*ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.*
*అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది.*
*అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.*
*మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.*
*అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు.*
*'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది.*
*అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.*
*'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది.*
*అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.*
*'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.*
*యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.*
*'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది.*
😂😂😂 😂😂😂 😂😂😂
*ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు.*
*నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి.*
😊😊😊 😊😊😊 😊😊😊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి