అది ఒక మారుమూల పల్లె ఆ ఊరికి బస్సుకూడా రాదు. అక్కడికి దగ్గర్లో వున్న వూళ్ళో బస్సు దిగి ఒక అర గంట నడిస్తేకాని ఆ పల్లెకు చేరుకోలేము. చుట్టూరా అడవి. వూరు ప్రక్కనే ఎప్పుడు పారె ఒక ఏరు. ఊళ్లోని వారంతా ఆ యెట్లోకి వెళ్లే ప్రొద్దున్నే కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి వస్తారు. రామదాసు ఒక నడి వయస్సు వాడు. ఒక చిన్న గుడిసెలో వుంటూ కూలి,నాలి చేసుకొని పొట్ట పోసుకుంటున్నాడు. అతనికి పెద్దగా ఏమి ఆశలు లేవు. కానీ ఎప్పుడైనా రైలు ఎక్కాలని మాత్రము అతని కోరిక. కానీ తానువున్న పరిస్థితిలో తన జీవితంలో రైలు ఎక్కలేనని తెలుసుకున్నాడు. జీవితం మాములుగ నడుస్తున్నది రోజులు గడుస్తున్నాయి. ఒకరోజుఎక్కడి నుండి వచ్చాడో కానీ ఒక సాధువు ఆ ఊరికి వచ్చి మర్రిచెట్టు క్రింద వున్నాడని అతను అందరికి వారికి జరిగినవి జరగబోయేవి చెపుతున్నాడని ఊరంతా కోడై కూస్తే రామదాసు కూడా ఆ సాధువుని చూడటానికి వెళ్ళాడు. రామదాసుని చూడగానే ఆ సాధువు అతని జీవితంలో జరిగినసంఘటనలు చెప్పి నీకు రైలు ప్రయాణం చేయాలని వుంది అవునా అన్నాడు. దానికి రామదాసు ఆశ్చయపోయి అవును స్వామి నాకు నిజంగా రైలు ఎక్కాలని వుంది నేను నా జీవితంలో రైలు ఎక్కగలనా అని అతృతతో అడిగాడు. దానికి ఆ సాధువు అతని కుడి చేయిని పరిశీలనగా చూసి నొసలు చిట్లిచ్చాడు. రామదాసు ఆశ కాస్త అడియాస ఐయ్యింది. వెంటనే ఆ సాధువు నీవు రైలుఎక్కుతావు అంతే కాదు విమానం కూడా ఎక్కుతావు అని చెప్పాడు. వెంటనే రామదాసు పెద్దగా నవ్వాడు. ఏమిటి స్వామి రైలు ఎక్కటానికి పైసలు లేని నేను విమానం యెట్లా ఎక్కుతాను అన్నాడు. నాయన నేను నీ జాతకంలో వున్నది చెప్పాను. నీవు నమ్మితే నమ్ము లేకపోతేలేదు కానీ ఒక్క విషయం నేను చెప్పింది ఇంతవరకు జరగకుండా ఎన్నడు లేదు. నిజమే ఆ స్వామి తనగూర్చి చెప్పినవన్నీ నిజానికి చూసినట్లుగా చెప్పాడు అటువంటప్పుడు తాను ఎందుకు తప్పు చెపుతాడు అని అనుకున్నాడు. తన చుట్టూ ప్రక్కల వున్నవారు కూడా అది విని రామదాసు విమానం ఎక్కుతాడు అని అనటం మొదలు పెట్టారు. నిజానికి తాను విమానం ఎక్కుతాడో లేదో కానీ ఆ నిమిషంలో మాత్రం రామదాసు మనసు గాలిలో తేలిపోసాగింది. ఆ నోటా ఆ నోటా పడి ఊరంతా ఆ వార్త గప్పుమన్నది. ఆ రోజునించి వూళ్ళో వారంతా రామదాసుని ఏదో తెలియని ప్రత్యేకతతో చూడటం మొదలు పెట్టారు. తాను విమానం ఎక్కటం విషయం దేముడికి తెలుసు కానీ రామదాసుకు మాత్రం విమానం ఎక్కిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది. తాను రైలు ఎక్కలేదే మరి విమానం యెట్లా ఎక్కుతాను, నిజంగా విమానం ఎక్కుతాన ఎక్కుతే ఎక్కడ ఎక్కుతాను ఎక్కడికి పోతాను. నా దగ్గర అంత డబ్బు లేదే. ఇలాంటి ప్రశ్నలు రామదాసుని పట్టి పీడిస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు పెద్ద వర్షం వచ్చింది ఏదో పనిమీద రామ దాసు యేరు దాటి ప్రక్క ఊరికి వెళ్ళాడు. ఆ వూరు చాల పల్లంగా ఉంటుంది. రామదాసు వూరు దాదాపు ఒక కొండ లాగ ఉంటుంది. కాబట్టి యెంత పెద్ద వాన వచ్చినా ఏరుకి వరద వచ్చినా వాళ్ళ ఊరికి యే ప్రమాదం లేదు. కానీ రామదాసు వెళ్లిన వూరు చాలా పల్లంలో ఉండటంలో తరచూ ఆ ఊరికి యేటి వరద తాకిడికి గురి అవుతుంది. రామదాసు సాయంత్రం కల్లా తిరిగి వద్దామని ఊరికి వెళ్ళాడు కానీ వచ్చే రప్పుడు యేరు ఉర్రుతలు వూగుతున్నది తాను ఎక్కిన పడవ అటు ఇటు వుగ సాగింది పడవలో వున్న వారంతా దేముడిని తలుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వున్నారు. ఒక్క నిమిషములో పడవలోకి నీరు వచ్చి పూర్తిగా పడవ మునిగి పోయింది. పడవలో వాళ్లంతా నీటిలో కొట్టుకొని పోయారు. ఎవరికి ఎవరు కనపడటం లేదు అంతా పెద్దగా అరుస్తున్నారు. రామదాసు కుడా వరద ఉధృతికి కొట్టుకొని పోయాడు. ఈత సరిగా రాదు కానీ ప్రాణాలు కాపాడుకోవటం కోసం చేతనైనంత వరకు ఈత కొట్టి,కొట్టి అలసి పోయాడు. ఏమైందో ఏమో తెలియతు ఎంతసేపు తానూ నీళ్లలో వున్నది తెలియదు. పూర్తిగా చీకటి మగత నిద్రగా వుంది కాపాడమని అరవటానికి కూడా నోరు రావటంలేదు. అయోమయం తాను బ్రతికి వున్నది మరణించింది కుడా తనకి తెలియటం లేదు. ఏమిటి ఈ వింత యెంత సేపు ఆలా గడిచిందో ఏమో రామదాసుకి తెలియదు తన మీద ఏదో ఒక వస్తువు పైనుంచి వ్రాలాడుతూ తాకుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచే శక్తి కూడా లేదు. అతి కష్టంగా కళ్ళు తెరిచి చూసాడు కడుపులో ఆకలి దంచుతున్నది. వంట్లో ఏమాత్రము శక్తి లేదు. కళ్ళు తెరవంగానే సూర్య భగవానుడు తన ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైనాడు. టైం దాదాపు పది పదకొండు కావచ్చు, తాను ఒక చిన్న రాతి కొండపై వున్నాడు చుట్టూరా నీళ్లు. పైనించి ఒక తాటి నిచ్చెన వ్రాలాడుతున్నది. దానిని చూడంగానే రామదాసుకి ప్రాణం లేచి వచినట్లయింది. అది పైన ఎగురుతున్న మిలిటరీ విమానం నుంచి వ్రాలాడుతూ వున్నది. ఆ విమానం తన చుట్టూ తీరుగుతూ వున్నది. అతి కష్టంమీద ఆ తాటి నిచ్చనని పట్టుకో గలిగాడు రామదాసు. తాను ఆ తాటి నిచ్చనని పట్టుకోవటమే ఆలస్యం అది వెంటనే పైకి పోవటంమెదలైయింది. ఒక్క నిముషంలో రామదాసు తాటితో పాటు విమానంలోకి వెళ్ళాడు. ఇద్దరు మిలటరీ వాళ్ళు రామదాసు రెండు చేతులని పట్టుకొని విమానంలోకి తీసుకుని విమానం తలుపు వేశారు. అప్పుడు రామదాసుకి గతంలో సాధువు చెప్పిన జోస్యం జ్ఞ్యాపకం వచ్చింది. నిజమే తానూ నిజంగా విమానం ఎక్కాడు. రామదాసు తనను తానూ గిల్లుకొన్నాడు అది కల నిజామా అని, నిజమే. రామదాసుని ఆ మిలటరీ వాళ్ళు తాను ఎలా వరదలో కొట్టుకొని పోయంది అడిగారు. రామదాసు జరిగిందంతా చెప్పాడువాళ్ళు రామదాసుని ఒక పెద్ద ఊరికి తీసుకొని వెళ్లారు. వాళ్లే రామదాసుని ఆ వురి రైల్వే స్టేషనుకి తీసుకొని వెళ్లి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పి రామదాసు ఊరికి దగ్గర్లోని రైల్వే స్టేషన్కి టిక్కెటు కొని యిచ్చి కొంత డబ్బు కుడా ఇచ్చి అక్కడనుండి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పారు. మరుసటి రోజు రామదాసు చస్తుపడుతూ తన వూరికిచేరాడు. ఊళ్లోని వారంతా రామదాసు కూడా మిగిలిన వారితోపాటు పడవ ప్రమాదంలో చనిపోయాడని అనుకున్నారు. రామదాసు ఊర్లోని వాళ్ళకి జరిగిందంతా చెప్పాడు. సాధువు చెప్పినట్లు రామదాసు విమాన ప్రయాణం చేసినందుకు రామదాసుతో పాటు వూరి వాళ్ళు కూడా ఆనందించారు. అప్పటినుండి రామదాసుని విమానం రామదాసు అని పిలవటం మొదలుపెట్టారు. వరద పుణ్యమాని రామదాసుకి జీవిత కోరిక ఐన రైలు ప్రయాణం మరియు విమాన ప్రయాణం చేయగలిగాడు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
1, అక్టోబర్ 2018, సోమవారం
భగవంతుడు దయామయుడు
ఒకరోజు ఒక పెద్ద చెప్పుల షాపు ముందు ఒక పేదవాడు నిలుచుని అక్కడి వివిధ రకాల చెప్పుల్ని చూసి తన కాళ్ళని చుసుకుంటున్నాడు. ఈ విషయం ఆ దుకాణంలో వున్నా యజమాని చూసాడు వెంటనే ఒక నవుకరిని పంపించి అతన్నిలోపలి తీసుకోరమ్మన్నాడు. వెంటనే ఆ పేదవాడు ఆ దుకాణందారుని ముందుకి తీసుకొని రాబడ్డాడు. అతను దుకాణందారుని చూసి భయంతో వణికి పోతున్నాడు. దుకాణందారు అతనికి భయపడవద్దని నేనునిన్ను ఏమి చేయను అని ధెర్యం చెప్పి వాణ్ణి ఈ విధంగా అడిగాడు. నీవు నా కొట్టు వైపు చూస్తూ ఏమని మనసులో అనుకున్నావు చెప్పు నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టను నాకు నిజం చెప్పు అన్నాడు. దానికి ఆ పేదవానికి దుకాణందారుని మీద నమ్మకం కలిగింది. అతను నేను మీ కొట్టులో రక రకాల చెప్పులు చూసి నా దారిద్య్రాన్ని నిందించుకొని మీరు ఎంత అదృష్టవంతులో కదా ప్రతి రోజు మీకు కావలసిన చెప్పులు వేసుకోవచ్చు అని అనుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ దుకాణం దారు తను వేసుకున్న లుంగీని ప్రక్కకి జరిపాడు. ఆశ్చర్యం అతనికి రెండు కాళ్ళు మోకాళ్ళ వరకే వున్నాయి. అది చూసి ఆ పేదవాడు నిస్చేస్తుడై అన్నాడు. దేముడు నాకే కాదు మీకు కూడా అన్యాయం చేసాడు. నాకు మంచిగాకాళ్ళు వున్నాయి కానీ కాళ్ళకి చెప్పులు లేవు, మరి మీకు ఎన్నో రకాల చెప్పులు వున్నాయి కానీ వాటిని వేసుకునే అదృష్టం మీకు లేకుండా దేముడు చేసాడు. అదే దేముడి లీల అన్నాడు. దానికి ఆ కొట్టు అతను చెప్పాడు దేముడు నీకు కానీ నాకు కాని అన్యాయం చేయలేదు. నిజానికి మన ఇద్దరికీ ఎంతో మేలు చేసాడు అన్నాడు. అది ఎట్లా అన్నాడు. ఎందుకంటె నీకు కాళ్ళకి చెప్పులు కొనుక్కునే స్తొమత లేదు కానీ నీవు చెప్పులు లేకుండా మండుటెండలో నడవ గల శక్తిని నీకు ఇచ్చాడు. మరి నాకు నేను ఎన్ని చెప్పులైనా వేసుకొనే శక్తీ వుంది కానీకాళ్ళు లేనందువల్ల వాటిని వేసుకోలేననుకోవటం కేవలం బుద్ధితక్కువ నాకు కాళ్లతో పని లేకుండా నన్ను ఎత్తుకొని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లే ఇద్దరు గుణవంతులైన కుమారులని ఇచ్చాడు అని ఆ ప్రక్కనే వున్నా తన కొడుకులని ఎంతో గర్వంగా చూపించాడు. నేను ఎన్నడూ నాకు కాళ్ళు లేవనే ఆలోచనే కలగకుండా నాకు చేసాడు. చూసావా మన ఇద్దరికీ భగవంతుడు మేలే చేసాడు. కానీ మనమే దేముడిని అపార్ధం చేసుకుంటాము. భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు. మన ఆలోచన బట్టి మాత్రమే మన మానసిక స్థితి ఉంటుంది అన్నాడు. భగవంతుడు ఎల్లప్పుడు తన భక్తులని కంటికి రెప్పలాగా చూస్తాడు. కేవలం మనం అర్ధం చేసుకోవాల్సి మాత్రమే ఉంటుంది.
మీ కామెంటుకి కృతజ్ఞతలు.
సర్వ్ జనా సుఖినోభవంతు. మీ కామెంటుకి కృతజ్ఞతలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)