5, సెప్టెంబర్ 2023, మంగళవారం

బసవ పురాణం - 23 వ భాగము....!!

 🎻🌹🙏బసవ పురాణం - 23 వ భాగము....!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸నేనిక బతకను’ అని ఒక బావిలో దూకి ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో! నీ భక్తికి మెచ్చాను అన్నాడు. వరమేమిటీ? ముందు నీవు విషం ఉమ్మేయి అన్నాడురుద్రపశుపతి. 


🌿పశుపతీ! విషం నేను మింగలేదు. అది నా గొంతులోనే వుంది చూడు’ అని తన నల్లని కంఠాన్ని చూపాడు. నాకదంతా తెలియదు. ఎప్పటికైనా అది గొంతు నుండి జారవచ్చు. 


🌸ఉమ్మేస్తావా? చావమంటావా? అన్నాడు పశుపతి. శివునికి ఏమి చేయాలో తోచలేదు. దేవతలంతా శివుడు విషాన్ని ఉమ్మేస్తాడేమోనని భయపడిపోయారు.


🌿రుద్రపశుపతీ! ప్రమథుల సాక్షిగా చెపుతున్నాను. నేనీ విషం మింగనయ్యా! కావాలంటే నా గొంతు చూస్తూ నా దగ్గరే కూర్చో అన్నాడు శివుడు రుద్రపశుపతిని లేవనెత్తి కౌగిలించుకొని! 


🌸శివుని తొడపై రుద్ర పశుపతి కూర్చొని శివుని గొంతునే చూస్తూ వున్నాడు. చేతిలో ఒక కత్తి పట్టుకొని దానిని తన రొమ్మునకు గురి పెట్టుకొని ఏ క్షణాన విషం శివుని గొంతు దిగితే ఆ క్షణాన ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధమై నేటికీ రుద్రపశుపతి అలాగే కూర్చొని ఉన్నాడు.


🌷నక్కనయనారు కథ


🌿(బసవన్న చెన్న బసవనికి చెప్పిన కథ)చోళ మండలములో నీల నక్కనయనారు అనే ముగ్ధ్భక్తుడు ఉండేవాడు. ఆయనా, ఆయన భార్య శివలింగ పూజ చేస్తూ వుండగా ఒక సాలెపురుగు లింగంమీద పాకింది.


🌸అది చూచి ఆమె ‘అయ్యో సాలెపురుగు పాకితే ఒళ్లు పేలిపోతుంది శివునికి ఎట్లా?’ అని సాలె పురుగు పాకినంత మేరా ఉమ్మి రాసింది.


🌿అది చూచి నీల నక్కనయనారు కోపించి ‘పాపీ! శివుణ్ణి ఎంగిలి చేస్తావా? నీవిక నాకు అక్కరలేదు పొమ్మ’ని భార్యను వదలిపెట్టాడు. ఆ రాత్రి మళ్లీ లింగపూజ చేస్తున్న సమయంలో నక్కనయనారు లింగాన్ని చూచేసరికి 


🌸అతని భార్య ఉమ్మి పూసినంత మేర మాత్రం బాగుండి మిగిలిన భాగమంతా పొక్కి వుంది.అది చూచి నక్కనయనారు పరుగు పరుగున పోయి భార్య పాదాలపై బడి క్షమాపణ కోరి పిలుచుకొని వచ్చి లింగాన్ని చూపాడు. 


🌿ఆమె లింగాన్ని చూచి ‘అయ్యో! శివా! ఎంత పని అయింది! మా ఆయన తిడితే తిట్టాడని సాహసించి లింగమంతా ఉమ్మి పూసినట్లయితే ఇలా పొక్కులు వచ్చి ఉండేవికావు కదా! 


🌸నేనిప్పుడింక ఏమి చేయను? ఈ కష్టాన్ని ఎలా చూడను?’ అని ఆమె తన తలను నరుక్కోవడానికి సిద్ధపడింది.

వారి ముగ్ధ భక్తికి సంతోషించి శివపార్వతులు ప్రత్యక్షమైనారు.


🌿వరాలు కోరుకోండి. మీకు ఏం కావాలో’ అని అడిగారు భవరోగ వైద్యుడయిన శివుడు, పార్వతీ! మీ దర్శన భాగ్యం లభించింది. ఇంక మాకు వేరే వరాలు ఎందుకు? అని వారన్నారు. 

శివుడు వారికి మోక్ష సౌభాగ్యాన్ని ప్రసాదించాడు.


🌷బెజ్జ మహాదేవి కథ


🌸(బసవన్న చెన్న బసవనికి చెప్పిన కథ)పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకున్నది. శివునికి అందరూ వున్నారు. కాని తల్లి మాత్రం లేదు. 


🌿చచ్చిపోయిందో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. 


🌸తల్లి వుంటే విషం తాగనివ్వదు. తల్లి వుంటే శివుణ్ణి తోళ్లు కట్టుకొని తిరుగనిస్తుందా?తల్లి వుంటే పాముల ధరింపనివ్వదు.బూడిదపూసుకోనివదు తల్లి వుంటే శివునికి బెచ్చబెత్తుకునే ఖర్ముమెందుకు పడుతుంది? 


🌿వల్లకాటిలో ఎందుకుతిరుగనిస్తుంది? తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనాడు. తల్లి వుంటే ఇంకెంత వాడగునో? పెళ్లిళ్లకు పేరంటాలకు అన్నిటికీ తల్లి వుండాలి. తల్లి లేని శివునికిక నేనే తల్లినై వుంటాను 


🌸అని భావించి బెజ్జ మహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుకబెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ్భక్తికి శివుడు మెచ్చి అన్ని 


🌿ఉపచారాలూ స్వీకరించసాగాడు.

ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది.అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది అని ఏడ్చింది. 


🌸అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం శివునిపై చూపి బాధపడ్డది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ఇక మాటలతో పనిలేదా బిడ్డా! 


🌿నీ బాధ చూస్తూ నేను జీవించలేను అని తల నరుక్కోడానికి సిద్ధపడ్డది. శివుడప్పుడు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. 


🌸నీవు నా కొడుకువు. నీ ముఖం శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అన్నది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వమును ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది...సశేషం....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: