శ్రీ కాళహస్తీశ్వర శతకం - 83
లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ
బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలోలేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్
సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా!
మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా?దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా?నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా?
పండుకొనుటకు ఆకుల పడకలు లేవా? జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు.
నీ అనుగ్రహమున ఇన్ని లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు.
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి