జయంతి అన్న పదం యొక్క పుట్టుపూర్వోత్తరాలను కొన్ని పురాణాల ప్రమాణాలతో పరిశీలిద్దాం.
విష్ణుధర్మంలోని ప్రమాణం -
*రోహిణీ చ యదా కృష్ణ పక్షే2ష్టమ్యాం ద్విజోత్తమ జయంతీ నామ సా ప్రోక్తా సర్వపాపహరా తిథి:*
సనత్కుమార సంహితలోని ప్రమాణం-
*శ్రావణస్య చ మాసస్య కృష్ణాష్టమ్యాం నరాధిప రోహిణీ యది లభ్యేత జయంతీనామ సా తిథి:*
వసిష్టసంహితలోని ప్రమాణం
*శ్రావణే వా నభస్యే వా రోహిణీసహితాష్టమీ యదా కృష్ణా నరైర్లబ్దా సా జయంతీతి కీర్తితా*
వీటి ఆధారంగా జయంతీ శబ్దానికి రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమి అనే అర్థమే తేలుతుంది.
కానీ జన్మదినం అనే అర్థం రాదు.
కాని కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం కావడం వల్ల
రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమిని తెలియజేసే జయంతీ శబ్దం మహాత్ముల జన్మదినంగా వాడుకలో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి