5, సెప్టెంబర్ 2023, మంగళవారం

Dondaya


 

Siva


 

J


 

 *


అమెరికాలోని వైట్‌హౌస్‌లో "శ్రీ రుద్రం స్తోత్రం"*


* *అమెరికన్లు ఇంత శుభ్రంగా ఉచ్చరించగలరని ఊహించడం అసాధ్యం.* 


 *"శ్రీ రుద్రం స్తోత్రం" జెఫ్రీ అర్హార్డ్ వైట్ హౌస్‌లో పఠించారు.* 


*భారత్ మాతా కీ జయహో.....*

Panchaag


 

R


 

K


 

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి💐

 *సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి💐🙏🕉️*


      *ఉపాధ్యాయ -  దినోత్సవం*

ఈరోజు తత్త్వవేత్త, విద్యావేత్త, అధ్యాపకుడు, మానవతావాది

భారతరత్న సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, ఇట్టి పవిత్ర దినమును 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజు గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది...

ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు ఇది,

గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం సర్వేపల్లి పుట్టిన రోజైన "సెప్టెంబర్ 5" ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు...


*ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకొందాం.!!*

భారతరత్న, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు,

ఈయన 1888 సెప్టెంబరు 5 న, సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ అను తెలుగు దంపతులకు, ఒక హిందూ నియెాగి బ్రాహ్మణుల కుటుంబంలో  మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో జన్మించారు...

రాధాకృష్ణన్ తన 16వ ఏట శివకామమ్మను పెళ్లి చేసుకున్నారు...

వీరికి ఐదుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. 

కొడుకు పేరు సర్వేపల్లి గోపాల్, ఆయన బాల్యమంతా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచింది...


భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు...


సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా ఉన్నారు...


1962 నుంచి 1967 వరకు రెండో రాష్ట్రపతి...

ఆయన ఒక గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, మానవతావాది...


1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు...


1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు.

చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు...


1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 

1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.


1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది... దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.


డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో "ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌" లో స్థానం కల్పించారు.. 

1953 నుంచి 1952 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు...


సర్వేపల్లి గొప్ప పండితుడు, బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 

ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు, మొత్తం 27సార్లు నామినేట్ అయ్యారు...

ఘనశ్యామ్ దాస్ బిర్లా తదితరులతో కలిసి రాధాకృష్ణన్ కృష్ణార్పన్ చారిటీ ట్రస్ట్‌ను స్థాపించారు...


రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు..


*తత్వవేత్తగాసర్వేపల్లి....!!*


భారతీయ తాత్వికచింతనలో ఆయన పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి, ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం...

గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. 

సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.


గురువులకు ప్రతీక వీరు, సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి. 

ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు.


మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రం లో (Philosophy), ఎమ్మే (M.A.) పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో ప్రొఫెసర్ (బోధకుడి) గా చేరారు. 

ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. 

ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు, ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు...


కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. 

దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం (Indian Philosophy)' అన్న గ్రంథం వ్రాశాడు. 

ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది, ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు (Western Philosophers) ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న "వేదాంత ప్రభావానికి" ఎలా లోనవుతున్నారో చూపించారు... 

అతని దృష్టిలో "తత్వము" అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము "భారతీయ తత్వమును (Indian Philosophy) " అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు...


భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, "భారతీయ తాత్వికచింతన" ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు...

 గురుపూజోత్సవ  శుభాకాంక్షలు 🙏💐🕉️

Pravachan


 

Masaala mirchi


 

Boppayakaya pappu


 

Teachers Day



తే.గీ. : 

అమ్మయే గద ఇలలోన ఆది గురువు పితరుడాయెను గురువుగ పిదప నాకు! జ్ఞానమిచ్చిరి గురువులే చదువు నేర్పి భువిని వేల్పులౌ వారల పూజ సేతు!!!


 - సూర్య గండ్రకోట

బసవ పురాణం - 23 వ భాగము....!!

 🎻🌹🙏బసవ పురాణం - 23 వ భాగము....!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸నేనిక బతకను’ అని ఒక బావిలో దూకి ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో! నీ భక్తికి మెచ్చాను అన్నాడు. వరమేమిటీ? ముందు నీవు విషం ఉమ్మేయి అన్నాడురుద్రపశుపతి. 


🌿పశుపతీ! విషం నేను మింగలేదు. అది నా గొంతులోనే వుంది చూడు’ అని తన నల్లని కంఠాన్ని చూపాడు. నాకదంతా తెలియదు. ఎప్పటికైనా అది గొంతు నుండి జారవచ్చు. 


🌸ఉమ్మేస్తావా? చావమంటావా? అన్నాడు పశుపతి. శివునికి ఏమి చేయాలో తోచలేదు. దేవతలంతా శివుడు విషాన్ని ఉమ్మేస్తాడేమోనని భయపడిపోయారు.


🌿రుద్రపశుపతీ! ప్రమథుల సాక్షిగా చెపుతున్నాను. నేనీ విషం మింగనయ్యా! కావాలంటే నా గొంతు చూస్తూ నా దగ్గరే కూర్చో అన్నాడు శివుడు రుద్రపశుపతిని లేవనెత్తి కౌగిలించుకొని! 


🌸శివుని తొడపై రుద్ర పశుపతి కూర్చొని శివుని గొంతునే చూస్తూ వున్నాడు. చేతిలో ఒక కత్తి పట్టుకొని దానిని తన రొమ్మునకు గురి పెట్టుకొని ఏ క్షణాన విషం శివుని గొంతు దిగితే ఆ క్షణాన ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధమై నేటికీ రుద్రపశుపతి అలాగే కూర్చొని ఉన్నాడు.


🌷నక్కనయనారు కథ


🌿(బసవన్న చెన్న బసవనికి చెప్పిన కథ)చోళ మండలములో నీల నక్కనయనారు అనే ముగ్ధ్భక్తుడు ఉండేవాడు. ఆయనా, ఆయన భార్య శివలింగ పూజ చేస్తూ వుండగా ఒక సాలెపురుగు లింగంమీద పాకింది.


🌸అది చూచి ఆమె ‘అయ్యో సాలెపురుగు పాకితే ఒళ్లు పేలిపోతుంది శివునికి ఎట్లా?’ అని సాలె పురుగు పాకినంత మేరా ఉమ్మి రాసింది.


🌿అది చూచి నీల నక్కనయనారు కోపించి ‘పాపీ! శివుణ్ణి ఎంగిలి చేస్తావా? నీవిక నాకు అక్కరలేదు పొమ్మ’ని భార్యను వదలిపెట్టాడు. ఆ రాత్రి మళ్లీ లింగపూజ చేస్తున్న సమయంలో నక్కనయనారు లింగాన్ని చూచేసరికి 


🌸అతని భార్య ఉమ్మి పూసినంత మేర మాత్రం బాగుండి మిగిలిన భాగమంతా పొక్కి వుంది.అది చూచి నక్కనయనారు పరుగు పరుగున పోయి భార్య పాదాలపై బడి క్షమాపణ కోరి పిలుచుకొని వచ్చి లింగాన్ని చూపాడు. 


🌿ఆమె లింగాన్ని చూచి ‘అయ్యో! శివా! ఎంత పని అయింది! మా ఆయన తిడితే తిట్టాడని సాహసించి లింగమంతా ఉమ్మి పూసినట్లయితే ఇలా పొక్కులు వచ్చి ఉండేవికావు కదా! 


🌸నేనిప్పుడింక ఏమి చేయను? ఈ కష్టాన్ని ఎలా చూడను?’ అని ఆమె తన తలను నరుక్కోవడానికి సిద్ధపడింది.

వారి ముగ్ధ భక్తికి సంతోషించి శివపార్వతులు ప్రత్యక్షమైనారు.


🌿వరాలు కోరుకోండి. మీకు ఏం కావాలో’ అని అడిగారు భవరోగ వైద్యుడయిన శివుడు, పార్వతీ! మీ దర్శన భాగ్యం లభించింది. ఇంక మాకు వేరే వరాలు ఎందుకు? అని వారన్నారు. 

శివుడు వారికి మోక్ష సౌభాగ్యాన్ని ప్రసాదించాడు.


🌷బెజ్జ మహాదేవి కథ


🌸(బసవన్న చెన్న బసవనికి చెప్పిన కథ)పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకున్నది. శివునికి అందరూ వున్నారు. కాని తల్లి మాత్రం లేదు. 


🌿చచ్చిపోయిందో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. 


🌸తల్లి వుంటే విషం తాగనివ్వదు. తల్లి వుంటే శివుణ్ణి తోళ్లు కట్టుకొని తిరుగనిస్తుందా?తల్లి వుంటే పాముల ధరింపనివ్వదు.బూడిదపూసుకోనివదు తల్లి వుంటే శివునికి బెచ్చబెత్తుకునే ఖర్ముమెందుకు పడుతుంది? 


🌿వల్లకాటిలో ఎందుకుతిరుగనిస్తుంది? తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనాడు. తల్లి వుంటే ఇంకెంత వాడగునో? పెళ్లిళ్లకు పేరంటాలకు అన్నిటికీ తల్లి వుండాలి. తల్లి లేని శివునికిక నేనే తల్లినై వుంటాను 


🌸అని భావించి బెజ్జ మహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుకబెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ్భక్తికి శివుడు మెచ్చి అన్ని 


🌿ఉపచారాలూ స్వీకరించసాగాడు.

ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది.అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది అని ఏడ్చింది. 


🌸అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం శివునిపై చూపి బాధపడ్డది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ఇక మాటలతో పనిలేదా బిడ్డా! 


🌿నీ బాధ చూస్తూ నేను జీవించలేను అని తల నరుక్కోడానికి సిద్ధపడ్డది. శివుడప్పుడు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. 


🌸నీవు నా కొడుకువు. నీ ముఖం శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అన్నది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వమును ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది...సశేషం....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

చతుర్థ జాతుడు

 చమత్కార పద్యం


ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం


*అంచిత చతుర్ధ జాతుడు*

*పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్*

*గాంచి, తృతీయం బక్కడ*

*నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!*


*భావం:*

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 


ఏమీ అర్థం కాలేదు కదా!? 


ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 


చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*

పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*

ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*

తృతీయము అంటే *అగ్ని ,*

ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి.... 


*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని... భావం* 


*ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవి గారికి నమస్సుమాంజలి.!!!* 🙏

శంఖగుండం

 🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹

      *🌞 శుభోదయం 🌅*


భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో "బాంకా" జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో "శంఖగుండం" ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి గడియలలో ఈ గుండంలో నీరు మొత్తం మాయమౌతుంది, గుండం అడుగున ఉన్న "పాంచజన్య శంఖం" భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివరాత్రి గడియలు పూర్తికాగానే శంఖ గుండం తిరిగి నీటితో నిండిపోతుంది.పరమశివుడు పాలసముద్రమథనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలాన్ని ఈశంఖంలో నింపి సేవించి  నీలకంఠుడు అయ్యాడని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది. 


మహాశివరాత్రి గడియలలో నీరు ఎక్కడకు వెల్తుంది, గడియలు ముగిసిన క్షణమే నీరు ఎలా వస్తుంది అనేది నేటికీ అంతుపట్టని రహస్యం. 


*ఓం నమః శివాయ 🙏🏻*

 

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

    🌼🇮🇳🌼🙏🌼🇮🇳🌼

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

Bhart


 

భాగం 10/12 ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం


                    భాగం 10/12 


ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం) 


                ----------------------- 


          9.  సాంకేతిక విజ్ఞానం 


    ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి పేరుతో మారుతూ ఉంటుంది. 

    రేడియోతో మొదలై, టేపురికార్డరు, TV, వీడియో ప్లేయరు, రికార్డరు, DVD, చరవాణితోపాటు మరిన్ని వైజ్ఞానిక పరికరాలూ, ఒకదాని తరువాత మరొకటిగా ఒకవైపు కనబడతాయి. 

    మరొకవైపు బొగ్గుబస్సు, డీసెల్/ గ్యాసు ఆధారితాలూ, విద్యుత్తుతోనూ సౌరశక్తితోనూ నడిచేటటవంటి దశలూ కనబడతాయి. 

    పరిశోధన, కొత్త విషయం అనేవి నిరంతరం జరుగుతూంటాయి. 


      శ్రీమద్రామాయణంలోని అనేక విషయాలు పరిశీలిస్తే, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మనలని అబ్బురపరుస్తుంది. 

    దానిలో భాగంగా కొన్ని పరిశీలిద్దాం. 


అ) నీటిలో భవనం 


    అరణ్యకాండలో, 

      మాండకర్ణి పంచాప్సర తీర్థంలో తన అప్సరస భార్యలకోసం, పైకి కనబడకుండా, సరస్సులోనీటిలోనే ఉండే గృహం నిర్మించాడని పేర్కొనబడింది. 

    క్రీడిస్తుంటే, గీత వాద్య ధ్వనులు మనోహరంగా బయటకు వినబడేవట. 


ఆ) వారధి 


    నదులమీద మాత్రమే మనం వంతెలని చూస్తుంటాం. 

    రామేశ్వరం వద్ద పంబన్ రైలు వంతెన, సాధారణ రవాణాకి మరో వంతెనా, 

    కలకత్తాలో హౌరా వంతెన మధ్యలో ఏ ఆధారం లేకుండా నిర్మించబడడం మనకు తెలిసిందే! 

    నీటి క్రింద నేల కోసుకుపోతుంటే ఆధారం నిలువని ప్రదేశాలలో అనుసరించే పద్ధతి అది. 


    కానీ రాముడు లంకకి వందయోజనాలు పొడుగు వంతెనని ఆధారంతో సముద్రంపై నిర్మించడం, 

    ప్రస్తుత మానవ సమాజంలో ఊహకు కూడా అందనిది. 

    ఏనుగంత ప్రమాణంగల రాళ్ళనీ, పర్వతాలనీ, హఠాత్తుగా సముద్రంలో వేయడంతో అవి ఆధారంగా లోపలికెళ్ళాయి. 

    అనేకరకాల వృక్షాలని ఉపయోగించారని కూడా తెలుపబడింది. 

    మొదటిరోజు 14యోజనాలు, 

    రెండవరోజు ఇరవై, 

    మూడవరోజు ఇరవై ఒకటి, 

    నాల్గవరోజు ఇరవైరెండు, 

    ఐదవరోజు ఇరవైమూడు యోజనాలు కట్టి, వంద యోజనాల వారధిని ఐదురోజుల్లో నిర్మించారు.  

    ఆధారముకలిగీ, 

    పైన తేలే విధంగా వృక్షాలూ, 

    సరిహద్దులూ, 

    అలంకరణలతో కూడిన నిర్మాణం 

  - వానరులతో  

  - అతి తక్కువ కాలంలో నిర్మింపబడడం ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. 


ఇ) పుష్పక విమానం 


   విమానం కనుగొన్నది ఇరువదవ శతాబ్దంలో రైటు సోదరులు అని మనకి తెలుసు. 

    కానీ 1895లో శివరాం బాపూజీ తల్పాడే అనే పండితుడు, భరద్వాజ మహర్షి అందించిన మన శాస్త్రం ఆధారంగా, సౌరశక్తి - పాదరసంతో నడిచే విమానం బొంబాయి చౌపతీ సముద్ర తీరంలో, బరోడా మహారాజు సమక్షంలో 1500 అడుగుల ఎత్తున గగన తలంలో పయనించి, మెల్లగా క్రిందికి దిగింది - అనేది ఎంతమందికి తెలుసు? 

    

    శ్రీమద్వాల్మీకి రామాయణంలో పుష్పక విమానం అత్యంత ఆశ్చర్యకరమైనది. అది 

  - వాయుమార్గమైన అంతరిక్షాన నిలబడగలిగియుండేదీ, 

  - సూర్యుని గమన మార్గమును సూచిస్తూ ప్రకాశించేదీ, 

  - యజమాని మనసు కోరిన చోటికి శీఘ్రంగా ప్రయాణం చేసే సామర్థ్యం కలిగినదీ, 

  - వాయువేగం గలదీ అయినది ఆ పుష్పక విమానం మరిన్ని ప్రత్యేకతలు కలిగియున్నది. 


       ఇటువంటి విషయాలనుబట్టి సాంకేతిక విజ్ఞానాన్ని శ్రీమద్రామాయణం

ఎంత చక్కనైన ఆదర్శంగా తెలియజేస్తుందో అర్థమవుతుంది.


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కృష్ణాష్టమి

 🎻🌹🙏 రానున్నది కృష్ణాష్టమి సందర్బంగా...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿శ్రీకృష్ణాష్టమి రోజున ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు.


 🌸ద్వాపరి యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి,. 


🌿దేవకీ వసుదేవులకు అష్టమ(8వ) సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు,. కృష్ణావతారాన్ని శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు,..


🌸శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది., అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’ గా జరుపుకుంటారు., కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అన్ని కూడా పిలుస్తారు. 


🌿ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు., ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు.


🌸కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు,. ఇంటి ముఖ ద్వారాలకు పచ్చని మావిడాకు తోరణాలు, వివిధ పూవులతో తోరణాలు కడతారు,.


🌿 కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి,. చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు., కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు,. అక్షింతలు, ధూపదీపాలతో స్వామి వారిని పూజిస్తారు.,


🌸పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి., కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, 


🌿అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి., ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి,. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి., 


🌸శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు.,. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి., ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు..


🌿కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి., ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాందపురాణం చెబుతుంది., 


🌸ఆ రోజున బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని తయారుచేసి వెండి, బంగారు పాత్రలలో దానిని ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.


🌿అంతే కాకుండా ఆ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు,. సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది.,


🌸అదే విధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది., అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు,.


🌿 ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే,. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది,. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌹🙏అందరికి ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు...🙏🌹


 🌹🙏సర్వేజన సుఖినోభవంతు🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


                 

భవరోగాన్ని

 భవరోగాన్ని (జన్మలపరంపరను) ఎలా నయం చేయాలి?


స్వామి చిన్మయానంద
అనేకత్వ దృష్టినే భవరోగం అంటారు. ఇది 'అహం' అనే శక్తివంతమైన క్రిమి వలన వస్తుంది. ఇది మనసు, బుద్ధుల వలన వృద్ధి చెందుతుంది. నువ్వు ఈ క్రింది మిశ్రమాన్ని తీసుకుంటే, రోగనివారణ తధ్యం.

నిష్కాపట్యం - 11 గ్రాములు
ప్రేమ - 10 ఔన్సులు
క్రమబద్ధత - 10 గ్రా
ధ్యానం - 9 ఔ
నిజాయతీ - 8 గ్రా
ధైర్యం - 9 గ్రా
లక్ష్యం - 7 గ్రా
అందరికి సేవ చేయడం - 6 గ్రా
స్వఛ్ఛత - 3 గ్రా

ఉపయోగించే ముందు సీసాను (బుద్ధి) కదిలించాలి. అటు తర్వాత మనోనియంత్రణ అనే మూత పెట్టాలి.
1. దోపిడిని ఎన్నడూ రుచి చూడకు. అవసరమైతే పుష్కలంగా ఓంకార జపాన్ని సేవించు.
2. అధికంగా భౌతిక, ఇంద్రియ విషయాల్లో తిరగకు.
3. ధ్యానంలో విశ్రాంతి పొందు. 

S


 

Krishna


 

బ్రాహ్మణ భోజనం& క్యాటరింగ్

 ఆల్ ఓవర్ ఇండియా

శర్మ స్ బ్రాహ్మణ భోజనం& క్యాటరింగ్


మీ ఇంట జరిగే శుభకార్యాలకి అన్ని కార్యక్రమాలకి వేద పండితులకి,మడితో రుచిగా శుభ్రంగా (ఉల్లి పాయ వెల్లుల్లిపాయ లేకుండా)  మీరు కోరుకున్న విధంగా బ్రాహ్మణ క్యాటరింగ్ చేయబడును దూరప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు, భవానీలకు, వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును


విజయవాడ సాయిశర్మ 7396881404

విజయవాడ మధువని 9182554800

విజయవాడ పవన్ శర్మ 79896 44180

సికింద్రాబాద్ శ్రీ రామ క్యాటరింగ్090329 10106

సికింద్రాబాద్ రవి కిరణ్ శర్మ7842413139

సికింద్రాబాద్ కళ్యాణ్ శర్మ9885785556

వైజాగ్ సాయి శర్మ 7032324851

బెంగళూరు బాలసుబ్రమణ్యం శర్మగారు9986119510

తిరుపతి హేమంత్ శర్మ9959859227

నెల్లూరు భార్గవ శర్మ+91 93469 43145

కాకినాడ హరి శర్మ

08142729222

సామర్లకోట శర్మ గారు

9182285617

గుంటూరు సాయి శర్మ7989585295

కడప మురళీ శర్మ

9866261232

చెన్నై శ్రీనివాస్ శర్మ7395932954

కేరళ శర్మ9447136023

ముంబై శివరామన్ శర్మ+91 74484 08447

మధురై నారాయణ శర్మ9842191826

అరుణాచలం లక్ష్మీకాంత శర్మ8870218670

శ్రీరంగం జై శర్మ+91 94871 80737

న్యూఢిల్లీ ఫణి కుమార్ శర్మ9650873730

నాగపూర్ 9505651387

వారణాసి శర్మగారు6387716431


ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ ఇంటి భోజనం అందించబడును నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి

కనిపెంచెడి తలిదండ్రులు


*కం*

కనిపెంచెడి తలిదండ్రులు

కనిపించెడి గురువులయ్యు కనుగొన వలయున్.

కనబడని దైవమెప్పుడు

పెనుగురువై నడుపుచుండు విడువక సుజనా.

*భావం*:-- ఓ సుజనా! కని,పెంచెడి తల్లిదండ్రులు మనకు కనిపించే గురువులని గుర్తించవలెను. కనిపించని దైవము ఎల్లప్పుడూ పెద్ద గురువై మనలను విడిచిపెట్టకుండా నడిపించును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*కం*

అక్షరమే యాధారము

నక్షరమే ఆయుధమగు ననిరుధ్ధముగన్

అక్షరసేద్యంబొనరెడు

సాక్షాద్దైవంబుగురువు సతతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అక్షరమే మనకు ఆధారం,అక్షరమే నిరంతర ఆయుధం కాగలదు. అటువంటి అక్షరాల వ్యవసాయం చేసే మనకు కనిపించే దైవమే ఎల్లప్పుడూ గురువు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


 👆

.      *మన నాణెం పై తెలుగు భాష.*

*(బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.)*


*కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్,*

*ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, Dr భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు.* 


*అప్పుడు, పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణసమస్య” ను సభ దృష్టికి తెచ్చారు.*


*"పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు.*

*అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు, ఎగతాళిగా!*


*వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ,  హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ & తెలుగులోనూ ‘ఒక అణా‘ అని  రాసి ఉంది. అది కూడా, బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)*

*"నాణెంపై _తెలుగుభాషలో 'ఒక-అణా'_ అని  ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?"*

*అంటూ చురక వేశారు.*


 *గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కానివారు కూడా ఆశ్చర్య పోయారు.*


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

జయంతి అన్న పదం

 జయంతి అన్న పదం యొక్క పుట్టుపూర్వోత్తరాలను కొన్ని పురాణాల ప్రమాణాలతో పరిశీలిద్దాం. 


విష్ణుధర్మంలోని ప్రమాణం  -


*రోహిణీ చ యదా కృష్ణ పక్షే2ష్టమ్యాం ద్విజోత్తమ జయంతీ నామ సా ప్రోక్తా సర్వపాపహరా తిథి:*


సనత్కుమార సంహితలోని ప్రమాణం-


*శ్రావణస్య చ మాసస్య కృష్ణాష్టమ్యాం నరాధిప రోహిణీ యది లభ్యేత జయంతీనామ సా తిథి:*


వసిష్టసంహితలోని ప్రమాణం


*శ్రావణే వా నభస్యే వా రోహిణీసహితాష్టమీ యదా కృష్ణా నరైర్లబ్దా సా జయంతీతి కీర్తితా*


వీటి ఆధారంగా జయంతీ శబ్దానికి రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమి అనే అర్థమే తేలుతుంది.


కానీ జన్మదినం అనే అర్థం రాదు.


కాని కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం కావడం వల్ల

రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమిని తెలియజేసే జయంతీ శబ్దం మహాత్ముల జన్మదినంగా వాడుకలో ఉంది.

మంగళవారం, సెప్టెంబర్ 05, 2023* రాశి ఫలాలు

 . *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*మంగళవారం, సెప్టెంబర్ 05, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి* : *షష్ఠి రా8.46* వరకు


. *🌹రాశి ఫలాలు🌹* 

 

మేషం


ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

మిధునం


ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

కర్కాటకం


విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

---------------------------------------

సింహం


ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

---------------------------------------

తుల


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. 

---------------------------------------

ధనస్సు


ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

---------------------------------------

మకరం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

కుంభం


ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. 

---------------------------------------

మీనం


బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

 



శ్రీ కాళహస్తీశ్వర శతకం - 83




లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ

బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలోలేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్

సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!




తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! 

మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా?దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా?నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా?


పండుకొనుటకు ఆకుల పడకలు లేవా? జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. 


నీ అనుగ్రహమున ఇన్ని లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు.



ఓం నమః శివాయ


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

మలేరియా జ్వరం

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -


      మలేరియా జ్వరం వర్షాకాలం  నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 


  నివారణోపాయాలు  - 


 *  7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న  మలేరియా జ్వరం 3  రోజులలో హరించును . 


 *  మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 


 *  తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 


 *  మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 


 *  తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 


 *  మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.


  గమనిక  - 


      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.


  నా అనుభవం - 


         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే  ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 


   

         మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                

Pravachan


 

Bsachalaaku pachadi


 

Aritaaku halva


 

మంగళవారం, సెప్టెంబర్ 05, 2023 రాశి ఫలాలు

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*మంగళవారం, సెప్టెంబర్ 05, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *షష్ఠి రా8.46* వరకు


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

మేషం


ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప  ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

మిధునం


ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

కర్కాటకం


విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం  కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

---------------------------------------

సింహం


ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో  శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

---------------------------------------

తుల


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల  వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. 

---------------------------------------

ధనస్సు


ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

---------------------------------------

మకరం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక    ఆరోగ్యసమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

కుంభం


ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. 

---------------------------------------

మీనం


బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా  ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కలి యుగం

 *కలి యుగం ఎందుకు 4,32,000 సంవత్సరాలు? ఎందుకు కేవలం అంతే?*


జీవాత్మ మూడు గుణాల్లో తిరుగుతుంటుంది. ప్రతీ గుణంలో ఆరు మంచి గుణాలు,ఆరు చెడు గుణాలు ఉంటాయి.


అంటే  తమో గుణంలో 12 గుణాలుంటాయి.

రజో లో 12 ఉంటాయి.

సత్వంలో  12 ఉంటాయి.


మొత్తం గుణాలు 36.

ఈ 36 నవగ్రహల ప్రభావం చేత ప్రతీ గంటకు ఈ గుణాలు మారుతూ తిరుగుతూ ఉంటాయి.అంటే జీవాత్మే ఆ గుణాలలో తిరుగుతుంది.


పగటి కాలం 12 గంటలు.

ఒక గంటకు ఈ 36 గుణాలు ఎన్ని సార్లు తిరుగుతాయంటే....


36×12=432 సార్లు,గంటకు.


పరమాత్మునికి పగలు వేయి యుగములు. కావున 


గంట గుణాలు432×1000= 4,32,000.సంవత్సరాలు.


దీనికి రెండింతలు ద్వాపర

8,64,000.


దానికి మూడింతలు త్రేత 

12,96,000.


మొదటి దానికి నాలుగింతలు

కృత.

4,32,000×4= 17,38,000 సంవత్సరాలు.


త్రిగుణాలు తిరిగేదాన్ని బట్టి పగటి కాలాన్ని బట్టి యుగ నిర్ణయం చేసాడు దేవుడు.

 

మొత్తం నాల్గు యుగాలు కలిపి

43,20,000సంవత్సరాలు అవుతుంది. 


ఈ నాల్గు యుగాలు 250 సార్లు  జరుగుతాయి.

అంటే 

43,20,000 సంవత్సరాలు×250మార్లు =108,00,00,000. అంటే 

108 కోట్ల సంవత్సరాలు.


108 కోట్ల సంవత్సరాలు గుణాలు ఆడుకుంటాయి.రాత్రిళ్ళు ఈ గుణాలు నిద్రిస్తాయి.


108 కోట్ల సంవత్సరాల తరువాత మాత్రమే భౌతిక ప్రళయం ఉంటుంది.

త్రైత జ్ఞానం నుండి.


శ్రీ కృష్ణ శ్రీ ప్రభోదానంద యోగేేశ్వరాయనమః 🙏🙏🙏

రామాయణమ్ 315

 రామాయణమ్ 315

...

రావణా జనస్థానంలో జరిగిన రాక్షస సంహారం గుర్తు తెచ్చుకో ! .వాలి వధను కూడ స్మరించుకో .బుద్ధిగా సన్మార్గంలో ప్రయాణించు.రామచంద్రుని ధనుష్ఠంకారము వినాలని అనుకోవద్దు.

.

నీ లంక ను వాజి రధ కుంజరాలతో సహా నాశనం చేయడానికి నేనొక్కడనే సరిపోదును....కానీ అది రాముని ప్రతిజ్ఞ!

.

సర్వ ఋక్ష వానర సమక్షములో రాముడు ప్రతిజ్ఞ చేసినాడు కావున నిన్ను నేను వదిలిపెడుతున్నాను.

.

సీత ,సీత అని కలవరిస్తున్నావే ఆమె నీ లంకకు కాళరాత్రి ,

నీ పాలిటి కాలపాశం

 అని తెలుసుకో!.

.

సీతదేవి తేజస్సు చాలును నీ లంక భస్మమయిపోవడానికి .

రాముని క్రోధం సృష్టించే విలయం నీ ఊహకు అందనిది!.

.

అందాల నెలవంక లాంటి నీ లంక సమస్తం దహించివేయబడుతుంది.

భస్మరాసులు మాత్రమే మిగులుతాయి.

.

మిత్రులు మంత్రులు

హితులు,సుతులు

జ్ఞాతులు,భ్రాతలు

సుతులు,హితులు

భార్యలు,భోగాలు ...అంతా నాశనం సర్వలంకా వినాశనం జరుగుతుంది జాగ్రత్త !

.

ఇకనైనా తెలివితెచ్చుకొని నీ లంకను కాపాడుకో !

.

హనుమంతుడి ఈ ఉపదేశానికి రావణుడికి తీవ్రమైన క్రోధం పెల్లుబికింది.కన్నులు క్రోధారుణిమతాల్చాయి!

.

వూటుకూరు జానకిరామారావు

తపన..ఆర్తి..*

 *తపన..ఆర్తి..*


"ఎల్లుండి శనివారం నాటికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నామండీ..కానీ ఇంతలోనే అవాంతరం ఎదురైంది..మా వారికి ఆఫీస్ లో ఏదో ఎంక్వయిరీ ఉన్నదట..అందువల్ల రాలేకపోతున్నాము..మళ్లీ వీలుచూసుకొని తప్పకుండా వస్తాము.." అని బెంగుళూరుకు చెందిన మహేశ్వరి గారు ఫోన్ చేసి చెప్పారు.."అయితే..మీకొఱకు బుక్ చేసి ఉంచిన రూమ్ ను వేరే వాళ్లకు కేటాయించమంటారా.."? అని అడిగాను.."వేరే వాళ్లకు ఇచ్చేయండి..ఈసారి మేము వచ్చేముందుగా మీకు తెలుపుతాము..ఈసారికి మాకు అదృష్టం లేదనుకుంటాము.." అన్నారు మహేశ్వరి గారు..మహేశ్వరి గారి కొఱకు తీసివుంచిన రూమ్ ను వేరే వాళ్లకు ఇచ్చేసాము..


శనివారం ఉదయం పది గంటల సమయం లో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు కారు వచ్చి ఆగింది..అందులోనుండి మధ్యవయస్కులైన దంపతులు దిగారు..వారితోపాటు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా దిగారు..మందిరం లోపలికి వచ్చి..సిబ్బంది ఉన్న టేబుల్ వద్ద నిలబడి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?." అని అడిగారు..మా సిబ్బంది నా వైపు చూపించారు..ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ మొన్న మీకు కాల్ చేసి, మేము రావటం లేదు..మా కోసం ఉంచిన రూమ్ ను వేరేవాళ్లకు ఇవ్వండి..అని చెప్పిన మహేశ్వరిని నేనే..వీరు మావారు రాజరత్నం..వాడు మా అబ్బాయి కార్తీక్..అమ్మాయి సుధారాణి..మావారికి ఆఫీస్ లో పని ఉన్నది అని చెప్పాము కదండీ..కానీ ఆ ఆఫీసర్లు రావడం లేదని నిన్న మధ్యాహ్నం తెలిపారట..మొగలిచెర్ల వెళ్లి ఆ అవధూత మందిరాన్ని చూసి వద్దాము..అని మావారు చెప్పారు..అందుకని వెంటనే బైలుదేరాము..మీకు వీలుంటే మాకోసం ఒక రూమ్ ఇవ్వగలరా?.." అన్నారు.."అమ్మా..ఏవీ ఖాళీ లేవు..కాకుంటే..కామన్ రూమ్ ఒకటి ఉన్నది..సుమారు ఇరవై మంది వరకూ అందులో ఉండొచ్చు..మీరు కాకుండా..మరెవరైనా వస్తే..అందులో మీతో పాటు వుంటారు..ప్రస్తుతానికి అదొక్కటే మార్గం..అందులో వుండండి.." అని చెప్పాను.."సరేలేండి..సర్దుకుంటాము.."అన్నారు..


రూమ్ కు వెళ్లి స్నానాదికాలు ముగించుకొని వచ్చారు..సాయంత్రం జరిగే పల్లకీసేవ గురించి వివరాలు అడిగి..అందులో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు..మధ్యాహ్నం అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చి.."ప్రసాద్ గారూ..మీతో మాట్లాడాలి..మాకు సమయం ఇస్తారా.."? అని అడిగారు.."ఇప్పుడు ఖాళీగానే వున్నాను..చెప్పండి.." అన్నాను.."నేను చెపుతాను.." అని రాజారత్నం గారు అన్నారు.."చెప్పండి.." అన్నాను.."మా ఆఫీస్ లో నాకూ..నా పైన ఉన్న అధికారులకూ మధ్య విబేధాలు ఉన్నాయండీ..నేను ఎంత పని చేసినా..ఏదో ఒక లోపం చూపి నన్ను వేధిస్తున్నారు..నేను లంచం తీసుకోను..నా పని వరకూ నిజాయితీగా చేస్తుంటాను..అది వారికి నచ్చటం లేదు..అందువల్ల నన్ను టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారు..నాకు మానసికంగా వత్తిడి గా ఉంది..వేరే డిపార్ట్మెంట్ కు వెళదామని ప్రయత్నం చేసాను..నిన్న కూడా నన్ను వేరే చోటుకి బదిలీ చేయమని అప్లికేషను ఇచ్చాను..తీసుకున్నారు..తరువాత చూస్తాం అన్నారు..ఈ పరిస్థితులు మార్చమని అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈ మధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..ఇక్కడికి రావాలని నిశ్చయం చేసుకున్నాను..ఇంతవరకూ నా సమస్య చెప్పాను..ఇక రెండోది వినండి..వీడు మా అబ్బాయి..ఇంజినీరింగ్ పూర్తి చేసాడు..క్యాంపస్ లోనే సెలెక్ట్ అయ్యాడు..ఈరోజుకు సరిగ్గా రెండు నెలల తరువాత ఉద్యోగం లో చేరాలి..కానీ ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..డాక్టర్లకు చూపించాము..మామూలు వైరల్ ఫీవర్ అని చెప్పారు..కానీ..తగ్గడం లేదు..వీడి గురించి కూడా స్వామివారికి విన్నవించుకోవాలని అనుకున్నాము.." అన్నాడు..


"రేపు ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మీ సమస్య అక్కడ చెప్పుకోండి..మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.." అని చెప్పాను..సాయంత్రం పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నది..అందరూ స్వామివారి మంటపం లో నేల మీదే పడుకున్నారు..తెల్లవారుజామున రాజారత్నం, మహేశ్వరి గార్లు స్నానం చేసి వచ్చి మందిరం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేశారు..వాళ్ళ అబ్బాయి కార్తీక్ మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసాడు..తన సోదరుడి తోపాటు అమ్మాయి కూడా అన్ని ప్రదక్షిణాలు చేశారు..ఆ కుటుంబం మొత్తం అత్యంత భక్తి తో మసలుకున్నారు..స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..రాజారత్నం గారి కుటుంబం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"ప్రసాద్ గారూ..వచ్చేవారం కూడా మేము ఇక్కడకు వస్తామండీ..అలా మొత్తం మూడు వారాలు వస్తాము..ఈ క్షేత్రం లో ఎక్కడలేని ప్రశాంతత ఉన్నది..ఇక మేము బైలుదేరుతామండీ..వచ్చేవారం ఆపై వారం కూడా మాకు రూము వద్దు..మంటపం లోనే పడుకుంటాము..స్వామి సన్నిధి లోనే పడుకుంటే..స్వామికి దగ్గరగా ఉన్నట్టు ఉంది.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత గురువారం మధ్యాహ్నం రెండు గంటల వేళ.."ప్రసాద్ గారూ..నేను రాజారత్నం మాట్లాడుతున్నాను..స్వామివారి దయతో నాకు బదిలీ అయింది..నేను కోరుకున్న డిపార్ట్మెంట్ కే నన్ను మార్చారు..మరో మాట..అక్కడినుంచి వచ్చిన తరువాత మా అబ్బాయి అనారోగ్యం కూడా లేదు..ఉషారుగా వున్నాడు..ఎల్లుండి శనివారం మేము వస్తున్నాము..ఇంకా ఇంటికి కూడా ఫోన్ చేయలేదు..మీరు స్వామివారి దగ్గరే వుంటారు కనుక..మొట్టమొదట మీకే చెపుతున్నాను.." అన్నారు..


అనుకున్న విధంగానే రాజారత్నం గారి కుటుంబం మూడు వారాలూ వచ్చారు..మొదటి వారం లోనే వారి సమస్యలు తీరిపోయినా..ముందుగా మొక్కుకున్న విధంగా మూడు శనివారాలూ వచ్చి పల్లకీసేవ లో పాల్గొని..మంటపం లో నేల మీదే పడుకొని..ప్రక్క ఆదివారం ఉదయం ప్రదక్షిణాలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లారు..


స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అనే తపన..ఆర్తి..ఉన్నవాళ్లను స్వామివారు తప్పకుండా కాపాడుకుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వార్ధక్యంలో


*కం*

రక్కసుడై చెలరేగుచు

గ్రక్కున ప్రాణాలుతీయు కర్కశుడైనన్.

చిక్కని(చిక్కగ) వార్ధక్యంబున

ఠక్కున చిరుచీమకరువ ఠారును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! రాక్షసుడు గా చెలరేగుచూ వెంటనే ప్రాణాలు తీయగల కఠినాత్ముడైననూ వృద్ధాప్యం తో కృశించినపుడు చిన్న చీమ కరువగానే మరణభీతుడగును.

*సందేశం*:-- చేతనత్వమున్న యవ్వనంలో ఎంతటి చేటుపనులు చేసిన నూ వార్ధక్యంలో అనుక్షణం భయంతో నే బతకాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

తప్పని గుర్తించినపుడు

తప్పకనాతప్పు నెల్ల తక్కించదగున్.

తప్పని యెరిగియు పరిపరి(మరి యా)

తప్పొనరించంగ శిక్ష తప్పదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పు అని గుర్తించిన తరువాత తప్పకుండా ఆ తప్పును తిరిగి చేయరాదు. తప్పని తెలిసిన తరువాత కూడా అదే తప్పు చేస్తే శిక్ష తప్పదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రాధపిలుపు

 వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!

సంబంధం కోసం

 


పెండ్లిడుకు వచ్చిన యువకుడు పెళ్లి చేసుకోవడం కోసం సొంత కులంలో పెళ్లి సంబంధం కోసం వెతుకుతుంటే అబ్బాయి ఏమీ చదువుకున్నాడు?  ఎంత సంపాదిస్తాడు? ఏ ఊరిలో ఉద్యోగం చేస్తాడు? సొంత ఇల్లు ఉందా? ఎన్నేకరాల భూమీ ఉంది? ఎంత ఆస్తి ఉంది? ఎంతమంది సంతానం? ఆడపడుచులు ఎంతమంది? పెళ్లయ్యాక అత్తమామలతో కలిసే ఉండాలా? ఇట్లా సవాలక్ష ప్రశ్నలతో తక్కెడలో తూకం వేసి.., బంధువులతో, స్నేహితులతో, అబ్బాయి వాళ్ళ ఊరిలో తెలిసిన వాళ్ళతో అబ్బాయి గురించి, అబ్బాయి కుటుంబం గురించి సీబీఐ, ఈడి మాదిరి ఎంక్వయిరీ చేసి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు కదా? 


మరీ సొంత కులం కాదు కదా కనీసం సొంత మతం కూడా కానీ వాడు, ఉద్యోగం, డబ్బులు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటాం అంటే ఇంట్లో డబ్బులు, నగలు దొంగతనం చేసి, అడ్డొచ్చిన సోదరిని చంపి పెళ్లి చేసుకుందాం అనే స్థాయికి ఎలా వచ్చారు..? 


ఒరే.    తల్లి  తండ్రులు అనే గాడిదలు సంపాదన మీద మాత్రమే కాదురా సంతానం బయట ఏమీ వెలగబెడుతున్నారు కాస్త చూడండి. లేదంటే కుటుంబం రోడ్డున పడుతుంది. సంవత్సరాల మీ  సంపాదన బూడిద పాలవుతుంది.


Ps: ఎవరి మనోభావాలైన దెబ్బతింటే మడిచి జేబులో పెట్టుకోండి.

పంచాంగం 05.09.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 05.09.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: షష్థి తిధి భౌమ వాసర: భరణి  నక్షత్రం వ్యాఘాత యోగ: వణిజ  తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం. 


షష్థి మధ్యాహ్నం 03:52 వరకు.

భరణి పగలు 09:02 వరకు.

సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:23

వర్జ్యం : రాత్రి 09:12 నుండి 10:49 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:23 వరకు తిరిగి రాత్రి  11:04 నుండి 11:51 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ప్రయత్నాన్ని విరమించడమే అపజయమని

 శ్లోకం:☝️

  *నేతా యస్య బృహస్పతిః*

*ప్రహరణం వజ్రం సురాః సైనికాః*

 *స్వర్గో దుర్గమనుగ్రహః ఖలు*

  *హరేరైరావణో వారణః |*

*ఇత్యాశ్చర్యబలాన్వితోఽపి*

  *బలభిద్భగ్నః పరైః సఙ్గరే*

*తద్వ్యక్తం నను దైవమేవ శరణం*

  *ధిక్ ధిక్ వృథా పౌరుషమ్ ||*


భావం: బృహస్పతి వంటి దేవగురువు, ఎదురులేనట్టి వజ్రాయుధం, సేనావాహినిలో ఉన్నవారంతా దేవతలు, కోట చూడబోతే స్వర్గం, ఐరావతం అనే ఏనుగు, అన్నిటిని మించి శ్రీహరి అనుగ్రహం. ఇన్ని ఉండి కూడా ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు. అదీ శత్రువులైన దానవులచేతిలో! ఎందువల్ల? ప్రయత్నలోపంవల్ల!

ప్రయత్నాన్ని విరమించడమే అపజయమని భావం.

గుణవంతుడికి

 🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄

 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*కుపితోఽపి గుణాయైవ*

*గుణవాన్భవతి ధ్రువమ్।*

*స్వభావమధురం క్షీరం*

*క్వథితం హి రసోత్తరమ్॥*


𝕝𝕝తా𝕝𝕝 గుణవంతుడికి కోపము వచ్చిననూ.... అది మేలు కలిగించేదే! స్వభావసిద్ధంగా తియ్యగా ఉండే పాలు మరిగిననూ.....మరింత తియ్యదనాన్నే పొందుతాయికదా!!