*కం*
రక్కసుడై చెలరేగుచు
గ్రక్కున ప్రాణాలుతీయు కర్కశుడైనన్.
చిక్కని(చిక్కగ) వార్ధక్యంబున
ఠక్కున చిరుచీమకరువ ఠారును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! రాక్షసుడు గా చెలరేగుచూ వెంటనే ప్రాణాలు తీయగల కఠినాత్ముడైననూ వృద్ధాప్యం తో కృశించినపుడు చిన్న చీమ కరువగానే మరణభీతుడగును.
*సందేశం*:-- చేతనత్వమున్న యవ్వనంలో ఎంతటి చేటుపనులు చేసిన నూ వార్ధక్యంలో అనుక్షణం భయంతో నే బతకాలి.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
తప్పని గుర్తించినపుడు
తప్పకనాతప్పు నెల్ల తక్కించదగున్.
తప్పని యెరిగియు పరిపరి(మరి యా)
తప్పొనరించంగ శిక్ష తప్పదు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తప్పు అని గుర్తించిన తరువాత తప్పకుండా ఆ తప్పును తిరిగి చేయరాదు. తప్పని తెలిసిన తరువాత కూడా అదే తప్పు చేస్తే శిక్ష తప్పదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి