5, సెప్టెంబర్ 2023, మంగళవారం

రామాయణమ్ 315

 రామాయణమ్ 315

...

రావణా జనస్థానంలో జరిగిన రాక్షస సంహారం గుర్తు తెచ్చుకో ! .వాలి వధను కూడ స్మరించుకో .బుద్ధిగా సన్మార్గంలో ప్రయాణించు.రామచంద్రుని ధనుష్ఠంకారము వినాలని అనుకోవద్దు.

.

నీ లంక ను వాజి రధ కుంజరాలతో సహా నాశనం చేయడానికి నేనొక్కడనే సరిపోదును....కానీ అది రాముని ప్రతిజ్ఞ!

.

సర్వ ఋక్ష వానర సమక్షములో రాముడు ప్రతిజ్ఞ చేసినాడు కావున నిన్ను నేను వదిలిపెడుతున్నాను.

.

సీత ,సీత అని కలవరిస్తున్నావే ఆమె నీ లంకకు కాళరాత్రి ,

నీ పాలిటి కాలపాశం

 అని తెలుసుకో!.

.

సీతదేవి తేజస్సు చాలును నీ లంక భస్మమయిపోవడానికి .

రాముని క్రోధం సృష్టించే విలయం నీ ఊహకు అందనిది!.

.

అందాల నెలవంక లాంటి నీ లంక సమస్తం దహించివేయబడుతుంది.

భస్మరాసులు మాత్రమే మిగులుతాయి.

.

మిత్రులు మంత్రులు

హితులు,సుతులు

జ్ఞాతులు,భ్రాతలు

సుతులు,హితులు

భార్యలు,భోగాలు ...అంతా నాశనం సర్వలంకా వినాశనం జరుగుతుంది జాగ్రత్త !

.

ఇకనైనా తెలివితెచ్చుకొని నీ లంకను కాపాడుకో !

.

హనుమంతుడి ఈ ఉపదేశానికి రావణుడికి తీవ్రమైన క్రోధం పెల్లుబికింది.కన్నులు క్రోధారుణిమతాల్చాయి!

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: