11, ఫిబ్రవరి 2026, బుధవారం

కలిన్ స్మరణాన్ ముక్తిహః

  కలిన్ స్మరణాన్ ముక్తిహః " దీని భావము ఏమిటంటే కలి యుగంలో భగవాన్ నామ స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుందని. ఈ వాక్యాన్ని చాలామంది నమ్మి తాము రోజులో కొంతసమయం చేసే భగవన్నామముతో ముక్తి లభిస్తుందని భావిస్తున్నారు. నిజానికి ఇతర యుగాల మనుషులతో పోలిస్తే కలియుగంలో వుండే మనుష్యులు చాలా బద్దకస్తులు అంటే తామస ప్రవ్రుత్తి కలిగినవారు. ఇక అటువంటి వారికి ఇటువంటి మాటలు ఎంతో రుచిస్తాయి. అది యెట్లా అంటే పని ఎగవేసే ఉద్యోగస్తునికి నీవు పని చేయకపోయినా జీతం ఇస్తారు అనే మాటలు ఎలా రుచిస్తాయో అలాగే. కానీ సాధక మిత్రమా ఎట్టి పరిస్థితిలోను ఇటువంటి మాటలను నమ్మి నీ సాధనను మధ్యలో ఆపు చేయకు. ఒక్క విషయం మనం చుస్తువున్నాం. గత యుగాలలో కూడా సూర్యభగవానుడు తూర్పు దిక్కునే ఉదయించాడు, నీరు పల్లానికే ప్రవహించింది. నదులన్నీ సముద్రంలోనే కలిసాయి, అగ్నికి దహించే శక్తి వున్నది. నెలకు 30 రోజులే వున్నాయి. మరి ప్రక్రుతి లోని శక్తులు అన్ని, అన్నీ యుగాలలో ఒకే విధంగా ఉంటే మరి పురుషుడు అంటే భగవంతుని విషయంలో అంటే ముక్తి విషయంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఎందుకు ఉంటుంది. ఆలోచించండి. ఇటువంటి వాక్యాలు అకుంఠిత దీక్ష, నిరంతర కృషి చేయలేని వారు కల్పించినవి కాక మరొకటి కాదు. నిజానికి ఇటువంటి విషయాలే నిజమైతే హిమాలయాలల్లో సాధువులు, సన్యాసులు, జ్ఞ్యానులు ఇప్పటికి నిరంతరం నిద్రాహారాలు మాని ఎముకలు కొరికే చలిలో ఎందుకు సాధన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించు. కఠినమైన తపమొనరిస్తేనే మనకు జ్ఞ్యానం కలుగుతుంది. అప్పుడే మోక్షసిద్ది. జన్మ రాహిత్యానికి ప్రయత్నించే చక్కటి అవకాశం మనకు కేవలం ఈ మనుష్య జన్మలోనే వున్నది. ఈ అవకాశాన్ని చేయిజార్చకూడదు. మిత్రమా ఇప్పుడే మోక్షసిద్దికి ఉద్యుక్తుడవు కమ్ము🌹🌷💫⭐🛕⭐💫🌷🌹

*

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *యత్ర మిత్రత్వ మిఛ్ఛంతి*

             *తత్ర త్రీణి నకారయేత్*

             *వాగ్వాదం అర్థ సంబంధం*

             *పరోక్షే దారభాషణమ్||*


తా𝕝𝕝 *లోకంలో ఇద్దరిని దురదృష్టవంతులు గా చెప్తారు ...* 


*ఒకటి - తల్లి పాలు తాగనివాడు*,

*రెండు - మంచి మిత్రుల్ని సంపాదించుకోలేని వాడు.*..

*స్నేహం చిరకాలం నిలుపుకోవాలంటే మూడు విషయాలలో జాగ్రత్త వహించాలి....* 

*ఒకటి... స్నేహితులతో వాదులాడరాదు*

*రెండు... ధన సంబంధపు లావాదేవీలు పనికిరావు*

*మూడు... స్నేహితుడు లేని సమయంలో అతని భార్యతో మాట్లాడరాదు....* 


*ఈ మూడు విషయాలలో జాగ్రత్త పాటిస్తే మంచి మిత్రునిగా ఉండిపోతారు...*


*సుహృత్ గా కీర్తింపబడతారు ఈ జగత్ లో...🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *యత్ర మిత్రత్వ మిఛ్ఛంతి*

             *తత్ర త్రీణి నకారయేత్*

             *వాగ్వాదం అర్థ సంబంధం*

             *పరోక్షే దారభాషణమ్||*


తా𝕝𝕝 *లోకంలో ఇద్దరిని దురదృష్టవంతులు గా చెప్తారు ...* 


*ఒకటి - తల్లి పాలు తాగనివాడు*,

*రెండు - మంచి మిత్రుల్ని సంపాదించుకోలేని వాడు.*..

*స్నేహం చిరకాలం నిలుపుకోవాలంటే మూడు విషయాలలో జాగ్రత్త వహించాలి....* 

*ఒకటి... స్నేహితులతో వాదులాడరాదు*

*రెండు... ధన సంబంధపు లావాదేవీలు పనికిరావు*

*మూడు... స్నేహితుడు లేని సమయంలో అతని భార్యతో మాట్లాడరాదు....* 


*ఈ మూడు విషయాలలో జాగ్రత్త పాటిస్తే మంచి మిత్రునిగా ఉండిపోతారు...*


*సుహృత్ గా కీర్తింపబడతారు ఈ జగత్ లో.........*


✍️🌹💐🌸🙏......*


✍️🌹💐🌸🙏

భాగవతం

  'భాగవతం వింటే బాగవుతాం'

*శ్రీ పోతన భాగవత మధురిమలు*

 

(6-214-ఆ)

తవిలి గుణుల చేతఁ దత్త్వబుద్ధులచేత

నిగిడి కానరాని నెలవువాని

మొదలఁ దాన కలిగి ముక్తి మానావధి

రూపమైనవాని ప్రాపుఁ గందు.


*భావము:-* సుగుణవంతులకు కాని, తత్త్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటినుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను.


శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం తో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

శ్రీ ఆదిశంకర పరివార్

  *************శ్రీ ఆదిశంకర పరివార్ ************


  శ్లో ll శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే! శివస్యహృదయంవిష్ణుః విష్ణోశ్చహృదయగ్ంశివః ll యధాశివమయోర్విష్ణురేవంవిష్ణుమయశ్శివఃl

యధాంతరంనపశ్యామితధామేసతవస్వస్తిరాయుషీll


 అద్వైతం అంటే..సమస్త ప్రాణికోటి కీ అన్ని మతాల వారికీ...అవిరోధమైనదనీ.. ఆమోదయోగ్యమైనదనీ.. *ఆబ్రహ్మస్తంబపర్యంతం*బ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకూ.. విశ్వమంతా బ్రహ్మ మేననీ.. అద్వైతం చెప్తుంది!


మంllయచ్చకించిజ్జగత్సర్వందృశ్యతేశ్రూయతే పివాlఅంతర్బహిశ్చతత్సర్వంవ్యాప్యనారాయణస్థితః!*ఈశావాz స్యమిదగ్ంసర్వం* "త్వయిమయి సర్వత్రైకో విష్ణుః" ఇత్యాది శృతి ఉపనిషత్ లు బోధించడం సర్వలోకవిదితమే కదా!


శ్రీ కృష్ణ పరమాత్మ యే శివ సహస్రనామ స్తోత్రం రచించారని.. నిత్యం శ్రీ కృష్ణ పరమాత్మ భస్మధారణ చేసి శివపూజ చేసేవారని మహాభారతం లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది!

*రుద్రాణాంశంకరశ్చాస్మి*ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశోzర్జునతిష్ఠతి*ఇత్యాది గీతాచార్యుల వాక్యాలు వినలేదా?!


               *****ప్రస్తుతవిషయం*****


శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి... శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి పై .. ద్వేషం తో..అసూయతో.. శంకరసిద్ధాంతంపై చతురామ్నాయ పీఠాలు ఆయనస్థాపించలేదని.. పంచాయతన/షణ్మతస్థాపన.. ఆయనచేయలేదనీ/ చెప్పలేదనీ... శంకరులపై తనకున్న ద్వేషాన్ని ప్రకటించడం చూస్తున్నాం!


 అసలు శంకరలు ఉద్భవించినదే... వైష్ణవ,శైవ, శాక్తేయ,గాణాపత్య, సౌర, ఇత్యాది పాషండుల బుద్ధి మాంద్యం నిరోధించుటకనీ.. .. అవైదికమైన మతాలను, కర్మలను.. జంతుబలులు మద్యమాంసాది నివేదపూర్వక క్షుద్ర తాంత్రిక దుష్ట ఉపాసనలని, నిర్మూలించి.. 


శుద్ధ వైదిక శ్రౌత,స్మార్త, కర్మలు, యజ్ఞ,తపో దానాది స్మృత్యుక్త ధర్మ కర్మలనుప్రతిపాదిస్తూ.. ప్రజలలో..భక్తి శ్రద్ధ ఉపాసనాది కర్మలననుష్ఠించాలని... 


(అనేక దేవతాస్తోత్ర ప్రస్థానత్యభాష్య. ప్రకరణ గ్రంధాలు రచనాపూర్వక అద్వైత జ్ఞానం ప్రచారం చేయుట ఇత్యాది లోకకల్యాణములు)


 తద్వారా జ్ఞాన సముపార్జన చేసి మోక్షం పొందాలని..జన్మసార్ధక్యం చేసుకోవాలని ప్రబోధించుటకొరకు శ్రీశంకరులు ఆవిర్భవించారని ఆస్తికులందరికీ తెలిసినదే! 


ఇప్పుడు శ్రీ చిన్న జీయర్ స్వామి ఇవన్నీ విస్మరించి 

శ్రీ శంకరాచార్య స్వామి వారి పై.. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం అవి..వైరల్ కావడంతో.. అద్వైత అనుయాయులు ఆదిశంకర పరంపర..శిష్యకోటి తీవ్ర మనోవేదనకు గురయ్యారు! ఇది చాలా బాధాకరమైనవిషయం!


అధవా ఆయన ఏదైనా పొగిడి నా...ప్రకటించినా... హేళనగా... వ్యంగ్యంగా.ఉండడమేకాక... న్యూనతాభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది! 


ఇలాంటివి ప్రచారం చేయడం వారిస్థాయికి తగునా?!ఇది వారి కి అగౌరవము కాదా?!.ఇలాచేయడం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి కి పరిపాటే!అని

ప్రజలుభావించడంవారికిమర్యాద అంటారా?


 ఇలాంటివి అనేకం ఆయన ప్రసంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి!ఆమధ్య శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ముచ్చింతలలో శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగద్గురువు శ్రీ రామానుజ స్వామి వారేనంటూ...అవిరోధమైన అద్వైతులను నిశ్చేష్టులనుచేశారు!


(ఈ కలియుగంలోజగద్గురువు ఆదిశంకరాచార్య స్వామివారు అని సర్వలోక విదితమే!)


 1000సం:ల క్రితమేజన్మించిన శ్రీరామానుజా చార్యులనుజగద్గురువుఅని...సమతావాదిఅని..

తమ ఆనందాన్ని ప్రకటిస్తూ..వారిలోని శంకర పక్షపాత బుద్ధిని ఆవిష్కరించారు!


శ్రీ శంకరులు *చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషామనీషామమ!*అని.. ద్వి సహస్రాబ్ది పూర్వమే..నాడే శ్రీ కాశీ క్షేత్రంలో..మనీషా పంచకం ద్వారా సమతా దృష్టి నెలకొల్పారు!ఇదితెలిరదేమో!


 కృతయుగంలో వ్యాసులవారు,, త్రేతాయుగంలో వసిష్ఠులవారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరబ్రహ్మ కలియుగంలో జగద్గురువు ఆదిశంకరాచార్య స్వామి వారు అన్న చరిత్ర సర్వజనవిదితమే కదా! 


అయినా.. ఆయన బుద్ధిలో వక్రదృష్టియే సుస్థిరమని చాటుకున్నారు!గతంలో.. రామేశ్వరం లో.. 

శ్రీ రామలింగ ప్రతిష్ఠ శ్రీ సీతారాములు చేయలేదని శ్రీ రామ చంద్ర మూర్తి రామేశ్వరమే వెళ్ళలేదని తమ భేద దృష్టిని లోకానికి చాటి చెప్పారు!


ఇటీవల శివ స్వరూపం.. లింగం/ప్రతిమ ఏదైనా కూడా ఇళ్ళలో పెట్టరాదు!శివుడు శ్మశానవాసుడు ఇళ్ళలో ఉండరాదు! ఎవరైనా కోరికోరి శ్మశానంలో ఉండరు కదా!అని..శివభక్తులను మనోవేదనకు గురి చేశారు!


ఇంకా ..దుర్మణాలు.. ఆత్మ హత్య ఉరి, విషం తాగుట మశూచి కలరా క్షయ, కరోనా మరియు యాక్సిడెంట్లో దుర్మరణం పొందిన వారికి.. ఆశౌచంలోనే... నారాయణబలిచేయడం తమకుతెలియదా?ఇవి అశుభసమయంలోజరిగేవేకదా!


కర్మలో ఆబ్దికాది పితృ కార్యాలలో విష్ణు స్థానం కల్పించారు కదా!అది అశుభం అంటారా!?

నమో రుద్రా విష్ణవే మృత్యుర్మేపాహి..అని..

అగ్నావిష్ణూసజోషసేమావర్ధంతువాంగిరఃl

 విష్ణు ర్యోనింకల్పయితు...విష్ణోఃపృష్ఠమసి..

ఇత్యాది మంత్రాలు వినలేదా?!శుభాzశుభాలనేవి

పురుషతంత్రం!మనో కల్పితం!


పరమాత్మ తత్త్వం వస్తుతంత్రమనీ..దానికి ఎలాంటి వివక్షలేదనీ.. అది నిర్గుణ నిరాకార నిరంజన నిర్వికార నిర్విశేష నిష్కల నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమనీ..అదే పరమాత్మయనీ... దానికి వేరైన..

తదితరములైన సగుణ సాకార కర్మ బ్రహ్మము.. మాయా ప్రకృతికి చేరినదనీ యరుగరా?! ఇవన్నీ గమనించాలని మామనవి!


ఇలాంటి శివ కేశవ భేదాన్ని కల్పించి.. సృష్టించి.. ప్రచారాలద్వారా ప్రజల్లో కొత్త అలజడి సృష్టిస్తున్నారు! శివ-కేశవ ద్వేషాన్ని రగుల్చుతున్నారు! దీనివలన వారుసాధించేదేమీ లేదు! *శివ* శబ్దం అంటే.. జ్ఞానం, మంగళం,భద్రం, ఐశ్వర్యం, శుభం, ఇత్యాది అర్ధములని సకలశాస్త్ర, పురాణాల నిర్వచనం! శివుడు లేని ప్రాణి ఉండదు! దేహంలో శివుడు లేకపోతే శవమే!ఇది సకలశాస్త్రాల సారము! ఇంతగా... ఇలాంటి... ప్రేలాపనల వలన అపవాదులు..పాషండులని..శివద్వేషులు..అనే పేరు మోయడం తప్ప సాధించేదిఏమీలేదు!


కావున ఈ..జగద్గురునింద శివ దూషణాదులు వెంటనే ఉపసంహరించుకోవాలి! ఈవిధంగా చేసిన ప్రసంగాలు వెనక్కి తీసుకోవాలని....


 ఇకపై ఇలాంటి..శివ/శంకర దూషణ...భాషణలు.. చేయరాదని శ్రీ ఆదిశంకర అద్వైత పరివారము సవినయంగా కోరుతున్నది!లేనిచో.. ఆధ్యాత్మికంగా పాపము, భౌతికంగా భక్తజనఆగ్రహం ఎదుర్కొంటారని.... మా విజ్ఞప్తి! జయజయశంకర 🚩 హరహరశంకర 🚩 హరిః ఓం 🙏 నగురోరథికమ్ 🚩 💓 


ఇలాంటి దుఃసంఘటనలని స్మార్త, అద్వైత అనుయాయులు.. సిద్ధాంతులు అందరూఖండించాలి!నిరసించాలి!


 జయజయశంకర 🚩


శ్రీ జగద్గురు చరణ సేవకులు:సాగి వేంకటేశ్వర శాస్త్రి మాచర్ల పురోహిత (సర్వజనహిత) సోzహమ్ 🚩 శివోస్మి 🚩

నవగ్రహాలు

  నవగ్రహాలు - నియ‌మాలు పాటిస్తే అద్భుత ఫ‌లితాలు.............!!


నవగ్రహాలు చాలా శ‌క్తివంత‌మైన‌వి. వాటిని ప‌ద్ద‌తి ప్ర‌కారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ? అనే విష‌యం తెలుసుకుందాం. నిజానికి న‌వ‌గ్ర‌హాల‌కు ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో చాలా మందికి తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.


గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. 


నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి అంటే చంద్రుని వైపు నుంచి.. కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు నుంచి.. రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు. 


చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. 


శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. “ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. 


ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిదని చెప్ప‌వ‌చ్చు.

*శ్రీ హరి స్తుతి 127*

  *శ్రీ హరి స్తుతి 127*


*కం . నిన్నే నమ్మినవారికి* 

*యెన్నో రీతులుగ బాధ లిచ్చుట తగునా* 

*మన్నించుము దోషములను* *విన్నపముల నందుకొనుము వేంకటరమ

*శ్రీ హరి స్తుతి 126*


*ఏ రీతిగ నీవుంటివి*

*ఆ రూపము తెలుసుకొనెడు నర్హత నిమ్మా*

*చేరితి భక్తిగ చెంతకు*

*తీరని మా యాశలన్ని తీర్చుట కొరకై*ణా*

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝    *యథాగ్నిః పవనోద్ధూతః*

              *సుసూక్ష్మోఽపి మహాన్ భవేత్* l

              *తథా కర్మసమాయుక్తం* 

              *దైవం సాధు వివర్ధతే* ll


                     *మహాభారతమ్*


తా𝕝𝕝 *చిన్న నిప్పురవ్వ ఐనా గాలికి పైకి ఎగిరి మహాగ్నిగా మారినట్లు పురుషప్రయత్నంతో కూడిన దైవబలం చక్కగా వర్ధిల్లుతుంది...*


✍️🌹💐🌸🙏

భాగవతం

  *'భాగవతం వింటే బాగవుతాం'*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_ 


(6-215-ఆ)

ఎల్ల తనువులందు నిరవొంది తనతోడఁ

బొందు చేసినట్టి పొందుకాని

పొందు పొందలేఁడు పురుషుండు గుణము నా

గుణినిఁ బోలు నట్టి గుణి భజింతు.


*భావము:-* సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్నా జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను.


శ్రీ భక్త పురందరదాసు వారి కీర్తనతో *గణేశుని స్తుతిస్తూ*..... శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

మైగ్రేను తలనొప్పి

  మరళ మరళ వచ్చు మైగ్రేను తలనొప్పి

ఆంగ్ల వైద్య మందు నంతమవదు

నీకు హోమియోనె నిజముగా తగ్గించు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: మైగ్రేన్ తలనొప్పి అనేది ఇంగ్లీషు వైద్యంలో ఎప్పటికీ సంపూర్ణంగా తగ్గని మొండి రకం తలనొప్పి! పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు, ఏంటీబయోటిక్స్ తో జీవితకాలం పాటు సప్రెస్ చేస్తూ, పేషెంట్లకు నిత్య నరకం చూపిస్తారు! చాలామంది ఎండలోకి వెళ్ళినా, ప్రయాణాలు చేసి వచ్చినా తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులతో బాధపడతారు! తలబరువుతోనూ, మెడలు లాగుతూ, తల వెనుక బాధగా ఉండటం, అలాగే తలకు కుడివైపు లేదా ఎడమవైపు ఒకే పార్శ్వంలో తలనొప్పి రావడం, సైనసైటిస్ లాంటి అన్ని తలనొప్పులనూ హోమియోతో అత్యంత త్వరగా, శాశ్వతంగా నయం చేయవచ్చు! ఇంగ్లీష్ వైద్యం ఫాస్ట్ గా పనిచేస్తుందనేది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే! ఎంత చిన్న జబ్బులోనైనా సరే టెంపరరీ రిలీఫ్ ని మాత్రమే ఇచ్చి, జీవితకాలం పాటు మిమ్మల్ని విడిచిపెట్టకుండా పీడించుకు తినేలా చెయ్యడమే ఇంగ్లీష్ వైద్యం ప్రత్యేకత! కాబట్టి ఏ జబ్బైనా శాశ్వతమగా నయం చేసుకుందామనుకుంటే హోమియోకీ, జీవితకాలం దాచుకుందామనుకుంటే ఇంగ్లీష్ కీ వెళ్ళండి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

సాధారణంగా, భౌతికవాద వ్యక్తులు కొంత పేరు, కీర్తి మరియు భౌతిక లాభం వెంట ఉంటారు, కాబట్టి ఎవరైనా ఈ కారణాల వల్ల కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటే, అతను ఈ తత్వాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. 


అలాంటి వ్యక్తులు మతపరమైన సూత్రాలను సామాజిక అలంకరణగా తీసుకుంటారు. 

ముఖ్యంగా ఈ యుగంలో పేరు కోసమే ఏదో ఒక సాంస్కృతిక సంస్థలో తమను తాము చేర్చుకుంటారు. 


అటువంటి వ్యక్తులు కూడా కృష్ణ చైతన్యం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేరు. 

ఒక వ్యక్తి భౌతిక వస్తువులపై అత్యాశతో లేకపోయినా, కుటుంబ జీవితంతో అతిగా అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, అతను కూడా కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోలేడు. 


బాహ్యంగా, అటువంటి వ్యక్తులు భౌతిక ఆస్తుల కోసం చాలా అత్యాశతో ఉండరు, కానీ వారు భార్య, పిల్లలు మరియు కుటుంబ అభివృద్ధితో చాలా అనుబంధంగా ఉంటారు. 


ఒక వ్యక్తి పైన పేర్కొన్న దోషాల ద్వారా కలుషితం కానప్పుడు, అంతిమంగా భగవంతుని సేవలో ఆసక్తి లేనప్పుడు లేదా అతను భక్తుడు కానివాడైతే, అతను కృష్ణ చైతన్యం యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోలేడు.


(శ్రీమద్భాగవతం, స్కందము.3, వచనం.40)


హరే కృష్ణ

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

పంచాంగం

  🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐


గురువారం, ఫిబ్రవరి 12, 2026


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:దశమి ఉ11.45 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:జ్యేష్ఠ మ1.27 వరకు

యోగం:హర్షణం తె3.05 వరకు

కరణం:భద్ర ఉ11.45 వరకు తదుపరి బవ రా12.45 వరకు


వర్జ్యం:రా10.15 - 12.01

దుర్ముహూర్తము:ఉ10.20 - 11.06

మరల మ2.53 - 3.39

అమృతకాలం:లేదు

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30


సూర్యరాశి:మకరం

చంద్రరాశి:వృశ్చికం


సూర్యోదయం:6.33

సూర్యాస్తమయం:5.56 


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం, ఆంధ్రప్రదేశ్ - 534 275

Mobile: 91 75698 87915, 91 83280 14080


శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.


https://www.facebook.com/vedavidyalayamu

నక్షత్రేష్టిలో

  యజుర్వేదంలోని నక్షత్రేష్టిలో వేరు వేరు నక్షత్రాలకు 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి.ఒక్కో నక్షత్రానికి 8 వాక్యాలతో కూడుకున్న మంత్రం ఉంటుంది.వైదిక సాహిత్యంలో అన్ని చోట్ల నక్షత్ర గణన కృత్తిక నక్షత్రం నుండి ప్రారంబమవుతుంది.కృత్తిక నుండి విశాఖ నక్షత్రం వరకు దేవ నక్షత్రాల విభాగంగాను ,అనూరాధ నుండి భరణి నక్షత్రం వరకు యమ నక్షత్రాలుగాను విభజించబడింది. 


ఉత్తరాషాడ 4 వ పాదం,శ్రవణా నక్షత్ర 1 వ పాదం కలిసి అభిజిన్నక్షత్రం .జయింప శక్యంకాని పనులు జయింప జేయాలంటే అభిజిత్తులో చేయాలి.


సూర్యుడు ఉదయించినప్పుడు నక్షత్రం కనపడదు.కనుక సూర్యోదయానికి ముందే నక్షత్రాలు కనపడే సమయంలో నక్షత్ర మంత్రాలను పఠించాలి.ఒక నక్షత్రం సూర్యోదయం కన్నా ముందు తూర్పు ఆకాశంలో ఉదయించినప్పుడు,ఒక నక్షత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు ఆకాశంలో ఉదయించినప్పుడు ఆయా నక్షత్రాలకు ఆయా రోజుల్లో పూజలు చేయాలని వైదిక సాహిత్యం సూచిస్తుంది.


కృత్తిక 


|| ఓం ||

అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః |

నక్ష’త్రం దేవమి’ఇంద్రియమ్ |

ఇదమా’సాం విచక్షణమ్ |

హవిరాసం జు’హోతన |

యస్య భాంతి’ రశ్మయో యస్య’కేతవః’ |

యస్యేమా విశ్వా భువ’నాని సర్వా” |

స కృత్తి’కాభిరభిసంవసా’నః | 

అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు ||


రోహిణి 


|| ఓం ||

ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” |

సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు |

రోహిణీదేవ్యుద’గాత్పురస్తా”త్ |

ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ | 

విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః |

యథా జీవే’మ శరదస్సవీ’రాః |

విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా | 

ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ || 


మృగశిర


|| ఓం ||

సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ |

శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ |

ఆప్యాయ’మానో బహుధా జనే’షు |

రేతః’ ప్రజాం యజ’మానే దధాతు |

యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ |

ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ |

తస్మై’ తే సోమ హవిషా’ విధేమ | 

శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే || 


ఆరుద్ర


|| ఓం ||

ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి |

శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ |

నక్ష’త్రమస్య హవిషా’ విధేమ |

మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ |

హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు |

ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ |

ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” | 

అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ ||


పునర్వసు


|| ఓం ||

పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు |

పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ |

పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” |

పునః’ పునర్వో హవిషా’ యజామః |

ఏవా న దేవ్యది’తిరనర్వా |

విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా |

పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ | 

ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ ||


పుష్యమి 


|| ఓం ||

బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః |

తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ |

శ్రేష్ఠో’ దేవానాం పృత’నాసుజిష్ణుః |

దిశో‌உను సర్వా అభ’యన్నో అస్తు |

తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ |

బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ |

బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ |

సువీర్య’స్య పత’యస్యామ || 


ఆశ్లేష 


|| ఓం ||

ఇదగ్‍మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” |

ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ |

యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ |

తే న’స్సర్పాసోహవమాగ’మిష్ఠాః |

యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః |

యే దివం’ దేవీమను’సంచర’ంతి |

యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” | 

తేభ్య’స్సర్పేభ్యో మధు’మజ్జుహోమి || ౭ ||


మఘా 


|| ఓం ||

ఉప’హూతాః పితరో యే మఘాసు’ |

మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః |

తే నో నక్ష’త్రే హవమాగ’మిష్ఠాః |

స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ |

యే అ’గ్నిదగ్ధా యే‌உన’గ్నిదగ్ధాః |

యే’‌உముల్లోకం పితరః’ క్షియంతి’ |

యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ | 

మఘాసు’ యఙ్ఞగ్‍మ్ సుకృ’తం జుషంతామ్ || 


పుర్వా ఫల్గునీ 


|| ఓం ||

గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ |

తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ |

తం త్వా’ వయగ్‍మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ |

జీవా జీవ’ంతముపసంవి’శేమ |

యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా |

యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ |

అర్యమా రాజా‌உజరస్తు వి’ష్మాన్ | 

ఫల్గు’నీనామృషభో రో’రవీతి || 


ఉత్తర ఫల్గునీ 


|| ఓం ||

శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి |

తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ |

అస్మభ్యం’ క్షత్రమజరగ్‍మ్’ సువీర్యమ్” |

గోమదశ్వ’వదుపసన్ను’దేహ |

భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా |

భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ |

భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ | 

యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ ||


హస్తా 


|| ఓం ||

ఆయాతు దేవస్స’వితోప’యాతు |

హిరణ్యయే’న సువృతా రథే’న |

వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ |

ప్రయచ్ఛ’ంతం పపు’రింపుణ్యమచ్ఛ’ |

హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః |

దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ |

దాతార’మద్య స’వితా వి’దేయ | 

యో నో హస్తా’య ప్రసువాతి’యఙ్ఞమ్ || 


చిత్రా 


|| ఓం ||

త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ |

సుభగ్‍మ్ స’సంయువతిగ్‍మ్ రాచ’మానామ్ |

నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ |

రూపాణి’ పిగ్ంశన్ భువ’నానివిశ్వా” |

తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ |

తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” |

తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు | 

గోభి’ర్నోఅశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ || 


స్వాతీ 


|| ఓం ||

వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ |

తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః |

సమీరయన్ భువ’నా మాతరిశ్వా” |

అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః |

తన్నో’ వాయస్తదు నిష్ట్యా’ శృణోతు |

తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” |

తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” | 

యథా తరే’మ దురితానివిశ్వా” || 


విశాఖా 


|| ఓం ||

దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః |

తది’ంద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే |

తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ |

పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు |

నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే |

శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ |

విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ | 

అపక్షుధ’న్నుదతామరా’తిమ్ ||


అనూరాధా 


|| ఓం ||

ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ |

మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు |

అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః |

శతం జీ’వేమ శరదః సవీ’రాః |

చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ |

అనూరాధా స ఇతి యద్వద’ంతి |

తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః | 

హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే || 


జ్యేష్ఠా 


|| ఓం ||

ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి |

యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ |

తస్మి’న్వయ-మమృతం దుహా’నాః |

క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ |

పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” |

అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” |

ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా | 

ఉరుం కృ’ణోతుయజ’మానాయ లోకమ్ || 


మూలా


|| ఓం ||

మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ |

పరా”చ్యేతు నిరృ’తిః పరాచా |

గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ |

అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” |

అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు |

మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి |

పరా’చీం వాచా నిరృ’తిం నుదామి | 

శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” || 


పూర్వాషాఢా 


|| ఓం ||

యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః |

యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః |

యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” |

తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు |

యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః |

యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః |

యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి | 

తా నఆపః శగ్గ్ స్యోనా భ’వంతు || 


ఉత్తరాషాఢా 


|| ఓం ||

తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః |

తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ |

తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ |

కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ |

శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః |

కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః |

విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః | 

అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ ||


అభిజిత్


|| ఓం ||

యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ |

అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” |

తన్నో నక్ష’త్రమభిజిద్విజిత్య’ |

శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ |

ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ |

తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ |

తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ |

తన్నో’ దేవాసో అను’జానంతుకామమ్” ||


శ్రవణమ్


|| ఓం ||

శృణ్వన్తి’ శ్రోణామమృత’స్య గోపామ్ |

పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” |

మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ |

ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః |

త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే |

మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ |

తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా | 

పుణ్యగ్గ్ శ్లోకం యజ’మానాయ కృణ్వతీ || 


ధనిష్ఠ 


|| ఓం ||

అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ |

చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః |

తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ |

సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి |

యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ |

దక్షిణతో’‌உభియ’ంతు శ్రవి’ష్ఠాః |

పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ | 

మా నో అరా’తిరఘశగ్ంసా‌உగన్న్’ ||


శతభిష


|| ఓం ||

క్షత్రస్య రాజా వరు’ణో‌உధిరాజః |

నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః |

తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ |

శతగ్‍మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః |

యఙ్ఞన్నోరాజా వరు’ణ ఉప’యాతు |

తన్నో విశ్వే’ అభి సంయ’ంతు దేవాః |

తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ | 

దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని’ || 

పూర్వాభాద్రా 


|| ఓం ||

అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ |

విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః |

తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” |

ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః |

విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః |

ఆ‌உంతరి’క్షమరుహదగంద్యామ్ |

తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ | 

ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే” || 


ఉత్తరాభాద్రా 


|| ఓం ||

అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి |

శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ |

తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ |

ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతిసర్వే” |

చత్వార ఏక’మభి కర్మ’ దేవాః |

ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి |

తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ | 

అహిగ్‍మ్’ రక్షంతినమ’సోపసద్య’ || 


రేవతీ


|| ఓం ||

పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ |

పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ |

ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా |

సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ |

క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః |

గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా |

అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ | 

వాజగ్‍మ్’ సనుతాంయజ’మానాయ యఙ్ఞమ్ || 


అశ్వినీ 


|| ఓం ||

తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ |

శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః |

స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ |

మధ్వాసంపృ’క్తౌ యజు’షాసమ’క్తౌ |

యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ |

విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ |

తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ | 

నమో‌உశ్విభ్యాం” కృణుమో‌உశ్వయుగ్భ్యా”మ్ || 


భరణీ


|| ఓం ||

అప’ పాప్మానం భర’ణీర్భరంతు |

తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ |

లోకస్య రాజా’ మహతో మహాన్, హి |

సుగం నః జయజయ శఙ్కర హరహర శఙ్కర


శ్రీ కంచి మహాస్వామి వారి శంకర విజయాలు


https://www.facebook.com/groups/1239212447484586/


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం 122


సన్న్యాసి నామము - శంకర నామం గొప్పదనం


సన్న్యాసం పుచ్చుకుంటే అసలు పేరు పోయి, మరొక నామం వస్తుంది. ఆది గురువు నుండి శుకుని వరకూ పేర్లల్లో మార్పు లేదు.  


గౌడపాదులకి ఏ నామమిచ్చారో తెలియదు. గౌడ దేశం నుండి చదువుకై రావడం, తరువాత పూజ్యవాచక మైన 'పాద' పదంతో ఉండడం కన్పిస్తుంది. 


గోవిందునకు పూర్వనామం చంద్రశర్మ, సన్న్యాసినామం, గోవింద. శంకరుల అసలు పేరే శంకరుడు. అదే ఆశ్రమం పుచ్చుకున్న తర్వాత కూడా ఉంది. వీరు కైలాస శంకరుల అవతారమని నిశ్చయించి గురువు ఆ పదాన్ని మార్పు చేయకుండా ఉంచారు.


శంకర అనే పదం, నామ కరణం చేసినపుడు తిథి, వార, నక్షత్రాదుల కనుగుణంగా పెట్టారు. ఈ ఆచార్య సంప్రదాయంలో వీరు స్థాపించిన మఠాలలో శంకరాచార్య పదమే ఈనాటికీ వినిపిస్తుంది. 


అట్టిది మిగతా సంప్రదాయాలలో లేదు. రామానుజ పీఠంలో ఉన్న పీఠాధిపతిని రామానుజులని అనరు. ఇట్లా ఎందుకు విధించినట్లు? మాకొక సన్న్యాసి నామం ఉంది. దానికి శంకరాచార్య అనే పదాన్ని ఎందుకు జోడించినట్లు? 


వారికీ తరువాత వచ్చినవారికీ భేదం లేదని చెప్పడానికా? బాగా లేదు. వారెక్కడ? మేమెక్కడ? హస్తిమశకాంతరం ఉంది. వారి పేరులోనే శక్తి యిమిడి ఉంది. 59వ పీఠాధిపతియైన బోధేంద్రస్వామి, నామ మాహాత్మ్యాన్ని ఉగ్గడించలేదా? శివ విష్ణు నామాలలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడని చెప్పారు.


"అపర్యాప్తం రూపం జగదవన ఏతత్పునరితి


ప్రభుర్జాగర్తి శ్రీహరి గిరిశ నామాత్మక తయా"


_/\_ పరమాచార్య తిరువడిగళే శరాణం _/\_


_/\_ శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే _/\_


గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం


లోకాః సమస్థా సుఖినో భవన్తు ||


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్


శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


పెరియవా శరణం


“హరి నారాయణ దురిత నివారణ 


పరమానంద సదాశివ శంకర”


జీవన్ముక్తులను ఈరోజు మనమందరమూ తలచుకొని మనల్ని ధర్మాచరణం వైపు నడిపించమని ప్రార్థిద్దాం


సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాజ్ఞ్ముఖం!


నౌమి శాస్త్రేషు నిష్ణాతమ్ చంద్రశేఖర భారతీం!!


జయతు జయతు నిత్యం చంద్రమౌళి ర్మహేశో


జయతు జయతు నిత్యం శారదాభీష్ట దాత్రీ


జయతు జయతు నిత్యం శంకరో దేశికేంద్రో


జయతు జయతు నిత్యం చంద్రచూడో గురుర్నః!!


సాధు దేశీ గోమాతను పూజించండి


సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


🌷 🌷 🌷 🌷 🌷 శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష 🙏 🙏 🙏 🙏 🙏 


లోకాః సమస్తాః సుఖినో భవన్తు 


🙏 శుభమస్తు 🙏


శ్రీరామ జయ రామ జయ జయ రామ 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము


Mobile: 91 75698 87915, 91 83280 14080


శ్రీ వాశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ట్రస్ట్ (రి.నెం.5/2023)


శ్రీమతి తటవర్తి సూర్యకుమారి గారి మరియు శ్రీ తటవర్తి సత్యనారాయణ శర్మ గారి నిలయము, 


శ్రీ రాజగోపాల స్వామి దేవాలయము పక్కన, డోర్ నెం. 1-1-14/1, స్టీమర్ రోడ్, నరసాపురం, 


పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, 534 275


ఇ-మెయిల్ : vedavidyalayamu@gmail.com


శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.


🕉️ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుమ్


        లీలయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః 卐


సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వారు, తన యొక్క లీలా మాత్రము చేతనే ఈ విశ్వాన్నంతటిని పరిపాలించువారు అయినటువంటి మాతా ఆద్యాదిమహాలక్ష్మీ దేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారికి ప్రతి నిత్యము నమస్కరించుచున్నాము.


వేద విద్యాలయ నిర్వహణకు దాతలు ఆర్థికంగా తమ సహాయ సహకారములు అందచేయవచ్చు.


ట్రస్ట్ అకౌంట్ పేరు: S V M K Trust


అకౌంట్ నెంబర్: 502-000-807-949-49


IFSC కోడ్: HDFC0002382


బ్యాంకు పేరు: హెచ్ డి యఫ్ సి బ్యాంకు


బ్రాంచ్ పేరు: నరసాపురం శాఖ.


ఫోన్ పే మరియు పేటీయం మొబైల్ నంబర్ : 83280 14080.


అన్ని విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G కింద మినహాయింపు పొందేందుకు అర్హమైనవి.


https://www.facebook.com/vedavidyalayamu


24,000 పైగా పరమ భాగవతోత్తములచే ఫేస్ బుక్ అనుసరించబడినది (FB followers). 


దయచేసి పైన పేర్కొన్న విషయంలో మీ సహాయ సహకారాలు అందజేయగలరు.  


మీకు తెలిసిన వేద పండితులకు, బ్రాహ్మణులకు, సనాతన హిందూ వైదిక ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగి ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు, సనాతన హిందూ వైదిక ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు దయచేసి షేర్ చెయ్యగలరు.


https://youtube.com/shorts/wr69WGczQAc


https://www.youtube.com/playlist?list=PLJUPtroQhuAV-sZT6BvscOw3aa9KMlQuj


శ్రీ హరి హర హిరణ్య గర్భ త్రిజయజయ శఙ్కర హరహర శఙ్కర


శ్రీ కంచి మహాస్వామి వారి శంకర విజయాలు


https://www.facebook.com/groups/1239212447484586/


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం 122


సన్న్యాసి నామము - శంకర నామం గొప్పదనం


సన్న్యాసం పుచ్చుకుంటే అసలు పేరు పోయి, మరొక నామం వస్తుంది. ఆది గురువు నుండి శుకుని వరకూ పేర్లల్లో మార్పు లేదు.  


గౌడపాదులకి ఏ నామమిచ్చారో తెలియదు. గౌడ దేశం నుండి చదువుకై రావడం, తరువాత పూజ్యవాచక మైన 'పాద' పదంతో ఉండడం కన్పిస్తుంది. 


గోవిందునకు పూర్వనామం చంద్రశర్మ, సన్న్యాసినామం, గోవింద. శంకరుల అసలు పేరే శంకరుడు. అదే ఆశ్రమం పుచ్చుకున్న తర్వాత కూడా ఉంది. వీరు కైలాస శంకరుల అవతారమని నిశ్చయించి గురువు ఆ పదాన్ని మార్పు చేయకుండా ఉంచారు.


శంకర అనే పదం, నామ కరణం చేసినపుడు తిథి, వార, నక్షత్రాదుల కనుగుణంగా పెట్టారు. ఈ ఆచార్య సంప్రదాయంలో వీరు స్థాపించిన మఠాలలో శంకరాచార్య పదమే ఈనాటికీ వినిపిస్తుంది. 


అట్టిది మిగతా సంప్రదాయాలలో లేదు. రామానుజ పీఠంలో ఉన్న పీఠాధిపతిని రామానుజులని అనరు. ఇట్లా ఎందుకు విధించినట్లు? మాకొక సన్న్యాసి నామం ఉంది. దానికి శంకరాచార్య అనే పదాన్ని ఎందుకు జోడించినట్లు? 


వారికీ తరువాత వచ్చినవారికీ భేదం లేదని చెప్పడానికా? బాగా లేదు. వారెక్కడ? మేమెక్కడ? హస్తిమశకాంతరం ఉంది. వారి పేరులోనే శక్తి యిమిడి ఉంది. 59వ పీఠాధిపతియైన బోధేంద్రస్వామి, నామ మాహాత్మ్యాన్ని ఉగ్గడించలేదా? శివ విష్ణు నామాలలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడని చెప్పారు.


"అపర్యాప్తం రూపం జగదవన ఏతత్పునరితి


ప్రభుర్జాగర్తి శ్రీహరి గిరిశ నామాత్మక తయా"


_/\_ పరమాచార్య తిరువడిగళే శరాణం _/\_


_/\_ శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే _/\_


గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం


లోకాః సమస్థా సుఖినో భవన్తు ||


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్మూ


శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


పెరియవా శరణం


“హరి నారాయణ దురిత నివారణ 


పరమానంద సదాశివ శంకర”


జీవన్ముక్తులను ఈరోజు మనమందరమూ తలచుకొని మనల్ని ధర్మాచరణం వైపు నడిపించమని ప్రార్థిద్దాం


సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాజ్ఞ్ముఖం!


నౌమి శాస్త్రేషు నిష్ణాతమ్ చంద్రశేఖర భారతీం!!


జయతు జయతు నిత్యం చంద్రమౌళి ర్మహేశో


జయతు జయతు నిత్యం శారదాభీష్ట దాత్రీ


జయతు జయతు నిత్యం శంకరో దేశికేంద్రో


జయతు జయతు నిత్యం చంద్రచూడో గురుర్నః!!


సాధు దేశీ గోమాతను పూజించండి


సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


🌷 🌷 🌷 🌷 🌷 శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష 🙏 🙏 🙏 🙏 🙏 


లోకాః సమస్తాః సుఖినో భవన్తు 


🙏 శుభమస్తు 🙏


శ్రీరామ జయ రామ జయ జయ రామ 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము


Mobile: 91 75698 87915, 91 83280 14080


శ్రీ వాశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ట్రస్ట్ (రి.నెం.5/2023)


శ్రీమతి తటవర్తి సూర్యకుమారి గారి మరియు శ్రీ తటవర్తి సత్యనారాయణ శర్మ గారి నిలయము, 


శ్రీ రాజగోపాల స్వామి దేవాలయము పక్కన, డోర్ నెం. 1-1-14/1, స్టీమర్ రోడ్, నరసాపురం, 


పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, 534 275


ఇ-మెయిల్ : vedavidyalayamu@gmail.com


శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.


🕉️ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుమ్ర్తి


        లీలయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః 卐


సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వారు, తన యొక్క లీలా మాత్రము చేతనే ఈ విశ్వాన్నంతటిని పరిపాలించువారు అయినటువంటి మాతా ఆద్యాదిమహాలక్ష్మీ దేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారికి ప్రతి నిత్యము నమస్కరించుచున్నాము.


వేద విద్యాలయ నిర్వహణకు దాతలు ఆర్థికంగా తమ సహాయ సహకారములు అందచేయవచ్చు.


ట్రస్ట్ అకౌంట్ పేరు: S V M K Trust


అకౌంట్ నెంబర్: 502-000-807-949-49


IFSC కోడ్: HDFC0002382


బ్యాంకు పేరు: హెచ్ డి యఫ్ సి బ్యాంకు


బ్రాంచ్ పేరు: నరసాపురం శాఖ.


ఫోన్ పే మరియు పేటీయం మొబైల్ నంబర్ : 83280 14080.


అన్ని విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G కింద మినహాయింపు పొందేందుకు అర్హమైనవి.


https://www.facebook.com/vedavidyalayamu


24,000 పైగా పరమ భాగవతోత్తములచే ఫేస్ బుక్ అనుసరించబడినది (FB followers). 


దయచేసి పైన పేర్కొన్న విషయంలో మీ సహాయ సహకారాలు అందజేయగలరు.  


మీకు తెలిసిన వేద పండితులకు, బ్రాహ్మణులకు, సనాతన హిందూ వైదిక ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగి ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు, సనాతన హిందూ వైదిక ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు దయచేసి షేర్ చెయ్యగలరు.


https://youtube.com/shorts/wr69WGczQAc


https://www.youtube.com/playlist?list=PLJUPtroQhuAV-sZT6BvscOw3aa9KMlQuj


శ్రీ హరి హర హిరణ్య గజయజయ శఙ్కర హరహర శఙ్కర


శ్రీ కంచి మహాస్వామి వారి శంకర విజయాలు


https://www.facebook.com/groups/1239212447484586/


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం 122


సన్న్యాసి నామము - శంకర నామం గొప్పదనం


సన్న్యాసం పుచ్చుకుంటే అసలు పేరు పోయి, మరొక నామం వస్తుంది. ఆది గురువు నుండి శుకుని వరకూ పేర్లల్లో మార్పు లేదు.  


గౌడపాదులకి ఏ నామమిచ్చారో తెలియదు. గౌడ దేశం నుండి చదువుకై రావడం, తరువాత పూజ్యవాచక మైన 'పాద' పదంతో ఉండడం కన్పిస్తుంది. 


గోవిందునకు పూర్వనామం చంద్రశర్మ, సన్న్యాసినామం, గోవింద. శంకరుల అసలు పేరే శంకరుడు. అదే ఆశ్రమం పుచ్చుకున్న తర్వాత కూడా ఉంది. వీరు కైలాస శంకరుల అవతారమని నిశ్చయించి గురువు ఆ పదాన్ని మార్పు చేయకుండా ఉంచారు.


శంకర అనే పదం, నామ కరణం చేసినపుడు తిథి, వార, నక్షత్రాదుల కనుగుణంగా పెట్టారు. ఈ ఆచార్య సంప్రదాయంలో వీరు స్థాపించిన మఠాలలో శంకరాచార్య పదమే ఈనాటికీ వినిపిస్తుంది. 


అట్టిది మిగతా సంప్రదాయాలలో లేదు. రామానుజ పీఠంలో ఉన్న పీఠాధిపతిని రామానుజులని అనరు. ఇట్లా ఎందుకు విధించినట్లు? మాకొక సన్న్యాసి నామం ఉంది. దానికి శంకరాచార్య అనే పదాన్ని ఎందుకు జోడించినట్లు? 


వారికీ తరువాత వచ్చినవారికీ భేదం లేదని చెప్పడానికా? బాగా లేదు. వారెక్కడ? మేమెక్కడ? హస్తిమశకాంతరం ఉంది. వారి పేరులోనే శక్తి యిమిడి ఉంది. 59వ పీఠాధిపతియైన బోధేంద్రస్వామి, నామ మాహాత్మ్యాన్ని ఉగ్గడించలేదా? శివ విష్ణు నామాలలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడని చెప్పారు.


"అపర్యాప్తం రూపం జగదవన ఏతత్పునరితి


ప్రభుర్జాగర్తి శ్రీహరి గిరిశ నామాత్మక తయా"


_/\_ పరమాచార్య తిరువడిగళే శరాణం _/\_


_/\_ శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే _/\_


గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం


లోకాః సమస్థా సుఖినో భవన్తు ||


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ర్భ


శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


పెరియవా శరణం


“హరి నారాయణ దురిత నివారణ 


పరమానంద సదాశివ శంకర”


జీవన్ముక్తులను ఈరోజు మనమందరమూ తలచుకొని మనల్ని ధర్మాచరణం వైపు నడిపించమని ప్రార్థిద్దాం


సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాజ్ఞ్ముఖం!


నౌమి శాస్త్రేషు నిష్ణాతమ్ చంద్రశేఖర భారతీం!!


జయతు జయతు నిత్యం చంద్రమౌళి ర్మహేశో


జయతు జయతు నిత్యం శారదాభీష్ట దాత్రీ


జయతు జయతు నిత్యం శంకరో దేశికేంద్రో


జయతు జయతు నిత్యం చంద్రచూడో గురుర్నః!!


సాధు దేశీ గోమాతను పూజించండి


సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


🌷 🌷 🌷 🌷 🌷 శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష 🙏 🙏 🙏 🙏 🙏 


లోకాః సమస్తాః సుఖినో భవన్తు 


🙏 శుభమస్తు 🙏


శ్రీరామ జయ రామ జయ జయ రామ 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము


Mobile: 91 75698 87915, 91 83280 14080


శ్రీ వాశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ట్రస్ట్ (రి.నెం.5/2023)


శ్రీమతి తటవర్తి సూర్యకుమారి గారి మరియు శ్రీ తటవర్తి సత్యనారాయణ శర్మ గారి నిలయము, 


శ్రీ రాజగోపాల స్వామి దేవాలయము పక్కన, డోర్ నెం. 1-1-14/1, స్టీమర్ రోడ్, నరసాపురం, 


పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, 534 275


ఇ-మెయిల్ : vedavidyalayamu@gmail.com


శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.


🕉️ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుమ్


        లీలయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః 卐


సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వారు, తన యొక్క లీలా మాత్రము చేతనే ఈ విశ్వాన్నంతటిని పరిపాలించువారు అయినటువంటి మాతా ఆద్యాదిమహాలక్ష్మీ దేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారికి ప్రతి నిత్యము నమస్కరించుచున్నాము.


వేద విద్యాలయ నిర్వహణకు దాతలు ఆర్థికంగా తమ సహాయ సహకారములు అందచేయవచ్చు.


ట్రస్ట్ అకౌంట్ పేరు: S V M K Trust


అకౌంట్ నెంబర్: 502-000-807-949-49


IFSC కోడ్: HDFC0002382


బ్యాంకు పేరు: హెచ్ డి యఫ్ సి బ్యాంకు


బ్రాంచ్ పేరు: నరసాపురం శాఖ.


ఫోన్ పే మరియు పేటీయం మొబైల్ నంబర్ : 83280 14080.


అన్ని విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G కింద మినహాయింపు పొందేందుకు అర్హమైనవి.


https://www.facebook.com/vedavidyalayamu


24,000 పైగా పరమ భాగవతోత్తములచే ఫేస్ బుక్ అనుసరించబడినది (FB followers). 


దయచేసి పైన పేర్కొన్న విషయంలో మీ సహాయ సహకారాలు అందజేయగలరు.  


మీకు తెలిసిన వేద పండితులకు, బ్రాహ్మణులకు, సనాతన హిందూ వైదిక ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగి ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు, సనాతన హిందూ వైదిక ధర్మం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు దయచేసి షేర్ చెయ్యగలరు.


https://youtube.com/shorts/wr69WGczQAc


https://www.youtube.com/playlist?list=PLJUPtroQhuAV-sZT6BvscOw3aa9KMlQuj


శ్రీ హరి హర హిరణ్య గర్భ త్రిమూర్తి యాత్మక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ నిత్య శ్రీ: నిత్య మంగళమ్ 卐 卐 卐 卐 卐 


సేకరణ త్రిమూర్తి యాత్మక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ నిత్య శ్రీ: నిత్య మంగళమ్ 卐 卐 卐 卐 卐 


సేకరణ యాత్మక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ నిత్య శ్రీ: నిత్య మంగళమ్ 卐 卐 卐 卐 卐 


సేకరణ కృణోతు |

యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” |

యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః | 

తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ |

అప’ పాప్మానం భర’ణీర్భరంతు ||

శ్రీ లింగ మహాపురాణం

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - ఉమామహేశ్వర వ్రతము - నూట నాలుగవ భాగం

_________________________________________________

శౌనకాది మునులారా! ఇప్పుడు మీకు ఉమామహేశ్వర వ్రత విధానము గురించి చెబుతాను. శివుడు స్వయంగా ఈ వ్రతము గురించి వివరించి, . పురుషులు, స్త్రీలు మరియు ఇతర ప్రాణులను క్షేమము, పుణ్యప్రాప్తి కోసం ఈ వ్రతము ఆచరించాలని చెప్పాడు.


ఉమామహేశ్వర వ్రతము చేయ సంకల్పించిన భక్తుడు లేక భక్తురాలు ఒక సంవత్సరం పాటు ప్రతి నెలలో రెండు పక్షములలో వచ్చే అష్టమి, చతుర్దశితో పాటు పూర్ణిమ, అమావాస్య నాడు రాత్రి పూట హవిష్య పదార్థాలు సిద్దం చేసి శివుని అర్చించాలి. సంవత్సరం ముగిసిన తరువాత బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసి దాన దక్షిణలు సమర్పించాలి.


ఉమాదేవి మహేశ్వరుల సుందర ప్రతిమలు బంగారంతో గానీ వెండితో గాని చేయించి విధి పూర్వకంగా ప్రతిష్ఠించాలి. విగ్రహములకు ఆభరణములు చేత అలంకరించి ఛత్రయుక్త రథములో శివాలయము నకు తీసుకు వెళ్ళి సమర్పించాలి. ఇలా చేసిన భక్తుడు పురుషుడైతే శివసాయిజ్యం, స్త్రీ అయితే ఉమాదేవి సాయిజ్యం పొందుతాడు.


భక్తుడు/భక్తురాలు కన్య లేదా విధవ అయితే ఒక సంవత్సరం పాటు అష్టమి, చతుర్దశిల నాడు రాత్రి పూట భోజనం చేసి బ్రహ్మచారిణిగా ఉండాలి. సంవత్సరాంతంలో ఉమామహేశ్వర విగ్రహము తయారు చేయించి శివాలయములలో ప్రతిష్టింపచేసి శివాలయమునకు ఇచ్చివేయాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇలా చేసిన వారు ఉమాదేవి సానిధ్యం పొంది సుఖసంతోషాలు అనుభవిస్తారు.


ఒక స్త్రీ కేవలం కృష్ణ పక్ష చతుర్దశి నాడు ఈ వ్రతము చేసి సంవత్సరం చివర ఏ పదార్థముతో నైనా శివుని ప్రతిమ చేయించి పూజించి శివాలయమునకు సమర్పిస్తే భవానీదేవితో ఉండి ఆనందము అనుభవించ గలదు స్త్రీ భక్తురాలు అయితే అమావాస్య నాడు భోజనం చేయకూడదు. అన్ని నియమాలు పాటిస్తూ సంవత్సరమంతా నిగ్రహంతో నియంత్రణలో ఉండాలి.


సంవత్సరం చివర్లో త్రిశూలం చేయించి శివునికి సమర్పించాలి. శివునికి అభిషేకం చేసి వేయి శ్వేత కమలాలతో పూజించాలి. రజత కమలం సువర్ణ కాడతో తయారు చేసి సమర్పించాలి. పురుషుడు రుద్ర సాయిజ్యం, స్త్రీ భవానీదేవి సాయిజ్యం పొందుతారు


భార్యాభర్తలు కలసి ఈ వ్రతము చేయాలని సంకల్పం చేసుకుంటే, వారు సంవత్సరమంతా పూర్ణిమ, అమావాస్య తిథుల నాడు ఉపవాసం చేయాలి. ఈ పవిత్ర వ్రతము, జపము, తపము మొదలైనవి స్త్రీ తన పతి ఆజ్ఞతో చేయాలి. ప్రతి మాసంలో భక్తుడు సుగంధ విగ్రహం దానము ఇవ్వాలి. ఇలా చేసిన స్త్రీ ఉమాదేవి సన్నిధి, సాయిజ్యం పొందుతుంది.


సంవత్సరమంతా చేయలేని శివభక్తులైన స్త్రీ కార్తీక మాసంలో పూర్ణిమ తిథి నాడు ఒక పూట మాత్రమే భోజనము చేసి వ్రతము ఆచరించాలి. క్షమ, అహింస పాటిస్తూ బ్రహ్మచారిణిగా ఉండాలి. నేయి, పాలు కలిపి వండిన పాయసము నివేదించి భుజించాలి. నల్ల నువ్వులు శివునికి నమస్కరించి తమ శక్తానుసారం బ్రాహ్మణునకు దానమివ్వాలి. ఇట్టి స్త్రీ ఉమామహేశ్వర సాయిజ్యం పొందుతారు.


అష్టమి, చతుర్దశి నాడు ఉపవాసం చేయు స్త్రీ భవానీదేవితో కలిగే సాయిజ్యం పొంది ఆనందము అనుభవిస్తుంది. పైన చెప్పిన అన్నీ వ్రతములు చేయువారు సత్యము, శాంతము, క్షమ, దయ, దానము, శౌచము (శుభ్రత), ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ నియమ నిష్టలతో శివుని పూజించాలి. నియమ నిష్టలు లేకుండా వ్రతము చేస్తే ఫలం లభించదు.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

శ్రీ లింగ మహాపురాణం

 అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - న్యాసపూర్వక పంచాక్షరి మంత్ర జపము - నూట ఎనిమిదవ భాగం

_________________________________________________

న్యాసము అనే ప్రక్రియ మంత్రం జపిస్తూ శరీర అంగములను, శరీరమును శుద్ది చేసుకోవడానికి , పవిత్రం చేసుకోవడానికి చేస్తారు. న్యాసము అంటే మంత్రాలు జపిస్తూ శరీర భాగాలను తాకుతూ దైవత్వాన్ని ఆ భాగాలకు కలుగచేయడం అని చెప్పవచ్చును.


బ్రహ్మచారులు, గృహస్థులకు, సన్యాసులు మంత్రములు పఠిస్తూ శరీరమును లేదా శరీరములోని నిర్ధిష్టమైన భాగాలను స్పర్శిస్తారు. ఉత్పత్తి న్యాసములో ఎడమ చేతి బొటనవ్రేలి నుంచి ప్రారంభించి కుడిచేతితో సమాప్తము చేసి వ్రేళ్ళను స్థిరముగా వుంచుతారు. సంహార న్యాసములో రెండు చేతి బొటనవ్రేళ్ళ నుంచి ప్రారంభించి చిటికెన వ్రేలితో సమాప్తం చేస్తారు.


మొదట కరన్యాసము తరువాత దేహన్యాసము చివరకు అంగన్యాసము చేస్తారు. సాధకుడు పంచాక్షరీ మంత్ర జపం ముందు ప్రతి శరీర అంగము యొక్క న్యాసము చేయడం అవసరం. ఒకటి తరువాత ఒకటి పూర్ణ మంత్రములు చదివిన తరువాత ఓంకార జపము చేయాలి. పాద ప్రక్షాళన చేసుకుని తూర్పు లేక ఉత్తరము వైపునకు తిరిగి న్యాసము అనుష్ఠించాలి.


భక్తుడు మనస్సును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఋషి, ఛందము, అధిష్టాన దేవత, బీజము, శక్తి, పరమాత్మ, గురువుని స్మరించాలి. మంత్రాలను పునశ్చరణ చేస్తూ, చేతులు స్పర్శించుకుంటూ ఓంకారమును అరచేతితో పాటు ప్రతి మొదలు, చివర చేతి వ్రేళ్ళ కణుపులపై స్థిరపరచుకోవాలి. ఐదు వ్రేళ్ళ మధ్య కణుపులపై బిందు సహితంగా బీజములను స్థిరపరచుకోవాలి.


తమ వయస్సుని అనుసరించి ఉత్పత్తి న్యాసముతో మొదలు పెట్టి రెండు చేతుల నుండి, పాదముల నుండి ప్రారంభించి శిరస్సు వరకు చేసి పూర్తి చేయాలి. మంత్రము ఓంకార పూర్వకంగా ఉచ్ఛరిస్తూ శరీరమును శిరస్సు, ముఖము, కఠము, హృదయము, గుహ్యావయములు, రెండు పాదములను స్పృంశించాలి. తిరిగి గుహ్యావయములు, హృదయము, కంఠము, ముఖము, శిరస్సును పై చేతితో స్పృంశించాలి. మూడు విధాలైన న్యాసము ఈవిధంగా చేసిన తరువాత భక్తుడు శివధ్యానము చేయాలి.


న్యాసముతో పాటు నమః, స్వాహా, వషట్ హుం, వౌషట్, ఫట్ అనే శబ్దములను ఉచ్ఛరించాలి. ఓం నమః శివాయ లో ఓంకారము హృదయము అని , 'న' శిరస్సు అని , 'మః ' శిఖ అని, 'శి' కవచము అని, 'వా' నేత్రము అని, 'య' అస్త్రము అని చెప్పబడును. ఈ విధంగా అంగములందు అక్షరములను స్థిరపరచి దిక్కులను బంధించాలి.


ఆగ్నేయముతో ప్రారంభించి దిక్కుల అధిదేవతలను, వినాయకుడు, దుర్గాదేవి, క్షేత్రపాలకులను ప్రార్థించాలి. భక్తుడు తర్జని (చూపుడు వ్రేలు) మొదలైన వ్రేళ్ళతో, బొటన వ్రేలుతో న్యాసము చేయాలి. తరువాత కంఠ మధ్యభాగంలో న్యాసము చేయాలి. శుభ మంత్రముల చేత న్యాసము చేసిన భక్తుడు శివుని సన్నిధిలో ఉన్నవాడు అవుతాడు. పూర్వజన్మ పాపాలన్ని నశించి పోతాయి.


పార్వతీ! భక్తుడు శరీరము శుద్దిపరచుకుని ధృఢచిత్తంతో న్యాసము చేయాలి. తరువాత గురువు స్మరణ చేసి పంచాక్షరీ మంత్ర జపము చేయాలి. ఈవిధంగా అనుసరించి చేయకపోతే మంత్రజపము వ్యర్థమై పోతుంది. కనుక భక్తుడు మొదట గురువుని ఆశ్రయించి మంత్రము యొక్క నిజమైన అర్థము తెలుసుకుని పూర్ణ జ్ఞానము పొందాలి. శిష్యుడిగా భక్తుడు తన పవిత్రమైన ఆచరణతో, ఆలోచనతో, మనస్సు, వాక్కుతో గురువుని సంతుష్టుడిని చేయాలి.


శిష్యుడు ఒక సంవత్సరం వరకు గర్వము అహంకారం లేకుండా నిర్మలమైన మనస్సుతో గురు సేవ చేయాలి. ఉపవాసాది క్రియలతో శరీరము శుద్దపరచుకోవాలి. 

పిదప గురువు నదీ సముద్ర తీరాలలో లేదా పవిత్రమైన ప్రదేశంలో శుభ తిథి ముహుర్తము నాడు మంత్రోపదేశం చేయాలి. గురువు నుంచి మంత్ర జ్ఞానము పొందిన శిష్యుడు సంకల్ప సహితంగా ప్రతిరోజు మంత్ర జపము చేయాలి.


మోక్షము కోరుకునేవారు పంచాక్షరి మంత్రమును లక్ష సార్లు జపము చేయాలి. తరువాత నాలుగు సార్లు పునశ్చరణ చేయాలి. శీఘ్రముగా ముక్తి కోరుకునేవాడు నిత్యము పంచాక్షరి మంత్ర జపము చేస్తూ నిత్యజపి అవ్వాలి. నిత్యజపి సిద్దుడు అవుతాడు.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

నడిచే దేవుడు-222

 

నడిచే దేవుడు-222

అన్నదమ్ములు - ఆస్తి పంపకం 


ఒకరోజు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు. అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు. అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు. తన మాటకు విలువ ఇవ్వకుండా వేరుకాపురం పెట్టాడు. తను సమానంగా అస్తిని పంచి ఇద్దాము అని అనుకున్నా తను చెప్పే మాటలకు విలువ ఇవ్వడు. కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు. 

అంతా విన్న స్వామివారు, “సరే నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్ప్ పేపర్స్ కొనవలసి ఉంటుంది?” అని అడిగారు. 

ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుందని చెప్పాడు. ”మరి న్యాయవాదికి ఎంత ఇవ్వాలి?”

అదీ కొంచం పెద్ద మొత్తం చెప్పాడు. 

”అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖలనుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది. మరి దానికి కొంచం ఖర్చు అవుతుంది కదా? మరి ఆ ఖర్చు ఎంతవుతుంది?”

అవును అని అందుకు కొంచం మొత్తం అవుతుందని చెప్పాడు. 

”సరే! సమాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు. కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుంది అని అనుకుంటున్నావు?”

“అది చాలా కాలం పట్టవచ్చు” 

”అవును. అది చివరికి ముగిసినా, తీర్పు నీకు అనుకూలంగా ఉందకపోవచ్చు కదా?”

“అలా అవుతుందని నేను అనుకోవడం లేదు”

“సరే! నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాము. నీ తమ్ముడు పైన్యాయాలయానికి వెళ్ళవచ్చు కదా?”

“అవును. వెళ్ళవచ్చు”

“మరి అప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికి తెలియబడుతుంది. అవును కదా?”

అప్పుడు అతను కొంచం అలోచిస్తున్నట్టుగా చిన్నగా అవును అన్నాడు. ”కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే డబ్బు, సమయం, శక్తి వృధా. మీ ఇంటి గౌరవ మర్యాదలు, మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. మరి దాని గురించి ఆలోచించావా?”

“ఏమి జరిగినా పర్వాలేదు నాకు సమ్మతమే అంటావా?. ఇదేనా నీకు కావాల్సింది”

ఆ భక్తుడు మనసులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది. కాని ఇప్పుడు ఏమి చేయాలో అతనికి అర్థం కావటం లేదు. 

“పెరియవ మీరుచెప్పినట్టు దావా వెయ్యడం సరికాదు. నేను ఇప్పుడు ఏమి చెయ్యలో నా తక్షణ కర్తవ్యం ఏంటో మీరే సెలవివ్వాలి” అని వేడుకున్నాడు. 

”ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రాన అలాగే ఉండిపోవాలని లేదు కదా? నువ్వు ఎవరు? తను ఎవరు? మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు ఇద్దరూ మళ్ళా కలవాల్సిందే. ఎందుకు మీరు ఇలాంటి మనస్థత్వాన్ని పెంపొందించుకోకూడదు?”

మహాస్వామి వారు కొద్దిసేపు అలోచించి, “సరే మీరిద్దరు ఏమి చెయ్యాలో నేను చెప్తాను. చాలా పళ్ళు, పూలు కొనుక్కుని నేరుగా మీ తమ్ముడి ఇంటికి వెళ్ళు. అతనిపై గుండెలనిండా ప్రేమతో వెళ్ళు. అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు. ప్రేమతో గుండేల్లోనుండి ఈ మాటలు చెప్పు ‘ఏదో జరిగినదేదో జరిగిపోయింది. నువ్వు ఎవరు? నేను ఎవరు? మొత్తం ఆస్తి అంతా నీ దగ్గరే ఉన్నా అది నా వద్ద ఉన్నట్టే. నాకూ సంసారం ఉంది కాబట్టి నీకు ఎంత ఇవ్వలనిపిస్తే అంత ఇవ్వు. ఈ జన్మకే మనం అన్నదమ్ములం. చక్కగా ఉందాం’ అని చెప్పమని” చెప్పారు.

మహాస్వామి వారి మాటలననుసరించి, తమ్ముని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుని స్వామి వారి వద్ద సెలవు తీసుకున్నారు. 

వారు వెళ్ళిన తరువాత స్వామి వారు అక్కడున్నవారితో, “తనకుతానుగా వచ్చిన అన్నను చూసినవెంటనే వాళ్ళ శతృత్వం సగం పోతుంది. ప్రేమతో పలకరించిన అన్న మాటలను విన్న వెంటనే మొత్తం మరచిపోయి ఇతణ్ణి ఆదరిస్తాడు. కోర్టుకు వెళ్ళకుండానే వారు సంతోషంగా ఆస్తిని పంచుకుంటారు. మనం మంచి అలోచనలతో ప్రేమతో వెళ్తే, వారు కూడా మనల్ని అలానే ఆదరిస్తారు”

పరమాచార్య స్వామి వారి సలహా పనిచేసింది. కొన్నిరోజులతరువాత అంతా సవ్యంగా జరిగినదనే వార్త శ్రీమఠానికి వచ్చింది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

(Kanchi Paramacharya Dharmika Seva Trust)

Kanchiparamacharya vaibhavam కంచిపరమాచార్యవైభవం

శ్రీ మహాపెరియవ శరణం పరమాచార్యా రక్ష రక్ష

జయ జయ శంకర | హర హర శంకర 

జయ జయ శంకర | హర హర శంకర

*సర్వే జనాః సుఖినోభవంతు *

నక్షత్రం: చిత్త (

 🌹🌷💫⭐🛕⭐💫🌷🌹

*బుధవారం 11 ఫిబ్రవరి 2026*


          *నక్షత్ర స్తోత్ర మాలిక*            

     *14 వ రోజు (విశేష స్తోత్రం)​*నక్షత్రం: చిత్త (Chitta)*


*అధిపతి: కుజుడు (Angaraka/Mars)*```


​అప్పుల బాధల నుండి విముక్తి కోసం, భూ సంబంధిత వివాదాల పరిష్కారం కోసం పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం:


*​🙏శ్రీ రుణమోచన మంగళ స్తోత్రం🙏


​ధ్యానం:


మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః।

స్థిరాసనో మహాకాయః సర్వకర్మ విరోధకః ॥1॥


​లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః।

ధరాత్మజః కుజో భౌమో భూతిదో భూమినందనః॥2॥


​అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః।

వృష్టేః కర్తాపహర్తా చ సర్వకామఫలప్రదః॥3॥


​ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్।

రుణం తస్య ప్రశమనం గచ్ఛేత్ ధనమవాప్నుయాత్॥4॥


​అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల।

నమోఽస్తుతే గృహేశాన రుణమాశు విమోచయ॥5॥


​రక్తపుష్పైః స గంధైశ్చ ధూపదీపైః గుడోదకైః।

మంగళం పూజయిత్వా తు మంగళేఽహని సర్వదా॥6॥


​అర్ఘ్యం దద్యాన్మహీపుత్రాయ రుణశాంతిం ప్రయచ్ఛ మే।

భూమిపుత్ర మహాతేజః కుమార శక్తిహస్తక॥7॥


​మంగళ ప్రార్థనాం చైవ గృహాణార్ఘ్యం నమోఽస్తుతే।

రుణమోచన మంగళ స్తోత్రం యః పఠేత్ సతతం నరః॥8॥


​షణ్మాసాభ్యంతరే చైవ రుణముక్తః సుఖీ భవేత్।

మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా॥9॥


​॥ఇతి శ్రీ స్కందపురాణే రుణమోచన మంగళ స్తోత్రం సంపూర్ణమ్॥


​💡పఠన విధానం&విశేష ఫలితం:


​*మంగళవార నియమం:

చిత్త నక్షత్రం మంగళవారం నాడు వస్తే ఈ స్తోత్రం పఠించడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.*


​*దీపారాధన*

*వీలైతే ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించి, స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి.*


​*ప్రభావం*

ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి అప్పుల బాధలు తొలగిపోవడమే కాకుండా, కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రతీతి.*


*ఈరోజు నక్షత్రమాలికలో మనం తెలుసుకున్న 14వ నక్షత్రం చిత్త గురించిన విశేషాలు:


*చిత్త నక్షత్రం 14వ నక్షత్రం, ఇది కన్యా రాశి (మొదటి రెండు పాదాలు) మరియు తులా రాశి(తరువాతి రెండు పాదాలు) రెండింటిలోనూ విస్తరించి ఉంటుంది, దీనికి అధిపతి అంగారకుడు, అధిష్టాన దేవత విశ్వకర్మ (త్వష్ట). ఈ నక్షత్ర జాతకులు సృజనాత్మకంగా, కళాత్మకంగా, శక్తివంతంగా ఉంటారు, కానీ పాదాన్ని బట్టి వారి స్వభావంలో తేడాలుంటాయి. 


ముఖ్య వివరాలు:

రాశి(Zodiac Sign): కన్యా రాశి (Virgo)మరియు తులా రాశి (Libra).


*అధిపతి(Ruling Planet): అంగారకుడు (Mars).


*అధిష్ఠాన దేవత (Presiding Deity): 

విశ్వకర్మ (Tvashtri).


*నక్షత్ర పాదాలు(Padas)&రాశులు:

1వ పాదం:కన్యారాశి(సింహనవాంశ)

-రవిచేత పాలించబడుతుంది.

2వ పాదం:కన్యా రాశి(కన్య నవాంశ) - బుధుడిచే పాలించబడుతుంది.

3వ పాదం:తులారాశి(తులా నవాంశ) - శుక్రుడిచే పాలించబడుతుంది.

4వ పాదం:తులారాశి(వృశ్చికనవాంశ) - కుజుడిచే పాలించబడుతుంది. 


*స్వభావ లక్షణాలు:


సాధారణంగా కళాత్మకత, సృజనాత్మకత, డైనమిక్ స్వభావం, వాస్తుశిల్ప నైపుణ్యాలు కలిగి ఉంటారు.


*మొదటి పాదం: ఆకర్షణీయంగా, శక్తివంతంగా ఉంటారు.

*రెండవ పాదం: పరిపూర్ణతను కోరుకుంటారు, కొన్నిసార్లు కఠినంగా ఉంటారు.

*మూడవ పాదం: ప్రేమ, రొమాన్స్, కీర్తిని కోరుకుంటారు.

*నాలుగవ పాదం: రహస్య స్వభావం, అభిరుచి ఉంటారు. 


*ఇతర అంశాలు:

వృక్షం: బిల్వ వృక్షం(Bael tree).

జంతువు: పులి (Tiger).```


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

చతుర్వేద పాఠశాల

 *కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయము అఖిలభారత బ్రాహ్మణ కరివేన నిత్య అన్నదాన సత్రము* వారి ఆధ్వర్యంలో రాయలసీమలోని కర్నూలు నందు గత మూడు సంవత్సరములుగా


అనుభవజ్ఞులైన అధ్యాపకులు చతుర్వేదములు చక్కగా విద్యాబోధన చేస్తున్నారు 


ఈ చతుర్వేద పాఠశాల దినదిన ప్రవర్థమానముగా ముందుకు సాగుతూ ఉన్నది 


ఇంకా ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులకు చేరువవ్వాలని సదుద్దేశముతో

 *కొత్తగా ఋగ్వేద స్మార్త గురువులను నియమించడం జరిగినది* 

ఆసక్తిగల బ్రాహ్మణ విద్యార్థులు క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చును.


చక్కటి భోజనము, వైద్య, వసతి కలదు.


కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయము అఖిలభారత బ్రాహ్మణ కరివేన సత్రము 

కర్నూలు.



K శ్రీ దత్త శర్మ .

82772 46156


మేడవరం శ్రీ ప్రణవ శర్మ.

6281846535 


పాఠశాల యాజమాన్యము

 97048 33439

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం -  నవమి -  అనూరాధ -‌‌ సౌమ్య వాసరే* (11.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అష్టకష్టములను

 *"అష్టకష్టములను నిఘంటువు నుండి సేకరించి పంపుచున్నాను. ఈ అష్టకష్టములను స్వల్పభేదములతో వేరువేరు నిఘంటువులు ఈ క్రిందివిధంగా తెలియజేస్తున్నాయి.*


వాటిని ఇక్కడ చూద్దాము. 

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


అష్టకష్టములు : *ఆంధ్ర వాచస్పత్యము:*


దాస్యము

దారిద్ర్యము

భార్యలేకుండుట

స్వయంకృషి

చేఁజాచి యడుగుట

అడిగిన లేదనుట

అప్పుపడుట

త్రోవనడుచుట.


*ఆంధ్రశబ్దరత్నాకరము:*

అష్టకష్టములు :  


దేశాంతరగమనము

భార్యావియోగము

ఆపత్కాలమునబంధుదర్శనము

ఉచ్ఛిష్ట భోజనము

శత్రుస్నేహము

పరాన్నప్రతీక్షణము

అప్రతిష్ఠ

దారిద్ర్యము.


*సంకేత పదకోశము:*

అష్టకష్టములు:


దాస్యము

దారిద్ర్యము

భార్య లేకుండుట

స్వయంకృషి

చేజాచి యడుగుట

అడిగిన లేదనుట

అప్పుపడుట

త్రోవ నడచుట.


*మరొకనిఘంటువు:*

(నిఘంటువు యొక్క పేరు తెలియదు)


దేశాంతరము

భార్యావియోగము

ఆపత్కాలమున

బంధుదర్శనము

ఉచ్ఛిష్టభక్షణము

శత్రుస్నేహము

పరాన్న ప్రతీక్షణము

భంగము

దారిద్ర్యము



*సూర్యరాయఆంధ్రనిఘంటువు:*

"పంథానం చ దరిద్రం చ దారాహీనం స్వయంకృషిః యాచేనాస్తి ఋణం చైవ అష్టకష్టాః ప్రకీర్తితాః" 


పూజ్యులు ప్రభాకరశాస్త్రిగారి నోట్స్‌:


ఋణము

యాచన

వార్ధక్యము

జారత్వము

చౌర్యము

దారిద్ర్యము

రోగము

భుక్తశేషము



*సీతారామాంజనేయము:*

అష్టకష్టములు : వావిళ్ల నిఘంటువు 1949:


ఎనిమిది కష్టములు- 1. దేశాంతరగమనము; 2. భార్యావియోగము; 3. ఆపత్కాలమున బంధుదర్శనము; 4. ఉచ్ఛిష్టభోజనము; 5. శత్రుస్నేహము; 6. పరాన్నప్రతీక్షణము; 7. అప్రతిష్ట; 8. దారిద్ర్యము.

పంచాంగం 11.02.2026

 ఈ రోజు పంచాంగం 11.02.2026 

Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష నవమి తిథి సౌమ్య వాసర అనురాధ నక్షత్రం వ్యాఘాత యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: దశమి


 

నమస్కారఃఈ రోజు పంచాంగం 11.02.2026 

Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష నవమి తిథి సౌమ్య వాసర అనురాధ నక్షత్రం వ్యాఘాత యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: దశమి


 


ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 27*


*ఉరరీకృత కాంచిపురీ ముపనిష దరవింద కుహర మధుధారామ్।*

*ఉన్నమ్రస్తనకలశీముత్సవలహరీ ముపాస్మహే శంభోః||*


*భావము :*


కాంచీపుర నివాసియైన జగన్మాత తన ఉన్నతమైన మాతృస్థానములతో ఈశ్వరునకు ఆనందమును కలిగించు చున్నది. సహస్రారములోని, ఉపనిషత్తులనే పద్మములనుండి తేనెను కురిపించే దేవిని ప్రార్థిస్తున్నాను.


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।

ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ।। 64 ।।



ప్రతిపదార్థ:


రాగ — మమకారము/అనురక్తి; ద్వేష — ద్వేషము; వియుక్తైః — లేకుండా; తు — కానీ; విషయాన్ — ఇంద్రియ విషయములు; ఇంద్రియైః — ఇంద్రియములచే; చరన్ — వాడుతున్ననూ; ఆత్మ-వశ్యైః — మనస్సుని అదుపు చేస్తూ; విధేయ-ఆత్మా — మనస్సుని నియంత్రణ చేయువానికి; ప్రసాదం — భగవత్ కృప; అధిగచ్ఛతి — లభించును.



 తాత్పర్యము :


 ఇంద్రియ వస్తు-విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.



 వివరణ:


.వినాశనానికి దారి తీసే అధోపతనమంతా ఇంద్రియ వస్తు-విషయములలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది. ఇప్పుడు, దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. ‘నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను’ అని అనుకోవటం అసంభవం, ఎందుకంటే అది ఆత్మకి అసహజము. అప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపు పదేపదే మననం చేస్తే, మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకారబంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు; పైగా అది శుద్ధి చేస్తుంది. పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు, మనం మనస్సుని పరమాత్మతో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా పవిత్రమౌతుంది.


ఈ విధంగా, శ్రీ కృష్ణుడు మనలను కోరికలను, మమకారాన్ని త్యజించమన్నప్పుడు, అతను భౌతిక/ప్రాపంచిక మమకారాన్ని, కోరికలను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక (ఈశ్వరసంబంధమైన) మమకారం, కోరికలు త్యజించకూడదు, నిజానికి అవి మెచ్చదగినవి. వాటిని అలవర్చుకోవటం, పెంచుకోవటం అంతఃకరణ శుద్ధి కోసం అవసరం. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే, అంతఃకరణ అంత శుద్ధి అవుతుంది. నిర్గుణ, నిరాకర అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసనని ప్రతిపాదించే జ్ఞానులు, అన్ని మమకార-బంధాలను త్యజించమని చెప్పినప్పుడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కానీ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ‘ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో వారి మనస్సుని నాయందే ఉంచుతారో, వారు మూడు ప్రకృతి గుణములకు అతీతులై, పరబ్రహ్మ స్థాయిని చేరుకుంటారు.’ (భగవద్గీత 14.26). శ్రీకృష్ణుడు పదేపదే అర్జునుడిని తన మనస్సుని భగవంతుని యందే నిలుపమని ఇక ముందు శ్లోకాలలో (శ్లోకం 8.7, 8.14, 9.22, 9.34, 10.10, 11.54, 12.8, 18.55, 18.58, మరియు 18.65 మొదలగునవి ) విజ్ఞప్తి చేయుచున్నాడు.


రాగ ద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు. ద్వేషం అంటే వేరేఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదేపదే ఎలా జ్ఞప్తికి వస్తుందో, అదే విధంగా ద్వేషంలో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు/విషయం పదేపదే గుర్తుకు వస్తుంది. కాబట్టి, అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగ చేస్తాయి-అవి దాన్ని మైల పరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. మనస్సు రాగ-ద్వేషములకు అతీతంగా ఉండి, అది భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు, వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆయొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత, మనస్సుకు ఆయా వస్తువులను వాడుతున్నా, ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అనురక్తి ఉండదు. ఈ ప్రకారంగా, మనందరి లాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా, మరియు చూస్తున్నా, స్థిత ప్రజ్ఞుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు.

పంచాంగం