించుకుని పితృదోషాలు ఉన్నాయా అని కనుకోవాలి.

ఒకవేళ ఉన్నట్లయితే వారి సలహా మేరకు దోష నివారాణ చేయించుకోవాలి.వారిచ్చే సూచనలను పాటించాలి.ఇంట్లో అన్ని రకాల బాగుండాలి అంటే పితృదోష నివారణ కలగాలి.లేదంటే అడుగడుగునా అంతరాయాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఏ పని చేసినా కలిసి రాదు. పితృ దోషాల వలన ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో ఈ క్రింద ఇవ్వబడినవి గమనించండి.


కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, యాక్సిడెంట్లు జరగడం, పిల్లలలో దుష్ప్రవర్తన, మానసిక అనారోగ్యం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంటాయి.


అలాగే కెరీర్‌లో అభివృద్ధి లేకపోవడం, ప్రారంభించిన కార్యాలు పూర్తికాకపోవడం ఇలా మీరు ఇక్కట్లు పడుతున్నట్లయితే మీకు పితృదోషం ఉండవచ్చు.వెంటనే పితృదోష నివారణ చేయించవలసి ఉంటుంది.


పితృ దేవతల కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే, పరిహారం కోసం మీరు దర్శించి తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడు.


పితృదోషాలు ఉన్నవారు తిలతర్పణపురి గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయాన్ని దర్శిస్తే దోషాలు పోతాయట. శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్ధించాడు. శివుడు ప్రత్యక్షమై ఈ ఊరులోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. ఆ ఊరు అందుకనే అప్పటి నుంచి తిలతర్పణపురి అయింది.


తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం.రాముడు తిలలు వదిలిన స్థలం ఇది. రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది.


అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు.ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది.


ఇక్కడ నరముఖంతో ఉన్న గణపతి దర్శనమిస్తాడు. గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది.


ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతిగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు సరస్వతీ ఆలయంకు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.


పిత్రుదోషాల గురించి మహాభారతంలో భీష్ముడు పాండవులకు చక్కగా వివరించాడు. పితృ దోషం ఎవరికైనా ఉంటే ఎన్ని నోములు ,వ్రతాలు ,దీక్షలు చేసిన ,తీర్ద యాత్రలు తిరిగిన పోవు. అందుకే కొన్ని ప్రాంతాల వారు ఇంట్లో శుభకార్యాలకు ముందు పెద్దల పేరు చెప్పి బందు,మిత్రులను పిలుసుకుని పెద్దల పేరిట కార్యం చేసి భోజనాలు పెట్టిస్తారు.


ముఖ్యంగా మనకు ఏ విషయంలోనూ కలిసి రావడం లేదు,కుటుంబంలో కూడా సంతోషం ,సఖ్యత లేదు,ఎలాంటి శుభకార్యాలు కావడం లేదు ఒకవేళ అయిన ప్రశాంతత లేకుండా అన్నింటా లోటుగా ఉన్నట్టు భావిస్తే తక్షణం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని సంప్రదించి మీ జాతకం పరిశీలన చేయించుకుని వారిచ్చే సూచనలు పాటించండి.తప్పక కుటుంబ సౌఖ్యం,జీవిత ఆనందం పొందుతారు.

వైశాఖ పురాణం - 22 వ

 _*వైశాఖ పురాణం - 22 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*దంతిల కోహల శాపవిముక్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు ఇట్లు అడిగెను. మహామునీ ఇహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము , శుభకరములగు విష్ణుకథలు , చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.


శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.


పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీ నదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.


అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును , పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.


శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు , చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.


శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున ఇట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.


కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల ఈ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా ! పాపాత్ముడవైనను , కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి , నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు , యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు , గంగానదికి ప్రయాగకు , పుష్కరమునకు , కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.


ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు , గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.


కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు , కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా ఇద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి *'నాయనలారా ! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని , వ్యతిరేకమునబలుకు భార్యను , దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన , ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను , కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి , ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా ! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.

శుశృతుడు

 #శుశృతుడు


కొన్ని వందల ఏళ్ళ క్రితం అత్యవసరమైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అర్థరాత్రివేళ ఆ ఋషి నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రోదిస్తూ కనిపించాడు. అతడి ముక్కు విరిగి వుండడం ఆ ఋషి గమనించాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు. మూలికా రసంతో అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర (మద్యం) ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగా, వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు, సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచారు. అతి చిన్నది, పదునైన కత్తిని వేడిచేసి, దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చారు. ముక్కు ఆకారాన్ని సరిచేసి, బియ్యపు పిండిని అద్ది, చందనపు (గంధం) పట్టు వేసారు. దానిమీద బూరుగు దూదిని పెట్టి, ఔషధ నూనెను పోసి, చక్కగా కట్టు కట్టారు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో ఏయే మందులు సేవించాలో వివరాలను ఆ ఋషి వివరించి పంపించాడు. ఆ ఋషి పేరే "శుశృతుడు"


“నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర వికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయనను #ప్రపంచంలో #మొట్టమొదటి #శస్త్రవైద్యశిఖామణి గా పేర్కొనడం జరిగింది.”


శుశృతుడు (#Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు, అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతసంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది.ఈ శుశృత సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర #ధన్వంతరి శుశృతుడు.


#చరిత్ర

కీ.పూ.600 ప్రాంతాలకు చెందినవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. శుశృతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశృతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.


#ఆయుర్వేద #వైద్యసేవలు

శుశృతుడు వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్ర చికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్ లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.


ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని యివ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో అందెవేసిన చేయి శుశృతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను శుశృతుడు ఉపయోగించేవాడట! తెగిన శరీర భాగాలను అతికించటం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు (ఫారిన్ ఆంటీబాడీస్) ను కనుగొని తొలగించటం, పుచ్చిన, దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం (బుడ్డ) రోగికి హాని కలుగకుండా శస్త్రచికిత్స చేసి వేరుచేయడం యివన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది శుశృతుడే!


ప్రొస్టేట్ గ్రంథిని ఏఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను శుశృతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు. మూత్రనాళంలో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.


పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త శుశృతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు శుశృతుడు.


మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీరభాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ (మదిర) ను గుర్తించాడు. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు.


శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసే వారికి కొన్ని నియమ నిబంధనలు సూచించారు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.


తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి, వందలాదిమంది శిష్యులను తయారుచేశాడు శుశృతుడు. అంతే కాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారం "శుశృత సంహిత" అనే గొప్ప గ్రంథం రాశాడు శుశృతుడు. 


#శుశృతసంహిత

శుశృత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు. ఈ "శుశృత సంహిత" లలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120 గా నిరూపింపబడింది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు - ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో యివ్వబడినాయి. అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి 57 ఔషధాలను తయారుచేసే వైద్య విన్ఞానం ఉంది.


సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం యిమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర, ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం " వివరింపబడింది.


ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశారు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది. ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాథులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.


ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్ర చికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి, ప్రస్తావన ఉంది. శస్త్ర చికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్ర చికిత్సలలో వాడే వివిధ శలాకల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే "శల్యతంత్ర" అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాథులను దరిచేరనివ్వదని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమరసము (మద్యం) ద్వారా మత్తు కలిగించి, "అనస్తీషియా" ప్రక్రియకు తొలిరూపం అందించినవారయ్యారు.


ఈ శుశృత సంహిత క్రీ.శ.8 వ శతాబ్దంలో అరబ్ భాషలోకి "కితాబ్ షాషూన్ ఎ హింద్", "కితాబ్ ఐ శుశృత" గ్రంథాలుగా అనువదింపబడినవి. ఆంగ్లంలోకి పి.వి.శర్మ అనువదించి 1999లో మూడు భాగాలుగా ముద్రించారు.తెలుగు అనువాదాన్ని మొదటిసారిగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు వారు ముద్రించారు. పిదప రోహిణి పబ్లికేషన్స్, విజయవాడ వారు 2011 లో టీకా తాత్పర్య సహితంగా ముద్రించారు. దీనికి 1957లో ఆచంట లక్ష్మీపతి విపులమైన పీఠికను వ్రాసారు.


#ప్రకృతి #ఆరాధకుడు

సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు, వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి అనేక అమూల్య అంశాలను వెలువరించారు. సంవత్సరంలోని భిన్న భిన్న ఋతువులలో ఆయా వాతావరణాలకు అనుగుణంగా మెసిలి, వ్యాధిరహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించారు. ఏఏ కాలాల్లో ఏ కూరగాయలు, ఏ పండ్లు తినవలెనో వివరించారు. తృణధాన్యాలు, పప్పుదినుసులు వాడకం గూర్చి సోదాహరణంగా పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.


సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే ప్రకృతిలో అనుసంధానమై వివిధ ప్రయోగాలు చేశారు. ఏ ఏ మొక్క మానవునికి ఎన్నివిధాలుగా ఉపయోగపడిందో కూలంకషంగా అధ్యయనం చేశారు. అంతేకాదు, తమ గాఢ అధ్యయనం ద్వారా తన శిష్యులకు సరళంగా బోధించేవారు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవారు. శస్త్ర చికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే, వైద్య చికిత్సలో వాడే మూలికలను, క్షార పదార్థాలను, లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను ఆయా గాయాల తీవ్రత, స్థాయిలను అనుసరిచ్మి తయారుచేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారు. గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతి శీతల వాతావరణం గాని, పూర్తిగా తడి లేదా పూర్తిగా పొడిగా ఉండడం గాని ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు.


ఔషథాల తయారీకి ఉపయోగపడు మొక్కలు తులసి నుంచి ఆముదం వరకు, ఔషధోపయోగ గుల్మాలు సీతాఫలం మొదలైన పండ్లు గురించి, వృక్షాలు నేరేడు, మారేడు మొదలైన వాటి గూర్చి తన గ్రంథంలో వివరించటానికి పూర్తి అధ్యాయం కేటాయించాడు. వందలాది మొక్కలు, వృక్షాలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు గూర్చి, వాటిని ఉపయోగించుకొనే విధానాలను గూర్చి విశ్లేషన చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథరచనలో పొందుపరిచాడు. ఈ గ్రంథం అరబిక్ లోనే కాక లాటిన్ తదితర విదేశీ భాషలలోకి అనువాదమైంది. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని మూడు రకాలుగా విభజించి వ్యాధికి పూర్వం, వ్యాధి గ్రస్తుడు అయినపుడు, వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీరతత్వాన్ని అవగాహన చేసుకోవాలని, ముఖ్యంగా ఆయా రోగుల శరీరతత్వాలను తెలుసుకొని, వారి శారీరక, మానసిక బలాలను, ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించారు. గర్భ నిరోధంతో పాటు గర్భధారణకు కూడా అనువైన ఔషధాలను, యవ్వనోత్సాహానికి తగిన మందులను తన మూలికా వైద్య ప్రకరణంలో పేర్కొన్నారు. ఈయన సృష్టించిన "సందంశ యంత్రాలు" ఆధునిక శస్త్రవైద్యుల spring forceps, dissection and dressing forceps లకు తొలి రూపములుగా ఉన్నాయి.


#ప్లాస్టిక్ #సర్జరీ

ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంతభాగం తీసి తెగిన చోట అమర్చి పూర్వ రూపానికి తీసుకువావడమే ప్లాస్టిక్ సర్జరీ! ప్లాస్టిక్ సర్జరీలో, రైనోప్లాస్టీ (ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం) మీద ప్రఖ్యాతి చెందిన, సాధికార గ్రంథం "సుశ్రుత సంహిత" రాసాడు.


ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతి సున్నితమైన శరీరభాగాల నుండి చర్మాన్ని వేరుచేసి కొత్త చర్మంతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం, పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశ్రుత మహర్షి తన "సుశ్రుత సంహిత" గ్రంథంలో!


పాశ్చాత్య అల్లోపతీ విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి, ఆధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరుపు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి.


#క్షారసూత్రం

ఈ క్షార సూత్రం చికిత్స ఫిస్టులా వ్యాధికి ఉద్దేశించారు. ఈ వ్యాధిని భగందరం, లూటీ వ్యాధి, రాచపుండు మొ. పేర్లతో పిలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్రంలో "ఫిస్టులా ఇన్ ఆనో"గా పేర్కొంటారు. ఫిస్టులాను క్షారములుగా విభజించారు. క్షార సూత్ర చికిత్స ఫిస్టులా వ్యాధికేకాక అర్స మొలలు (పైల్స్), నాడీ వ్రణం మొ. వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో విశదీకరించారు. ముందుగా దారమును తీసుకొని దానికి 21 సార్లు క్షారయుక్తమైన ఔషధాలతొ సమ్మిళితం చేస్తారు. దీనినే క్షార సూత్రమని అంటారు. దీనిని ఉపయోగించి అయిదారు వారాలలో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు. రక్తస్రావం లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు. మధుమేహ రోగులకు, రక్త పోటు ఉన్నవారికి కూడా ఈ క్షార సూత్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.


వైద్య విధానాలు

సుశ్రుతుడు రాసిన గ్రంథరచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్యచికిత్సా విధానాలు అనేకం తెలియవస్తాయి. శస్త్ర చికిత్సను అతి నైపుణ్యంతొ నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను, బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు. వైద్యుడి వేష భాషలు ఎలా ఉండాలో ముఖ్యంగా ప్రవర్తన ఏ తీరులో ఉండాలో చెప్పారు. మంచి ఆరోగ్యంలో ఉండి, పూర్తి చేతనతో, ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు. శస్త్రపరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని హితవు పలికారు.


సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం అవకాశం ఉన్నా పూర్వకర్మ చికిత్స (ఫిజియో థెరపీ) ను ఆ వ్యక్తికి అందించాలని, అప్పుడే శస్త్ర చికిత్సకు సంసిద్ధుడై, చికిత్స అనంతరం త్వరిత గతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించారు. మానవులకు హాని కలిగించే, వ్యాథులను ఏర్పరచి క్రిమికీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశరు. ఏ క్రిమి/కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏవిధమైన మూలికా వైద్యం అవసరమో వివరించారు.


మెదడు (పెద్దమెడడు) లోచిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకురావటనికి కూడా చికిత్సను సూచించారు. కపాలానికి రంధ్రం చేసి, మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశారు. శరీరంలో ప్రవహించే రక్తంలో అతి సూక్ష్మ క్రిములు పుట్టి, ధమనులు సిరలలో జీవిస్తూ పలురకాల అస్వస్థతలకు గురిచేయగలవని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా మానవుడికి దాపురించే వ్యాధికారకాలు, చికిత్సా విధానాలను తమ గ్రంథ రచనలో ఇమిడ్చి, మానవ జాతికి మహోపకారం చేశారు. ఈనాటికీ వైద్య విజ్ఞాన కోశంగా ఉపయోగపడుతున్న "సుశ్రుతసంహిత" లోని ముఖ్యాంశాలు దేశ దేశాల వారికి మౌలిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సుశ్రుతుడు అంకురార్పణ చేసిన అనేక వైద్యచికిత్సలు ఆయుర్వేద వైద్యవిధానం ద్వారా మనకు పరిచయం కావడంతో ఏమంత విశేషంగా అనిపించకపోవచ్చు. కొన్ని మాత్రం తెరమరుగున వుండి, ఈనాటికీ వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలలో మగ్గుతూ పూర్తి వివరాలకోసం వేచివున్నాయి. ఉదా: రక్త మోక్షణ.


యితర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు

సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్నిపురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ఈయన గ్రంథం "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర" ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ ఈ గ్రంథం అనువాదం టిబెట్ లో "గుష్టి" (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి.


సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే ఆగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాష లోకి తర్జుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుదు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూదా 8 వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి.


ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ కు అత్యవసర వైద్యం చేయడానికి "మనక్" అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత "మనక్" బాగ్దాద్లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్ తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.


మూలం - వికీపీడియా


#fatherofsurgery

#ayurveda

నీ పాద కమల సేవయు

 *నీ పాద కమల సేవయు,*

*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*

*తాపార భూత దయయును,*

*తాపస మందార నాకు దయసేయ గదే.!!*


(పోతన భాగవతము .. దశమ స్కంధము .. సుదాముడి భక్తి.)


తెలుగు భాగవతం లో ప్రసిద్ధ పద్యాల లో ఇది ఒకటి. 


ఒక్కో భక్తుడు ఒక్కో కోరికతో భగవంతుడిని పూజిస్తారు. కొద్దిమంది విలక్షణ మైన కోరికలు కోరతారు. 


పాండవుల తల్లి కుంతీ దేవి కష్టాలు పడీ పడీ అవి అలవాటవడమే కాకుండా కష్టాలకు addiction కూడా వచ్చినట్లుంది. ఆమె కృష్ణుడిని "నిరంతరం నాకు కష్టాలు ఉండేటట్లు అనుగ్రహించ వయ్యా అని ప్రార్ధిస్తుంది. కష్టాలు లేనప్పుడు నేను దేవుడిని మరచి పోతున్నాను అందుకని దేవుడు నిరంతరం గుర్తుండాలని ఈ కోరిక కోరానని చెపుతుంది". తమాషా కోరిక. 


ఏదడిగినా ఇస్తాడని తెలిసి కూడా మొహమాటం అడ్డొచ్చి ఏదీ అడగ కుండా వెళ్ళిపోయిన వాడు కుచేలుడు. 


శివుడి లాగా విష్ణుమూర్తి సాధారణంగా అంత తొందరగా భక్తులను అనుగ్రహించడు. పరీక్షలు పెట్టీ పెట్టీ, భక్తుడి దుంప తెంచీ, వాడు ఆయన పెట్టే అన్ని పరీక్షల్లో నెగ్గితే ఆఖరకు అనుగ్రహిస్తాడు. 


సుదాముడనే వాడు మధురా నగర వాసి. కుచేలుడికి కూడా సుదాముడనే పేరుంది. ఇతను వేరు. ఇతను ఇంకో కృష్ణ భక్తుడు. వాడు ఎంత తపస్సు చేశాడు ఎన్ని పూజలు చేసాడు అనే వివరాలు, భాగవతం లో లేవు. ఇతను మాలాకారుడు అంటే పూల మాలలు తయారు చేసేవాడు. కుబ్జ కథ కు సరిగ్గా ముందు ఇతని కధ వస్తుంది. స్వయంగా కృష్ణుడే అతని ఇంటికి వెళతాడు. ఆయన ఆతిధ్యం తీసుకుని మాలలు తీసుకుని, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అంటే అప్పటికే సుదాముడి కి పరీక్షలూ తపస్సులూ అన్నీ పూర్తయినాయన్న మాట. సుదాముడు కూడా వచ్చినవాడు భగవంతుడని గుర్తు పడతాడు. ఈ సందర్భం లో ఆయన కోరిన కోరికే పైన వ్రాసిన పద్యం. ఈయన కోరిన కోరిక విలక్షణ మైనది. వ్యాసుడి శ్లోకం కంటే పోతన తెలుగు పద్యం బావుంది. అందుకే ఇది వ్రాసాను. దీని అర్థం గమనించండి. 


*తాపస మందార* :: పారి జాతము, సంతానము, కల్ప వృక్షము, మందారము, హరి చందనము ఇవి ఐదూ స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టుకు పేర్లు. తెలుగులో మందారమంటే దాసాని చెట్టు, హరిచందనమంటే గంధం చెట్టు ఇలాగ ఉంటాయి. సంస్కృత సమాసాలలో మాత్రం స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. ఆశ్రిత పారిజాతమా భక్త మందారమా అంటే అదీ అర్ధము. నీకోసం తపించే (తపస్సు చేసే) వారి అన్ని కోరికలు తీర్చేవాడా అని అర్ధము. 


*నీ*:: భగవంతుడిని ఏకవచనం లో సంబోధించాలంటే ఆయన తనవాడు, తను ఆయన వాడిని అనే భావం పూర్తిగా వుండాలి. త్వమేవాహం అన్న స్థితి. అది వున్న వాడే ఆవిధంగా భగవంతుడిని ఆత్మీయం గా ఏక వచనం లో పిలవ గలడు. అనన్యశరణత్వము, అనన్యా ర్హ శేషత్వము మొదలైన భావనలు ఉండడం. లేదా అలా పిలవడం ద్వారా ఆభావాలు అలవాటు చేసు కోడము అనుకోవాలి. 


*పాద కమల సేవయు*:: పాదాలను కవులు కమలాల తో పోలుస్తారు. Physical పోలిక ఉండదు. కావాలంటే బెంగుళూరు వంకాయలతో పోల్చుకోవచ్చు. కమలాల తో పోలికేమిటి. నిజానికి కోల ముఖం ఉన్న వాళ్ళను కూడా చంద్ర ముఖి అని పద్మ ముఖి అని పిలుస్తారు. ముఖం గుండ్రంగా ఉంటుందని కాదు. చంద్రుడి లోను, పద్మం లోనూ లక్ష్మీ కళ ఆకర్షణ ఉంటాయి. ఆగుణం తో పోలిక. ఆ పోలిక అనుభవించిన వాడికి దేవుడి పాదాలు వదల బుద్ధి కాదు. ముక్తులు చాలా రకాలు. అందులో సామీప్యం, సాలోక్యం అని రెండుంటాయి. విష్ణుమూర్తి పాదాలు చూస్తూ నిత్యం వాటిని సేవించాలంటే సామీప్య సాలోక్య ముక్తులు రెండూ ఉండాలి. సామీప్య సాలోక్య ముక్తులు రెండూ కావాలని లోపలి కోరిక.


*నీ పాదార్చకుల తోడి నెయ్యము* :: నీ భక్తులతో మాత్రమే సత్సంగత్వం కావాలి అని కోరిక. మన పక్క నుండేవాళ్ళు కూడా అదే కోరికతో వున్న వాళ్ళయితే మన భక్తి కి diversion కలగదు. భగవత్సేవ తో పాటు భాగవతుల సాంగత్యం కూడా కావాలి అని.


*నితాంతాపార భూత దయయును*:: అద్వేష్టీ సర్వ భూతానం .. భగవద్గీత గుర్తుంది కదా. ఆ శ్లోకాల కొసలో యోమే భక్తః సమే ప్రియః అని ఉంటుంది. భూతదయ కలగాలి దాని తరవాత దానివల్ల విష్ణుమూర్తికి తాను ఇష్టుడు కావాలి అని కోరిక. 


పద్యం అంతా ప్రధమ పురుష లో (you) నడుస్తుంది. భగవంతుడిని ఎదురుగా ఉన్నాడని భావించి మన మాట ఆయన వింటున్నాడనే నమ్మకంతో పలికే ప్రార్ధన ఇది. ఇందులో భగవంతుడు శివుడు రాముడు కృష్ణుడు అని ఏమీ ఉండదు. అమ్మవారి ముందు కూడా చెప్పుకోవచ్చు. స్తుతీ, ప్రార్ధన, సంకల్పమూ, సంపూర్ణ శరణాగతీ అన్నీ ఈ పద్యం లో ఉన్నాయి. 


భగవంతుడు అడగలేదని కుచేలుడికి ఎగ గొట్టడు. అడిగింది కదా అని కుంతికి కష్టాలు ఇవ్వడు. ఎవరి కర్మఫలం వారికి తూచి సరిగ్గా ఇవ్వడం భగవంతుడి ప్రత్యేకత. ఈ కోరిక విని కృష్ణుడు నవ్వి సుదాముడికి అడిగినవీ అడగనివీ అన్నీ ఇచ్చాడని భాగవతం లో ఉంది. 


మన కున్న కర్మ తాలూకు balance ఏమిటో మనకు తెలీదు. పోనీ నష్టం లేదు కనుక మనం కూడా సుదాముడు పద్ధతి లో ఓ application ఇస్తే సరిపోతుంది. మనం రోజూ పూజలో చదువు కోవచ్చు పిల్లలకు నేర్పించ వచ్చు... మంచి పద్యం... 


*పవని నాగ ప్రదీప్.*

*98480 54843*

సీతాశోక వినాశకః

 *సీతాశోక వినాశకః*


Trauma Care & Deppression Counselling అని రెండు విషయాలు Matrimonial counselling లో భాగంగా  నేర్చుకోవలసి వచ్చింది. ఆ subjects psychology లో భాగం. Psychology books అఖ్ఖర లేదు. Books ఉన్నా అందులో theory ఉంటుంది.  Commonsence ఉపయోగించి  Practice మీద నేర్చుకో వచ్చు. 


బాధల లో ఉన్న వాళ్ళ తో మాట్లాడేటప్పుడు వీడు మనలను వెక్కిరించ డానికి రాలేదు. బాధను పంచుకో డానికి వచ్చాడు బాధను తీర్చ డానికి సహాయ పడతాడు, అని నమ్మకం కలిగించాలి.  ఈ నమ్మకం లేకపోతే counselling ఫలించదు. ఈనమ్మకం కలగాలి అంటే empathitic listening & sympathy talking రెండూ చెయ్యాలి. ఇందులో మాట్లాడటం కంటే వినడం ఎక్కువగా చెయ్యాలి. Counseller మీద నమ్మకం కలిగాక patient  కు hope create చెయ్యాలి.  ముందుగా patient  అప్పుడున్న  condition సరిగా asess చేసుకోవాలి. కొద్దిపోరపాటు చేసినా counselling చెడి, అనుకోని దుష్పరిణామాలు కలుగుతాయి.  Negative నుంచి positive thinking లోకి రప్పించాలి. అంతా అయిన తరవాత relapse కాకుండా self help training ఇవ్వాలి.   ఇవన్నీ అనుభవం తో నే నేర్చుకోవాలి. 


రామాయణం లో హనుమ సీతతో మాట్లాడిన పద్ధతి కాస్త శ్రద్ధగా గమనిస్తే వేరే ఏ అనుభవం లేకుండానే ఇందాక అనుకున్న subject అర్థమౌతుంది. 


మొదటగా హనుమ సీతకు తనమీద నమ్మకం కలిగించు కోడానికి తనలో తను అన్ని విధాలా తర్కించు కొని సీతకు ఇష్టమైన రామకథా గానం చేస్తాడు. నువ్వెవరు అని అడగడానికి తన మనసులో ఆమె పట్ల ఎంత గౌరవ మున్నది తెలిసే టట్లు ప్రశ్నలు వేస్తాడు. ఆ మాటల మాధుర్యం ఎలాటిదంటే సీతకు నమ్మకం పూర్తి గా కలగ కున్నా బిగుసుకో కుండా relaxed గా మాట్లాడుతుంది. ఇక్కడికి హనుమ  rapo create చేసాడు. ఇది counselling లో 1st stage. 


ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తనమీద నమ్మకం కలిగించు కుంటారు. హనుమ మీద సీతకు నమ్మకం కలిగాక  తరవాత హనుమ అంగుళీయకం ఇస్తాడు.  35 సర్గ 85 & 88 శ్లోకాలు చూడండి. అంగుళీయకం చూపించి నమ్మకం కలిగించు కోలేదు. 36 వ సర్గ లో 3 వ శ్లోకం అంగుళీయక ప్రదానం. అంగుళీయకం లేకున్నా ఆంజనేయుడి మాటలను బట్టి సీత ఆయనను ముందే నమ్మింది. 


బాలరామాయణం దగ్గర నుంచి అన్నిచోట్లా అందరూ రాముడిని వాగ్విదాం వర అని పిలుస్తారు. ఆ రాముడే కిష్కిందాకాండ లో ఆంజనేయుడి మాట నేర్పుకు ఫిదా అయ్యి తెగ మెచ్చు కుంటాడు. అందుకే హనుమను సాంత్వవాది అని సుందరకాండ 27 వ సర్గ 53 వ శ్లోకం లో వాల్మీకి వర్ణిస్తారు. కేవలం పొందికగా మాట్లాడడం తోనే ఆయన పనులు సాధించు కుంటారు. 


సీతకు తగిన మాటలు చెప్పి ఉత్సాహ పరుస్తాడు.  తరవాత సీతకు hope create చెయ్యడం. సముద్రాన్ని లంఘించడం మిగతా వానరులకు చేత కాదని తెలిసి కూడా ఆమెకోసం అబద్ధం చెపుతాడు. రాముడి ప్రేమ గురించి ఆమె కోసం ఆయన తపించడం గురించి చెప్పి అవిడకున్న సందేహాలన్నీ తీరుస్తాడు. ఇక తను వెళ్ళి పోయిన తరవాత అవిడకు హనుమ పరాక్రమం గురించి సుగ్రీవుడి సైన్యం గురించి మళ్ళీ సందేహం కలగ కుండా లంకలో సగం వీరులను చంపి లంక తగల బెట్టి మంచి demo ఇచ్చి మరీ వెళతాడు.  సీతకే కాదు లంకలో వున్న వాళ్ళ లో చాలామందికి ఆ దెబ్బ  తో రాముడొస్తాడు యుద్ధం జరుగుతుందనే నమ్మకం కలిగేటట్లు చేస్తాడు. ఇది counselling అయ్యాక లక్షణాలు relapse కాకుండా జాగ్రత్తలు తీసుకోడం.   తరవాత అంటే ఈయన వెళ్ళిపోయాక సీత ఈన చెప్పిన మాటలు నమ్మక పోవడానికి అవకాశమే లేదు. యుద్ధం పూర్తి అయ్యేదాకా మళ్ళీ సీతకు ఏ సందేహమూ రాదు. మళ్ళీ నిరాశ కలగదు. హనుమ కల్పించిన నమ్మకం అంత గాఢ మైనదీ. 


36 వ సర్గ 47 ఆఖరు శ్లోకం లో ఆమెకు ఉన్న శోకం మొత్తం తీరింది అని సీతే చెబుతుంది. ఈ శ్లోకము తో 68 వ సర్గ 29 శ్లోకం కలిపి చదివితే ఆమె శోకం తీరిందనే విషయం ఆంజనేయుడికి కూడా బాగా తెలుసు అని తెలుస్తుంది.  


అందుకే సీతకు అందరికంటే హనుమ ఇష్టం. ఆమె ప్రత్యేకంగా పట్టాభిషేక సర్గ లో ఆయనకు హారం ఇస్తుంది.  ఆయనకు ఉన్న ద్వాదశ నామాలలో  కల్లా  చాలా ముఖ్య మైన పేరు "సీతాశోక వినాశకః" అన్నది.  రావణుని చంపి ఆమెను రక్షించి న రాముడికి ఆ పేరు రాలేదు. ఇంకెవ్వరికీ రాలేదు. హనుమకే వచ్చింది. 


*పవని నాగ ప్రదీప్*

ఆవకాయ

 




👆బడినుంచి ఇంటికిరాగానే అమ్మని వెతుక్కున్నట్టు అన్నాలకి కూర్చోగానే ఆవకాయ జాడీ ఎక్కడుందో వెతుకుతాయి కళ్లు. 


వేడివేడిగా కలగూరపప్పు, మువ్వొంకాయ కూర, ముక్కలపులుసూ ఉన్నా ఆవకాయ కనబడకపోతే ఇళయరాజా పాటలో ఫ్లూటెక్కడా వినబడనట్టు లోటుగా అనిపిస్తుంది. 


ఈలోగా అలా ఓమూల ఆలయప్రాంగణంలో పూలచెట్టులా నేనున్నానంటూ ధీమాగా పలకరిస్తుంది పింగాణీ పిల్ల. 


అసలీ ఆవకాయ జాడీలతో మనకు బోల్డన్ని జ్ఞాపకాలు. 


మా చిన్నతనంలో వంటింట్లో నీలంరంగు చెక్కతలుపుల బీరువా తెరవగానే పదునెక్కిన పాతవాసన వచ్చేది. అదో రకమైన ఘాటు. తలుపులు మూసేసి మళ్లీ వెంటనే తెరవాలనిపించేంత వ్యసనం. 


తీరా తెరిచిచూస్తే  మూతికి గుడ్డ బిగించి కట్టిన పొడవాటి జాడీ ఒకటి అలా నిలువుగా మా పెదనాన్నలా గంభీరంగా కనబడేది... కిందంతా పట్టుపంచెలా తెల్లగానూ, పైనేదో లేతపసుపు ఉత్తరీయం కప్పుకున్నట్టుగానూ!


ఆ జాడీని ఏ పదిరోజులకోసారో చూసేవాళ్లం. దాన్ని పెద్దావకాయ అనేవారు అమ్మానాన్నా!


గుండ్రంగా, గునగునలాడుతూ మా పెద్దత్తయ్యలా కనబడే చిన్నజాడీ ఒకదాన్ని ఎప్పుడూ అన్నాల దగ్గర పెట్టేది అమ్మ. ఎందుకంటే పెద్దావకాయ తియ్యడానికి మడీ తడీ అంటూ చాలా హడావిడుంటుంది .


ఎవరితోనూ మాటాడకుండా అత్యంత శ్రద్ధతోనూ, ఇంకా బోలెడంత శుభ్రతతోనూ స్టీలు గరిటొకటి పట్టుకుని అమ్మ బయల్దేరిందంటే మా ఇలవేల్పు సినిమాలో కె.ఆర్. విజయని చూసినంత భయభక్తులతో చూసేవాళ్లం. 


అలా తిన్నగా వంటింట్లోకెళ్లి కిడ్నాప్ చేసిన హీరోయిన్‌ నోట్లోంచి గుడ్డలు తీసినట్టు వాసినిగుడ్డ విప్పేది. ఆనక పెద్దజాడీలోంచి చిన్నజాడీలోకి దఫదఫాలుగా ఆరేడు గరిటెల ఆవకాయ నింపుతుండేది. గరిటె బయటపడిన ప్రతిసారీ కమ్మని నూనెవాసన, కళ్లనీళ్లొలికించే ఆవఘాటూ తగిలేవి. 


ఇక వెల్లుల్లి ఆవకాయైతే మధ్యమధ్యలో ఒక్కొక్కటి కనబడి ‘ఏరా, బావున్నావా?’ అని మమ్మల్ని పలకరించుకుంటూ జాడీలోకి జారుకునేవి.


ఇదంతా చూస్తూ ఎదిగాం. 


అసలు ఈ ఆవకాయల కోసం పెళ్లివారిలా నెలముందునుంచీ హడావుడి చేసేవారు నాన్నగారు. బారామాసి కాయలైతే ఊట బావుంటుందని, ఏడాదంతా పాడవదని అవే తెచ్చేవారు. పోనీ ఇప్పట్లా ఆ కాయలవాడి పక్కనే గోనెపట్టా వేసుక్కూర్చుని ముక్కలు కొట్టే అబ్బాయి చేత కొట్టించేవారా? ఎబ్బే! అలాచేస్తే సంతృప్తుండదుట. 


మాయింట్లోది కాకుండా పక్కింట్లోంచి మరో కత్తిపీటో, మర కత్తిపీటో తెచ్చేవారు. అదేంటో పక్కవాళ్ళ కత్తిపీటలే బావుండేవి ఎప్పుడూ! వాటితో ఈయన మొత్తం కాయలన్నిటినీ అరగంటలో తరిగేసేవారు. అప్పుడు పిల్లలం ఐదుగురం శుభ్రంగా ఉతికిన తెల్లటి గుడ్డలొక ఐదు తీసుకొచ్చి ముక్కల బేసిన్ చుట్టూ కూర్చునేవాళ్లం. స్నానం చేయించాక చంటిపిల్లల్ని తువ్వాలుతో తుడిచినట్టు తడిలేకుండా ముక్కలన్నిటినీ తుడిచి ఇచ్చేసేవాళ్లం. జీడిమీద ఉండే పల్చటి పొరల్ని చాకుతోనో, చెంచాతోనో తియ్యడమంటే నాకు భలే సరదాగా ఉండేది. 


ఈలోగా అమ్మానాన్నా కారాలూ మిరియాలూ... సారీ, కారాలు, ఉప్పూ కలిపిన ఆవపిండితో సిద్ధంగా ఉండేవారు. ఏళ్లతరబడి అందరి నోళ్లలోనూ నానుతున్న అంబటి సుబ్బన్న నువ్వులనూనె ఓపక్కగా కేజీ సైజు హార్లిక్స్ సీసాలోంచి బంగారంలా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు శివుడి జటాఝూటంలోంచి కిందకి దూకుదామా అని ఎదురుచూసే గంగలా ఉండేది. ఆవకాయలో ఒలకగానే ఆత్మానందం దానికి. ఇక ఏడాదంతా ముక్కల్నీ, పిండినీ, మనల్నీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యతంతా తనదే కదా! అక్కణ్ణుంచి ఆ నూనె తాలూకా కమ్మదనం కాస్తా అమ్మదనంలా మారిపోతుంది. 


అబ్బ, ఆవకాయకి ఇంత వర్ణన అవసరమా అని అడుగుతారేమో? అవసరం కాదు. విధాయకం. మా మూడో మేనత్త తన ఏడుగురు కొడుకులకీ పొద్దున్నే ఇంత ఆవకాయేసి గిన్నెడు చద్దన్నం తినిపించేసి బయటికి తోసేసేది. అదే బ్రేక్‌ఫాస్ట్. వీధిలో పిల్లలతో ఆడినంతసేపు ఉత్సాహంగా ఉంటారని, దాని ఉపయోగాలు, పోషకవిలువల గురించి పాఠం చెబుతూండేది. లేకపోతే అంతమందికీ ఇడ్డెన్లూ, దోశలంటూ కూర్చుంటే బట్టలుతకడాలు, అంట్లపనీ, వంటపనీ అయ్యేనా? 


ఇక పెసరావకాయ, మెంతావకాయ, పులిహోరావకాయ అంటూ రకరకాలుగా దశాలంకరణలు చేసినా మెగాస్టార్ మాత్రం ఒరిజినల్ ఆవకాయే! 


చిన్నతనంలో మనం ఉండే మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిమాటలైనా, రహస్యాలైనా అన్నీ పిల్లల ఎదురుగానే నడుస్తూ ఉండేవి. అలానే ఊరగాయలు, ఉపవాసాలూ కూడా మనకు ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది బాల్యంనుంచీ తెలుస్తూనే ఉండేవి. ఈ విజ్ఞానానికి అదే కారణం. చదువులదేం ఉంది, తిన్నగా బడికెళితే వంటపడుతుంది. కానీ ఇలా కారాలు, మమకారాలు తెలియాలంటే మాత్రం జీవితాన్ని చదవాలి. 


అదృష్టవశాత్తూ తనుకూడా నాలాగే అటువంటి ఒళ్లోనే పెరిగి, అటువంటి బళ్లోనే చదివొచ్చిన ఇల్లాలు. 


ఇన్నేళ్ల కాపురంలో నేను కోసే కోతల గురించి (నే చెప్పేది మావిడికాయ గురించి) బానే తెలుసుకుంది.


అందుకే ఈ ఆవకాయల సీజన్లో ఎప్పుడైనా అలా నోట్లో పెన్నో, కలర్‌నోట్లో వేలో పెట్టుకుని ఆలోచిస్తుండగా తనొచ్చి పిలుస్తుంది.


‘ఆల్చిప్పల్లాంటి కళ్లతో...’ అని ఓ రెండు లైన్లు రాయగానే రెండు ఆల్చిప్పలు నాముందు పడేసి మాగాయకి తొక్కు తియ్యమంటుంది. నేనేమో వినయవిధేయరాముళ్లా కూర్చుని చెప్పిన పనల్లా చేస్తోంటే తను టీవీనైన్ వాళ్లలా స్టింగ్ ఆపరేషనొకటి నిర్వహిస్తూ ఫొటోలు, వీడియోలు తీసేసి, వాటన్నిటినీ ‘అరాచక కుటుంబ సమూహం’ అనే వాట్సప్ గ్రూపులో పెట్టేస్తుంది.


అందుకే ఈసారి కాయల మీద నేను చెయ్యిచేసుకోలేదు. తనే ముందుగా నా ఆశీర్వాదం తీసుకుని, ఆనక ఆశీర్వాద్ పేకెట్టు, అంబటి సుబ్బన్న పేకెట్లు కొనితెచ్చుకుని మా అత్తగారి సాయంతో ఆవకాయ, మాగాయ, తొక్కుడుపచ్చడీ పెట్టేసి జాడీలకెత్తేసింది. 


ఎదిగిన చెట్లు రెండూ ఇటువంటి తిళ్లు బానే తింటాయి. పెద్దాడికి ఆవకాయంటే మహాయిష్టం. ఈసారి కాస్త కారం తగ్గించి, కమ్మగా పెట్టిందేమో, వాడు తడవతడవకీ డాల్బీ సౌండ్‌లో లొట్టలేస్తూ లాగిస్తున్నాడు. 


‘ఓమూల అమ్మాయి ఉద్యోగం చేస్తోందికదా, ఇంకా ఈ చాదస్తాలేవిఁటి డాక్టర్ గారూ, కాస్తకాస్త ఏ ప్రియా పచ్చళ్లో కొనితెచ్చేసుకుని నాలిక్కి రాసుకోకా?’ అని మీరడగొచ్చు. తనకి నచ్చవు. ఇవేకాదు. దీపావళికి మతాబాలూ అంతే. కూర్చుని కూరతాం ఇప్పటికీ. అది నా సంతోషం. 


ఈ ఆవకాయనేది ఒక్కోసారి ఒక్కో రుచితో మనల్ని అలరిస్తుంది. చద్దన్నంతో తింటోంటే పల్లెటూళ్లో పొలంగట్టుమీద కూర్చున్నట్టనిపిస్తుంది. వేడివేడన్నంలో వెల్లుల్లావకాయ కలిపి తింటోంటే వెంకటేశ్వరస్వామి ఎదురుగా కూర్చున్నట్టనిపిస్తుంది. ఆక్షణం ఎన్ని జన్మలైనా మనిషిగానే, అదికూడా తెలుగువాడిగానే పుట్టించమని ఆయన్ని వేడుకోవాలనిపిస్తుంది. 


ఆవకాయ కలిపిన రోజున ఇంకా ఆ ఘాటదీ పూర్తిగా దిగకముందే ఓ నాలుగుముద్దలన్నం కలుపుకుని తినిచూడండి. కొత్తపుస్తకం అట్టవాసనలా మర్చిపోలేని మధురానుభూతి కలుగుతుంది. చిరుచేదుతో ఆవపిండి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మర్నాటికల్లా అది తన ఉనికిని మర్చిపోయి మావిడికాయతో తల్లీబిడ్డా న్యాయంగా కలిసిపోతుంది. 


ఎంత సంపాదించినా చివరిదశకి కొంత మిగుల్చుకోవాలని చిన్నప్పటి నుంచీ పొదుపూ అదుపూ నేర్పారు మనందరికీ. మనమంతా ఏం మిగుల్చుకోకపోయినా ఆవకాయన్నం తిన్న తరవాత ఓరెండు బద్దల్ని పెరుగన్నంలోకి మాత్రం మిగుల్చుకోవాలి. లేకపోతే ఆ అసంతృప్తి రోజంతా వెంటాడుతుంది. ఇది నిజం.


హొటళ్లలో వెనిగార్ ఆవకాయలవీ తిని అణగారిన ఆశలతో బతుకుబండిని లాగే కుర్రాళ్లంతా నామాట విని త్వరగా పెళ్లిళ్లు చేసుకోండి. 


కొత్తావకాయ, కొత్తకాపురం బావుంటాయి. 


శుభస్య శీఘ్రం!


....జగదీశ్ కొచ్చెర్లకోట

హిరణ్యాక్షశక్తి

 హిరణ్యాక్షశక్తి అహంకారంతో భూమిపై జీవం లేకుండా చేయాలని భూమి అంతటినీ జలమయం చేయు శక్తి కలిగిన వాడు.నీటి ద్వారానే భూమిపై జీవ లక్షణమని తెలిసి భూమిని జలమయం చేయుట యనే తత్వం. అనంతమైన జీవ ఙ్ఞానం సంపాదించి సృష్టి క్రమాన్ని కలిగిన భూమికి గల క్షేత్ర సస్య ధర్మాన్వి నాశనం చేయుట. అందుకు వరాహ అవతారంలో భూమిని జలం నుండి పైకి ఎత్తి భూమిని సస్యవృధ్దికి క్షేత్ర వృద్దిని కాపాడుట. యిది తెలిసి హిరణ్యకశిపుడు కూడాఅధర్మమని జీవ చైతన్య లక్యణమైన విష్ణుని నివారించి తనే విష్ణు శక్తికి  మూలంగా యుండుట, అనే అహంకారమనే రాక్షస తత్వం. శ్రీహరి శక్తిని ఎక్కడా కనపడక చైతన్య శక్తి తనలోనే అనగా ప్రహ్లాద జనమునకు ముందే వాయు రూపంలో హిరణ్యకశిపుని నాసిక ద్వారా విష్ణువు హిరణ్యకశిపుని దేహంలో ముందే ప్రవేశించి యుండుట. ఆ శక్తియే తిరిగి ప్రహ్లాదుని రూపంలో ప్రవేశము.తనలో యున్న విష్ణువని తెలియక ప్రపంచం అంతా చూచుట అఙ్ఞానం.హిరణ్యకశిపుని కోరికయే ఆతని మరణం.అందువలన మరణం లేకుండా కోరిక అసంభవం.పంచభూతాత్మకమైన శరీరమేదైనా లయం తప్పదు. వాటిని తట్టుకునే శక్తిని దేహము కోల్పోయిన మరణమే కదా.వకరికి ముందు వకరికి వెనుక. యిదే ప్రతీ జీవి ప్రకృతితో అనుసంధానించబడిన పరిణామం క్రమం. యింత స్పష్టంగా వేదం కధల రూపంలో వివరించింది. ఙ్ఞానం తో ఆలోచన చేయుట మానవ ధర్మం,దైవత్వంకూడాఅజ్ఞానంతో అహంకరించుట రాక్షస తత్వం. ఆతని అహంకారము అతని పతనానికి తొలి మెట్టు. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*సమాధి గది నిర్మాణం..సూచన..*


*(నలభై ఐదవరోజు)*


శ్రీ స్వామివారు దగ్గరుండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహాయం చేస్తున్నారు..పనివాళ్ళు ను శ్రీధరరావు గారు ఏర్పాటు చేస్తున్నారు..చక చకా నిర్మాణం జరుగుతున్నది..


ఒకరోజు మధ్యాహ్నం తరువాత, మీరాశెట్టి గారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చారు..మామూలు కుశల ప్రశ్నల తరువాత..తీరుబడిగా కూర్చున్నాక..


"స్వామివారు ఈరోజు ఒకమాట చెప్పారు..ప్రధాన గదిలో.. భూగృహం లాగా కట్టించమన్నారు.. అందులో కూర్చుని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు.." అని మీరాశెట్టి గారు శ్రీధరరావు దంపతులతో చెప్పారు..


ఆ మాట విని ప్రభావతి గారు  ఆశ్చర్యంగా.."ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా?..ఇందులో ఏదో అర్ధం దాగివుంది.." అని..శ్రీధరరావు గారి వైపు చూసి.."శ్రీవారూ!  మీరు వెళ్లి పూర్తివివరం కనుక్కోండి..మీరాశెట్టి గారూ మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలుపెట్టకండి..అన్ని సంగతులూ కూలంకషంగా మాట్లాడి ఆపైన చూద్దాము.." అన్నారు..


"అందుకే గదమ్మా నేను ఇక్కడిదాకా పరిగెత్తుకొచ్చింది..నాకు వివరం చెప్పలేదు..ఇప్పుడు లోపల మళ్లీ గొయ్యి త్రవ్వి..అందులో చిన్న గది లాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు..మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి.." అని శ్రీధరరావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు..


అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు..శ్రీధరరావు గారు ఆలస్యం చేయలేదు..పని వాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి..నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంటబెట్టుకొని మీరాశెట్టి గారితో సహా ఫకీరు మాన్యం చేరారు..


వీళ్ల రాక కోసమే ఉన్నట్లు..శ్రీ స్వామివారు పాక వెలుపల..ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి వున్నారు..ముగ్గురూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి కలిశారు..


"నాయనా..లోపల భూగృహం కట్టించమని చెప్పారట..ఎందుకోసం?..మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా!..మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది..మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు?.." ప్రభావతి గారు గబ గబా అడిగేసారు..


శ్రీ స్వామివారు పక పకా నవ్వారు.."మీరాశెట్టి మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడా?..సరే!..రండి..ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి గదా!.." అన్నారు శ్రీ స్వామివారు ..


వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ..


"అమ్మా!..నేను సాధకుడిని..తీవ్ర సాధన నా లక్ష్యం..ఇక్కడ గది లాగా కట్టిస్తున్నారు..బాగానే వుంది..దానికి తలుపులు కూడ వస్తాయి..నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు..కానీ తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితి కి వెళుతుంటాను..ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడికి కూడా సమాధి స్థితి భగ్నం అవుతుంది..ఇతమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను..అది అనుభవించేవారికే అవగతం అవుతుంది..అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే..నాలుగు అడుగుల లోతు.. నాలుగడుగుల వెడల్పు తో చిన్న గది "నేలమాళిగ" లాగా కట్టించమన్నాను..నా తపోసాధన కొఱకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా?.."


"మరో విషయం కూడా మీకు తెలియచేయాల్సిన అవసరం ఉంది..నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది..ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగృహమే నా సమాధి అవుతుంది..నేను అందులోనే వుండబోతాను..ఎందరో తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు..ఆ సమాధినే దర్శించి తరిస్తారు..ఇక్కడ నేను ధారపోస్తున్న తపశ్శక్తి మహిమాన్వితం అయినది..అది ఈ క్షేత్రం లో కొన్ని వందల ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది..ప్రతి పనికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది..నాకు నిర్దేశింపబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి..మోక్షానికి వెళతాను..నేను చేస్తున్న ఈ తపో యజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లూ కూడా చిరస్థాయిగా నిలచిపోతాయి.." 


శ్రీధరరావు దంపతులతో పాటు మీరాశెట్టి గారు కూడా నివ్వెరపోయి వింటున్నారు..ఇంతా ఈ ఆశ్రమ నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు..మరి ఈ స్వామివారేమో..తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెపుతున్నారు..ఇంతా చేస్తే శ్రీ స్వామివారు ముప్పై యేళ్ళ వయసుకూడా లేని యువకుడు..అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే.. పరి పరి విధాల ఆలోచించి ఆయోమయానికి గురయ్యారు..


"మీరు చెప్పినట్టు ఆ నేలమాళిగను సిద్ధం చేయిస్తాము..మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి..మోక్షం..సమాధి..ఇవన్నీ ఇప్పుడెందుకు స్వామీ!..మీలాటి సిద్ధపురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో వుండి.. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి..ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి.."కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు..ముందు ముందు అన్నీ మీకు అర్ధం అవుతాయి.." అన్నారు..


శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..ఇవతలికి వచ్చేసారు..మీరాశెట్టి గారు అటునుంచి అటే తమ గ్రామానికి వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలనే తలుచుకుంటూ మౌనంగా మొగలిచెర్ల కు చేరారు..


తపోసాధన..సందేహం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శివ శబ్ద మహిమ

 శివ శబ్ద మహిమ


#శివ_శబ్ద_మహిమ


ఒకసారి ఓ పల్లెటూరి వానికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్లాడు. శివా అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా. నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడీ ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామీ అన్నాడు. ఓ జానపదుడా ఇదిగో ఈ నీకు కనిపించే ఈ చీమ చెవి దగ్గర ‘ఓం నమశివాయ’ అని అరువు అని చెప్పాడు. చీమ చెబుతుందా అన్నాడు జానపదుడు. ముందు అయితే చెప్పింది చేయి అన్నాడు సన్యాసి. జానపదుడు అట్లాగే చేశాడు. చీమ కాస్తా ప్రాణాలు కోల్పోయింది. రామ రామ! ఎంత ఘోరం జానపదుడు అనుకొన్నాడు. అట్లానే సీతాకోక చిలుక, లేడి దగ్గర శివనామం చెప్పించి వాటినీ హరీ అనిపించాడు. అంతలో అక్కడికి ఓ దంపతులు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వచ్చి అయ్యా! ఈ శిశువును ఆశీర్వదించండి అన్నారు. సన్యాసి ఎప్పటిలాగా శివనామం చెప్పమన్నాడు. జానపదుడు గడగడా వణికి, అయ్యా! అన్నాడు. మరేం ఫర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు సన్యాసి. ‘నమఃశివాయ’ అని జానపదుడు అనగానే ఆ శిశువు ‘అయ్యా! పరమ పుణ్యచరితా! మరొక్కసారి నమశివాయ అనవా’ అన్నాడు. ఇదేమి చిత్రం అని చూస్తుంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. ‘అయ్యా! చీమ దగ్గరనుంచి ఇప్పటిదాకా ఆ శివనామం చెపితేనే మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరోసారి శివనామం వింటే నేను దివ్యునిగా మారిపోతాను కదా. సందేహం ఎందుకు’ అన్నాడు. శివశబ్దంలోని మహిమ తెలుసుకొన్న జానపదుడు ఆగకుండా శివనామాన్ని జపిస్తూ కదులుతున్నాడు.


ఓంనమఃశివాయ