20, ఫిబ్రవరి 2024, మంగళవారం

Janaganman


 

Measure

 


బటన్ నొక్కడమే కాదు

 



*ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.*


*అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది.*


*అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.*


*మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.*


*అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు.*


*'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది.*


*అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.*


*'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది.*


*అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.*


*'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.*


*యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.*


*'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది.*

😂😂😂 😂😂😂 😂😂😂

*ఇందులో నీతి  ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు.*

 

*నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి.*

😊😊😊 😊😊😊 😊😊😊

పంచాంగం 20.02.2024

 ఈ రోజు పంచాంగం 20.02.2024 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస శుక్ల పక్ష: ఏకాదశి తిధి భౌమ వాసర: ఆర్ద్ర నక్షత్రం ప్రీతి యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి పగలు 09:57 వరకు.

ఆర్ధ్ర మధ్యాహ్నం 12:14 వరకు.

సూర్యోదయం : 06:44

సూర్యాస్తమయం : 06:16


వర్జ్యం : రాత్రి 01:16 నుండి 03:01 వరకు.


దుర్ముహూర్తం : పగలు 09:02 నుండి 09:40 వరకు తిరిగి రాత్రి  11:15 నుండి 12:05 వరకు.


అమృతఘడియలు : ఈ రోజు లేదు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

పురాణంలో

 *ఏ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము*


1.మత్స్యపురాణం 

2.కూర్మపురాణం

3.వామనపురాణం

4.వరాహపురాణం

5.గరుడపురాణం

6.వాయుపురాణం

7. నారదపురాణం 

8.స్కాందపురాణం

9.విష్ణుపురాణం

10.భాగవతపురాణం

11.అగ్నిపురాణం 

12.బ్రహ్మపురాణం

13. పద్మపురాణం

14.మార్కండేయ పురాణం

15.బ్రహ్మవైవర్తపురాణం 

16.లింగపురాణం

17.బ్రహ్మాండపురాణం

18.భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.


మత్స్య పురాణం:

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.


కూర్మ పురాణం:

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.


వామన పురాణం:

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.


వరాహ పురాణం:

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.


గరుడ పురాణం:

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.


వాయు పురాణం:

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.


అగ్ని పురాణం:

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.


స్కంద పురాణం:

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.


లింగ పురాణం:

లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.


నారద పురాణం:

బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.


పద్మ పురాణం:

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది.


విష్ణు పురాణం:

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.


మార్కండేయ పురాణం:

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.


బ్రహ్మ పురాణం:

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.


భాగవత పురాణం :

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.


బ్రహ్మాండ పురాణం:

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.


భవిష్య పురాణం:

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.


బ్రహ్మావైపర్త పురాణము :

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి.

భీష్మ ఏకాదశి

 _రేపు భీష్మ ఏకాదశి*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. *"మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః"*  కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.


*అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది , మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు , ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది , ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి'* అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.


సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ , మంచుకు తడుస్తూ , నీరు , ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది , కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.


తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి *మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః* అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.


అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట ! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట *"మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః"* హే ద్రౌపతి ! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.


కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు , కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.


ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను , ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప , ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.


భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే , పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ *'తాతా ! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు'* అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు *'అవును తల్లీ ! నా దేహం నా అధీనంలో లేదు , అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా , నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.


కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు , పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. *' హే ద్రౌపతీ ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు , కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను , అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.


నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు , నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం , నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా ! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు.


భగవంతుడు సముద్రం లాంటి వాడు , నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి , భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు , విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.

బంధాలు పచ్చగా

 🌷🦚🌷🦚🌷🦚

 *🌹HAPPY MORNING🌹*

     *🌷🌹 జై శ్రీరాం🌹🌷*


*ఇంట్లో అందరూ కలిసి మట్టిపాత్రలలో భోజనం చేసే రోజుల్లో అందరి లోనూ ఓర్పూ సహనం ఉండేవి*

 *అరిటాకుల్లో చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి*

*స్టీలు రాగి పాత్రలు వచ్చినపుడు బంధాలలో ఆధునికీకరణ మొదలైంది*

*గాజు పింగాణి పాత్రలు వాడటం మొదలు పెట్టినపుడు బంధాలు బీటలు వారడం మొదలైంది*

 *ఇప్పుడూ యూస్ అండ్ త్రో వచ్చాయి బంధాలు కూడా అలాగే మారిపోయాయి* 




   *శ్రీ రామా అంతా నీవే కలవు*


    *🌷శుభ శుభోదయం🌷*

🌷🌹🦚🌹🌷🦚🌹🌷🦚

క్రమశిక్షణకు మారుపేరు

 


నా పేరు సింగిరేసి సాంబశివరావు

వినుకొండ సిఐ గా పని చేస్తున్నాను

*తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా*

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు.

ఇంట్లో భయం లేదు.

అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.

వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. 

అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.

*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.*

ఇది నిజం.

*గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది*?

*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు*! 

*5వ తరగతి నుండే

షట్కర్మ విధానం

 ప్రాచీన భారతీయ యోగవిద్యలో షట్కర్మ విధానం  - సంపూర్ణ వివరణ.


    ప్రాచీన భారతావనిలో యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యత కలదు.  యోగవిద్యలో "హఠయోగం" అనే యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యం కలదు. ఈ హఠయోగాన్ని ప్రచురపరచిన వారిలో శ్రీ గోరక్ష నాథులు ప్రధానులు . ఈ శ్రీ గోరక్షనాధులు మత్స్యేంద్ర నాథుల శిష్యులు అనియు , గోరక్ష నాథుల శిష్యులు శాoభువులు అనియు అనేక గ్రంథాలలో రాయబడి ఉంది. గోరక్షనాధులు శ్రీ స్వాత్మా రామయోగీంద్రులకు హఠయోగమును భోధించిరి . వీరు హఠయోగ ప్రదీపిక అను గ్రంథమును రచించిరి.


           "హ" అనగా సూర్యనాడి "ఠ " అనగా చంద్రనాడి "హఠ" అనగా సూర్యచంద్ర నాడుల సమగోగ్యము . రాజయోగము శ్రేష్టమైనది మరి హఠయోగము గురించి అడగగా హఠయోగులు చెప్పు సమాధానం ఏమనగా ఈ సంప్రదాయము నందు ప్రాణకళ , చిత్తకళ అను రెండు యోగమార్గములు కలవు.  హఠయోగం ప్రాణకళ , రాజయోగమే  చిత్తకళ . ఆయుర్వేదం నందు అంతఃపరిమార్జనము , బహిహపరిమార్జనము  , శస్త్రప్రణిధానము అని చికిత్సలు మూడు విధానములు హఠయోగము నందు కూడా ఈ మూడే ప్రధానములు . అంతః పరిమార్జన అనగా ఆయుర్వేదము నందు పంచకర్మ విధానము . ఇదియే హఠయోగము నందు షట్కర్మ విధానం .


          ఇప్పుడు మీకు హఠయోగము నందలి షట్కర్మ విధానం గురించి సంపూర్ణముగా వివరిస్తాను.


  ధౌతి , వస్తి , నేతి , త్రాటకము , నౌలి , కపాలభాతి  ఈ ఆరింటిని కలిపి షట్కర్మలు అంటారు.


 *  ధౌతి -


        నాలుగంగుళముల వెడల్పు ఇరవై మూరల పొడుగు కలిగిన వస్త్రమును నీటియందు తడిపి వర్తిగా చుట్టుచూ నోటి మార్గమున కొంచెంకొంచెం మింగి ఆరు అంగుళముల కొన బయటవైపు మిగులునట్లు చూసుకుని మింగుట ఆపి కడుపునందలి అవయవములను కుడిపక్కగానో , ఎడమపక్కగానో నీటి సుడి వలే వేగముగా చుట్టవలెను . ఈ విధముగా చేసి మెల్లమెల్లగా గుడ్డను బయటకి లాగవలెను. ఈ విధముగా చేయుటవలన మర్దన జరిగి శరీరము నందలి 72000 నాడులు మధించబడి ప్రక్కమూలల యందు ఉండు దోషములు బయటకి వచ్చును.


        ఈ ధౌతి పద్దతిలో జలధౌతి , సూత్రధౌతి , వస్త్రధౌతి , పవనధౌతి అను నాలుగు విధములైన ధౌతి కర్మములు కలవు. తైల , ఘృతాది ఔషదాలు శరీర అంతర్భాగము నందు మర్దన చేయుట కూడా ఈ ధౌతి ప్రక్రియ నందే చేరును .


 *  వస్తి  -


              ఈ వస్తి క్రియ నందు వస్తి నిరూహము , అనువాసము అని రెండు రకాలు కలవు.


    గుద ద్వారము నుండి వస్తి యంత్రము ద్వారా కషాయాదులతో చేయు ప్రతిక్రియ నిరూహవస్తి అనబడును.


     ఆయా రోగ నాశకరము అగు తైలాదులతో వస్తి యంత్రముతో చేయు ప్రతిక్రియ అను వాసనవ వస్తి అనబడును.


          చిటికెన వ్రేలు దూరనంతటి రంధ్రములు గలదియు , 8 అంగుళాల పొడవు గలదియు నునుపైనదియు , వెదురుతోగాని , తగరము మొదలగు లోహములతోగాని తయారుచేయబడిన నాళమును గ్రహించి దానికి తైలమును పూసి తెలివిచేత గుద ద్వారమున మెల్లగా లోపలికి చొప్పించి నాభి లోతుగల నీటి యందు ఉత్కఠాసనం న ఉండి నాళము గుండా నీటిని లోపలికి పీల్చి తరువాత చెప్పబోవు నౌళి కర్మచే కడుపును జాడించి నీటిని బయటకి వదులుట .దీనినే వస్తికర్మ అందురు.


         దీనిలో జలవస్తి , వాయువస్తి అని రెండు రకాల పద్ధతులు కలవు. కొందరు గుదము నందు నాళమును ప్రవేశపెట్టకుండానే వస్తికర్మ చేయుదురు. నాళము ఉపయోగించి చేయుటయే నిరపాయకారము .


      ఈ వస్తికర్మలో తిరిగి మూడు విధములు కలవు. అందులో వరసగా నిరూహవస్తి , అనువాసవ వస్తి , ఉత్తర వస్తి అని కలవు.


       ఉత్తర వస్తి అనగా సీసముతో తయారు అయిన సన్నని నాళమును పన్నెండు అంగుళముల పొడవుగలదిగా గ్రహించి పురుషుడి మూత్రనాళము నందు లోపలికి చొప్పించి పాలు , తైలం , జలములను యుక్తిచేత నాళము గుండా పంపి నౌలి ప్రక్రియ ద్వారా జాడించి మెల్లగా బయటకి వదులున్నట్లు చేయుట . ఈ పద్దతిని మూత్రాశయ దోష నివారణ కొరకు చేయుదురు . దీనిని యోగులు "వజ్రోలి" అని పిలిచెదరు.


         ఈ వజ్రోలి సిద్ధిపొందిన యోగుడు శుక్రధారణమును , శుక్రస్తంభమును గలవాడై చిరకాలమును యవ్వనవంతుడు అయి ఉండునని హఠయోగ సిద్ధాంతము .


 *  నేతి  -


            దీనినే ఆయుర్వేదము నందు నస్యకర్మ అందురు. మూరెడు పొడవు , మూడు పెనలు వేసిన నూలుతాడుకు నెయ్యి పూసి మెల్లమెల్లగా ముక్కు రంధ్రము నుంచి లోపలికి పంపి పైకి పీల్చి నోటి మార్గము నుంచి ఆ తాడును బయటకి లాగి మెల్లమెల్లగా ముందుకు వెనక్కు అంటూ ఉండవలెను . ఈ విధానం వలన శిరఃకపాలం శోధించబడును . దివ్యదృష్టి కలుగును. మెడకొంకులకు కలుగు రోగములను శీఘ్రముగా హరించుట యందు ఈ నేతి కర్మ శ్రేష్టమైనది.


 *  త్రాటకము  -


           ఏకాగ్రత చిత్తుడు అయ్యి నిశ్చలమైన దృష్టి వలన సూక్షమైన లక్ష్యమును కన్నీరు స్రవించువరకు చూడవలెను . దీనివలన వాయవు , నేత్రము స్థిరత్వము పొందును. ఇలా దీక్షగా చేసి కొంచెముసేపు కనులు మూసి తరువాత తటాలున తెరిచి ఎదురుగా నిర్మలమైన ఆకాశమును ఏకాగ్రత చిత్తుడై సూర్యబింబము కనుపడినట్లు తోచువరకు చూడవలెను. ఈ త్రాటకము నాశిక కొనవద్ద సిద్ధించినచో  ఇలా సిద్దిపొందిన సాధకునకు సకలవ్యాధులు నివర్తించును. భ్రూమధ్యమము నందు సిద్ధించిన ఖేచరీ , దివ్యదృష్టి, యోగసిద్ధి కలుగును.


         ఈ త్రాటక ప్రక్రియ వలన నేత్రరోగములు తగ్గును. తంద్ర మొదలగు వ్యాధులు తగ్గును. ఈ త్రాటక ప్రక్రియ అత్యంత రహస్యమైనది.


 *  నౌలి  - 


          ఈ నౌలి ప్రక్రియ నందు భుజములను వంచుకొని కడుపునందలి అవయవములు కుడిపక్కగా నైనా , ఎడమ పక్కగా నైనా నీటి సుడి వలే అతివేగముగా చుట్టవలెను . దీనిని సిద్ధులు నౌలి కర్మగా వ్యవహరిస్తారు . ఈ నౌలి ప్రక్రియ ఆచరించటం వలన అగ్నిమాంద్యము పోగొట్టబడును. వాతాది సకలరోగాలను నశింపచేయును . హఠ క్రియలకు కిరీటము వంటి ప్రక్రియ ఇది.


 *  కపాల భాతి  -


          కమ్మరి వారివద్ద ఉండు గాలి తిత్తి వలే ఉచ్వాస , నిశ్చ్వాసాలను వేగముగా చేయుటనే కపాల భాతి అందురు. ఈ ప్రక్రియ వలన కఫదోషాలు పోగొట్టబడును .


          షట్కర్మలు వలన శరీరం యెక్క లావు , శరీరం నందలి మలాది దోషాలను పోగొట్టుకొని శరీరాన్ని శుద్ది చేసుకొనిన పిమ్మట ప్రాణాయామం చేయవలెను . షట్కర్మలు ఆచరించిన తరువాత చేయు ప్రాణాయమం వలన యోగము అత్యంత త్వరితముగా సిద్ధించును . ఈ షట్కర్మలు మాత్రమే కాకుండా కొంతమంది యోగులు కిలికర్మ , చక్రికర్మ , వజ్రోలి , శంఖ ప్రక్షాళనం మొదలగు శోధన కర్మలను కూడా అభ్యసించుదురు.


             శంఖ ప్రక్షాళన అనగా నోటితో జలమును తాగి మలద్వారం గుండా బయటకి పంపుట. లేక నాశికా రంధ్రము గుండా జలమును గ్రహించి వేరొక ముక్కు రంధ్రము నుండిగాని నోటి మార్గము ద్వారా గాని బయటకి పంపుట. ఇటువంటి విద్యలు కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చుకొని సాధన చేయవలెను . ఇందులో మరికొన్ని యోగ ప్రక్రియలు కూడా కలవు. వాటి గురించి చెప్తాను .


         సూర్యభేదనము , ఉజ్జయని , సీతార్కరి , శీతలీ , భస్త్రిక , భ్రామరీ , మూర్చ, ప్లావిని , భుజకీకరణము మొదలగు కుంభకముల గురించి జాలంధర , ఉడ్యాన , మూలబంధనం వంటి యోగ విద్యలను కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చి అభ్యసించవలెను . ఇందు సిద్ధి కలిగినవారికి ముసలితనము పొయి పదహారు సంవత్సరముల కలిగిన పడుచువారు వలే మారుదురు.


            అపానవాయువును మీదికి లేపి మూలాధారం పైకి ఆకర్షించుట వలన ప్రాణవాయువును కంఠము క్రిందికి తీసుకొని వెళ్లగలిగిన సిద్దుడు వృద్ధుడు అయినప్పటికి పదాహారు సంవత్సరాల పడుచువానిగా మారును అని కొన్ని రహస్య యోగ గ్రంథాలలో ఉన్నది. ఇచ్చట వాయవు అనగా పాశ్చాత్త్యులు చెప్పినట్లు కేవలం ఉచ్చ్వాస , నిశ్చ్వాసాల చే లోపలికి వెలుపలికి పోవు గాలి కాదు . ఆయుర్వేదం నందు యోగ శాస్త్రము నందు చెప్పబడిన సంకోచ వికాసాది రూపము కలిగిన చలనశక్తి .


       ఈ సందర్భమున మీకు ఒక హఠయోగి గురించి చెప్తాను . ఆయన పేరు శ్రీ యోగి ఓరుగంటి నరసింహం గారు . వీరు డిసెంబర్ 29 తారీఖు 1942 వ సంవత్సరము నందు లాహోరులో జరిగిన అఖిల భారత ఆయుర్వేద సమ్మేళనం నందు సభాపతి సమక్షంలో పైన చెప్పిన వజ్రోలి కర్మ సహాయముతో 40 తులముల పాదరసమును మూత్రమార్గముచే లోపలికి ఆకర్షించి తిరిగి అదే మార్గమున బయటకి విసర్జించి అందరిని ఆశ్చర్యచకితులను చేసినారు . 


       ఇంతగొప్ప యోగులు కలిగిన మన కర్మభూమి పాశ్చాత్త్యా సంస్కృతి మోజులో పడి మన మూలలను నాశనం చేసుకుంటున్నాము.


 

          అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వాంతులు వెంటనే తగ్గుట

 ఎన్ని మందులు వాడినా తగ్గని వాంతులు వెంటనే తగ్గుట కొరకు - 


       ఎండి రాలిపడిన రావి చెట్టు ఆకులు 7 తీసుకొచ్చి వాటిని కాల్చి ఆ బూడిదని తగినన్ని నీటిలో వేసి కొంతసేపు ఉంచి ఆ నీటిని వడకట్టి తాగితే ఏ మందులు వాడిన తగ్గని వాంతులు వెంటనే తగ్గిపోతాయి . 


        ఇది అత్యంత సులభ ఔషధ యోగం .


          అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మంగళవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*20-02-2024 / మంగళవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో  అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులులో జాప్యం  కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

వృషభం


అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మిధునం


వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా  ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి.  ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో  పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి.

---------------------------------------

కర్కాటకం


వృత్తి వ్యాపారాలలో  దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

---------------------------------------

సింహం


వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున  కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కన్య


వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు  అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.

---------------------------------------

తుల


బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు  సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక  నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------

ధనస్సు


అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.

---------------------------------------

మకరం


ఉద్యోగాలలో  బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనదాయం పెరుగుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

కుంభం


సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట  మీ మాటకు విలువ  పెరుగుతుంది.  ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

---------------------------------------

మీనం


ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  -‌ ఏకాదశి - ఆర్ద్ర -‌ భౌమ వాసరే* *(20-02-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

హృదయం కదిలించే

 *హృదయం కదిలించే వార్త:-*



స్కూల్ టూర్‌ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ నానమ్మ కనిపించింది వంద మాటల్లో చెప్పలేని విషయాలను ఒక్క ఫొటోతో చెప్పొచ్చంటారు అలాంటి ఒక ఫొటో ఇది ఒక స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది అక్కడ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించింది దాంతో ఇద్దరూ ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ అమ్మాయి తన నానమ్మ గురించి ఇంట్లో అడిగినప్పుడల్లా ఆమె బంధువుల దగ్గర ఉంటోందని ఇంట్లో వాళ్లు చెప్పేవారు ఎలాంటి సమాజాన్ని మనమంతా నిర్మిస్తున్నాం అనే వ్యాఖ్యలు ఈ ఫొటోపైన రాసున్నాయి ఆశ్రమాలులేని సమాజాన్ని నిర్మిద్దాం!ఇంట్లో ఎంతమంది వున్నా బరువు కాకుండా పెంచారు తల్లిదండ్రులు మనం ఆ ఇద్దరిని పెంచలేమా? ఈ సమాజం ఎటుపోతోంది సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది ఉమ్మడి కుటుంబాల నిర్మాణం అలాగే కొనసాగాలి.... 🙏

Panchaag