ప్రాచీన భారతీయ యోగవిద్యలో షట్కర్మ విధానం - సంపూర్ణ వివరణ.
ప్రాచీన భారతావనిలో యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యత కలదు. యోగవిద్యలో "హఠయోగం" అనే యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యం కలదు. ఈ హఠయోగాన్ని ప్రచురపరచిన వారిలో శ్రీ గోరక్ష నాథులు ప్రధానులు . ఈ శ్రీ గోరక్షనాధులు మత్స్యేంద్ర నాథుల శిష్యులు అనియు , గోరక్ష నాథుల శిష్యులు శాoభువులు అనియు అనేక గ్రంథాలలో రాయబడి ఉంది. గోరక్షనాధులు శ్రీ స్వాత్మా రామయోగీంద్రులకు హఠయోగమును భోధించిరి . వీరు హఠయోగ ప్రదీపిక అను గ్రంథమును రచించిరి.
"హ" అనగా సూర్యనాడి "ఠ " అనగా చంద్రనాడి "హఠ" అనగా సూర్యచంద్ర నాడుల సమగోగ్యము . రాజయోగము శ్రేష్టమైనది మరి హఠయోగము గురించి అడగగా హఠయోగులు చెప్పు సమాధానం ఏమనగా ఈ సంప్రదాయము నందు ప్రాణకళ , చిత్తకళ అను రెండు యోగమార్గములు కలవు. హఠయోగం ప్రాణకళ , రాజయోగమే చిత్తకళ . ఆయుర్వేదం నందు అంతఃపరిమార్జనము , బహిహపరిమార్జనము , శస్త్రప్రణిధానము అని చికిత్సలు మూడు విధానములు హఠయోగము నందు కూడా ఈ మూడే ప్రధానములు . అంతః పరిమార్జన అనగా ఆయుర్వేదము నందు పంచకర్మ విధానము . ఇదియే హఠయోగము నందు షట్కర్మ విధానం .
ఇప్పుడు మీకు హఠయోగము నందలి షట్కర్మ విధానం గురించి సంపూర్ణముగా వివరిస్తాను.
ధౌతి , వస్తి , నేతి , త్రాటకము , నౌలి , కపాలభాతి ఈ ఆరింటిని కలిపి షట్కర్మలు అంటారు.
* ధౌతి -
నాలుగంగుళముల వెడల్పు ఇరవై మూరల పొడుగు కలిగిన వస్త్రమును నీటియందు తడిపి వర్తిగా చుట్టుచూ నోటి మార్గమున కొంచెంకొంచెం మింగి ఆరు అంగుళముల కొన బయటవైపు మిగులునట్లు చూసుకుని మింగుట ఆపి కడుపునందలి అవయవములను కుడిపక్కగానో , ఎడమపక్కగానో నీటి సుడి వలే వేగముగా చుట్టవలెను . ఈ విధముగా చేసి మెల్లమెల్లగా గుడ్డను బయటకి లాగవలెను. ఈ విధముగా చేయుటవలన మర్దన జరిగి శరీరము నందలి 72000 నాడులు మధించబడి ప్రక్కమూలల యందు ఉండు దోషములు బయటకి వచ్చును.
ఈ ధౌతి పద్దతిలో జలధౌతి , సూత్రధౌతి , వస్త్రధౌతి , పవనధౌతి అను నాలుగు విధములైన ధౌతి కర్మములు కలవు. తైల , ఘృతాది ఔషదాలు శరీర అంతర్భాగము నందు మర్దన చేయుట కూడా ఈ ధౌతి ప్రక్రియ నందే చేరును .
* వస్తి -
ఈ వస్తి క్రియ నందు వస్తి నిరూహము , అనువాసము అని రెండు రకాలు కలవు.
గుద ద్వారము నుండి వస్తి యంత్రము ద్వారా కషాయాదులతో చేయు ప్రతిక్రియ నిరూహవస్తి అనబడును.
ఆయా రోగ నాశకరము అగు తైలాదులతో వస్తి యంత్రముతో చేయు ప్రతిక్రియ అను వాసనవ వస్తి అనబడును.
చిటికెన వ్రేలు దూరనంతటి రంధ్రములు గలదియు , 8 అంగుళాల పొడవు గలదియు నునుపైనదియు , వెదురుతోగాని , తగరము మొదలగు లోహములతోగాని తయారుచేయబడిన నాళమును గ్రహించి దానికి తైలమును పూసి తెలివిచేత గుద ద్వారమున మెల్లగా లోపలికి చొప్పించి నాభి లోతుగల నీటి యందు ఉత్కఠాసనం న ఉండి నాళము గుండా నీటిని లోపలికి పీల్చి తరువాత చెప్పబోవు నౌళి కర్మచే కడుపును జాడించి నీటిని బయటకి వదులుట .దీనినే వస్తికర్మ అందురు.
దీనిలో జలవస్తి , వాయువస్తి అని రెండు రకాల పద్ధతులు కలవు. కొందరు గుదము నందు నాళమును ప్రవేశపెట్టకుండానే వస్తికర్మ చేయుదురు. నాళము ఉపయోగించి చేయుటయే నిరపాయకారము .
ఈ వస్తికర్మలో తిరిగి మూడు విధములు కలవు. అందులో వరసగా నిరూహవస్తి , అనువాసవ వస్తి , ఉత్తర వస్తి అని కలవు.
ఉత్తర వస్తి అనగా సీసముతో తయారు అయిన సన్నని నాళమును పన్నెండు అంగుళముల పొడవుగలదిగా గ్రహించి పురుషుడి మూత్రనాళము నందు లోపలికి చొప్పించి పాలు , తైలం , జలములను యుక్తిచేత నాళము గుండా పంపి నౌలి ప్రక్రియ ద్వారా జాడించి మెల్లగా బయటకి వదులున్నట్లు చేయుట . ఈ పద్దతిని మూత్రాశయ దోష నివారణ కొరకు చేయుదురు . దీనిని యోగులు "వజ్రోలి" అని పిలిచెదరు.
ఈ వజ్రోలి సిద్ధిపొందిన యోగుడు శుక్రధారణమును , శుక్రస్తంభమును గలవాడై చిరకాలమును యవ్వనవంతుడు అయి ఉండునని హఠయోగ సిద్ధాంతము .
* నేతి -
దీనినే ఆయుర్వేదము నందు నస్యకర్మ అందురు. మూరెడు పొడవు , మూడు పెనలు వేసిన నూలుతాడుకు నెయ్యి పూసి మెల్లమెల్లగా ముక్కు రంధ్రము నుంచి లోపలికి పంపి పైకి పీల్చి నోటి మార్గము నుంచి ఆ తాడును బయటకి లాగి మెల్లమెల్లగా ముందుకు వెనక్కు అంటూ ఉండవలెను . ఈ విధానం వలన శిరఃకపాలం శోధించబడును . దివ్యదృష్టి కలుగును. మెడకొంకులకు కలుగు రోగములను శీఘ్రముగా హరించుట యందు ఈ నేతి కర్మ శ్రేష్టమైనది.
* త్రాటకము -
ఏకాగ్రత చిత్తుడు అయ్యి నిశ్చలమైన దృష్టి వలన సూక్షమైన లక్ష్యమును కన్నీరు స్రవించువరకు చూడవలెను . దీనివలన వాయవు , నేత్రము స్థిరత్వము పొందును. ఇలా దీక్షగా చేసి కొంచెముసేపు కనులు మూసి తరువాత తటాలున తెరిచి ఎదురుగా నిర్మలమైన ఆకాశమును ఏకాగ్రత చిత్తుడై సూర్యబింబము కనుపడినట్లు తోచువరకు చూడవలెను. ఈ త్రాటకము నాశిక కొనవద్ద సిద్ధించినచో ఇలా సిద్దిపొందిన సాధకునకు సకలవ్యాధులు నివర్తించును. భ్రూమధ్యమము నందు సిద్ధించిన ఖేచరీ , దివ్యదృష్టి, యోగసిద్ధి కలుగును.
ఈ త్రాటక ప్రక్రియ వలన నేత్రరోగములు తగ్గును. తంద్ర మొదలగు వ్యాధులు తగ్గును. ఈ త్రాటక ప్రక్రియ అత్యంత రహస్యమైనది.
* నౌలి -
ఈ నౌలి ప్రక్రియ నందు భుజములను వంచుకొని కడుపునందలి అవయవములు కుడిపక్కగా నైనా , ఎడమ పక్కగా నైనా నీటి సుడి వలే అతివేగముగా చుట్టవలెను . దీనిని సిద్ధులు నౌలి కర్మగా వ్యవహరిస్తారు . ఈ నౌలి ప్రక్రియ ఆచరించటం వలన అగ్నిమాంద్యము పోగొట్టబడును. వాతాది సకలరోగాలను నశింపచేయును . హఠ క్రియలకు కిరీటము వంటి ప్రక్రియ ఇది.
* కపాల భాతి -
కమ్మరి వారివద్ద ఉండు గాలి తిత్తి వలే ఉచ్వాస , నిశ్చ్వాసాలను వేగముగా చేయుటనే కపాల భాతి అందురు. ఈ ప్రక్రియ వలన కఫదోషాలు పోగొట్టబడును .
షట్కర్మలు వలన శరీరం యెక్క లావు , శరీరం నందలి మలాది దోషాలను పోగొట్టుకొని శరీరాన్ని శుద్ది చేసుకొనిన పిమ్మట ప్రాణాయామం చేయవలెను . షట్కర్మలు ఆచరించిన తరువాత చేయు ప్రాణాయమం వలన యోగము అత్యంత త్వరితముగా సిద్ధించును . ఈ షట్కర్మలు మాత్రమే కాకుండా కొంతమంది యోగులు కిలికర్మ , చక్రికర్మ , వజ్రోలి , శంఖ ప్రక్షాళనం మొదలగు శోధన కర్మలను కూడా అభ్యసించుదురు.
శంఖ ప్రక్షాళన అనగా నోటితో జలమును తాగి మలద్వారం గుండా బయటకి పంపుట. లేక నాశికా రంధ్రము గుండా జలమును గ్రహించి వేరొక ముక్కు రంధ్రము నుండిగాని నోటి మార్గము ద్వారా గాని బయటకి పంపుట. ఇటువంటి విద్యలు కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చుకొని సాధన చేయవలెను . ఇందులో మరికొన్ని యోగ ప్రక్రియలు కూడా కలవు. వాటి గురించి చెప్తాను .
సూర్యభేదనము , ఉజ్జయని , సీతార్కరి , శీతలీ , భస్త్రిక , భ్రామరీ , మూర్చ, ప్లావిని , భుజకీకరణము మొదలగు కుంభకముల గురించి జాలంధర , ఉడ్యాన , మూలబంధనం వంటి యోగ విద్యలను కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చి అభ్యసించవలెను . ఇందు సిద్ధి కలిగినవారికి ముసలితనము పొయి పదహారు సంవత్సరముల కలిగిన పడుచువారు వలే మారుదురు.
అపానవాయువును మీదికి లేపి మూలాధారం పైకి ఆకర్షించుట వలన ప్రాణవాయువును కంఠము క్రిందికి తీసుకొని వెళ్లగలిగిన సిద్దుడు వృద్ధుడు అయినప్పటికి పదాహారు సంవత్సరాల పడుచువానిగా మారును అని కొన్ని రహస్య యోగ గ్రంథాలలో ఉన్నది. ఇచ్చట వాయవు అనగా పాశ్చాత్త్యులు చెప్పినట్లు కేవలం ఉచ్చ్వాస , నిశ్చ్వాసాల చే లోపలికి వెలుపలికి పోవు గాలి కాదు . ఆయుర్వేదం నందు యోగ శాస్త్రము నందు చెప్పబడిన సంకోచ వికాసాది రూపము కలిగిన చలనశక్తి .
ఈ సందర్భమున మీకు ఒక హఠయోగి గురించి చెప్తాను . ఆయన పేరు శ్రీ యోగి ఓరుగంటి నరసింహం గారు . వీరు డిసెంబర్ 29 తారీఖు 1942 వ సంవత్సరము నందు లాహోరులో జరిగిన అఖిల భారత ఆయుర్వేద సమ్మేళనం నందు సభాపతి సమక్షంలో పైన చెప్పిన వజ్రోలి కర్మ సహాయముతో 40 తులముల పాదరసమును మూత్రమార్గముచే లోపలికి ఆకర్షించి తిరిగి అదే మార్గమున బయటకి విసర్జించి అందరిని ఆశ్చర్యచకితులను చేసినారు .
ఇంతగొప్ప యోగులు కలిగిన మన కర్మభూమి పాశ్చాత్త్యా సంస్కృతి మోజులో పడి మన మూలలను నాశనం చేసుకుంటున్నాము.
అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి