*కం*
కనిపెంచెడి తలిదండ్రులు
కనిపించెడి గురువులయ్యు కనుగొన వలయున్.
కనబడని దైవమెప్పుడు
పెనుగురువై నడుపుచుండు విడువక సుజనా.
*భావం*:-- ఓ సుజనా! కని,పెంచెడి తల్లిదండ్రులు మనకు కనిపించే గురువులని గుర్తించవలెను. కనిపించని దైవము ఎల్లప్పుడూ పెద్ద గురువై మనలను విడిచిపెట్టకుండా నడిపించును.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
అక్షరమే యాధారము
నక్షరమే ఆయుధమగు ననిరుధ్ధముగన్
అక్షరసేద్యంబొనరెడు
సాక్షాద్దైవంబుగురువు సతతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అక్షరమే మనకు ఆధారం,అక్షరమే నిరంతర ఆయుధం కాగలదు. అటువంటి అక్షరాల వ్యవసాయం చేసే మనకు కనిపించే దైవమే ఎల్లప్పుడూ గురువు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి