💐💐*పితృదోషం అంటే..? ఏంటీ? ఎందుకు..? ఎలా ఏర్పడుతాయి..?* 💐💐
కుటుంబ పెద్దలు ఎవరైనా కాలం చేస్తే వారికి శాస్త్ర విధిగా పిండ ప్రదానాలు, ఆబ్దికాలు ( సంవత్సరీకాలు ) క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.అలా బంధాన్ని సంబంధం లేకుండా ప్రవర్తిస్తే దాని తాలూకు దోషాలు కుటుంబంపై చూపిస్తాయి.
ఇంట్లో అన్ని అరిష్టాలు,అనర్ధాలు జరుగుతున్నట్లు భావిస్తే వెంటనే జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతక పరిశీలన చేయించుకుని పితృదోషాలు ఉన్నాయా అని కనుకోవాలి.
ఒకవేళ ఉన్నట్లయితే వారి సలహా మేరకు దోష నివారాణ చేయించుకోవాలి.వారిచ్చే సూచనలను పాటించాలి.ఇంట్లో అన్ని రకాల బాగుండాలి అంటే పితృదోష నివారణ కలగాలి.లేదంటే అడుగడుగునా అంతరాయాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఏ పని చేసినా కలిసి రాదు. పితృ దోషాల వలన ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో ఈ క్రింద ఇవ్వబడినవి గమనించండి.
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, యాక్సిడెంట్లు జరగడం, పిల్లలలో దుష్ప్రవర్తన, మానసిక అనారోగ్యం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంటాయి.
అలాగే కెరీర్‌లో అభివృద్ధి లేకపోవడం, ప్రారంభించిన కార్యాలు పూర్తికాకపోవడం ఇలా మీరు ఇక్కట్లు పడుతున్నట్లయితే మీకు పితృదోషం ఉండవచ్చు.వెంటనే పితృదోష నివారణ చేయించవలసి ఉంటుంది.
పితృ దేవతల కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే, పరిహారం కోసం మీరు దర్శించి తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడు.
పితృదోషాలు ఉన్నవారు తిలతర్పణపురి గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయాన్ని దర్శిస్తే దోషాలు పోతాయట. శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్ధించాడు. శివుడు ప్రత్యక్షమై ఈ ఊరులోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. ఆ ఊరు అందుకనే అప్పటి నుంచి తిలతర్పణపురి అయింది.
తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం.రాముడు తిలలు వదిలిన స్థలం ఇది. రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది.
అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు.ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది.
ఇక్కడ నరముఖంతో ఉన్న గణపతి దర్శనమిస్తాడు. గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది.
ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతిగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు సరస్వతీ ఆలయంకు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.
పిత్రుదోషాల గురించి మహాభారతంలో భీష్ముడు పాండవులకు చక్కగా వివరించాడు. పితృ దోషం ఎవరికైనా ఉంటే ఎన్ని నోములు ,వ్రతాలు ,దీక్షలు చేసిన ,తీర్ద యాత్రలు తిరిగిన పోవు. అందుకే కొన్ని ప్రాంతాల వారు ఇంట్లో శుభకార్యాలకు ముందు పెద్దల పేరు చెప్పి బందు,మిత్రులను పిలుసుకుని పెద్దల పేరిట కార్యం చేసి భోజనాలు పెట్టిస్తారు.
ముఖ్యంగా మనకు ఏ విషయంలోనూ కలిసి రావడం లేదు,కుటుంబంలో కూడా సంతోషం ,సఖ్యత లేదు,ఎలాంటి శుభకార్యాలు కావడం లేదు ఒకవేళ అయిన ప్రశాంతత లేకుండా అన్నింటా లోటుగా ఉన్నట్టు భావిస్తే తక్షణం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని సంప్రదించి మీ జాతకం పరిశీలన చేయించుకుని వారిచ్చే సూచనలు పాటించండి.తప్పక కుటుంబ సౌఖ్యం,జీవిత ఆనందం పొందుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి