29, జూన్ 2026, సోమవారం

యోగవాసిష్ఠ రత్నాకరము*

  0026 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము


ఒకటవ అధ్యాయము 


రాఘవ వైరాగ్య వర్ణనము


పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన అవధూత సూర్య నారాయణ స్వామి మఠం 


1-68


దహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః సంసారాబ్దా విహోహ్యాన్తే కించిత్తేషు నరం విదుః. 


కేవలము దహనము కొఱకు యోగ్యము లైనట్టి శరీరములను కట్టెలనేకము లీ సంసారమను సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొకానొక కట్టె మనుజుడని చెప్పబడుచున్నది.


1-69


బద్దాస్థా యే శరీరేషు బద్దాస్థా యే జగత్థ్సితౌ 

తన్మోహమదిరోన్మత్తాన్‌ ధిగ్‌ధిగస్తు పునః పునః. 


ఎవరు శరీరములందును, 

జగత్స్థితి

యందును అవి సత్యములని, చిరకాల ముండునవి యని విశ్వాసము గలిగియుందురో, అజ్ఞానమను కల్లుత్రాగి ఉన్మత్తులైయున్నట్టి జనులకు మరల మరల ధిక్కారమగు గాక! 


1-70


నాహం దేహస్య నో దేహో మమనాఽయమహం తథా 

ఇతి విశ్రాన్తచిత్తా యే తే మునే పురుషోత్తమాః. 


ఓ మునీంద్రా! 'జడమగు ఈ దేహము నేను కాను, నేను దానికి సంబంధించినవాడను కాను, నాకు దేహము లేదు' అని విచారించి ఆత్మయందు విశ్రాంతి నొందువారే మనుజులలో నుత్తములు.

రావణుడిని సంహరించావా?"

 శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్య అడిగింది:

"రామా నువ్వే రావణుడిని సంహరించావా?"

శ్రీరాముడు చెప్పాడు "అమ్మా... రావణుడు అసాధారణ పండితుడు,మహా పరాక్రమశాలి, శివభక్తుడు, అతడు శివతాండవ స్తోత్రం రచించిన గొప్ప భక్తుడు. అతన్ని జయించింది నా బలం కాదు... అతని అహంకారమే అతన్ని ఓడించింది."

ఈ కథ మనకు చెప్పే సత్యం:ఎంత జ్ఞానం, శక్తి, ప్రతిభ ఉన్నా అహంకారం పెరిగితే అవన్నీ వృథా అవుతాయి. వినయం ఉన్నవారే నిజమైన విజేతలు.అహంకారం నాశనానికి దారి...వినయం విజయానికి పునాది.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 23*


*యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే*

*యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిమ్ ।*

*యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం*

*మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే ॥*


*భావము :*


*జగన్మాతా! ఎర్రని సంధ్యాప్రకాశము, నీ పాదములవంటి ఎరుపు రంగును వాంఛిస్తుంది. వెన్నెల అంటావా, నీ నఖముల తెల్లని కాంతిని పొందాలనుకుంటుంది. లేలేత చిగురుటాకులు, నీ పాదములంత మృదువుగా ఉండాలనుకుంటాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 23*


*యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే*

*యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిమ్ ।*

*యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం*

*మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే ॥*


*భావము :*


*జగన్మాతా! ఎర్రని సంధ్యాప్రకాశము, నీ పాదములవంటి ఎరుపు రంగును వాంఛిస్తుంది. వెన్నెల అంటావా, నీ నఖముల తెల్లని కాంతిని పొందాలనుకుంటుంది. లేలేత చిగురుటాకులు, నీ పాదములంత మృదువుగా ఉండాలనుకుంటాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। 15 ।।




ప్రతిపదార్థ:



న, ఆదత్తే — స్వీకరించడు; కస్యచిత్ — ఏ ఒక్కని యొక్క; పాపం — పాపము; న — కాదు; చ — మరియు; ఏవ — తప్పకుండా; సు-కృతం — పుణ్య కర్మలను; విభుః — సర్వవ్యాపియైన భగవంతుడు; అజ్ఞానేన — అజ్ఞానముచే; ఆవృతం — ఆవరింపబడి; జ్ఞానం — వివేకము/జ్ఞానము; తేన — దానిచే; ముహ్యంతి — మోహితులై భ్రమకు లోనగుచున్నారు; జంతవః — జీవులు.



 

తాత్పర్యము : 


సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.



వివరణ:


భగవంతుడు ఏ ఒక్కని పుణ్య, పాప పనులకు భాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది: 1) ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు 2) మనకు ఇవ్వబడిన శక్తితో, మనం పనులు చేయగానే మనం చేసినదాన్ని నోట్ చేసుకుంటాడు. 3) మనం చేసిన పనుల కర్మఫలములను అందజేస్తాడు.


ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయటానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వతంత్రచిత్తమే సృష్టి కేళికి మూలాధారము మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం. ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైర్‌లా ఉంటుంది భగవంతుని పని. ఫలితములను ఇస్తూనే ఉంటాడు, ‘నాలుగు పరుగులు!’, ‘ఆరు పరుగులు!’, ‘అతను ఔట్!’ అలా. నిర్ణయాలకు అంపైర్‌ని దోషుడిగా చేయలేము, ఎందుకంటే అవి ఆటగాడి ఆట తీరుని బట్టి ఉంటాయి.


భగవంతుడు, జీవులకు స్వతంత్ర-చిత్తమును (free-will) ఎందుకు ఇచ్చాడు అన్న సందేహము రావచ్చు. ఇది ఎందుకంటే, భగవంతుడు అభిజ్ఞ స్వరాట్ (సర్వ స్వతంత్రుడు), కాబట్టి జీవాత్మ కూడా, తన ఇంద్రియమనోబుద్ధులను తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది.


అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలానే ఉద్దేశంతోనే మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. మన స్వతంత్ర చిత్తమును వాడుకోవటం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడుతాయి, అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుడిని తప్పు పట్టరాదు.


అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు, స్వేచ్ఛాచిత్తము ఉందని తెలుసుకుంటారు, కానీ, శారీరక అహంకారం లో కర్తృత్వభావన కలిగి ఉంటారు (చేసేది నేనే అన్న భావన). ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే. ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.

పంచాంగం 29.06.2026 Monday,

ఈ రోజు పంచాంగం 29.06.2026  Monday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం  గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఇందు వాసర మూల నక్షత్రం శుక్ల యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: పౌర్ణమి 


 

నమస్కారః , శుభోదయం