1, జూన్ 2021, మంగళవారం

సీతాశోక వినాశకః

 *సీతాశోక వినాశకః*


Trauma Care & Deppression Counselling అని రెండు విషయాలు Matrimonial counselling లో భాగంగా  నేర్చుకోవలసి వచ్చింది. ఆ subjects psychology లో భాగం. Psychology books అఖ్ఖర లేదు. Books ఉన్నా అందులో theory ఉంటుంది.  Commonsence ఉపయోగించి  Practice మీద నేర్చుకో వచ్చు. 


బాధల లో ఉన్న వాళ్ళ తో మాట్లాడేటప్పుడు వీడు మనలను వెక్కిరించ డానికి రాలేదు. బాధను పంచుకో డానికి వచ్చాడు బాధను తీర్చ డానికి సహాయ పడతాడు, అని నమ్మకం కలిగించాలి.  ఈ నమ్మకం లేకపోతే counselling ఫలించదు. ఈనమ్మకం కలగాలి అంటే empathitic listening & sympathy talking రెండూ చెయ్యాలి. ఇందులో మాట్లాడటం కంటే వినడం ఎక్కువగా చెయ్యాలి. Counseller మీద నమ్మకం కలిగాక patient  కు hope create చెయ్యాలి.  ముందుగా patient  అప్పుడున్న  condition సరిగా asess చేసుకోవాలి. కొద్దిపోరపాటు చేసినా counselling చెడి, అనుకోని దుష్పరిణామాలు కలుగుతాయి.  Negative నుంచి positive thinking లోకి రప్పించాలి. అంతా అయిన తరవాత relapse కాకుండా self help training ఇవ్వాలి.   ఇవన్నీ అనుభవం తో నే నేర్చుకోవాలి. 


రామాయణం లో హనుమ సీతతో మాట్లాడిన పద్ధతి కాస్త శ్రద్ధగా గమనిస్తే వేరే ఏ అనుభవం లేకుండానే ఇందాక అనుకున్న subject అర్థమౌతుంది. 


మొదటగా హనుమ సీతకు తనమీద నమ్మకం కలిగించు కోడానికి తనలో తను అన్ని విధాలా తర్కించు కొని సీతకు ఇష్టమైన రామకథా గానం చేస్తాడు. నువ్వెవరు అని అడగడానికి తన మనసులో ఆమె పట్ల ఎంత గౌరవ మున్నది తెలిసే టట్లు ప్రశ్నలు వేస్తాడు. ఆ మాటల మాధుర్యం ఎలాటిదంటే సీతకు నమ్మకం పూర్తి గా కలగ కున్నా బిగుసుకో కుండా relaxed గా మాట్లాడుతుంది. ఇక్కడికి హనుమ  rapo create చేసాడు. ఇది counselling లో 1st stage. 


ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తనమీద నమ్మకం కలిగించు కుంటారు. హనుమ మీద సీతకు నమ్మకం కలిగాక  తరవాత హనుమ అంగుళీయకం ఇస్తాడు.  35 సర్గ 85 & 88 శ్లోకాలు చూడండి. అంగుళీయకం చూపించి నమ్మకం కలిగించు కోలేదు. 36 వ సర్గ లో 3 వ శ్లోకం అంగుళీయక ప్రదానం. అంగుళీయకం లేకున్నా ఆంజనేయుడి మాటలను బట్టి సీత ఆయనను ముందే నమ్మింది. 


బాలరామాయణం దగ్గర నుంచి అన్నిచోట్లా అందరూ రాముడిని వాగ్విదాం వర అని పిలుస్తారు. ఆ రాముడే కిష్కిందాకాండ లో ఆంజనేయుడి మాట నేర్పుకు ఫిదా అయ్యి తెగ మెచ్చు కుంటాడు. అందుకే హనుమను సాంత్వవాది అని సుందరకాండ 27 వ సర్గ 53 వ శ్లోకం లో వాల్మీకి వర్ణిస్తారు. కేవలం పొందికగా మాట్లాడడం తోనే ఆయన పనులు సాధించు కుంటారు. 


సీతకు తగిన మాటలు చెప్పి ఉత్సాహ పరుస్తాడు.  తరవాత సీతకు hope create చెయ్యడం. సముద్రాన్ని లంఘించడం మిగతా వానరులకు చేత కాదని తెలిసి కూడా ఆమెకోసం అబద్ధం చెపుతాడు. రాముడి ప్రేమ గురించి ఆమె కోసం ఆయన తపించడం గురించి చెప్పి అవిడకున్న సందేహాలన్నీ తీరుస్తాడు. ఇక తను వెళ్ళి పోయిన తరవాత అవిడకు హనుమ పరాక్రమం గురించి సుగ్రీవుడి సైన్యం గురించి మళ్ళీ సందేహం కలగ కుండా లంకలో సగం వీరులను చంపి లంక తగల బెట్టి మంచి demo ఇచ్చి మరీ వెళతాడు.  సీతకే కాదు లంకలో వున్న వాళ్ళ లో చాలామందికి ఆ దెబ్బ  తో రాముడొస్తాడు యుద్ధం జరుగుతుందనే నమ్మకం కలిగేటట్లు చేస్తాడు. ఇది counselling అయ్యాక లక్షణాలు relapse కాకుండా జాగ్రత్తలు తీసుకోడం.   తరవాత అంటే ఈయన వెళ్ళిపోయాక సీత ఈన చెప్పిన మాటలు నమ్మక పోవడానికి అవకాశమే లేదు. యుద్ధం పూర్తి అయ్యేదాకా మళ్ళీ సీతకు ఏ సందేహమూ రాదు. మళ్ళీ నిరాశ కలగదు. హనుమ కల్పించిన నమ్మకం అంత గాఢ మైనదీ. 


36 వ సర్గ 47 ఆఖరు శ్లోకం లో ఆమెకు ఉన్న శోకం మొత్తం తీరింది అని సీతే చెబుతుంది. ఈ శ్లోకము తో 68 వ సర్గ 29 శ్లోకం కలిపి చదివితే ఆమె శోకం తీరిందనే విషయం ఆంజనేయుడికి కూడా బాగా తెలుసు అని తెలుస్తుంది.  


అందుకే సీతకు అందరికంటే హనుమ ఇష్టం. ఆమె ప్రత్యేకంగా పట్టాభిషేక సర్గ లో ఆయనకు హారం ఇస్తుంది.  ఆయనకు ఉన్న ద్వాదశ నామాలలో  కల్లా  చాలా ముఖ్య మైన పేరు "సీతాశోక వినాశకః" అన్నది.  రావణుని చంపి ఆమెను రక్షించి న రాముడికి ఆ పేరు రాలేదు. ఇంకెవ్వరికీ రాలేదు. హనుమకే వచ్చింది. 


*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: